పెను తుఫాన్ భీభత్సం సృష్టించినా ముందస్తు జాగ్రత్త లతో ప్రాణ ఆస్తి నష్టం లేకుండా చూశాం. ఈ గొప్పదనం జిల్లా యంత్రాంగానికి చెందుతుంది. గ్రామ స్థాయిలో సచివాలయం నుంచి ఉన్నత స్థాయి వరకు పటిష్టమైన టీమ్ వర్క్ ఏపీ లో ఉంది. వ్యవసాయం, ఉద్యాన పంటలు నష్ట పోయిన రైతులకు సత్వర సాయం అందిస్తాం. పునరావాస కేంద్రాల్లో తలదాచుకున్న వారికి ఆర్థిక సహాయం చేసాం. పంట దెబ్బతిన్న రైతులని ఆదుకుంటాం. అంచనాలను సిద్ధం చేయమని ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేశాం. జిల్లాలో పంట నష్టమైతే దాదాపుగా జరగలేదు.
Breaking News
కేసీఅర్ ను కలవడానికి సిద్దిపేట జిల్లా ఎర్రవల్లి లోని వ్యవసాయ క్షేత్రానికి కేసీఅర్ సొంత గ్రామమైన చింతమడక గ్రామస్తులు తొమ్మిది బస్సులలో సుమారు 540 మంది గ్రామస్తులు కేసీఅర్ ఫార్మ్ హౌస్ కు చేరుకున్నారు. కేసీఅర్ ను కలవడానికి వచ్చిన గ్రామస్తులను ఫార్మ్ హౌస్ పోలిస్ సిబ్బంది ఫార్మ్ హౌస్ చెక్ పోస్ట్ వద్ద ఆపేశారు. పర్మిషన్ లేనిది లోనికి అనుమతి లేదని ఫార్మ్ హౌస్ లోపల నుండి మాకు సమాచారం ఇస్తే లోపలకు పంపిస్తామని పోలీసులు గ్రామస్తులకు చెప్పడం తో పర్మిషన్ కోసం గ్రామస్తులు మూడు గంటలు వెయిట్ చేశారు. ఆ తర్వాత కేసీఅర్ ను కలసి వెళ్లిపోయారు
రాష్ట్ర పర్యాటక, సంస్కృతిక వ్యవహారాల, యువజన సర్వీసుల మరియు క్రీడా శాఖ మంత్రి ఆర్.కె.రోజా ఆధ్వర్యంలోని రోజా చారిటబుల్ ట్రస్ట్ తరపున మంత్రి సోదరులు వై. రాంప్రసాద్ అగరంపేట దళిత కాలనీ లో వరద భాదితులకు బుధవారం ఆర్థికసాయం అందజేశారు. నిండ్ర మండలం అగరంపేట దళిత కాలనీలో నీటి ముంపునకు గురైన 26 కుటుంబాలను పరామర్శించి బాధితులకు బియ్యం, పప్పు, నూనె వంటి నిత్యావసర వస్తువులను పంపిణి చేశారు. అలాగే నిండ్ర మండలం ఆత్తూరు దళిత కాలనీ లో వరద భాదితులకు బుధవారం ఆర్థికసాయం అందజేశారు. నిండ్ర మండలం ఆత్తూరు దళిత కాలనీలో నీటి ముంపునకు గురైన 45 కుటుంబాలను పరామర్శించి బాధితులకు బియ్యం, పప్పు, నూనె వంటి నిత్యావసర వస్తువులను పంపిణి చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు వైస్సార్సీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
విజయనగరం జిల్లా కొత్తవలస మండలం జోగయ్యపాలెంలో తుఫాన్ ప్రభావంతో 20 ఎకరాలకు పైగా పంట నష్టం జరిగింది. కొత్తవలస మండల కేంద్రంలో చిన్ని పాలెం గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న జోగయ్యపాలెం లో తుఫాన్ కారణంగా వందలాది ఎకరాల పంట నీట మునిగింది. జాతీయ రహదారి పనులలో భాగంగా కాలువలు మూసివేయడం వలన ….వరద నీరు పంట పొలాలపైకి రావటంతో కోత కోసిన వరిపంట మొత్తం కొట్టుకుపోవడంతో రైతులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
ఎన్నికల కంటే ముందే అంగన్ వాడి అక్కా చెల్లమ్మల్లకు తెలంగాణ కన్నా అదనంగా వేతనం పెంచుతామన్న ఎపి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారి హామీ నీటి మిద వ్రాతలుగా మిగిలిపోయ్యిందని ఆరోపించారు. సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి అబ్బవరం రామంజులు, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ భాగ్య లక్ష్మిలు, రాష్ట్ర కమిటి ఉత్తర్వుల మేరకు ఈ నెల్ 8 నుంచి అంగన్వాడి సమస్యల పరిష్కారానికై డిసెంబెర్ 8 నుండి జరిగే అంగన్ వాడి నిరవధిక సమ్మెను జయప్రదం చేయాలంటూ అన్నమయ్య జిల్లా రాయచోటి లో ఎపి అంగన్వాడి వర్కర్స్ & హెల్పర్ యునియన్ (సిఐటియు) అద్వర్యంలో ర్యాలి నిర్వహించారు .ఈ ర్యాలి స్థానిక తహసిల్దార్ కార్యాలయం నుండి బస్టాండ్ మీదగా వైఎస్సార్ సర్కిల్ వరకు కొనసాగింది. అనంతరం అక్కడ మనవహరంగా నిలబడి అంగన్వాడి సమస్యల పరిష్కరించడమే కాకుండా పెండింగ్ లో నున్న వేతనాలు టి ఎ ,డి ఎ లు కూరగాయల బిల్లుల నిధులను వెంటనే విడుదల చేయాలనీ వారు నినాదాలు తెలియజేశారు .అక్కడ నుంచి ప్రభుత్వ సముదాయాల దగ్గర నున్న రాజ్యాంగ సృష్టి కర్త బడుగు బలహీన వర్గాల ఆశా కిరణం డా.. బి ఆర్ అంబేద్కర్ చిత్రపటానికి వినతి పత్రం అందజేసి వారి నిరసనను తెలియజేశారు .అనంతరం వారు మీడియాతో మాట్లాడుతు అక్క చెల్లమ్మల అందరికి తోడుగా ఉంటానన్న జగనన్న మా అంగన్ వాడి అక్క చెల్లమ్మల కు ఇచ్చిన హామీలను అమలు చేయక పోవడం చాల దురదృష్టకరం అన్నారు .నెల నెల వేతనాలు రాక అనేక ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన దుస్థితి ఉందన్నారు.అదే విదంగా గర్బవతులకు ,బాలింతలకు ,అంగన్ వాడి పిల్లలకు పౌష్టికాహారం కు కావాల్సిన గ్యాస్ కూరగాయలు ఇతర సరుకుల కోసం ఖర్చు చేసిన బిల్లులు సకాలంలో రాకపోవడం తో వర్కర్లు అంత రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితులు వచ్చాయన్నారు .రాష్ట్రంలో సుమారు 70 శాతం సెంటర్లు అద్దె భవనలలోనే కొనసాగుతున్నాయన్నారు .అద్దె బిల్లులు కుడా సక్రమంగా రాకపోవడంతో భవనాల యజమాను దారులు నుండి అద్దెలు చెల్లించాలంటూ ఒత్తిడిలు అధికం అయ్యాయన్నారు.వైఎస్సార్ సంపూర్ణ పౌష్టికాహారం కుడా సక్రమంగా పంపిణి కాకపోవడంతో లబ్ది దారులకు సరైన సమయంలో పంపిణి చేయలేక పోతున్నమన్నారు .ఎంటువంటి దుర్భర పరిస్థితులు ఎదుర్కొంటున్న మా సమస్యల పరిష్కారానికై రాష్ట్రంలో నున్న ఎపి అంగన్వాడి వర్కర్స్ & హెల్పర్ యునియన్ (సిఐటియు) ఇతర కార్మిక సంఘాల మద్దతుతో మా సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు నిరవధిక సమ్మెను చేపట్టడం జరుగుతుందని వారు తెలియజేశారు .ఈ కార్యక్రమంలో అన్నమయ్య జిల్లా ఉఉపాధ్యక్ష రాలు ఖాజాబి, కోశాధికారి బంగారు పాప, రాయచోటి అధ్యక్షురాలు సిద్దమ్మ తో పాటు రాయచోటి ప్రాజెక్ట్ పరిదిలోనున్న అంగన్ వాడి లీడర్లు, వర్కర్లు, హేల్పర్లు పాల్గొన్నారు
దేశీయ స్టాక్ మార్కెట్లలో లాభాల జోరు కొనసాగుతోంది. ఈరోజు కూడా మార్కెట్లు లాభాలను మూటకట్టుకున్నాయి. అమెరికాలో వడ్డీ రేట్లు తగ్గుతాయనే సంకేతాలు, చమురు ధరల్లో స్థిరీకరణ ఇన్వెస్టర్ల సెంటిమెంటును బలపరిచాయి. దీంతో, ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 358 పాయింట్లు లాభపడి 69,654కి చేరుకుంది. నిఫ్టీ 83 పాయింట్లు పెరిగి 20,938 వద్ద స్థిరపడింది.
కృష్ణాజిల్లా మచిలీపట్నంలో మీచాంగ్ తుఫాన్ ప్రభావంతో కరగ్రహారం, క్యాంబిల్ పేట, చిన్నకరగ్రహారం, పల్లిపాలెం, నవీన్ మిట్టల్ కాలనీ, మేకవాని పాలెం, తాళ్లపాలెం, మంగినపూడి, తుమ్మలచెరువు, పేద యాదర, చిన యాదర, భోగిరెడ్డిపల్లి, నెలకుర్రు చిన్నాపురం, గ్రామాలలో నీట మునిగి దెబ్బతిన్న వరి, వేరుశనగ, మినువు పంటలు ప్రభుత్వం సరైన రీతిలో స్పందించకపోవడంతో మొత్తం పొలాలు నీళ్లతో నిండిపోయి, అమ్ముకోవడానికి వీలు కాకుండా కుళ్లిపోయి నష్టపోయిన రైతాంగాన్ని పరామర్శించి తక్షణమే అధికారులు స్పందించి రైతాంగానికి ఇన్సూరెన్స్ కింద ఆదుకోవాలని కోరిన మాజీ మంత్రి వర్యులు పొలిట్ బ్యూరో సభ్యులు కొల్లు రవీంద్ర వారితో పాటు మచిలీపట్నం నియోజకవర్గ రూరల్ తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి రేపు ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఎల్బీ స్టేడియం వేదికగా జరిగే ఈ కార్యక్రమంలో రేవంత్ చేత గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. గురువారం మధ్యాహ్నం జరగనున్న ప్రమాణస్వీకారానికి రావాలని ఏఐసిసి చీఫ్ మల్లిఖార్జున్ ఖర్గేతో పాటు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీని రేవంత్ రెడ్డి ఆహ్వానించారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పలు రాష్ట్రాల సీఎంలు, మాజీ సీఎంలు, వివిధ రాజకీయ పార్టీల నేతలకు టీపీసీసీ ఆహ్వానాలు పంపింది. అలాగే ఏపీ సీఎం వైఎస్ జగన్, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ తో పాటు చంద్రబాబునాయుడుకి, కెసిఆర్ ను కూడా ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించారు. కాంగ్రెస్ గెలుపులో కీలకపాత్ర పోషించిన కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ను ప్రమాణ స్వీకార మహోత్సవానికి ఆహ్వానించారు. వీరితోపాటు హైకోర్టు చీఫ్ జస్టిస్ అలోక్, తెలంగాణ అమరవీరుల కుటుంబాలకూ టీపీసీసీ ఆహ్వానం పంపింది. టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం, ప్రొఫెసర్ హరగోపాల్, కంచె ఐలయ్యతో పాటు వివిధ కుల సంఘాల నేతలు, సినీ ప్రముఖులకు ఆహ్వానాలు వెళ్లాయి.
‘పుష్ప’లో అల్లు అర్జున్ పక్కన సహాయ నటుడి పాత్ర పోషించిన జగదీశ్ (కేశవ) పై పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. జూనియర్ ఆర్టిస్టు మరో వ్యక్తితో ఉన్నప్పుడు ఫొటోలు తీసి వాటిని సోషల్‌మీడియాలో పోస్టు చేస్తానని బెదిరింపులకు పాల్పడిన జగదీశ్‌ను పంజాగుట్ట పోలీసులు బుధవారం అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చారు. జగదీశ్ వేధింపులతో పంజాగుట్ట పరిధిలో నివాసం ఉంటున్న ఓ మహిళ (జూనియర్ అర్టిస్టు) గత నెల 29న ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు మహిళ ఆత్మహత్యకు గల కారణాలను తెలుసుకున్నారు. మహిళ గత నెల 27న ఓ వ్యక్తితో ఉన్న సమయంలో ఆమెకు తెలియకుండా జగదీశ్ ఫొటోలు తీశాడు. ఆ తర్వాత ఆమెను బెదిరించాడు. దీంతో మనస్తాపానికి గురైన మహిళ ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ కేసులో అప్పటి నుంచి తప్పించుకుని తిరుగుతున్న బండారు జగదీశన్‌ను ఇవాళ అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఆత్మహత్య చేసుకున్న మహిళతో గతంలో జగదీశ్‌కు సినీ రంగంలో పరిచయం ఉందని పోలీసులు తెలిపారు.
తెలంగాణలో ఏర్పడే కొత్త ప్రభుత్వం ప్రజా సానుకూల పాలన అందించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం సూచించారు. ఆయన ఖమ్మం జల్లా నేలకొండపల్లిలో మీడియాతో మాట్లాడారు. కెసిఆర్ అనుసరించిన అహంకార వైఖరి కారణంగానే ఓటమి పాలయ్యారన్నారు. కేసిఆర్ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను వ్యక్తం చేసేందుకు ప్రజలకు కాంగ్రెస్ ప్రత్యామ్నాయంగా కనిపించిందని అన్నారు. ఈ ఎన్నికల్లో డబ్బు ప్రభావంతో ఫలితాలు తారు మారయ్యాయని అన్నారు. అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసి, గిట్టుబాటు ధర కల్పించాలన్నారు.




Total views : 196363