మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఉచిత ప్రయాణాన్ని అందిస్తున్న ఆర్టీసీ రానున్న మేడారం, ఇతర జాతరలకు నడిపే ప్రత్యేక బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని తొలగించి ఛార్జీలు వసూలు చేస్తామని ప్రతిపాదించింది. రాష్ట్ర బడ్జెట్‌కు సంబంధించి ఉప ముఖ్యమంత్రి, ఆర్థికశాఖ మంత్రి భట్టి విక్రమార్కతో రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఆర్టీసీ ఉన్నతాధికారులు ఇటీవల సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సంస్థకు ఆదాయం పెరుగుతుందని ఈ ప్రతిపాదన తీసుకురాగా భట్టి ఈ ప్రతిపాదనను తిరస్కరించారు. మహిళలకు ఉచిత ప్రయాణం విధానాన్ని అమలుచేయాల్సిందేనని, మేడారం సహా ఏ జాతరకు మహిళా ప్రయాణికుల నుంచి టికెట్ ఛార్జీలను వసూలు చేయవద్దని, ఆ ఖర్చంతా ప్రభుత్వం భరిస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా ఈసారి మేడారం జాతరకు ఫిబ్రవరి 18 నుంచి 25 వరకు ఆర్టీసీ 6,000 ప్రత్యేక బస్సులను నడపనుంది. హైదరాబాద్ నుంచే రెండు వేల సిటీ బస్సులను పంపించేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు సమాచారం.
Bhatti Vikramarka
గత ప్రభుత్వం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మండిపడ్డారు. ఫార్ములా ఈ-రేస్ రద్దుతో రాష్ట్రానికి నష్టం జరిగిందని వస్తున్న విమర్శలపై స్పందించారు. రేస్ టికెట్లు అమ్ముకుని ఏస్ నెక్ట్స్ జెన్ కంపెనీ లబ్ధిపొందిందన్నారు. బిజినెన్స్ రూల్స్ ప్రకారం రేస్‌కు అనుమతి లేదన్నారు. ఈ రేస్‌తో రాష్ట్రానికి ఎలాంటి ఆదాయం రాదు. దీని కోసం ప్రభుత్వం 110 కోట్లు ఖర్చు చేయాలా అని ఆయన ప్రశ్నించారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి నెల రోజులయింది. కాంగ్రెస్ నెల రోజుల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఇది ప్రజల ప్రభుత్వం.. ప్రజల పాలనలో వారి కలలను నిజం చేయడమే లక్ష్యంగా చేసుకుని పని చేస్తున్నాము. ఇందిరమ్మ రాజ్యంలో ప్రజలు ఇచ్చిన అధికారంతో విర్ర వీగకుండా వెన్నులో భయం పెట్టుకొని పని చేస్తామని ఆయన రాసుకొచ్చారు. అలాగే 10 సంత్సరాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన 7 లక్షల కోట్ల అప్పు నుంచి రాష్ట్రాన్ని గట్టెక్కించి ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడ్తామని భట్టి విక్రమార్క అన్నారు. గత ప్రభుత్వ రాష్ట్ర ఖజానాను ఖాళీ చేసి, అప్పుల ఊబిలోకి నెట్టినప్పటికీ ఉద్యోగులకు రెండో తేదీన జీతాలు ఇచ్చిన ప్రభుత్వం కాంగ్రెస్‌ది. ప్రభుత్వంలోని ప్రతి వ్యవస్థ నా కోసం ఏర్పాటు చేశారని ప్రతి పౌరుడు అనుకునే విధంగా మా పరిపాలన సాగుతుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ట్వీట్ చేశారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క క్లాస్ పీకారు. పదే పదే స్పీకర్ పోడియం వద్దకు రావడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. విద్యుత్ పై చర్చ సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకుంది. జగదీశ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై భట్టి మాట్లాడుతుండగా కౌశిక్ రెడ్డి పదే పదే అవాంతరం కలిగించారు. దీంతో ఉప ముఖ్యమంత్రి జోక్యం చేసుకున్నారు. తొలుత కౌశిక్ రెడ్డిని నియంత్రించాలని స్పీకర్ ను అభ్యర్థించారు. ఓ దశలో స్పీకర్ ప్రసాద్ కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేను సున్నితంగా మందలించారు.
Read Also..
Read Also..
గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై తెలంగాణ అసెంబ్లీలో అధికార, ప్రతిపక్షాల మధ్య వాడీవేడి చర్చ జరిగింది. సమావేశాలు ప్రారంభం కాగానే కేటీఆర్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మధ్య మాటల యుద్ధం ప్రారంభమైంది. కేటీఆర్ మాట్లాడుతూ గవర్నర్ ప్రసంగం తప్పుల తడకగా ఉందని ఆరోపించారు. మధ్యలోనే కల్పించుకున్న భట్టి విక్రమార్క సంపదతో ఇచ్చిన రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని ఆరోపించారు. బాగు చేయాల్సిన రాష్ట్రాన్ని ధ్వంసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. లక్షకోట్ల రూపాయలు వృథా చేశారని, పదేళ్లపాటు విధ్వంసం చేశారని ఆరోపించారు. రాష్ట్రంలో స్వేచ్ఛ అనేదే లేకుండా చేశారని విమర్శించారు. తెలంగాణను రూ. 5 లక్షల కోట్ల అప్పుల రాష్ట్రంగా మార్చారని భట్టి మండిపడ్డారు.
