ప్రతిరోజూ ఎక్కడో ఒకచోట ఆన్ లైన్ మోసాలకు అమాయకులు బలవుతూనే ఉన్నారు. సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆన్లైన్ ట్రేడింగ్ లో ఇద్దరు చిరు వ్యాపారులు భారీగా మోసపోయారు. కిష్టారెడ్డి పేటకు చెందిన ఒక మొబైల్ షాపు వ్యాపారి 8 లక్షలు, అమీన్ పూర్ వాసి ఆన్ లైన్ ట్రేడింగ్ లో 2 లక్షలు పోగట్టుకున్నారు. ఆన్ లైన్ మోసాల బారిన పడి మోసపోయిన తమకు న్యాయం చేయాలంటూ సైబరాబాద్ పోలీసులను ఆశ్రయించారు బాధితులు.
సీఎం రేవంత్‌రెడ్డిని MCHRD బోధి పెవిలియన్‌లో గోద్రేజ్ ఇండస్ట్రీస్ గ్రూప్ ప్రెసిడెంట్ రాకేశ్‌స్వామి, గోద్రేజ్ అగ్రోవెట్ ఆయిల్ పామ్ బిజినెస్ సీఈఓ సౌగతో నియోగి కలిశారు. గోద్రెజ్ ఆగ్రోవెట్ కంపెనీ ఆధ్వర్యంలో ఆయిల్ పామ్ సాగు విస్తరణపైన ముఖ్యమంత్రికి నివేదిక అందజేశారు…
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల చట్టబద్ధతపై హైకోర్టు తీవ్ర సందేహాలను వ్యక్తం చేసింది. శాసనసభ ఆమోదం లేకుండా కేవలం ప్రభుత్వ ఉత్తర్వుల ద్వారా ఈ పథకాలను ఏ విధంగా అమలు చేస్తారని ప్రశ్నించింది.…
సింగరేణికి తాడిచర్ల-2 కేటాయింపు సంతోషకరం అని కానీ కిషన్ రెడ్డి వాస్తవాలు దాస్తున్నారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మండిపడ్డారు. వాస్తవాలను మరుగునపరిచి తప్పుదోవ పట్టించడం సరికాదన్నారు. ఈ బ్లాక్‍ను 2013లో నాటి యూపీఏ ప్రభుత్వం సింగరేణి కాలరీస్ కు కేటాయించిందని…