మంత్రి హరీశ్ రావు సమక్షంలో బీఆర్ఎస్లో చేరిన బీజేపీ నేత విజయ్ పాల్ రెడ్డి సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. నారాయణ ఖేడ్ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి సోదరుడు, బీజేపీ నేత విజయ్ పాల్ రెడ్డి బిఆర్ఎస్ కండువా కప్పుకున్నారు. మంత్రి హరీశ్ రావు ఆయనకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. గతంలో నారాయణ ఖేడ్ ఎమ్మెల్యేగా పనిచేసిన విజయ్ పాల్ రెడ్డి కొంత కాలంగా బీజేపీలో ఉన్నారు. ఈసారి టికెట్ ఆశించారు. కానీ సంగప్పను ఇక్కడ అభ్యర్థిగా ప్రకటించారు. దీంతో ఆయన బీఆర్ఎస్ లో చేరాలని నిర్ణయం తీసుకున్నారు. తన తమ్ముడి గెలుపు కోసం పనిచేస్తానన్నారు.
Bjp
ముఖ్యమంత్రి కేసీఆర్‌పై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ సీరియస్ కామెంట్స్ చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ గ్రాఫ్ పెంచాలని కేసీఆర్ చూస్తున్నాడని కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ అభ్యర్థులకు స్వయంగా సీఎం కేసీఆరే డబ్బులు పంచుతున్నారని అన్నారు. కాంగ్రెస్‌కు ప్రజల్లో ఇమేజ్ లేదని ఎద్దేవా చేశారు. ధరణిలో కేసీఆర్ భూములే తప్పుగా చూసిస్తున్నాయని అన్నారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే బీసీ వ్యక్తే ముఖ్యమంత్రి అవుతారని.. ఇందులో ఎలాంటి సందేహం లేదని స్పష్టం చేశారు. సీఎం అవుతానని తాను ఏనాడూ చెప్పలేదని.. ముఖ్యమంత్రి అధిష్టానమే ప్రకటిస్తుందని తెలిపారు.
Read Also..
Read Also..
తెలంగాణలో ప్రధాని మోడీ పర్యటనను వ్యతిరేకిస్తూ రాయలసీమలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో మాలమహానాడు రాయలసీమ అధ్యక్షుడు రంగన్న ఆధ్వర్యంలో ర్యాలీ, ధర్నా చేపట్టారు. అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. ఎస్సీ వర్గీకరణ చేస్తే మాలలు నష్టపోతారనితెలిసి కూడా మాల, మాదిగలను విడదీసి ఓటు బ్యాంకు ను చీల్చాలని మోడీ చూస్తున్నారని ఆగ్రహ్ం వ్యక్తం చేశారు. ఎస్సీ వర్గీకరణ చేస్తే మోడీకి ఇవే అంతిమ గడియలని, ఎస్సీ వర్గీకరణ అంటూ మోడీ చేస్తే దేశ వ్యాప్తంగా ఉన్న బీజేపీ కార్యాలయాలను ముట్టడిస్తామని హెచ్చరించారు.
తెలంగాణ ఎన్నికల ప్రచారానికి వచ్చిన డీకే శివకుమార్ బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర స్తాయిలో విమర్శలు చేసారు.ఇప్పటి వరకు సచివాలయానికి వెళ్ళని కేసీఆర్‌ను ఫామ్ హౌస్‌కు పంపిచలని అన్నారు.
బీజేపీ, బీఆర్ఎస్ రహస్య దోస్తులని, బీజేపీ నేతలు హైదరాబాద్‌కు వచ్చి మాత్రమే కేసీఆర్‌పై విమర్శలు చేస్తారన్నారు.కాంగ్రెస్ హయాంలో కట్టిన నాగార్జున సాగర్ వంటివి అరవై ఏళ్లు దాటినా చెక్కు చెదరలేదని,కానీ కేసీఆర్ కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు అప్పుడే బీటలు వారిందన్నారు. మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్ కుంగిపోయిందన్నారు. అనంతరం కాంగ్రెస్ అభ్యర్థి పద్మావతికి మద్దతుగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలు తెలంగాణ తలరాతను ఈ ఎన్నికల్లో మార్చబోతున్నారని, డిసెంబర్ 9న తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అవుతుందని ధీమా వ్యక్తం చేసారు.
