కృష్ణా జలాల విషయంలో ఉభయ తెలుగు రాష్ట్రాలు సామరస్యంగా చర్చల ద్వారా పరిష్కారం చేసుకోవాలని సీపీఎం జాతీయ నేత బీవీ రాఘవులు సూచించారు. నెల్లూరు నగరంలో పర్యటించిన ఆయన జిల్లా సీపీఎం కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. దేశంలో బీజీపీ మళ్లీ అధికారం చేపట్టకుండా చేయడమే తమ పార్టీ విధానమని అన్నారు. సామాజిక సాధికారిత పేరిట బస్సు యాత్ర చేస్తున్న వైకాపా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్‌ను రద్దు చేసిన కేంద్రాన్ని ఎందుకు నిలదీయడంలేదని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు ప్రశ్నించారు. సబ్ ప్లాన్‌ను కేంద్రం రద్దు చేయడం వల్ల రాష్ట్రాలకు రావాల్సిన వాటా తగ్గిందన్నారు. దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాలని డిమాండ్ చేశారు.
Andhra Pradesh News
తెలంగాణలో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ప్రతి వాహనాన్ని తనిఖీ చేస్తున్న పోలీసులు.. డివిజన్ పరిధిలో తెలంగాణ సరిహద్దుగా ఉన్న 7మండలాల్లో ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు 5 చెక్ పోస్టులు ఏర్పాటుచేశామని ఏ సి పి రమేష్ అన్నారు. డివిజన్ పరిధిలో 330 మంది రౌడీ షీటర్లు, లా అండ్ ఆర్డర్ సస్పెక్ట్ కలిగిన వ్యక్తులను బైండోవర్ చేశామని ఏ సి పి అన్నారు. 27గ్రామాలు తెలంగాణకు సరిహద్దుగా ఉండటంతో అయా గ్రామాల్లో పోలీస్ నిఘా, పటిష్ఠ బందోబస్తు ను కల్పించడంతో ప్రశాంతమైన వాతావరణాన్ని నెలకొల్పామని ఏ సి పి అన్నారు. 166 మద్యం కేసులు నమోదు చేసి 1078 బాటిళ్లు, 18 లీటర్ల సారా స్వాధీనం చేసుకోవడం జరిగిందని ఆయన అన్నారు. ఈ తనిఖీల్లో తిరువూరు సిఐ అబ్దుల్ నభి, ఎస్సైలు వి.సతీష్, ఏ పద్మారావు, సిబ్బంది పాల్గొన్నారు.
నాగార్జున సాగర్ ప్రాజెక్టు వద్ద ఉద్రిక్తత నెలకొన్నది. అర్ధరాత్రి సమయంలో సాగర్ వద్దకు ఏపీ పోలీసులు చేరుకున్నారు. దాంతో పరిస్థితులు ఉద్రిక్తతకు దారి తీశాయి. తెలంగాణ, ఏపీ మధ్య నీటి విషయంలో వివాదాలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే, సాగర్ నుంచి నీటిని విడుదల చేసేందుకు ఏపీ అధికారులు రాగా.. తెలంగాణ అధికారులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో అక్కడ ఘర్షన వాతావరణం చోటుచేసుకుంది. తాజాగా.. ఈ ఘటనపై తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్పందించారు. పోలింగ్‌కు ముందురోజు సెంటిమెంట్‌ను రగిల్చేలా వ్యూహాత్మకంగానే వివాదం సృష్టించారని మండిపడ్డారు. దీనిపై ఎన్నికల అధికారి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎవరు? ఎందుకు? ఏం ఆశించి? ఈ ప్రయత్నాలు చేశారో ప్రజలకు తెలుసని అన్నారు. సాగర్ డ్యామ్ అక్కడే ఉంటుంది. నీళ్లు ఎక్కడికి పోవు. దీనిపై పోలింగ్‌కు ముందు రోజు అర్ధరాత్రి వివాదం చేయాల్సిన అవసరం ఏమొచ్చింది. ఇది కచ్చితంగా కుట్రలో భాగమే అని తెలిపారు. ఏ రాష్ట్రంతో సమస్య ఉన్నా.. సామరస్యంగా పరిష్కరించుకోవాలని సూచించారు. ఇలాంటి కుట్రలు ఎన్నికలపై ఎలాంటి ప్రభావం చూపించవు అని తేల్చి చెప్పారు.
దొంగ ఓట్లపై టీడీపీ నేతలు అచ్చెన్నాయుడు, బోండా ఉమా, తదితరులు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఏపీ టీడీపీ చీఫ్ అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వ వైఖరి దొంగే దొంగ అన్న చందంగా ఉందంటూ వ్యాఖ్యలు చేశారు. వ్యవస్థను చేతుల్లో పెట్టుకొని ఓడిపోతామని దుర్వినియోగం చేస్తున్నారన్నారు. ఏపీలో 8 జిల్లాల కలెక్టర్లు వైసీపీ కార్యకర్తలుగా వ్యవహరిస్తున్నారని.. వారిపై ఆధారాలతో సహా ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఫార్మ్ 6, 7, 8 డుప్లికేట్‌లపై తాము పెట్టిన అప్లికేషన్లు ఏమయ్యాయని ప్రశ్నించారు. అనంతరం బోండా ఉమా మాట్లాడుతూ.. రాష్ర్టంలో జరుగుతున్న ఓట్ల అక్రమాలపై ఈసీకి ఫిర్యాదు చేశామన్నారు. పదో తారీఖు లోపు ఢిల్లీ నుండి ఒక టీమ్ రాబోతుందన్నారు. 8 మంది జిల్లా కలెక్టర్లపై ఈసీకి ఫిర్యాదు చేయబోతున్నామన్నారు. కలెక్టర్లు జగన్ కనుసన్నల్లో కాకుండా.. ఎన్నికల నిభందనలను పాటించాలని తెలిపారు.
ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గంలో మాజీ మంత్రి దేవినేని ఉమా అరెస్ట్ కలకలం రేపింది. ఇసుక దోపిడీకి నిరసనగా ఇబ్రహీంపట్నం ఫెర్రీ లో.. ఇసుక కుప్పపై కూర్చొని దేవినేని ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో పోలీసులు అరెస్ట్ చేసి.. విజయవాడ వన్ టౌన్ పీఎస్ కు తరలించారు. ఇసుక దోపిడీని ఆపకుండా అరెస్టు చేయడం ఏంటంటూ పోలీసులపై దేవినేని ఉమా మండిపడ్డారు. దోపిడీ చేస్తున్న వారిని అరెస్టు చేయమని అడిగితే.. ప్రశ్నిస్తున్న తమ నోరు నొక్కాలని చూస్తున్నారన్నారు.
తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తిరిగి ప్రారంభించిన యువగళం పాదయాత్ర గతంలో కంటే రెట్టింపు ఉత్సాహంతో దూసుకుపోతుంది. అధికార పార్టీ వైఫల్యాలను, అక్రమాలను లోకేశ్ ఎండగడుతున్నారు. రెండో రోజు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో లోకేశ్ పాదయాత్ర కొనసాగింది. ఈ సందర్భంగా సీఎం జగన్ మోహన్ రెడ్డిపై విమర్శలు వర్షం కురిపించారు. ముమ్మిడివరం యువగళం పాదయాత్రలో నారా లోకేశ్ మాట్లాడుతూ.. పేదల కడపు నింపేందుకు గత ప్రభుత్వం తీసుకొచ్చిన అన్నా క్యాంటీన్లను మూసివేసి సీఎం జగన్ పైశాచికానందం పొందారని విమర్శించారు. పాదయాత్రలో అన్నా క్యాంటీన్‌ను వార్డు సచివాలయంగా మార్చడని గమనించిన లోకేశ్.. అక్కడే నిలబడి సీఎం జగన్‌కు సెల్ఫీ ఛాలెంజ్ విసిరారు. టీడీపీ ప్రభుత్వం ముమ్మడివరంలో ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ భవనాన్ని, ప్రస్తుతం వార్డు సచివాలయంగా మార్చేశారని మండిపడ్డారు
