Sunday, September 13, 2026
News Navigation
Sunday, September 13, 2026
News Navigation

Breaking

Sunday, September 13, 2026
Home Andhra Pradesh మా ఎజెండా వైసీపీని ఓడించడమే…

మా ఎజెండా వైసీపీని ఓడించడమే…

by Prakash
Mandipalli Ramprasad Reddy, Sugawasi Subrahmanyam

తెలుగుదేశం పార్టీలో నాయకుల మధ్య చిన్న చిన్న బేధాభిప్రాయాలు తప్ప రానున్న ఎన్నికలలో వైఎస్సార్సీపీ ని గద్దె దించి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడును మరోసారి సిఎం చేయాలనీ కృత నిశ్చయంతో తెలుగుదేశం పార్టీ అభిమానులు ఉత్సాహంగా ఉన్నారని రాయచోటి తెలుగుదేశం పార్టీ అభ్యర్ధి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, మాజీ జడ్పి చైర్మన్, రాజంపేట పార్లమెంట్ కాబోయే అభ్యర్ధి సుగావాసి సుబ్రహ్మణ్యం అన్నారు. అన్నమయ్య జిల్లా రాయచోటి లో సుగవాసి సుబ్రహ్మణ్యం ను వారి పార్టీ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసారు. వారిని శాలువాతో సన్మానించి బొకే అందజేసి మీ యొక్క ఆశీస్సులు కావాలని కోరారు. మండిపల్లి సుగవాసి కుటుంబాల నాయకత్వం వర్దిల్లాలి చంద్రబాబు నాయుడును ముఖ్యమంత్రిగా గెలిపించాలంటూ బారి నినాదాలు చేశారు వారి అభిమానులు. ఈ సందర్బంగా వారిరువురు మాట్లాడుతూ రానున్న ఎన్నికలలో వైసిపినీ గద్దె దించి తెలుగుదేశం పార్టీని గెలిపించేందుకు కార్యకర్తలు సిద్దంగా ఉన్నరున్నారు. మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అనే నాకు టికెట్ రాకపోయినా పార్టీ కోసం అందరితో కష్టపడే వాడినే తప్ప ఎలాంటి రాగద్వేషాలకు లోనయ్యేవాడిని కానన్నారు. వెనుక బడిన ప్రాంతం రాయచోటి అభివృద్ధి చేయడమే ధ్యేయంగా సుగావాసి, మండిపల్లి కుటుంబాలు పని చేస్తాయన్నారు. సుగవాసి కుటుంబం, మండిపల్లి రెండు కుటుంబాలు కూడా మంచి ఆప్యాయత ప్రజాదరణ పుష్కలంగా కలిగి ఉన్నాయని రానున్న ఎన్నికలలో అత్యధిక మేజార్టితో గెలుస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. తమ పై నమ్మకం ఉంచి తమను రాయచోటి అభ్యర్థిగా ప్రకటించిన తెదేపా అధ్యక్షులు చంద్ర బాబునాయుడు,లోకేష్,పవన కళ్యాణ్ లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు ఆదేశించినట్లు అందరం కలిసి పార్టీ జెండా రెప రెప లాడిస్తాం. మాజీ ఎమ్మెల్యే రమేష్ కుమార్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ద్వారక నాధ రెడ్డి, అభ్యర్థి రాంప్రసాద్ రెడ్డి తో కలిసి పార్టీని అత్యధిక మెజారిటీతో గెలిపించుకు తీరుతాం. నాయకులు కలుసి పోవాలని ప్రజలే ఆదేశించారని మా రెండు కుటుంబాల కలయిక నియోజకవర్గం అభ్యున్నతికి కృషి చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. మా తండ్రి పాలకొండ రాయుడు ఒక సమూహానికి మండిపల్లి నాగిరెడ్డి నాయకులుగా వ్యవహరించారన్నారు. అప్పట్లో వారి కార్యకర్తల కార్యక్రమాలకు మేము మా కార్యకర్తల కార్యక్రమాలకు హాజరయ్యే వాళ్ళం కాదు అటువంటి రాజకీయాలకు ప్రజలు మార్పు తెచ్చారన్నారు. ప్రజల కోరిక మేరకే నాయకులందరూ కలిసి పొయ్యారు ఫ్యాక్షన్ లాంటి వాతావరణం ఉండదు కేవలం రాయచోటి అన్ని రంగాలలో అభివృద్ధికి మాత్రమే పాటు పడే విధంగా మా కలియిక ఉంటుందని వారి స్పష్టంగా తెలియజేశారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: