అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు మార్పు కొరుతున్నారని బిజెపి రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ అన్నారు. ఈరోజు ముషీరాబాద్ బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి పూసరాజు నామినేషన్ ర్యాలీ రామ్ నగర్ చౌరస్తా నుండి ప్రారంభమైంది ఈ ర్యాలీకి ముఖ్య అతిథులుగా బిజెపి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి డాక్టర్ లక్ష్మణ్ హాజరయ్యారు. భారీ ర్యాలీగా వచ్చిన పూసరాజు ముషీరాబాద్ లో ట్యాంక్ బండ్‌లోని ఎమ్మార్వో కార్యాలయంలో తన నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలకు వారంటీ లేదని లక్ష్మణ్ తెలిపారు. టిఆర్ఎస్ కాంగ్రెస్ రెండు పార్టీల డిఎన్ఏ ఒక్కటే అని లక్ష్మణ్ వెల్లడించారు. రాష్ట్రాన్ని దోచుకోవడానికి రెండు పార్టీలు సిద్ధంగా ఉన్నాయని లక్ష్మణ్ పేర్కొన్నారు. దాచుకోవటం దోచుకోవటం కాంగ్రెస్.. బీఆర్ఎస్ పార్టీ సిద్ధాంతమని లక్ష్మణ్ వెల్లడించారు భారీ మెజారిటీతో ముషీరాబాద్ బిజెపి అభ్యర్థి పూసరాజును గెలిపించాలని ముషీరాబాద్ ప్రజలను లక్ష్మణ్ కోరారు
Bjp
సీపీఐ జాతీయ కార్యదర్శి కే. నారాయణ గూడూరులో మీడియా సమావేశం. రెండు తెలుగు రాస్ట్రాల్లో బీజేపీ అండదండలతోనే అక్రమాలు జరుగుతున్నాయి. బి ఆర్ ఎస్ చేస్తున్నాదంతా అక్రమాలే అన్యాయలే ఆంధ్రపరదేశ్ లో వైసీపీ కి బీజేపీ కి వ్యతిరేకంగా ఉండే పార్టీలతోనే మేము కలుస్తాం. బీజేపీ కి వ్యతిరేకించే వాళ్ళు ఈ భూమి ఉండడకూడదనేది మోడీ తత్వం బీజేపీ ని వ్యతిరేకించిన వారిపై సిబిఐ, ఈడీ దాడులు నిర్వహిస్తున్నారు. కేవలం పగసాధింపు చర్యలే పనిగా పెట్టుకున్న బీజేపీ తెరాస బీజేపీ రెండు కలిసే కాంగ్రెస్ పై కుట్ర చేస్తున్నాయి. వైసీపీ బీజేపీ తెరాస మూడు ఒకే దారిలో దొడ్డిదారిన నడుస్తున్నాయి. లిక్కర్ స్కామ్ అంతా వైసీపీ తెరాస బీజేపీ కలిసే చేస్తుంటే పేరుకు మాత్రం హమ్ ఆద్మీ పార్టీపై చెపుతున్నారు. మోడీ అమిత్ షా అండతోనే జగన్ ఇన్ని కేసులు ఉన్న బయట తిగితున్నాడు. విభజన చట్టాల్లోని హామీలు అమలు చేయకుండా చేస్తుండేది. బీజేపీ ప్రాంతీయ పార్టీలు ఉండకూడదు అనేదే బీజేపీ సిద్ధాంతం. టి ఆర్ ఎస్ ఇపుడు బి ఆర్ ఎస్ గా ఉంది ఎన్నికల తరువాత వి ఆర్ ఎస్ (వాలంటరీ రిటైర్మెంట్ )గా అవుతుంది. దేశంలో ఇండియా కూటమి రోజురోజుకి బలపడుతోంది. బీజేపీ ఓడిపోతుందనే బయముతోనే దుర్మార్గలాక్కు పాల్పడుతుంది. బీజేపీ కి అనుకూలంగా ఉన్న ఎవరైనా హత్యలు మానభంగాలు చేయవచ్చు అటువంటి వారి జొలికి ఏ అధికారి కూడా వెళ్ళరు.
Read Also..
Read Also..
మంత్రి రోజా జగన్ కళ్ళల్లో ఆనందం కోసం ప్రతిపక్ష నాయకులను నోటికొచ్చినట్లు మాట్లాడుతూ, నగరి ప్రజల కన్నీళ్లు చూస్తోందని ఆయన విమర్శించారు. నిన్న రాష్ట్ర బిజెపి అధ్యక్షురాలు పురందేశ్వరి పై మంత్రి రోజా అనుచిత వ్యాఖ్యలు చేయడం పై రాష్ట్ర బిజెపి అధికార ప్రతినిధి భాను ప్రకాష్ రెడ్డి నగరి ఏం అభివృద్ధి జరిగింది. ఈ ఐదు మండలాల్లో మంత్రి రోజా ఆమె అనుచరులు దోచుకోవడం దాచుకోవడం తప్ప నగరి అభివృద్ధి శూన్యం అన్నారు. నగరిలో రంగు నీటి సమస్య నగిరి నియోజకవర్గంలో కొండగుట్ట ఇసుక అక్రమంగా తమిళనాడుకు తరలిపోతుందని ఎద్దెవా చేశారు. ఆమె నగరి నియోజకవర్గంలో ఏమి అభివృద్ధి చేసారో ఆ అభివృద్ధిని చూపించాలంటూ బీజేపీ నాయకులు సవాల్ విసిరారు.
