Friday, July 10, 2026
News Navigation
Friday, July 10, 2026
News Navigation

Breaking

Friday, July 10, 2026
Home National తెలంగాణలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ

తెలంగాణలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ

by Satya
Narendra Modi

లోక్‌సభ ఎన్నికలు(Lok Sabha elections):

లోక్‌సభ ఎన్నికలు నేపథ్యంలో… తెలంగాణ(Telangana)లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(Narendra Modi) ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. రాష్ట్రంలో వరుసగా శుక్ర, శని, సోమవారాల్లో వివిధ చోట్ల బహిరంగసభలు, రోడ్‌షోల్లో పాల్గొంటారు. గత అసెంబ్లీ ఎన్నికల ముందు నగరంలో మోదీ రోడ్‌ షోను నిర్వహించినట్లుగానే ఈసారి కూడా బీజేపీ అదే విధంగా ప్లాన్‌ చేస్తోంది. మూడు పార్లమెంటు నియోజకవర్గాలకు కలిపి ఒక కేంద్రంలో ప్రధాని ఎన్నికల ప్రచారం కొనసాగించేలా రాష్ట్ర పార్టీ ప్రణాళిక రూపొందించింది.

Follow us on : FacebookInstagram, YouTube & Google News

ఇందుకు అనుగుణంగా మల్కాజ్‌గిరి, సికిందరాబాద్‌, హైదరాబాద్‌ సెగ్మెంట్లకు కలిపి సాయంత్రం 5 గంటలకు మల్కాజ్‌గిరి పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో జరిగే రోడ్‌ షోలో మోదీ పాల్గొంటారు. మీర్జాలగూడ నుంచి మల్కాజ్‌గిరి చౌరస్తా వరకు రోడ్ షో భారీ ఎత్తున నిర్వహించేందుకు బీజేపీ ఏర్పాట్లు చేసింది. మల్కాజ్‌గిరి చౌరస్తాలో ప్రధాని ప్రసంగిస్తారు. అనంతరం, ప్రధాని రాజ్‌భవన్‌కు వెళ్లి బస చేస్తారు.

ఇది చదవండి: సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ విడుదల..!


గగన్‌యాన్ మిషన్‌లో కీలక మైలురాయి సాధించిన ఇస్రో.
భారత తొలి మానవ అంతరిక్ష యాత్ర గగన్‌యాన్ మిషన్‌లో ఇస్రో మరో కీలక విజయాన్ని నమోదు …
చెన్నై ఎగ్మూర్‌లోని ఆస్పత్రుల్లో సీఎం విజయ్‌ ఆకస్మిక తనిఖీలు.
తమిళనాడు సీఎం విజయ్ పాలనలో తన మార్క్‌ చూపిస్తున్నారు. అవినీతి లేని పాలన అందిస్తానని చెబుతున్న …
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలపై భారత్‌ ఆందోళన.
పశ్చిమాసియాలో తాజా ఉద్రిక్త పరిస్థితులపై భారత్‌ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. అంతర్జాతీయ జలమార్గాల మీదుగా …

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Our Visitor

039460
Total views : 196914

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: