Wednesday, May 20, 2026
News Navigation
Wednesday, May 20, 2026
News Navigation

Breaking

Wednesday, May 20, 2026
Home Film ‘ఓం శాంతి డిస్కో శాంతి’ ఆల్ రెడీ కాష‌న్ కియా.. ఆల్ రెడీ’. టైటిల్, మోష‌న్ పోస్ట‌ర్ విడుద‌ల‌…

‘ఓం శాంతి డిస్కో శాంతి’ ఆల్ రెడీ కాష‌న్ కియా.. ఆల్ రెడీ’. టైటిల్, మోష‌న్ పోస్ట‌ర్ విడుద‌ల‌…

by CVR NEWS

ఆనందో బ్ర‌హ్మ‌, సేవ్ ది టైగ‌ర్స్ వంటి ఎంట‌ర్‌టైన‌ర్స్ సృష్టిక‌ర్త మ‌హి వి.రాఘ‌వ్ నుంచి రాబోతున్న మ‌రో స‌రికొత్త కామెడీ హార‌ర్ చిత్రం ‘ఓం శాంతి డిస్కో శాంతి’. ‘ఆల్ రెడీ కాష‌న్ కియా.. ఆల్ రెడీ’ క్యాప్షన్. మరోసారి ప్రేక్ష‌కుల‌ను క‌డుపుబ్బా న‌వ్వించ‌టానికి ఎవ‌రూ ఊహించ‌ని స‌రికొత్త ట్విస్ట్‌తో ఈ సినిమా రూపొందుతోంది. ఇప్ప‌టి వ‌ర‌కు దెయ్యాలు మ‌నుషుల్ని భ‌య‌పెట్టాయి. కానీ ఆ దెయ్యాల‌కే భ‌యం పుట్టించే వాళ్లు ఎదురైతే? అస‌లు భ‌యం అంటే తెలియ‌ని పిచ్చివాళ్లు ఈ దెయ్యాల ముందుకు వ‌స్తే.. దెయ్యాలు వ‌ర్సెస్ పిచ్చివాళ్లు మ‌ధ్య జ‌రిగే ఓ గంద‌ర‌గోళ‌మైన ఫుల్ ఫ‌న్ రైడర్ ‘ఓం శాంతి డిస్కో శాంతి’.

దెయ్యాలు పిచ్చివాళ్ల‌ని భ‌య‌పెట్ట‌గ‌ల‌వా? లేక పిచ్చివాళ్లే తిర‌గ‌బ‌డి దెయ్యాల్ని భ‌య‌పెడ‌తారా?, జంప్ స్కేర్‌, ఫ‌న్నీ డైలాగ్స్‌, ఉహించ‌ని ట్విస్టులతో ఈ స్పూకీ ఫ‌న్ జ‌ర్నీ తెర‌కెక్కుతోంది. ‘ఓం శాంతి డిస్కో శాంతి’.. ఆల్ రెడీ కాష‌న్ కియా..ఆల్ రెడీ చిత్రాన్ని సెప్టెంబ‌ర్‌లో విడుద‌ల చేయ‌టానికి స‌న్నాహాలు జ‌రుగుతున్నాయి.

Advertisements

You may also like

Our Visitor

014991
Total views : 81441

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.