సీఎం కేసీఆర్ పై రేవంత్ రెడ్డి భారీ మెజార్టీతో గెలుస్తారని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య జోస్యం చెప్పారు. తెలంగాణ ప్రజలు కేసీఆర్‌ను ఓడించాలని నిర్ణయించుకున్నారని అన్నారు. శుక్రవారం కామారెడ్డిలో కాంగ్రెస్ విజయభేరి యాత్ర – బీసీ డిక్లరేషన్ సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిద్ధరామయ్య మాట్లాడుతూ అందరికీ నా నమస్కారాలు అంటూ తెలుగులో ప్రసంగం ప్రారంభించారు. రేవంత్ రెడ్డి రెండుచోట్ల ఘన విజయం సాధిస్తారన్నారు. కేసీఆర్ తన అవినీతి డబ్బుతో మళ్లీ అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తున్నారన్నారు. కానీ తెలంగాణ ప్రజలు మాత్రం కేసీఆర్‌ను ఓడించాలని నిర్ణయించుకున్నారన్నారు. తెలంగాణలో బీజేపీ పని అయిపోయిందని ఆ పార్టీ నాలుగైదు సీట్లు గెలిస్తే ఎక్కువ అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుందని, ఈ నెల 30వ తేదీన ఓటు వేసేందుకు ప్రజలు వేచి చూస్తున్నారన్నారు.
Read Also..
Read Also..
జనసంద్రంగా మారిన ఎల్బీనగర్ నియోజకవర్గం నామినేషన్ ప్రక్రియ చివరి రోజు కావడంతో ఎల్బీనగర్ నియోజకవర్గ బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి సామ రంగారెడ్డిహయాత్ నగర్ శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి వేద పండితుల ఆశీర్వాదం తీసుకుని నామినేషన్ వేయడానికి భారీ ర్యాలీతో వెళ్లడం జరిగింది ఈ ర్యాలీ హయత్ నగర్ మొదలుకొని సరూర్‌నగర్ జిహెచ్ఎంసి ఆఫీస్ వరకు వెళ్లడం జరిగింది సుమారుగా 20000 మందితో ర్యాలీ తీయడం జరిగింది 10 కిలోమీటర్ల మేర భారీగా వాహనాలు స్తంభించి వాహనదారులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎక్కడ చూసినా జైశ్రీరామ్ అనే నినాదాలతో ఎల్బీనగర్ దద్దరిల్లిపోయింది. ఈ ర్యాలీని చూసిన జనాలు భారీ మెజార్టీతో బిజెపి అభ్యర్థి గెలవడం ఖాయం అని చెప్తున్నారు. నియోజకవర్గంలో 11 డివిజన్ల కార్పొరేటర్ల గాను ghmc ఎన్నికల్లో 11 డివిజన్లు బిజెపి కైవసం చేసుకోవడం జరిగింది .కావున ఇప్పుడు కూడా బిజెపి అభ్యర్థి 11 డివిజన్లలోను బారి మెజార్టీతో గెలిచి ఎల్బీనగర్ నియోజకవర్గం బిజెపి అభ్యర్థి ఎమ్మెల్యే స్థానాన్ని కైవసం చేసుకుంటారని ఇంటలిజెన్స్ వర్గాల నివేదిక.
Read Also..
బిజెపి పార్టీ ఇప్పుడు తెలంగాణలో బ్రోకర్ హౌస్ గా మారింది. తెలంగాణ రాష్ట్రము అధ్యక్షుడు జి కిషన్ రెడ్డి పై ఘాటు వ్యాఖ్యలు చేసిన కంటోన్మెంట్ బిజెపి సీనియర్ నాయకులు నాయుడు ప్రకాష్. విజయ రామారావు. కంటోన్మెంట్ నామినేటెడ్ బోర్డు మెంబెర్ రామకృష్ణ బిజెపి పార్టీ లో పెద్ద బ్రోకర్ గా మారాడు. కంటోన్మెంట్ లో ఐదు మంది బీజేపీ నాయకులు 40 సంవత్సరాల నుంచి కష్టపడుతున్నాము. కంటోన్మెంట్ నామినేటెడ్ బోర్డ్ మెంబర్ రామకృష్ణ పార్టీలో కష్టపడ్డా వారికీ అన్యాయం చేసి, వేరే వాళ్లకు టికెట్ కేటాయించడం అతి దారుణమైన మోసము. రామకృష్ణ లెఫ్ట్ సైడ్ జేబులో కిషన్ రెడ్డి, రైట్ సైడ్ జేబులో లక్ష్మణ్ ఉన్నారు అని నేను ఏది చెప్తే అదే నడుస్తుంది అని ఇష్టారాజంగా వివరిస్తున్నారు. బిజెపి పార్టీ కంటోన్మెంట్లో ఎలా గెలుస్తుందో మేము చూస్తాం. బిజెపి పార్టీకి రెబల్‌గా బరిలో దిగనున్నాము. బిజెపి పార్టీ ఒక పెద్ద బ్రోకర్ హౌస్ ల మారింది. నిన్న మొన్న వచ్చిన వాళ్ళకి టికెట్ ఇచ్చి పార్టీని నమ్ముకుని ఉన్నవాళ్లకు అన్యాయం చేస్తుంది. కంటోన్మెంట్ లో 60 వేల మంది మా సామాజిక వర్గానికి చెందినవారు ఉన్నారు. కచ్చితంగా బిజెపి పార్టీ కి రెబల్ నుంచి పోటీ చేసి ఈ ఎలక్షన్ లో గెలిచి , మాసత్తా చూపుతాం.
సంగారెడ్డి రిటర్నింగ్ కార్యాలయం ముందు బీజేపీ నేత రాజేశ్వర్ రావు దేశ్ పాండే నిరసనకు దిగారు. శుక్రవారం విడుదలైన బీజేపీ అభ్యర్థుల చివరి జాబితాలో సంగారెడ్డి నుంచి రాజేశ్వర్ రావు దేశ్ పాండేకు బీజేపీ అధిష్టానం టికెట్ కేటాయించింది. అయితే టికెట్ ఇచ్చినప్పటికీ బీ ఫామ్ ఇవ్వకపోవడంతో దేశ్ పాండే తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్‌రెడ్డికి ఫోన్ చేసి మరీ వెక్కి వెక్కి ఏడ్చారు. తనకు బీ ఫామ్ ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటానని బీజేపీ నేత హెచ్చరించారు.
హనుమకొండ జిల్లా పరకాల నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి డాక్టర్ పగడాల కాళిప్రసాద్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేసిన అనంతరం అంబేద్కర్ సెంటర్ నుండి బస్టాండ్ కూడలి వరకు భారీ ర్యాలీగా బయలుదేరారు. ఈ ర్యాలీలో భాగంగా బైక్ పై వస్తున్న యువకున్ని అడ్డుకుని ఆకారణంగా ఆ యువకున్ని CRPF పోలీస్ కానిస్టేబుల్లు చేయి చేసుకుని పోలీస్ స్టేషన్ కి తరలించారు.. విషయం తెలుసుకున్న బీజేపీ నాయకులు మూకుమ్మడిగా పోలీస్ స్టేషన్ లోనికి చొచ్చుకు పోయి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం CI వెంకట రత్నం చొరవతో యువకున్ని విడుదల చేయడంతో గొడవ సర్దుమనిగింది..
ఈరోజు నామినేషన్ చివరి రోజు కావడంతో బిజెపి అభ్యర్థి కేఎస్ రత్నం భారీ మెజార్టీతో నామినేషన్ దాఖలు చేయడానికి రావడం జరిగింది ఈ సందర్భంగా రోడ్ షోలో కేసు రత్నం మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబ పాలనను, చేవెళ్ల గడ్డపై కాలే యాదయ్య కుటుంబ పాలనను తమొందిస్తమని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. అలాగే బిఆర్ఎస్ అభ్యర్థి కుటుంబ పాలనను కాంగ్రెస్ అభ్యర్థి నేర చరిత్ర గురించి ఆయన ఈ సందర్భంగా ప్రజలకు తెలిపారు.
ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి బి ఎల్ వర్మ మాట్లాడుతూ.. తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం ఎన్నో అవినీతి, అక్రమాల జరిగాయని కేంద్ర మంత్రి బి ఎల్ వర్మ అన్నారు కాలేశ్వరం పేరుతో ఎన్నో కోట్లు దోచుకున్నారని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. టిఆర్ఎస్ మరియు కాంగ్రెస్ ది కుటుంబ పాలనని ఎద్దేవా చేశారు కాబట్టి బిజెపి కి ఓటు వేసి డబుల్ ఇంజన్ సర్కార్ ను తీసుకురావాలని ఆయన ప్రజలను కోరారు తెలంగాణలో బిజెపి ప్రభుత్వం ఏర్పడితే బీసీ వ్యక్తిని ముఖ్యమంత్రి చేస్తామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు ఈ నామినేషన్ లో భాగంగా కేంద్రమంత్రి బిఎల్ వర్మ ముఖ్య అతిథిగా హాజరై నామినేషన్ దాఖలు చేయడం జరిగింది అనంతరం మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీ కుటుంబ పాలన నడుస్తుందని దాన్ని అంతమొందిస్తామని అలాగే నన్ను గెలిపిస్తే ప్రజలు ఏప్పుడు అందుబాటులో ఉండి అభివృద్ధి పనులు చేస్తానని రత్నం తెలిపారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బిజెపి ప్రభుత్వం ఏర్పడుతుందని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కెసిఆర్ కుటుంబ పాలనను అలాగే చేవెళ్ల గడ్డమీద కాలే యాదయ్య కుటుంబ పాలన అంతమొందిస్తమని ఈ సందర్భంగా ఆయన తెలిపారు..
Read Also..






Total views : 90594