Thursday, July 9, 2026
News Navigation
Thursday, July 9, 2026
News Navigation

Breaking

Thursday, July 9, 2026
Home Andhra Pradesh రైల్వే కోడూరు సీటు ఎస్సీ మాదిగలకే – నగిరి పాటి సంతోష్

రైల్వే కోడూరు సీటు ఎస్సీ మాదిగలకే – నగిరి పాటి సంతోష్

by Prakash
Nagiri Pati Santosh

రైల్వే కోడూరు నియోజకవర్గానికి టిడిపి అభ్యర్థిగా ఎస్సీ మాదిగలనే కేటాయించాలని టిడిపి తెలుగు యువత జిల్లా సెక్రెటరీ నగిరిపాటి సంతోష్ అన్నారు. రైల్వే కోడూరు నియోజకవర్గానికి టిడిపి అభ్యర్థిని మాదికులకే కేటాయించాలంటూ టిడిపి తెలుగు యువత జిల్లా సెక్రెటరీ నగిరిపాటి సంతోష్ రైల్వే కోడూరు ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన ప్రెస్ మీట్ లో పేర్కొన్నారు. 1956 నుండి కాంగ్రెస్ పార్టీ ఎన్నడూ కూడా మాదిగలకు టికెట్ ఇవ్వకుండా మాలలకు మాత్రమే టికెట్ ఇస్తూ మాదిగలకు అన్యాయం చేస్తూనే వస్తున్నారు. అలాగే ఇప్పుడు వచ్చిన వైసీపీ పార్టీ కూడా మాలలకే టికెట్ ఇస్తూ మాదిగలను విస్మరిస్తున్నారు. టిడిపి పార్టీ అయినా రైల్వే కోడూరు నియోజకవర్గానికి సంబంధించి మాదిగలకు టికెట్ ఇస్తే మాదిగలందరూ కలిసి మోకమ్మడిగా తమ ఓట్లను టిడిపి పార్టీకి వేసి అత్యధిక మెజారిటీతో గెలిపిస్తామని పేర్కొన్నారు.

లేదంటే మాదిగలం అందరం కలిసి ఇండిపెండెంట్గా నైనా లేదా మందకృష్ణ మాదిగ ఏర్పాటు చేసిన ఎం ఎస్ పి పార్టీ ద్వారా అయినా పోటీ చేసి మాదిగల సత్తా ఏమిటో చూపుతామని సవాల్ విసిరారు. టిడిపి అధిష్టానం ప్రస్తుతం 2024 లో జరగబోయే ఎన్నికలకు రైల్వే కోడూరు నియోజకవర్గానికి సంబంధించి ఎమ్మెల్యే అభ్యర్థిని మాదిగలకు ఇచ్చి అత్యధిక మెజారిటీతో గెలుపొంద వలసినదిగా కోరుకున్నట్లు ఆయన తెలిపారు. నగిరిపాటి సంతోష్ కుమార్, TDPతెలుగు యువత జిల్లా సెక్రెటరీ. నగిరిపాటి వినోద్, నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి. రెడ్డి పాక మహేష్ జనసేన నాయకులు, పెంచలయ్య, సిద్దయ్య, ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు. సురేంద్ర, శివయ్య,కుంచెం హరి, నగిరిపాటి కళ్యాణ్, చందు, నరేంద్ర, నారాయణ, నాగభూషణం తదితరులు పాల్గొన్నారు.

Advertisements

You may also like

Our Visitor

039139
Total views : 194417

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: