Thursday, July 9, 2026
News Navigation
Thursday, July 9, 2026
News Navigation

Breaking

Thursday, July 9, 2026
Home Andhra Pradesh టీమిండియా గెలుపు కోసం ప్రత్యేక పూజలు..

టీమిండియా గెలుపు కోసం ప్రత్యేక పూజలు..

by Prakash
Special Pujas

ప్రపంచ కప్ తుదిపోరుకు సర్వం సిద్దమైంది.దేశం మొత్తం క్రికెట్‌ ఫివర్‌తో ఊగిపోతోంది. ఎటుచూసినా టీమిండియా గెలవాలన్న నినాదామే వినిపిస్తోంది. టీమిండియాకు ఎదురులేదని అభిమానులు ఢంకా బజాయించి మరీ ధీమా వ్యక్తం చేస్తున్నారు. అహ్మదాబాద్‌లో జరగబోయే వన్డే ప్రపంచకప్ ఫైనల్ లో ఆస్ట్రేలియా పై టీంఇండియా గెలవాలని కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో దత్తసాయి దేవాలయంలో 108 టెంకాయలను కొట్టి క్రికెట్ అభిమానులు
ప్రత్యేక పూజలు నిర్వహించారు. భారత్ జట్టు గెలవాలని ఇక్కడ యువకులు జాతీయ జెండాలు చేత పట్టి ఇండియా జట్టుకు మద్దతుగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ పూజలు నిర్వహించారు. అభిమానులు దేశవ్యాప్తంగా పూజలు, హోమాలు, యాగాలు చేస్తూ పుష్కర కాలం తర్వాత టీమ్ ఇండియా ఫైనల్లోకి ప్రవేశించడంతో ఈసారి కప్పు రావడం ఖాయమని అభిమానులు గంపెడాశలు పెట్టుకొని ఎవరికి తోచిన విధంగా వారు టీమిండియాకు ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు

Advertisements

You may also like

Our Visitor

039053
Total views : 194132

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: