రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గం నుండి నామినేషన్ దాఖలు చేసిన అనంతరం తుల ఉమ మీడియాతో మాట్లాడుతూ, నేను ఎవరికీ హామీ చేయలేదనీ, తల్లిదండ్రులు నిబద్దతతో పెంచారు, అదే విధంగా పెరిగానన్నారు. బిసి బిడ్డ, మహిళకు బీజేపీ టికెట్ ఇస్తే కుట్రలు చేశారనీ ప్రజలకు మేలు చేస్తే తప్పు, ప్రజ నాయకురాలు ఎదగడం తప్పు పట్టారనీ, బీజేపీ పార్టీ ఇటీవలే మహిళల కి 33 పర్సంట్ రిజర్వేషన్ అన్నారు. కనీసం 10 శాతం, 12 శాతం కావడం లేదనీ, 75 ఏళ్లుగా దొరల ప్రాబల్యం నడుస్తుందనీ, ఇక వేములవాడ నుండే దొరల పై పోరాటం కొనసాగుతుందన్నారు. నన్ను నక్సలైట్ అంటున్నారనీ అనాడు దొరల బానిసత్వం విముక్తి పై కోట్లాడిన వాస్తవమే, పార్టీ నాకు అవకాశం ఇవ్వక పోతే బిసి లకు, మహిళలకు ఇక బీజేపీ అవకాశాలు ఉండవనీ, లో నేను కచ్చితంగా పోటీలో ఉంటానని ప్రకటించారు.
Bjp
మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గం స్వతంత్ర అభ్యర్థిగా దేవరకద్ర బాలన్న నామినేషన్ దాఖలు చేశారు… అనంతరం మీడియా తో మాట్లాడుతూ బిజెపి సిద్ధాంతాలకు కట్టుబడుతూ వార్డ్ నెంబర్ స్థాయి నుండి కార్పొరేటర్ స్థాయికి ఎదిగానన్నారు. నియోజకవర్గంలో కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ అనేక సేవా కార్యక్రమాలను కూడా చేయడం జరిగిందన్నారు. బడుగు బలహీన వర్గాలకు టికెట్ ఇవ్వకుండా కాంగ్రెస్, బిఆర్ఎస్ పార్టీలు మోసం చేశాయన్నారు. బిజెపి టికెట్టు బీసీలకు వస్తుందని ఆశాభవం వ్యక్తం చేశారు. ఒకవేళ టికెట్ రాకుండా స్వతంత్ర అభ్యర్థిగా ఖచ్చితంగా బరిలో ఉంటాను అన్నారు. భారతీయ జనతా పార్టీ దేవరకద్ర నియోజకవర్గంలో బీసీలకు అవకాశం కల్పిస్తుందని ఆశ భావం వ్యక్తం చేశారు.
కేంద్రమంత్రి అమిత్ షా చత్తీస్ గఢ్ లోని జశ్పూర్ నియోజకవర్గం ర్యాలీలో పాల్గొన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే నక్సలిజాన్ని పారద్రోలుతామన్నారు అమిత్ షా. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ హయాంలో దేశంలో కుల మత విభేదాలు పెరిగిపోయాయన్నారు. సీఎం భూపేశ్ భగేల్ పై కూడా విమర్శలు గుప్పించారు. గత ఐదేళ్ల కాలంలో చత్తీస్ గఢ్ లో అవినీతి రాజ్యమేలుతోందన్నారు. సీఎం భగేల్ కొన్ని వేల కోట్ల స్కామ్స్ లో పాలుపంచుకున్నారని ఆరోపించారు.