బీహార్ అసెంబ్లీలో ఎమ్మెల్యే నితీష్ కుమార్ మహిళలను, మానవ సంతోనోత్పత్తిని అవమానపరిచేలా వ్యాఖ్యలు చేశారని బిజెపి మైనార్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు షేక్ బాజీ అన్నారు… నితీష్ కుమార్ వ్యాక్యలను బీజేపీ తీవ్రంగా ఖండిస్తుందని తెలిపారు… ఏలూరు బిజెపి కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ నితీష్ కుమార్ మహిళా జాతికి క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు… ఆంధ్ర రాష్ట్రంలో కూడా మహిళలపై లైంగిక వేధింపులు ఎక్కువయ్యాయని దానికి నిదర్శనమే బిజెపి మహిళా అధ్యక్షురాలు పై వైకాపా నేతలు అసత్య పదజాలంతో దూషిస్తున్నారని ఆయన మండిపడ్డారు… రాష్ట్రంలో జరుగుతున్న వైసిపి దాడులను బిజెపి చూస్తూ ఉందని త్వరలో తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు.
మధ్యప్రదేశ్ లో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ఆయా పార్టీల స్టార్ క్యాంపెయినర్లు ఇప్పటికే ప్రచారంలో పాల్గొంటుండగా ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మధ్యప్రదేశ్ లోని గుణాలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ డబుల్ ఇంజన్ సర్కార్ తో మధ్యప్రదేశ్ లో అభివృద్ధి వేగం పుంజుకుందన్నారు. రాష్ట్ర బడ్జెట్ 20వేల కోట్ల నుంచి 80వేల కోట్లకు పెరిగిందన్నారు. బీజేపీ ప్రభుత్వం మహిళా సాధికారతకు అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. పీఎం ఉజ్వల, ఆవాస్ యోజన, మాతృవందన యోజన, లాడ్లీ బ్రాహ్మణ యోజన, లాడ్లీ లక్ష్మీ యోజన వంటి ఎన్నో పథకాలను మహిళల కోసమే ప్రవేశ పెట్టిందన్నారు. బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలతో పార్టీకి నారీ శక్తి నుంచి ఆశీస్సులు లభిస్తున్నాయని ప్రధాని మోదీ పేర్కొన్నారు.
Read Also..
Read Also..
ఎన్నికల వేళ రాష్ట్రంలో కాంగ్రెస్ నేతలే టార్గెట్‌గా దర్యాప్తు సంస్థల రెయిడ్స్ కలకలం రేపుతున్నాయి. తాజాగా కాంగ్రెస్ నేత పొంగులేటిపై ఐటీ దాడులు రాజకీయంగా సంచలనం అవుతున్నది. ఈ నేపథ్యంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై ఐటీ దాడులను కాంగ్రెస్ సీనియర్ నేత భట్టివిక్రమార్క ఖండించారు. ప్రజాస్వామ్యంలో ఇది మంచి పద్దతి కాదన్నారు. నామినేషన్ వేళ ఐటీ దాడులతో భయపెట్టాలని చూడటం సరికాదన్న ఆయన బీజేపీ, బీఆర్ఎస్ కలిసి కుట్ర పన్నుతున్నాయని ధ్వజమెత్తారు. పొంగులేటికి పార్టీ అండగా ఉంటుందన్నారు. ఇదిలా ఉంటే గురువారం తెల్లవారుజాము నుంచే ఖమ్మం, హైదరాబాద్‌లోని పొంగులేటి ఇల్లు, కార్యాలయాలపై ఐటీ దాడులు కొనసాగుతున్నాయి.
ఎల్బీనగర్ కాంగ్రెస్ అభ్యర్థి మధుయాష్కిగౌడ్ నామినేషన్ దాఖలు చేశారు. కొంతమంది కార్యకర్తలతో ముందుగా ఒక సెట్ నామినేషన్ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ… తెలంగాణ భవిష్యత్తు కొరకై, తెలంగాణ ప్రజల కొరకై, తెలంగాణ ను రక్షించడం కొరకై జరుగుతున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు. ఏ తెలంగాణ రాష్ట్రం కోసం అమరవీరులు తమ ప్రాణాలను అర్పించారో వారి ఆశయ సాధన కోసం బిఆర్ఎస్ పార్టీ ఏమీ చేయడం లేదని ఆయన ఆరోపించారు. వారి అమరవీరుల త్యాగాలను ఫణంగా పెట్టి బిఅర్ఎస్ అధికారం చేపట్టారని ఆరోపించారు. బిజెపి , బిఅర్ఎస్ పార్టీ లు రెండు ఒకటేనని ఆయన ఆరోపించారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని బలపరిచి తమను గెలిపించాల్సిందిగా మదు యాష్కీ కోరారు.