ఏపీ ప్రభుత్వం ‘ఆడుదాం ఆంధ్రా’ పేరిట ప్రతిష్ఠాత్మక రీతిలో రాష్ట్ర వ్యాప్తంగా క్రీడా పోటీలు నిర్వహించేందుకు సన్నద్ధమవుతోంది. ఈ క్రీడలకు అధికారిక చిహ్నం గా కృష్ణజింక కిట్టును రూపొందించారు. ఈ మస్కట్ ను సీఎం జగన్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన ఎక్స్ లో స్పందించారు. మన ‘ఆడుదాం ఆంధ్రా’ అధికారిక చిహ్నం ‘కిట్టు’ను పరిచయం చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది అని వెల్లడించారు. “ఈ రాష్ట్ర వ్యాప్త టోర్నమెంట్ ద్వారా క్రీడాకారులు ఉన్నతస్థాయికి చేరుకుంటారని నేను నమ్ముతున్నాను… ప్రతి ఒక్కరూ ఈ రోజే రిజిస్టర్ చేసుకోండి” అని పిలుపునిచ్చారు. ఏపీలో ‘ఆడుదాం ఆంధ్రా’ క్రీడా పోటీలు డిసెంబరు 15 నుంచి వచ్చే ఏడాది ఫిబ్రవరి 3 వరకు జరగనున్నాయి. వివిధ క్రీడాంశాల్లో పోటీ పడే ఆటగాళ్లు రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు డిసెంబరు 13 వరకు అవకాశం ఉంది.
Read Also…
Read Also…
అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జే లలితమ్మ ముఖ్య అతిథిగా మాట్లాడుతూ అంగన్వాడీల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అంగన్వాడి కేంద్రాల ఇంటి అద్దె కరెంట్ బిల్లులు కూరగాయల బిల్లులు సకాలంలో చెల్లించాలని అన్నారు. గౌరవ వేతనాన్ని 11,500 నుంచి 16,000 చేయాలని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అమలుపరచాలన్నారు. మినీ అంగన్వాడీలను మెయిన్ అంగన్వాడీలుగా మార్చాలన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన వైయస్సార్ ఎస్పీ, ఎఫ్ ఆర్ ఎస్, వైయస్సార్ మిల్క్, పోషణ ట్రాకర్ అనే మూడు యాప్‌లను ఒకే యాప్ గా మార్చాలన్నారు. ఈ డిమాండ్లన్నింటినీ నెరవేర్చకపోయినట్లయితే డిసెంబర్ 8వ తేదీ నుండి నిర్వాదిక సమ్మెను చేయనున్నట్లు ఆమె తెలిపారు. ఈ నిరవధిక సమ్మె సమస్యలు పరిష్కారమయేంతవరకు కొనసాగుతుందన్నారు.. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు అందే నాసరయ్య, ఏఐటియుసి జిల్లా కార్యదర్శి షేక్ ఖాసిం, నియోజకవర్గ ఏఐటీయూసీ అధ్యక్షుడు వెంకట్ రెడ్డి, రాష్ట్ర ఆఫీస్ బేరర్ టీవీ రేణుక జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటరత్నం, అధ్యక్షురాలు నారాయణమ్మ, ధనలక్ష్మి తోపాటు తదితర అంగన్వాడి వర్కర్లు హెల్పర్లు పాల్గొన్నారు.