Read Also..
Read Also..
తెలంగాణ ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక, విద్యుత్ శాఖల మంత్రి మల్లు భట్టి విక్రమార్క కుటుంబ సమేతంగా అధికారిక నివాసం ‘మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రజా భవన్’లోకి అడుగుపెట్టారు. ఇందుకు సంబంధించి గురువారం తెల్లవారుజామున ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్కడే ఉన్న మైసమ్మ దేవాలయంలో పూజలు నిర్వహించారు. ఆ తర్వాత తన కార్యాలయంలో బాధ్యతలు చేపట్టేందుకు సచివాలయానికి వెళ్లారు. కాగా పూజా కార్యక్రమాలకు సంబంధించిన ఫొటోలను భట్టి విక్రమార్క సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. పూజా కార్యక్రమాల్లో భట్టి భార్య, ఇతర కుటుంబ సభ్యులు, ఆయన అనుచరులు, కాంగ్రెస్ నేతలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కాగా బీఆర్ఎస్ ప్రభుత్వంలో సీఎం అధికారిక నివాసంగా ప్రజాభవన్ ఉండేది. అయితే సీఎం నివాసాన్ని వేరే ప్రాంతానికి మార్చాలని కాంగ్రెస్ ప్రభుత్వం యోచిస్తోంది. అందుకే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారిక నివాసంగా ప్రజాభవన్‌ను కేటాయించింది. అందుకే గురువారం తెల్లవారుజామున ఆయన కుటుంబ సమేతంగా అడుగుపెట్టారు.
అసెంబ్లీ ప్రాంగణాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి సుధాకర్ రెడ్డి, శ్రీధర్ బాబు, సీతక్క , కొండా సురేఖ, మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పరిశీలించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమలు కానీ హామీలు ఇచ్చారంటూ మాజీ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ నాయకులకు అంత తొందర పాటు వద్దని సూచించారు. అధికారం పోయిందన్న బాధ కేటీఆర్‌ను వెంటాడుతోందన్నారు. తాము మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీ అమలు చేస్తామని స్పష్టం చేశారు. ఒక్కో హామీని అమలు చేసుకుంటూ వస్తున్నామన్నారు. రైతులకు ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకుంటామని మంత్రి సీతక్క స్పష్టం చేశారు.
తెలంగాణ ఎన్నికల తర్వాత డిప్యూటీ సీఎం గారి బాధ్యతలు చేపట్టిన తరువాత మొక్కులు చెల్లించుకోవడానికి తిరుమల కు వచ్చిన డిప్యూటి సియం భట్టి విక్రమార్క. శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ డిప్యూటి సియం భట్టి విక్రమార్క. రోండు రాష్ర్టాల ప్రజలు సంతోషంగా ఉండాలి. డిసెంబర్ 28వ తేదిన కాంగ్రేస్ పార్టి ఆవిర్బవించిన రోజు మరిన్ని సంక్షేమ పథకాలను ప్రారంభిస్తాం. రైతు భరోసా అమలు చెయ్యడానికి విధివిధానాలు త్వరలోనే ఖరారు చేస్తాం.
ఖమ్మం జిల్లా కూసుమంచి ప్రభుత్వ ఆసుపత్రిలో ఐదు లక్షల నుంచి 10 లక్షలకు పెంచిన రాజీవ్ ఆరోగ్యశ్రీ ని డెప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు లు ప్రారంభించారు. ఈ సందర్భంగా రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను మాటల వరకే పరిమితం కాకుండా మొదటి రెండు రోజుల్లో నే ఆరు గ్యారెంటీ ల్లో రెండు గ్యారెంటీ లను అమలు చేసిందన్నారు. రాబోయే రోజుల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీ లను అమలు చేసే కార్యక్రమం కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టభోతోందని శ్రీనివాస రెడ్డి తెలిపారు.
Read Also..
ఖమ్మం జిల్లా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత మంత్రుల హోదాలో తొలిసారి ఖమ్మం జిల్లాకు వస్తున్న డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిలు ముగ్గురు మంత్రులు జిల్లా సరిహద్దు కూసుమంచి మండలం నాయకన్ గూడెం వద్దకు చేరుకున్నారు. వీరికి కాంగ్రెస్ శ్రేణులు, అభిమానులు అధిక సంఖ్యలో వచ్చి ఘన స్వాగతం పలికారు. మంత్రులు ర్యాలీగా ఖమ్మం బయలు దేరారు. అనంతరం మంత్రులు పాలేరు నుండి భద్రాచలం వరకు వివిధ కార్యక్రమాలలో పాల్గొంటారు.






Total views : 90184