Read Also..
సామాజిక న్యాయం కోసం బీసీ సీఎం కావాలని కోరుకుంటున్నామన్నారు బీజేపీ ఎంపీ కె లక్ష్మణ్. బీసీ సీఎంను ప్రకటించడంతో బీసీలందరూ ఒక్కటయ్యారన్నారు.మిగతా వర్గాలు కూడా బీజేపీ వైపు చూస్తున్నాయన్నారు. ఇప్పుడు వార్ వన్ సైడ్ అయిందన్నారు. ఎన్టీఆర్ తర్వాత సామాజిక న్యాయం చేస్తోన్న పార్టీ బీజేపీ మాత్రమేనన్నా. బీఆర్ఎస్ రాష్ట్రంలో కుటుంబ పార్టీ అయితే, కాంగ్రెస్ దేశంలో కుటుంబ పార్టీ అనీ, బీజేపీ దేశం కోసం పని చేసే పార్టీ అన్నారు. బీసీ సీఎంను ప్రకటిస్తే రెండు శాతం ఓట్లు వస్తాయని రాహుల్ విమర్శలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.అన్ని సమీకరణాలు తీసుకొని 100 సీట్లకు గాను తాము 35 స్థానాలను బీసీలకు కేటాయించామన్నారు. బీఆర్ఎస్ అధికార పీఠాలు, గడీల రాజ్యాన్ని బద్దలు కొట్టేందుకు బీసీలు ఒక్కటవుతున్నారన్నారు.
Read Also..
Read Also..
వైసీపీ కీలక నేత, ఎంపీ విజయసాయిరెడ్డి, ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరిల మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. ఇరువురు మధ్య మాటల తుటాలు పేలుతున్నాయి. ఒకరిపై ఒకరు పరస్పరం విమర్శల చేసుకోవడంతో ఏపీలో బీజేపీ వర్సెస్ వైసీపీగా రాజకీయం నడుస్తోంది. ఈ క్రమంలో టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి విజయసాయిరెడ్డిపై ఫైర్ అయ్యారు. పురందేశ్వరిని విమర్శించే అర్హత విజయసాయిరెడ్డికి లేదని అన్నారు. ఎంపీ విజయసాయిరెడ్డి ఒక నొటోరియస్ క్రిమినల్ అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేంద్రమంత్రిగా పురందేశ్వరి 9 ఏళ్లుగా పని చేయడంతో ఆమె ప్రజలకు తెలుసు విజయిసాయిరెడ్డి మాత్రం ఏ2గానే ప్రజలకు తెలుసని ఎద్దేవా చేశారు. అసలు విజయసాయిరెడ్డికి సంస్కారం లేదని ధ్వజమెత్తారు. పురందేశ్వరి బయటపెట్టిన వైసీసీ ప్రభుత్వ అవినీతిపై విజయసాయిరెడ్డి సమాధానం చెప్పాలని సోమిరెడ్డి ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ నేత, పాలేరు అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పినట్టుగానే జరిగింది. ఐటీ, ఈడీ అధికారులు పొంగులేటి నివాసంలో సోదాలు చేస్తున్నారు. గురువారం వేకువజామున 3 గంటల నుంచే ఖమ్మం పట్టణంలోని ఆయన నివాసాల్లో సోదాలు మొదలయ్యాయి. మొత్తం 8 వాహనాల్లో అధికారులు పొంగులేటి ఇంటికి చేరుకున్నారు. మొదటి సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత తనిఖీలు మొదలుపెట్టారని తెలుస్తోంది. ఖమ్మంతోపాటు హైదరాబాద్‌లోని నందగిరిహిల్స్‌లో కూడా తనిఖీలు జరుగుతున్నాయి. ఇదిలావుండగా ఐటీ దాడులను పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ముందుగానే ఊహించారు. బీజేపీ, బీఆర్ఎస్ ప్రోద్బలంతో తన నివాసంపై, తన కుంటుంబ సభ్యుల ఇళ్లలో, తన అనుచరుల ఇళ్లలో ఐటీ సోదాలు జరగబోతున్నాయని బుధవారం మీడియా సమావేశంలో పొంగులేటి అన్నారు. రోజుల వ్యవధిలో ఇది చూడబోతున్నారని వ్యాఖ్యానించారు. ఆయన మాట్లాడిన గంటల వ్యవధిలోనే ఈ దాడులు జరగడం గమనార్హం. కాగా గురువారం ఆయన నామినేషన్ వేయాలని భావించారు. ఐటీ, ఈడీ దాడుల నేపథ్యంలో ఏమైనా మార్పులు చోటు చేసుకుంటాయా అనేది వేచిచూడాలి.





Total views : 90518