మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం లో బిఆర్ఎస్ ప్రచారం జోరుగా సాగుతోంది. నర్సాపూర్ బిఆర్ఎస్ అభ్యర్థి సునీత లక్ష్మారెడ్డి వెల్దుర్తి మండలం లోని హస్తాల్ పూర్.. బండమీదిపల్లి .. ముల్లూరు, పెద్దాపూర్ గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ…బిఆర్ ఎస్ మూడో సారి అధికారంలోకి వస్తే పేదలకు మరిన్ని సంక్షేమ పథకాలను అందుతాయని అన్నారు. రేషన్ దుకాణాలలో సన్న బియ్యం పంపిణీ చేస్తామన్నారు.
మహిళలందరికీ మహిళా సమాఖ్య భవనాలు కట్టిస్తామని…సౌభాగ్య లక్ష్మి పేరుతో ప్రత్యేకంగా నెలకు మూడు వేల రూపాయలు ఇస్తామన్నారు.పేదలకు ఇళ్ల నిర్మాణానికి 5 లక్షల వరకు ఆర్థిక సహాయం చేస్తామన్నారు. నర్సాపూర్‌లో తనను గెలిపిస్తే పేదలను అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు.
Brs
బీఆర్ఎస్ పార్టీ హయాంలో పేపర్ లు లీక్ చేసి నిరుద్యోగులను మోసం చేశారన్నారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా. నాగర్ కర్నూల్ జిల్లా కొల్హాపూర్ సభలో ఆయన ప్రసంగించారు. కేసీఆర్ నిరుద్యోగుల ఆశలను ఆవిరి చేశారన్నారు. తాము అధికారంలోకి వచ్చాక కచ్చితమైన ఉద్యోగ ప్రకటనను ఇస్తామని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండో ఒకటే అని పేర్కొన్నారు. బీఆర్ఎస్ కు ఓటు వేస్తే కాంగ్రెస్ కు వేసినట్లేనన్నారు. బీసీని సీఎం చేస్తానని కేసీఆర్ మాట తప్పారన్నారు. బీసీ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటే బీజేపీకి ఓట్లు వేసి గెలిపించాలన్నారు.
రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి భీమ్ భరత్ ఉదయం 6 గంటల నుంచి కార్యక్రమాన్ని ప్రారంభించి రాత్రి 10 గంటల వరకు ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. ఈ ప్రచార కార్యక్రమంలో ఈరోజు చేవెళ్ల మండలంలోని కేసారం, దామరగిద్ద, ఖానాపూర్ గ్రామాలలో కొనసాగిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భీం భారత్ కు పెద్ద ఎత్తున ప్రజలు నీరాజనాలు పలుకుతూ హారతులు ఇస్తున్నారు. ఈ ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన 6 గ్యారెంటీ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రజలకు అర్థమయ్యే విధంగా చెప్పుతూ వచ్చే ఎన్నికల్లో చేతి గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో కాంగ్రెస్ పార్టీని గెలిపించాల్సిందిగా కోరారు. ఈ నేపథ్యంలో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి చేస్తున్న భూదందాలు కానీ, కుటుంబ పాలన కొనసాగిస్తున్నాడని దళితులకు రావలసిన పదవులను సైతం తన కుటుంబమే పొందుతుందని దుయ్యబట్టారు. రంగులు మార్చే ఊసరవెల్లి లాగా కేఎస్ రత్నం కూడా పార్టీలు మారుస్తున్నారని ఆయన చేసింది ఏమీ లేదని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాంగానే పెండింగ్‌లో ఉన్న పనులన్నీ పూర్తి చేస్తామని దామరగిద్దలో బస్ డిపోను ఏర్పాటు చేపిస్తామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ అభ్యర్థి భీం భారత్ తో పాటు వ్యవహారాల ఇన్చార్జి చింపుల సత్యనారాయణ రెడ్డి చేవెళ్ల సర్పంచ్ శైలజ రెడ్డి, దేవర వెంకటరెడ్డి సున్నం వసంతం షాబాద్ దర్శన్ నాయకులు కార్యకర్తలు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
ప్రభుత్వ రంగ సంస్థలు అమ్మడమే బిజెపి పని అని, బిజెపి అధికారంలోకి వస్తే నిత్యవసరాల ధరలు పెరుగుతాయని ఎమ్మెల్సీ కవిత అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో ఏర్పాటు చేసిన రోడ్ షోలో ఆమె పాల్గొన్నారు. అనంతరం ప్రజలను ఉద్దేశించి కవిత మాట్లాడుతూ నాడు అరిగోస పడ్డ తెలంగాణ నేడు బీఆర్ఎస్ పాలనలో అభివృద్ధి దిశగా ముందుకు వెళుతుందన్నారు. షుగర్ ఫ్యాక్టరీలను ముంచిందే బిజెపి అని, నేడు అదే బీజేపీ షుగర్ ఫ్యాక్టరీలను తెరిపిస్తామనడం విడ్డూరంగా ఉందని అన్నారు. అభివృద్ధి చేసే బిఆర్ఎస్ వైపు ఉండాలని, అరాచకం చేసే కాంగ్రెస్, బిజెపి వద్దని ఆమె అన్నారు. కారు గుర్తుకు ఓటు వేసి కల్వకుంట్ల సంజయ్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని ఆమె కోరారు.
ఉప్పల్ నియోజకవర్గంలో ప్రచారంలో జోరు పెంచిన బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి. ఉప్పల్ నియోజకవర్గంలోని అశోక్ నగర్ ఎన్ఎఫ్సీ కార్మికులు తమ విధులకు హాజరయ్యే సమయంలో వారితో కలిసి తనకు ఓటు వేసి గెలిపించాలని కోరారు, ఈ సందర్భంగా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ ఎన్ ఎక్స్ లో పనిచేస్తున్న కార్మికులు అండగా ఉంటానని ప్రతి ఒక్కరూ వారి ఇంటి దగ్గర మరియు కంపెనీ దగ్గర కూడా కలిసి మద్దతు కోరామని తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 24 గంటల కరెంటు రావడంతో ప్రజలందరూ సంతోషంగా ఉన్నారని ఆయన తెలిపారు. ఎన్ఎఫ్సి వర్కర్స్ యూనియన్ ఉప్పల్ నియోజకవర్గ బిఆర్ఎస్ అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డికి పూర్తి మద్దతు తెల్పుతున్నట్లు యూనియన్ మాజీ అధ్యక్షులు రాజారెడ్డి తెలిపారు. ఈ సందర్బంగా ఆయన రాజారెడ్డి మాట్లాడుతూ కార్మికుల పూర్తి మద్దతు బండారి కుటుంబానికి ఉంటుందని, ఆ కుటుంబంతో మంచి అనుబంధం ఉందన్నారు.
రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం అజిత్ నగర్ గేట్ సమీపంలో తాండూరు నుంచి హైదరాబాద్ కు బిఆర్ఎస్ పార్టీ మీటింగ్ కు వెళ్తున్న తుఫాన్ వాహనం అదుపుతప్పి బోల్తా కొట్టడంతో ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. మృతి చెందిన వ్యక్తులు సిహెచ్ రమేష్ (36) వాహన డ్రైవర్ ధర్మచేడు గ్రామం బషీరాబాద్ మండలం వికారాబాద్ జిల్లా, లక్ష్మయ్య (55), విష్ణుపురి కాలనీ మల్కాజ్గిరి, ఒక వ్యక్తికి ఎలాంటి గాయాలు కాలేదు మిగతా 5 మందినీ గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను పట్టణంలోని ప్రీమియర్ హాస్పిటల్ కి తరలించారు. ప్రమాద సమయంలో కారులో 8 మంది ప్రయాణిస్తున్నట్లు తెలుస్తోంది. వీరు తాండూరు లోని టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డికి చెందిన వ్యక్తులుగా తెలుస్తుంది.
Read Also..
