హైదరాబాద్‌లోని కేబీఆర్ పార్క్ పరిసరాల్లో చెట్ల నరికివేతపై సుప్రీంకోర్టు స్టే విధించింది. ఎకో సెన్సిటివ్ జోన్ అంటే..పార్క్‌కు చుట్టూ 25 నుంచి 35 మీటర్ల పరిధి లోపల చెట్లను ఎట్టి పరిస్థితుల్లోనూ నరకరాదని ఉన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. కేబీఆర్ పార్క్ చుట్టూ ఫ్లై ఓవర్ నిర్మాణానికి చర్యలు చేపట్టింది ప్రభుత్వం..ఈ నేపథ్యంలోనే జరుగుతున్న చెట్ల నరికివేతపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. జస్టిస్ నాగరత్న, జస్టిస్ ఉజ్జల్ భుయాన్ ధర్మాసనం ముందు ఈ పిటిషన్‌పై విచారణ జరిగింది. పర్యావరణ ప్రేమికుల తరఫున సీనియర్ కౌన్సిల్ కె. వివేక్ రెడ్డి బలమైన వాదనలు వినిపించారు. చెట్ల నరికివేత వల్ల వస్తున్న పర్యావరణ నష్టాన్ని వివరించి, ప్రభుత్వ నిర్మాణ పనులపై స్టే విధించాలని కోర్టును కోరారు. దీంతో చెట్ల నరికివేతపై స్టే ఇచ్చిన సుప్రీంకోర్టు..తదుపరి విచారణను జూలై 27కు వాయిదా వేసింది. సుప్రీంకోర్టు స్టే ఆదేశాలతో SRDP పనులు తాత్కాలికంగా నిలిచిపోనున్నాయి.
Tag:






Total views : 80988