ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కోసం ఆమ్ ఆద్మీ పార్టీ చివరిదైన నాలుగో జాబితాను రిలీజ్ చేసింది. ఇందులో 38 మంది అభ్యర్థుల పేర్లను ఆప్ ప్రకటించింది. ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ న్యూఢిల్లీ స్థానం నుంచి, కల్కాజీ స్థానం నుంచి ముఖ్యమంత్రి అతిశీ, గ్రేటర్ కైలాశ్ స్థానంలో సౌరభ్ భరద్వాజ్, బాబర్ పూర్ నుంచి గోపాల్ రాయ్, బల్లి మారన్ నుంచి ఇమ్రాన్ హుస్సేన్ పోటీ చేయనున్నారు. న్యూఢిల్లీ స్థానం కాంగ్రెస్ పార్టీకి కంచుకోట లాంటిది. అక్కడి నుంచి దివంగత ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారుడు సందీప్ దీక్షిత్ కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు. అందుకే ఈ స్థానాన్ని అరవింద్ కేజ్రీవాల్ ఎంచుకున్నారు.
ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌తోనూ అమీతుమీకు తాము సిద్ధమేననే సంకేతాలను పంపేందుకు న్యూఢిల్లీ అసెంబ్లీ స్థానాన్ని ఆప్ అధినేత ఎంచుకున్నారు. అభ్యర్థుల చివరి జాబితాను విడుదల చేసిన సందర్భంగా ఎక్స్ వేదికగా ఆమ్ ఆద్మీ పార్టీ ఒక పోస్ట్ పెట్టింది. ఇప్పటివరకు మొత్తం 70 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించామని వెల్లడించింది. బీజేపీ మిస్సింగ్.. ఆ పార్టీ ఎక్కడా కనిపించడం లేదంటూ ఆప్ విమర్శలు గుప్పించింది. గత ఐదేళ్లలో కేజ్రీవాల్‌ను తిట్టడం తప్ప, ఢిల్లీ కోసం బీజేపీ ఏమీ చేయలేదని ఆప్ దుయ్యబట్టింది. ఢిల్లీ అభివృద్ధిపై స్పష్టమైన విజన్ ఉన్న ఆప్కే ప్రజలు పట్టం కడతారని విశ్వాసం వ్యక్తం చేసింది.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సీడబ్ల్యూసీ అధికారుల పర్యటన.పోలవరం ప్రాజెక్టు ప్రభావిత ప్రాంతాల పరిస్థితులను తెలుసుకునేందుకు సీడబ్ల్యూసీ అధికారులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్యటించారు.పినపాక నియోజకవర్గంలోని బూర్గంపాడు మండలంలో పోలవరం ముంపుకు గురయ్యే ప్రాంతాలను అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. తెలంగాణలో పోలవరం ప్రాజెక్టు కారణంగా ప్రభావితమవుతున్న గ్రామాలు, ముంపు పరిస్థితులపై…
- కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం.కర్ణాటక ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం చేశారు. లోక్ భవన్ లో గవర్నర్ తావర్ చంద్ గెహ్లాట్.. డీకేతో ప్రమాణం చేయించారు. డీకేతో పాటు జీ.పరమేశ్వర ఉపముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. సీఎంతో పాటు మొత్తం 13 మంది మంతృలుగా ప్రమాణం…
- జూన్ 19న విజయ్ ఆంటోని ‘వంద దేవుళ్ళు’ మూవీ రిలీజ్.విజయ్ ఆంటోని చిత్రాలకు తెలుగులో ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎప్పుడూ డిఫరెంట్ కంటెంట్, భిన్న ప్రాజెక్టులతో ప్రేక్షకుల్ని మెప్పిస్తూనే ఉంటారు. ‘బిచ్చగాడు’తో హీరోగా విజయ్ ఆంటోని, దర్శకుడిగా శశికి వచ్చిన ఫాలోయింగ్ అందరికీ తెలిసిందే. మళ్లీ…
- రష్యా పర్యటనలో మంత్రి నారా లోకేష్ కీలక భేటీ..రష్యా పర్యటనలో ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ స్పీడ్ పెంచారు. పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా మాస్కోలో ఆయన కీలక భేటీలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా రష్యాకు చెందిన ప్రముఖ ‘స్బేర్ బ్యాంక్’ వైస్ ప్రెసిడెంట్ అల్బర్ట్ యెఫిమోవ్‌తో మంత్రి లోకేష్ ప్రత్యేకంగా…
- “సర్కారు బాయి’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల.తెలంగాణ సామాజిక నేపథ్యంలో నీటి సమస్యలు, కుల వివక్ష, అణగారిన వర్గాల జీవిత పోరాటాలను ప్రతిబింబించే కథాంశంతో తెరకెక్కుతున్న ‘సర్కారు బాయి’ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను హైదరాబాద్ ఫిలిం ఛాంబర్లో ఘనంగా విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ దర్శక…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




Total views : 92114