ఎన్నికల ప్రచారం ముమ్మరంగా జరుగుతున్న నేపథ్యంలో లంగాణలో ఐటీ సోదాలు కూడా ఊపందుకున్నాయి. ఓ వైపు పాతబస్తీలో బడా వ్యాపారులే లక్ష్యంగా ఐటీ దాడులు నిర్వహించారు. మరోవైపు అధికారపార్టీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఇంట్లో ఐటీ సోదాలు జరిగాయి. వికారాబాద్ జిల్లా తాండూరులోని రోహిత్ రెడ్డి నివాసంలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. రోహిత్ ఇంట్లో రూ.20 లక్షల నగదు, పలు రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనుచరుడిని ఐటీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
ఉప్పల్ నియోజకవర్గం లో ప్రచారంలో జోరు పెంచిన బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి. ఉప్పల్ నియోజకవర్గం లోని అశోక్ నగర్ ఎన్ఎఫ్సీ కార్మికులు తమ విధులకు హాజరయ్యే సమయంలో వారితో కలిసి తనకు ఓటు వేసి గెలిపించాలని కోరారు, ఈ సందర్భంగా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ ఎన్ ఎక్స్ లో పనిచేస్తున్న కార్మికులు అండగా ఉంటానని ప్రతి ఒక్కరూ వారి ఇంటి దగ్గర మరియు కంపెనీ దగ్గర కూడా కలిసి మద్దతు కోరామని తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 24 గంటల కరెంటు రావడంతో ప్రజలందరూ సంతోషంగా ఉన్నారని ఆయన తెలిపారు. ఎన్ఎఫ్సి వర్కర్స్ యూనియన్ ఉప్పల్ నియోజకవర్గ బిఆర్ఎస్ అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డికి పూర్తి మద్దతు తెల్పుతున్నట్లు యూనియన్ మాజీ అధ్యక్షులు రాజారెడ్డి తెలిపారు. ఈ సందర్బంగా ఆయన రాజారెడ్డి మాట్లాడుతూ కార్మికుల పూర్తి మద్దతు బండారి కుటుంబానికి ఉంటుందని,ఆ కుటుంబంతో మంచి అనుబంధం ఉందన్నారు.
ప్రజలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయొద్దంటూ కేంద్ర ఎన్నికల సంఘం సీఎం కేసీఆర్‌కు లేఖ రాసింది. అక్టోబర్ 30న బాన్సువాడలో జరిగిన ప్రజాశీర్వాద సభలో కేసీఆర్ కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడి గురించి మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు రూల్స్‌కు విరుద్ధమని స్పష్టం చేసింది. స్టార్ కాంపెయినర్‌గా, బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని తేల్చి చెప్పింది. ఇలాంటి వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణిస్తామని హెచ్చరించింది. ఇలాంటి ప్రసంగాలు చేసిన వ్యక్తుల పార్టీ అనుమతులు రద్దు చేసే అధికారం తమకు ఉందని గుర్తు చేసింది. ప్రస్తుత వ్యాఖ్యలను మాత్రం సీరియస్‌గా తీసుకోవట్లేదని పేర్కొంది.
దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిపై కత్తితో దాడి ఘటనపై స్పందిస్తూ కేసీఆర్ ప్రజాశీర్వాద సభలో రెచ్చగొట్టేలా మాట్లాడారని కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. దీనిపై ఈసీ విచారణకు ఆదేశించగా స్థానిక రిటర్నింగ్ అధికారి ఈ నెల 14న ఈసీకి నివేదిక సమర్పించారు. ఈ నివేదిక ఆధారంగా సీఎం కేసీఆర్‌కు నోటీసులు జారీ చేసిన ఈసీ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయొద్దని సూచించింది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పలువురు నేతలు, వారి అనుచరుల ఇళ్ళల్లో సోదాలు జరుగుతున్నాయి. తాజాగా మంత్రి మల్లారెడ్డి అనుచరుడు, బీఆర్ఎస్ బోడుప్పల్ పార్టీ అధ్యక్షుడు మంద సంజీవరెడ్డి ఇంట్లో సోదాలు జరిగాయి. ఎన్నికల అధికారులు, ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. సంజీవరెడ్డి నివాసానికి మల్లారెడ్డికి చెందిన డబ్బు భారీ మొత్తంలో చేరిందన్న ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో సోదాలు జరిగాయి. సంజీవరెడ్డి ఇంటి నుంచి బయటకు వెళ్లకుండా అడ్డుకుని సోదాలు చేశారు. అయితే, సోదాల్లో ఎలాంటి డబ్బు దొరకకపోవడం గమనార్హం. సోదాల సందర్భంగా సంజీవరెడ్డి ఇంటి ముందు బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు పరస్పరం నినాదాలు చేసుకున్నారు.
Read Also..
Read Also..