రాష్ట్ర భవిష్యత్తు బాబు షూరిటితోనే సాధ్యమని మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. స్థానిక బీసీ కాలనీలో భవిష్యత్తుకు గ్యారెంటీ.. బాబు షూరిటి కార్యక్రమాన్ని బుధవారం పల్లె చేపట్టారు. తెలుగు తమ్ముళ్లు, మహిళలు పల్లెకు హారతితో ఘన స్వాగతం పలికారు. జనసేన పార్టీ నాయకులతో కలిసి పల్లె ఇంటింట కలియ తిరుగుతూ భవిష్యత్తుకు గ్యారెంటీ… బాబు షూరిటి పథకాలను ప్రజలకు వివరించారు. కాలనీలోని మసీదులో ముస్లిం మత పెద్దలతో మాట్లాడారు. రానున్న ఎన్నికల్లో రాష్ట్ర భవిష్యత్తు కోసం తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని పల్లె ముస్లిం మత పెద్దలను కోరారు. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి ఆడబిడ్డ కు నెలకు రూ. 1500 రూపాయలు, చదువుకునే పిల్లలకు ఒక్కొక్కరికి ఏడాదికి రూ. 15,000, ప్రతి రైతుకు ఏడాదికి, రూ. 20వేల రూపాయలు, నిరుద్యోగులకు యువగళం నిధి నుంచి నెలకు రూ.3 వేలు, నిరుద్యోగ భృతి, ఇంటింటికి తాగునీటి కులాయి కనెక్షన్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం జరుగుతుందని ప్రజలకు వివరించారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా బీసీ వర్గాలపై దాడులు ఎక్కువయ్యాయని, టిడిపి మినీ మేనిఫెస్టోలోని సూపర్ సిక్స్ పథకాల్లో చెప్పిన విధంగా రాష్ట్రంలో టిడిపి అధికారంలోకి రాగానే బీసీలకు రక్షణ కల్పించే చట్టాన్ని తీసుకొస్తామని పల్లె హామీ ఇచ్చారు. కావున ప్రతి ఒక్కరూ బాగా కష్టపడి వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురావాలని పల్లె కాలనీవాసులకు పిలుపునిచ్చారు.
బుధవారం ఉదయం ఉలవపాడు ఎన్ జె డి ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో జాయింట్ కలెక్టర్ కూర్మనాథ్, సబ్ కలెక్టర్ శోభిక, జడ్పీ సీఈవో చిరంజీవి జగనన్నకు చెబుదాం కార్యక్రమం నిర్వహించి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ప్రజల నుండి అందిన అర్జీలను నిర్ణీతకాలవ్యవధిలో పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ మే 9 నుంచి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా జగనన్నకు చెబుదాం కార్యక్రమాన్ని ప్రారంభించిందని, అందులో భాగంగానే గ్రామస్థాయిలో ప్రజల సమస్యలు పరిష్కరించాలనే లక్ష్యంతో మండల కేంద్రాల్లో ముందుగానే షెడ్యూలు ప్రకటించి ప్రతి బుధవారం, శుక్రవారం జగనన్నకు చెబుదాం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. జిల్లా కేంద్రానికి రాలేని గ్రామా ప్రజల సమస్యలు తెలుసుకుని అక్కడికక్కడే పరిష్కరించడం, సంతృప్తికర స్థాయిలో పరిష్కరించేందుకు మండల కేంద్రాల్లో జగనన్నకు చెబుదాం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఉలవపాడు లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి మంచి స్పందన వచ్చిందన్నారు. రెవెన్యూ , సర్వే,వారసత్వం భూముల మ్యూటేషన్లు, ఇళ్ల స్థలాలు, రోడ్లు,మౌలిక వసతుల కల్పన మొదలైన సమస్యలపై 80 అర్జీలను ప్రజలు అందజేశారని, నిర్ణీత గడువులోగా ఈ అర్జీలను పరిష్కరించేందుకు చర్యలు చేపడతామన్నారు.
ఈ కార్యక్రమంలో నుడావిసి బాపిరెడ్డి, సిపిఓ సాలెం రాజు, హౌసింగ్, డ్వామా పీడీలు నాగరాజు, వెంకట్రావు, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి ఎంవి సుబ్బారెడ్డి, మైనార్టీ వెల్ఫేర్ అధికారి నిర్మలాదేవి, సమగ్ర శిక్ష ఏపీసి ఉషారాణి, జిల్లా పౌరసరఫరాల అధికారి వెంకటేశ్వర్లు, పలువురు జిల్లా, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.
Read Also…
Read Also…




Total views : 202846