మైనారిటీలను సీఎం జగన్ నాలుగన్నరేళ్లుగా మోసం చేశారని బీజేపీ మైనార్టీ మోర్చ రాష్ట్ర అధ్యక్షుడు షేక్ బాజీ విమర్శించారు. కాకినాడ బిజెపి కార్యాలయం జిల్లా అధ్యక్షుడు చిలుకూరు రామ్ కుమార్ అధ్యక్షతన జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వంలో దుల్హన్ పథకం ద్వారా రూ.50వేలు ఇచ్చేవారన్నారు. ఎన్నికల్లో దుల్హన్ పథకంలో రూ.లక్ష అందిస్తానని చెప్పిన జగన్ నాలుగున్నరేళ్లుగా సవాలక్ష నిబంధన లతో దుల్హన్ పథకం ఏ ఒక్కరికి అందకుండా చేశాడన్నారు. గత ప్రభుత్వం విదేశి విద్యకు రూ.10లక్షలు ఇస్తే, తాను రూ.15లక్షలు చేస్తానని చెప్పి జగన్ విద్యా ర్థులను మోసం చేశాడన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే పథకాలన్నిటిలో కేంద్రం నిధులే ఉన్నాయన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పథకాలపై రాష్ట్ర ప్రభుత్వం పేర్లు పెట్టుకుంటుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర పథకాలకు పేర్లు మార్చి అమలు చేస్తుందన్నారు. గృహనిర్మాణానికి సంబంధించి బోర్డులలో కూడా ముఖ్యమంత్రి జగన్ బొమ్మ వేసుకుంటూ ప్రజలను మోసం చేస్తుందన్నారు. ఈ విధానాన్ని మార్చుకోకపోతే కేంద్ర ప్రభుత్వం అధికారులను బాధ్యులను చేస్తుందన్నారు. ఈ సమావేశంలో బిజెపి మేధావుల సంఘం రాష్ట్ర కన్వీనర్ రాష్ట్ర ముత్తానవీవ్ కృష్ణ, జిల్లా ప్రధాన కార్యదర్శి కోక్కిలిగడ్డ గంగరాజు, డివి సూర్యనారాయణ రాజు, కవి కొండల భీమ శేఖర్, ధనరాజు, గంగాధర్, రంబాల వెంకటేశ్వరావు, చోడిశెట్టి రమేష్ బాబు , చిట్టీడి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Read Also..
పల్నాడు జిల్లా రాజుపాలెం మండలం రెడ్డిగూడెం గ్రామంలో వై ఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమంలో జలవనరుల శాఖ మంత్రి రాంబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ పై అంబటి ఘాటు వ్యాఖ్యలు చేశారు. మా వాళ్లు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలనుకుంటారు. పవన్ కళ్యాణ్ సూట్ కేసులు తీసుకొని చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలనుకుంటాడన్నారు. పవన్ కళ్యాణ్ తెలంగాణలో బిజెపికి ,ఏపీ లో తెలుగుదేశం పార్టీ కి సపోర్ట్ చేస్తారన్నారు . అక్కడ అలా ఇక్కడ ఇలా ఏమిటో ఎవరికి అర్థం కాదు. ఎప్పుడు ఎక్కడ ఎలా ఉంటాడో తెలియని వ్యక్తి పవన్ కళ్యాణ్ అని ఎద్దేవా చేశారు అంబటి.
నామినేషన్ల దాఖలుకు నేడు శుక్రవారం చివరి రోజు కావడంతో ప్రధాన పార్టీల అభ్యర్థు వ్యర్థి,లకు సంబంధించి మరో సెట్ నామినేషన్లు, స్వంతంత్ర అభ్యర్థులు నామినేషన్లు వేసే అవకాశం ఉంది. శనివారం నుంచి నామినేషన్ల ఉపసంహరణ, పరిశీలనలో తిరస్కరణ ఆతర్వాత ఎన్నికల బరిలో ఉన్న తుది పోటీదారుల జాబితా వెల్లడవుతుంది. దీంతో ప్రచార వేడి ఊపందుకోనుంది. ఇప్పటికే ప్రధాన పార్టీ లైన బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, బీఎస్పీ తదితర పార్టీల అభ్యర్థుల ప్రకటన వెలువడింది. అన్నీ పార్టీల్లోనూ నామినేషన్ల ప్రక్రియ దాదాపు పూర్తయింది. ఇక ఓట్ల కోసం అభ్యర్థుల ప్రచారం ముమ్మరం కానుంది.
నల్గొండ జిల్లా.. మునుగోడు నియోజకవర్గ అసెంబ్లీ బీజేపీ పార్టీ అభ్యర్థిగా చల్లమల్ల కృష్ణారెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. మునుగోడు ఎన్నికల్లో ఒకరు అవినీతిపరుడు ఇంకొకరు అహంకారి అయిన వీరి ఇద్దరిని ఇంటికి పంపేందుకు బీజేపీ కార్యకర్తలు నడుం బిగిస్తున్నారని, నవంబర్ 30న జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో మునుగోడు గడ్డమీద కాషాయ జండా ఎగరపోతుందని బీజేపీ పార్టీ ఖచ్చితంగా గెలవబోతుందని ధీమా వ్యక్తం చేశారు. వీరితో పాటు కేంద్రమంత్రి ఠాకూర్, బూర నరసయ్య గౌడ్, గొంగిడి మనోహర్ రెడ్డి ఉన్నారు.
