Friday, June 19, 2026
News Navigation
Friday, June 19, 2026
News Navigation

Breaking

Friday, June 19, 2026
Home Telangana ప్రజా రవాణా అందించడమే మా లక్ష్యం – కేటీఆర్‌

ప్రజా రవాణా అందించడమే మా లక్ష్యం – కేటీఆర్‌

by Satya
KTR

ఉమ్మడి ఏపీలో విద్యుత్‌, తాగునీటి సమస్యలు తీవ్రంగా ఉండేవని మంత్రి కేటీఆర్‌ అన్నారు. తెలంగాణలో గతంలో తరచూ విద్యుత్‌ కోతలు, తాగునీటి కోసం నిరసనలు జరిగేవని చెప్పారు. హైదరాబాద్‌లో రెసిడెంట్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ల ప్రతినిధుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘‘మిషన్‌ భగీరథ ద్వారా హైదరాబాద్‌లో తాగునీటి సమస్య లేకుండా చేశామన్నారు. నిరంతరాయంగా విద్యుత్‌ సరఫరా అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని అన్నారు. హైదరాబాద్‌లో కాలుష్య రహిత ప్రజా రవాణా అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. నగరంలో 24 గంటల తాగునీటిని అందించాలన్నదే మా స్వప్నమని చెప్పారు. మెట్రోను రాబోయే 10 ఏళ్లలో 415 కి.మీ విస్తరించాలన్నదే మా ఎజెండా అని మంత్రి కేటీఆర్‌ తెలిపారు.

Advertisements

You may also like

Our Visitor

026050
Total views : 149796

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.