రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. నన్ను కాపాడండి .. హాస్పిటల్ కు తీసుకెళ్లండి అని పక్కన ఉన్నవాళ్ళని ఎంత వేడుకున్నా ఏ ఒక్కరూ మానవత్వంతో ముందుకు రాలేదు. తన బాధను ఎవరు పట్టించుకోలేదు. ప్రేక్షకుల్లా నిలపడి వీడియోలు ఫొటోలు తీస్తూ లలక్షేపం చేసారు.ఇదంతా హైదరాబాద్ లో కీసర ఔటర్ రింగ్ రోడ్డు వద్ద జరిగింది. కీసర పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం చూస్తే … వరంగల్‌కు చెందిన వి.ఎలేందర్ (35) కీసర సమీపంలోని రాంపల్లి నివాసం ఉంటున్నాడు. బుధవారం సాయంత్రం కీసరలో నిర్మిస్తున్న కొత్త ఇంటి పనులను చూసేందుకు తన బైక్ ఫై వస్తుండగా వెనుక నుంచి లారీ ఢీకొట్టింది. ఎలేందర్ ఒక్కసారి గా బైక్ పై నుంచి రోడ్డుపై పడిపోయాడు. కేకలు వేయడంతో స్థానికులు గమనించి డ్రైవర్ లారీని రివర్స్ చేశాడు. దీంతో లారీ చక్రాలు ఎలేందర్ కాళ్లపై నుంచి వెళ్లాయి. నన్నువెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లండి అని ఎంత వేడుకున్న వాళ్ళు ఎవరు సాయం చేయలేదు. చుట్టుపక్కల జనం అంబులెన్సు కు సమాచారం అందించగా… వారందరిని చూసి ఎలేందర్ నిస్సహాయ స్థితిలో వుండిపోయాడు. కొద్దిసేపటికి 108 వాహనం వచ్చే సరికి అప్పటికే బాధితుడు ఎలేందర్ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఎలేందర్‌కు భార్య, ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు. లారీ డ్రైవర్ లక్ష్మణ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- నాచారం పరిధిలో 108 ఎకరాల్లో చెరువుల పునరుద్ధరణ.హైదరాబాద్ నాచారం డివిజన్ హెచ్ఎంటి నగర్‌లోని 108 ఎకరాల్లో ఉన్న చెరువును 28 కోట్లతో హైడ్రా అభివృద్ధి చేయనుంది. ఈ మేరకు చెరువు అభివృద్ధి పనులకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ శ్రీకారం చుట్టారు. చెరువు వద్ద ఏర్పాటు చేసిన శంకుస్థాపన కార్యక్రమంలో…
- సక్సెస్ స్కూల్ వివాదంపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.హైదరాబాద్ లోని సైదాబాద్‌లో సక్సెస్ స్కూల్ వివాదంపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రెండో తరగతి చదువుతున్న ఒక హిందూ విద్యార్థికి కల్మా, సూరా అల్ ఫాతిహా చదవాలని, రాయాలని స్కూల్ డైరీలో సూచించడంపై ఆయన తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం…
- సాగునీటి ప్రాజెక్టులపై తెలంగాణ సర్కార్ ఫోకస్.బీఆర్ఎస్ హయాంలో చేపట్టిన ప్రాజెక్టుల నిర్మాణంలోనే లోపాలున్నాయని జాతీయ ఆనకట్టల భద్రతా సంస్థ పేర్కొన్నట్లు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ప్రస్తుతం టెస్టింగ్, రీహాబిలిటేషన్ ప్రక్రియ కొనసాగుతోందని చెప్పారు. రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న అన్ని సాగునీటి ప్రాజెక్టులను…
- కోహ్లీ, శ్రేయస్ పోరాటం వృథా.. ఇంగ్లండ్ చేతిలో భారత్ ఓటమి.ఇంగ్లండ్ అద్భుతంగా పుంజుకుని నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించి, మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను 1-1తో సమం చేసింది. ఈ విజయానికి పునాది వారి పేస్ బౌలర్లు వేశారు. ముందుగా భారత జట్టును కేవలం 233 పరుగులకే ఆలౌట్ చేశారు.…
- నేడు తెలంగాణ కేబినెట్ సమావేశం.సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలో భేటీ కానుంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. వర్షాభావ పరిస్థితులు, సాగునీటి ప్రాజెక్టుల ప్రస్తుత పరిస్థితి,…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి



Total views : 212477