రాజేంద్రనగర్ నియోజకవర్గం అభ్యర్థి తోకల శ్రీనివాస్ రెడ్డి ఉదయం తన నివాసం మైలార్‌దేవ్‌పల్లి ప్రజాభవన్ ఆరంగర్ చౌరస్తా నుండి రాజేంద్రనగర్ ఆర్డిఓ కార్యాలయం వరకు కార్యకర్తలతో కలిసి ఊరేగింపుగా వచ్చి నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం మీడియా తో మాట్లాడుతూ. భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వం తనను బలపరిచి నందుకుగాను ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఎన్నికల్లో 50 వేల మెజార్టీతో గెలిపించేందుకు ప్రజల సిద్ధంగా ఉన్నారని.. ప్రజల ఆశీర్వాదం ఎల్లవేళనాపై ఉంటుందని. ఎన్నికల్లో ఘన విజయం సాధించి రాజేంద్రనగర్ నియోజకవర్గం లో ఉన్న సమస్యలను పరిష్కరిస్తానని అన్నారు. నామినేషన్ దాఖలుకు నియోజకవర్గ వ్యాప్తంగా వచ్చిన కార్యకర్తలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఇదే ఉత్సాహంతో ఎన్నికల్లో పనిచేస్తామని ఆయన అన్నారు.
రెండు తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ అండదండలతోనే అక్రమాలు జరుగుతున్నాయని సీపీఐ జాతీయ కార్యదర్శి కే. నారాయణ ఆరోపించారు. బీఆర్ఎస్ చేస్తున్నదంతా అక్రమాలు, అన్యాయాలే.ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ కి బీజేపీకి వ్యతిరేకంగా ఉండే పార్టీలతోనే మేము కలుస్తాం.బీజేపీని వ్యతిరేకించే వాళ్ళు ఈ భూమి మీద ఉండడకూడదనేది మోడీ తత్వం.బీజేపీని వ్యతిరేకించిన వారిపై సీబీఐ, ఈడీ దాడులు నిర్వహిస్తున్నారు.కేవలం పగసాధింపు చర్యలే పనిగా పెట్టుకున్న బీజేపీ,టీఆర్ఎస్ రెండు కలిసే కాంగ్రెస్ పై కుట్ర చేస్తున్నాయి. వైసీపీ, బీజేపీ, తెరాస మూడు ఒకే దారిలో దొడ్డిదారిన నడుస్తున్నాయి. లిక్కర్ స్కామ్ అంతా వైసీపీ, టీఆర్ఎస్, బీజేపీ కలిసే చేస్తుంటే పేరుకు మాత్రం ఆమ్ ఆద్మీ పార్టీపై చెపుతున్నారని సీపీఐ నారాయణ మండిపడ్డారు.
మహేశ్వరం బీజేపీ అభ్యర్థి అందెల శ్రీరాములు యాదవ్ నామినేషన్ వేసేందుకు బయలుదేరారు. నామినేషన్‌కు ముందు కర్మన్‌ఘాట్ ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. నేను ఆంజనేయస్వామి భక్తుండనని అందుకే ఇక్కడ పూజలు నిర్వహించనని తెలిపారు. రాబోయేది బిజెపి ప్రభుత్వం అని రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి బిజెపి ప్రభుత్వం ఏర్పడ్డాక అన్ని వసతులు కల్పిస్తామని సమస్యలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని అందెల తెలియజేశారు. బిజెపి గుర్తుకు ఓటు వేసి మహేశ్వరం నియోజకవర్గం నుండి తనను గెలిపించాల్సిందిగా ఆయన కోరారు. నామినేషన్ వేసేందుకు వెళ్తున్న క్రమంలో పెద్ద ఎత్తున బిజెపి శ్రేణులు అక్కడికి చేరుకున్నాయి. పార్టీకి చెందిన నేతలు కూడా ఈ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు.
Read Also..





Total views : 90578