Saturday, July 11, 2026
News Navigation
Saturday, July 11, 2026
News Navigation

Breaking

Saturday, July 11, 2026
Home Andhra Pradesh జగన్ ను భయపెడుతున్న రెడ్ బుక్ రహస్యాలు

జగన్ ను భయపెడుతున్న రెడ్ బుక్ రహస్యాలు

by Satya
జగన్ ను భయపెడుతున్న రెడ్ బుక్ రహస్యాలు

తాను ఇంకా రెడ్‌బుక్ తెరవకముందే జగన్ గగ్గోలు పెడుతున్నారని మంత్రి నారా లోకేశ్ ఎద్దేవా చేశారు. ఢిల్లీ వెళ్లి మరీ ఆయన రెడ్‌బుక్‌కు ప్రచారం కల్పిస్తున్నారని అన్నారు. అసెంబ్లీ లాబీలో లోకేశ్ విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఢిల్లీలో జగన్ లేవనెత్తిన రెడ్‌బుక్ గురించి మాట్లాడడంపై స్పందించారు. రెడ్‌బుక్ అనేది రహస్యమేమీ కాదని, తన వద్ద ఆ పుస్తకం ఉన్నట్టు దాదాపు 90 సభల్లో చెప్పానని గుర్తు చేశారు. తప్పుచేసిన వారందరి పేర్లు అందులో చేర్చి చట్టప్రకారం శిక్షిస్తామని అప్పట్లో చెప్పిన మాటకు కట్టుబడి ఉన్నట్టు లోకేశ్ స్పష్టం చేశారు.
నిజానికి తానింకా రెడ్‌బుక్ తెరవనే లేదని లోకేశ్ పేర్కొన్నారు. గతంలో జగన్ ఒకసారి ఢిల్లీ వెళ్లినప్పుడు దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు ‘భారతరత్న’ ఇవ్వాలన్న అంశంపై స్పందించమని జాతీయ మీడియా కోరితే విజయసాయిరెడ్డి మాట్లాడతాడంటూ వెళ్లిపోయిన జగన్ ఇప్పుడు అదే మీడియాను బతిమాలి పిలిపించుకుని మరీ రెడ్‌బుక్‌కు ప్రచారం కల్పిస్తున్నారని చెప్పారు. గత ఐదేళ్లలో రెండంటే రెండుసార్లు ప్రెస్‌మీట్లు పెట్టిన జగన్, ఎన్నికల్లో ఓటమి తర్వాత గత నెల రోజుల్లో 5 ప్రెస్‌మీట్లు పెట్టారని లోకేశ్ ఎద్దేవా చేశారు. అక్కడ మాట్లాడే అబద్ధాలేవో అసెంబ్లీకి వచ్చి మాట్లాడితే తాము సమాధానం ఇస్తామని చెప్పారు.

FOLLOW US ON : FACE BOOKINSTAGARAMYOU TUBE, GOOGLE NEWS

  • హ్యారీ బ్రూక్ విధ్వంసం.. భారత్‌పై ఇంగ్లండ్ ఘన విజయం.
    వావ్! హ్యారీ బ్రూక్ మరియు అతని జట్టు నుంచి ఇది నిజంగా అద్భుతమైన ప్రదర్శన. ఇన్నింగ్స్ మధ్యలో, బంతి పిచ్‌పై నెమ్మదిగా ఆగుతున్న పరిస్థితుల్లో భారత్‌కు పోరాడే అవకాశం ఉందా అన్న సందేహం కలిగింది. 159 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో…
  • రైతులను ఇబ్బంది పెట్టొద్దు-మంత్రి జూపల్లి.
    రైతులు అన్నం పెట్టే దేవుళ్ళతో సమానం, వారిని ఇబ్బంది కలిగించకూడదని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం సోమశిల మంత్రి ,జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్, రెవెన్యూ అటవీ అధికారులతో సమావేశం నిర్వహించారు. సోమశిల…
  • బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రిని సందర్శించిన కేంద్రమంత్రి జేపీ నడ్డా.
    యాదాద్రి భువనగిరి జిల్లాలోని బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రిని కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాశ్ నడ్డా సందర్శించారు. కేంద్రమంత్రితో పాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీలు డీకే అరుణ, లక్ష్మణ్‌లు ఈ పర్యటనలో పాల్గొన్నారు.…
  • యంగ్ ఇండియా స్పోర్ట్స్ వర్సిటీ ప్రారంభోత్సవం.
    హైదరాబాద్‌లో ఒలింపిక్‌ క్రీడలు నిర్వహించాలనేది తన డ్రీమ్‌ అని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. యంగ్‌ ఇండియా ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ స్పోర్ట్స్‌ యూనివర్సిటీ, గచ్చిబౌలి స్పోర్ట్స్‌ డిస్ట్రిక్ట్‌ను భారత ఒలింపిక్‌ సంఘం అధ్యక్షురాలు పీటీ ఉషతో కలిసి ఆయన ప్రారంభించారు.…
  • ఇరాన్‌పై అదనపు దాడుల నేపథ్యంలో ట్రంప్ కీలక వ్యాఖ్యలు.
    ఇరాన్‌పై అదనపు దాడులు ముమ్మరమైన నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాము ఇప్పటికే సైనికంగా విజయం సాధించామని, ప్రస్తుతం ఇరాన్ వద్ద చాలా తక్కువ వనరులు మాత్రమే మిగిలి ఉన్నాయని ఆయన ప్రకటించారు. అమెరికా చర్యలతో…

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Advertisements

You may also like

Our Visitor

039616
Total views : 198729

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: