బడే నాగజ్యోతి చరిత్ర మీకు తెలుసు. కాంగ్రెస్ రాజ్యం వస్తే ఇందిరమ్మ రాజ్యం తెస్తరట. ఇందిరమ్మ రాజ్యంలో ఏం మంచిగుండె. ఎన్కౌంటర్లు, కాల్చి చంపుడు.. ఎమర్జెన్సీపెట్టి జైళ్లలో వేసుడే ఉండెకదా? ఓ బానిస బతుకుల్లా ఉండే. అటువంటి దుర్మార్గమైన ఇందిరమ్మ రాజ్యం ఉన్నప్పుడే బడే నాగజ్యోతి తండ్రి ఉద్యమాల్లో పోయి అమరుడయ్యాడు. ప్రజల కోసం ప్రాణాలు ఇచ్చిండు. ఆయన స్వార్థం కోసం కాలేదు. ప్రజల పక్షాన కొట్లాడేందుకు వెళ్లి బలయ్యారు. అలాంటి వ్యక్తి బిడ్డ నాగజ్యోతి. తల్లిలేదు తండ్రి లేదు.. ములుగు ప్రజలు నా తల్లిదండ్రులని చెప్పింది. నేను మీ అందరినీ కోరుతున్నా. ఆమె కష్టపడి చదువుకున్నది. ఉన్నత విద్యావంతురాలుగా ఎదిగింది. సర్పంచ్‌గా పని చేసి ఇవాళ జిల్లా పరిషత్ చైర్మన్ హోదాకు వచ్చింది’ అన్నారు. నాగజ్యోతిని గెలిపించకుంటే పంచాయితీ పెట్టుకుంట.. ‘నేను మీ అందరినీ కోరేది.. నాగజ్యోతి ఎమ్మెల్యే అయితే ములుగు ఓ జ్యోతిలా గ్యారంటీగా వెలుగుతుంది. నాగజ్యోతిని గెలిపిస్తే నేను ఇక్కడే రెండురోజులు క్యాంప్‌లో ఉంటాను. నేను స్వయంగా మీతోని మాట్లాడుతాను. ఎక్కడ ఏం అవసరాలున్నయో వందశాతం చేసే బాధ్యత నాది అని మనవి చేస్తున్నా. కాంగ్రెస్ పార్టీ వాళ్లు గెలిచేది లేదు సచ్చేది లేదు. ఇవాళ నేను తిరిగేది 80వ నియోజకవర్గం కావొచ్చు. ఇంకో 20 తిరిగితే అయిపోతది. ఏం గాలి లేదు.. తుస్సుమన్నది. ఎక్కడా ఏం లేదు. అది వచ్చేది లేదు. సచ్చేది లేదు. లాస్ట్ టైమ్ గెలిపించకుంటే నేను మీ మీద అలుగలేదు. కానీ, ఇప్పుడుమాత్రం పంచాయితీ పెట్టుకుంటా. ములుగు అభివృద్ధి కావాలంటే గవర్నమెంట్ ఉండే పార్టీ గెలిస్తేనే మంచి లాభం జరుగుతుంది. పనులు ఎక్కువ జరుగుతాయ్. ఆ అమ్మాయి ఇక్కడే పుట్టింది.. ఇక్కడే పెరిగింది. కుటుంబ త్యాగాలు మీకు తెలుసు. అందరూ బడే నాగజ్యోతిని దీవించండి. మీకు కావాల్సిన పనులన్నీ చేసిపెడుతాను’ అని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు.
Brs
జూబ్లీహిల్స్ నియోజకవర్గం మధురానగర్ లోని శ్రీనివాస కాలనీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సమావేశంలో కాంగ్రెస్ అభ్యర్థి మహమ్మద్ అజారుద్దీన్ కి మద్దతుగా కాంగ్రెస్ నాయకులు తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. రానున్న ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి బరిలో ఉన్న కాంగ్రెస్ అభ్యర్థి మహమ్మద్ అజారుద్దీన్ని గెలిపించాలని కాలనీ వాసులకు పిలుపునిచ్చారు. తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలు అన్ని రంగాలలో వెనకబడి ఉన్నారని, బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేసింది అని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ప్రత్యేక తెలంగాణ ఇస్తే కెసిఆర్ కుటుంబం అక్రమపాలన కొనసాగిస్తుందని విమర్శించారు. చంద్రబాబు హాయంలో ఐటీ కంపెనీలు అభివృద్ధి చెందాయి, వైఎస్ రాజశేఖర్ రెడ్డి మంచి పరిపాలన అందిచారాన్నారు. ప్రస్తుతం ఉన్న జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే కు రాజకీయ బిక్ష పెట్టిన ఎన్టీఆర్ నే విస్మరిస్తున్నార్నారు. తెలంగాణలో ప్రాజెక్టుల పేరుతో అవినీతికి పోయి, తెలంగాణ రాష్ట్రం అభిరుద్ధి చెందాలంటే కేసీఆర్ ప్రభుత్వాన్ని ఎన్నికల్లో ఓడించి, కాంగ్రెస్ అభ్యర్థి అజారుద్దీన్ కి ఓటు వేసి అత్యధిక మెజారిటితో గెలిపించాలని పిలుపునిచ్చారు.
సనత్ నగర్ నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బన్సీలాల్ పేట్ డివిజన్ బోయగూడా ప్రాంతంలో ఏర్పాటు చేసిన ముస్లిం మైనార్టీల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు. బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి కారు గుర్తుకే ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపిస్తామని మైనార్టీ సోదరులు ఈ సమావేశం ద్వారా ఏకగ్రీవ తీర్మానం చేశారు. నిత్యం ప్రజలతో ఉంటూ అవసరం వచ్చిన శుభకార్యానికి అండగా నిలిచే వ్యక్తి తలసాని శ్రీనివాస్ యాదవ్ అని 450 కోట్లతో సనత్ నగర్ నియోజకవర్గాన్ని అభివృద్ధిలో అగ్ర స్థానంలో నిలిపారని వారు అన్నారు. మేనిఫెస్టోకు సంబంధం లేకుండా ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ఘనత సీఎం కేసీఆర్ అని కుల, మతవరణలకు అతీతంగా తెలంగాణ ప్రభుత్వం అన్ని వర్గాలకు అండగా నిలిచిందని ఆనందాన్ని వ్యక్తపరిచారు. శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. ఎన్నికలు రాగానే తెల్ల బట్టలు వేసుకొని కనబడే వ్యక్తులు ప్రజలలో ఎప్పటికీ ఉండాలని స్థానిక ప్రతిపక్ష పార్టీల్లో బలమైన నాయకులు లేకనే ఢిల్లీ నుండి వచ్చి ఇక్కడ ప్రచారంలో టిఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధిపై కేసీఆర్ పై నోటికి వచ్చినట్టుగా మాట్లాడుతున్నారని అన్నారు. తెలంగాణ గడ్డపై ప్రతి ఒక్కరిలో ప్రవహించే రక్తం పోరాటాల స్ఫూర్తితో ఉంటుందని వారు చెప్పే కల్లబొల్లి మాటలు నమ్మి మోసపోయే ప్రజలు ఈ ప్రాంతంలో ఎవరూ లేరని ఎన్ని ప్రలోభాలుకు గురిచేసిన భయపెట్టిన భయపడే వాళ్ళు ఎవరు లేరని ధీమా వ్యక్తం చేశారు. స్థానికులు కాని వారు ఇక్కడికి వచ్చి పోటీ చేయడం, ఇక్కడి మనిషైనా గతంలో ఎమ్మెల్యేగా ఉన్న బిజెపి పార్టీ అభ్యర్థి ఎప్పుడు ప్రజలకు అందుబాటులో లేడని వారితో నాకు పోటీ ఏంటి అని ఎద్దేవా చేశారు. కచ్చితంగా సనత్ నగర్ నియోజకవర్గం లో లక్ష మెజార్టీతో తన గెలుపు ఖాయమని అన్నారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కల్వకుంట్ల తారకరామారావు సోషల్ మీడియా ద్వారా పార్టీ శ్రేణుల్ని, సోషల్ మీడియా సైన్యాన్ని అప్రమత్తం చేశారు.
స్కాంగ్రేస్ స్కామర్ల నుంచి రాబోయే కొద్ది రోజులలో అనేక తప్పుడు, డీప్ ఫేక్ వీడియోలు, ఇతర రకాల అసంబద్ధమైన ప్రచారాలు రావొచ్చని కేటీఆర్ హెచ్చరించారు. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అసత్య ప్రచారాల వలలో ఓటర్లు పడకుండా చూడాలని కేటీఆర్ కోరారు. డీప్ ఫేక్ కంటెంట్ గురించి దేశవ్యాప్తంగా చర్చ నడుస్తోంది. డీప్ ఫేక్ వ్యాప్తి కట్టడికి కేంద్రం కఠిన చర్యలకు ఉపక్రమించింది. ఈ తరుణంలో తెలంగాణ ఎన్నికల్లోనూ ఆ తరహా కంటెంట్ వైరల్ కావొచ్చంటూ కేటీఆర్ చేసిన కామెంట్లు ఇప్పుడు ఆసక్తిని రేకేత్తిస్తోన్నాయి.
Read Also..
Read Also..
జోగులాంబ గద్వాల జిల్లా అయిజ మండలం చిన్న తాండ్రపాడు గ్రామంలో బీఆర్ఎస్ ప్రచారంలో భాగంగా అంబేద్కర్ విగ్రహం సమీపంలో ప్రచార రథం ను నిలిపి ప్రజా ప్రతినిధులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేయడం జరిగింది. అనంతరం ప్రచార రథం పైకి ఎక్కి ప్రజా ప్రతినిధులు మాట్లాడుతుండగా ప్రమాదవశాత్తు అంబేద్కర్ విగ్రహం విరిగిపోవడం జరిగింది. ఇది గమనించిన స్థానికులు బీఆర్ఎస్ ప్రచార రథంను అడ్డుకున్నారు. పోలీసులు కలగజేసుకొని స్థానికులను చదరగొట్టారు.
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి BRS అభ్యర్ధి దుర్గం చిన్నయ్యకు నిరసన జ్వాలలు ఎదురవుతున్నాయి. ఎటు వెళ్లినా ఓటర్లు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. అధికారంలో ఉండగా జరిగిన పొరపాట్లు ఇప్పుడు ఆయన పాలిట శాపంగా మారిపోతున్నాయి. నాడు మౌనంగా ఉన్న వారు కూడా ఎన్నికల వేళ నిలదీసే పరిస్థితులు వచ్చేశాయి. చిన్నయ్యపై భూ కబ్జాలు, ప్రభుత్వ భూములను ధరదాత్తం చేశారనే ఆరోపణలు వచ్చాయి. సొంత గ్రామం జెండా వెంకటాపూర్ ను అయినా అభివృద్ధి చేయలేదనే విమర్శలు ఉన్నాయి. ఇక బెల్లంపల్లి పట్టణంలో సొంత పార్టీ నాయకులు పార్టీని వీడారు. ఇద్దరు మున్సిపల్ కౌన్సిలర్లు కూడా కారు దిగిపోయారు. మరికొందరు అదే బాటన సాగుతారన్న ఊహాగానాలు వస్తున్నాయి. హాట్రిక్ విజయం ఎమ్మెల్యే చిన్నయ్య విపరీతంగా శ్రమిస్తున్నారు. ఓటర్ల కరుణ కోసం ఆరాటపడుతున్నారను.
ఈ తొమ్మిదిన్నరేండ్ల కాలంలో తెలంగాణ ప్రభుత్వం 1లక్ష 60వేల 83 ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. రానున్న రోజుల్లో మరో 42 వేల ఉద్యోగాలు భర్తీ ప్రక్రియలో ఉన్నాయని… తమ కంటే మెరుగ్గా ఉద్యోగాలు భర్తీ చేసిన రాష్ట్రాలు ఉన్నాయా అని ప్రశ్నించారు. ఐటీసీ కాకతీయ హోటల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో కేటీఆర్ తెలంగాణ అభివృద్ధిపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. తెలంగాణ పిల్లలకు చెప్పండని.. ఊరికే గావుకేకలు, పెడబొబ్బలు కాదంటూ ఎద్దేవా చేశారు. ప్రజెంటేషన్ ఇచ్చి… ఫలానా చోట ఇంత కన్న ఎక్కువ చేశామని చెప్పండన్నారు. గుజరాత్లో 6 కోట్లు, రాజస్థాన్‌లో ఎనిమిదిన్నర కోట్ల జనాభా ఉన్నా.. ఆ రాష్ట్రాల్లో ఉద్యోగాల భర్తీ అనుకున్నంత జరగలేదన్నారు. 4 కోట్ల జనాభా ఉన్న తెలంగాణలో తాము 1.60 లక్షల ఉద్యోగాలను భర్తీ చేశామన్నారు. ఎనిమిదిన్నర కోట్లు, 6 కోట్ల జనాభా ఉన్న రాష్ట్రాలు కూడా అన్ని ఉద్యోగాలను భర్తీ చేయలేదని తెలిపారు. ఇవి వాస్తవాలని.. ఉద్యోగాల భర్తీకి సంబంధించి వెబ్సైట్ కూడా పబ్లిష్ చేశామని పేర్కొన్నారు. ఇవి వాస్తవాలు కాదని రుజువు చేసే దమ్ము ప్రతిపక్షాలకు ఉందా.. అంటూ ప్రశ్నించారు. ప్రైవేటు సెక్టార్లో కూడా లక్షల ఉద్యోగాలు సృష్టించి, ఉపాధి కల్పించామని కేటీఆర్ తెలిపారు.
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణంలో BRS ఎమ్మెల్యే అభ్యర్ధి సైదిరెడ్డి తరపున రోడ్డు షోలో కేటీఆర్ పాల్గొన్నారు. కేటీఆర్ మాట్లాడుతూ ఈ ర్యాలీ ఎన్నికల ర్యాలీలా లేదు విజయోత్సవ ర్యాలీలా ఉంది . రెండేళ్లలో సైదిరెడ్డి చేసిన పని 2టర్మ్ లు మంత్రిగా ఉన్న ఉత్తమ్ కూడా చేయలేదు.. ఉప ఎన్నికల్లో సీఎం హుజూర్ నగర్ కు ఇచ్చిన ప్రతీ హామీని నెరవేర్చారు… తండాలు గ్రామపంచాయితీలు గా చేసిన ఘనత కెసిఆర్ దే..సెవాలాల్ జయంతి అధికారికంగా నిర్వహించింది మా ప్రభుత్వమే, కరెంట్ కావాలో కాంగ్రెస్ రావాలో మీరే నిర్ణయించుకోండి. కాంగ్రెస్ ఉదయ్ పూర్ డిక్లరేషన్ లో కుటుంబంలో ఒక్కరికే టికెట్ ఆన్నవాళ్లు..ఈరోజు ఎంతమంది పోటీ చేస్తున్నారు…అక్కడ ఇచ్చిన హామీనే నిలబెట్టుకోలేదు…మిగతా గ్యారెంటీలకు గ్యారెంటీయే లేదు. స్కాములు చేయాలే.. రాష్ట్రాన్ని మింగేయలి ఇదే కాంగ్రెస్ నినాదం.. రేవంత్ రెడ్డి మూడు గంటలు కరెంటు చాలు అంటాడు. ఉత్తమ్ కుమార్ రెడ్డి రైతుబందు దుబారా అని చెబుతున్నాడు.. భట్టి విక్రమార్క ధరణి రద్దు చేస్తా అంటాడు..ఇలాంటి వాళ్ళకా మనం ఓట్లు వేసేది.
జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల నియోజకవర్గంలోని ధరూర్ మండల కేంద్రం లో నిర్వహించిన మహిళా ఆశీర్వాద సభకు ధరూర్, కేటి దొడ్డి మండలాల నుండి మహిళలు భారీ ఎత్తున హాజరయ్యారు. ఈ సందర్భంగా బూరెడ్డిపల్లి సర్పంచ్, ఎమ్మెల్యే భార్య బండ్ల జ్యోతి మాట్లాడుతూ కృష్ణమోహన్ రెడ్డిని చూసి కళ్ళు మండుతున్న వాళ్ళు విద్యార్థులపై కూడ అసత్య ఆరోపణలు చేస్తున్నారని రాజకీయాలలో విద్యార్థులను బలిపశువులు చేసి వారి జీవితాలతో ఆడుకోవద్దండి అని అన్నారు. గద్వాల విద్యార్థుల కోసం, గద్వాల ప్రజల కోసం కృష్ణమోహన్ రెడ్డి ఎవరు కాళ్ళు మొక్కేందుకైనా సిద్ధమని అన్నారు. ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మాట్లాడుతూ అన్నం పెట్టే పార్టీ భారాస పార్టీ అని అన్ని చేసిన పార్టీ కావాల్న లేక మొండి చేయి పార్టీ కావాల్న అని ఎమ్మెల్యే అన్నారు. రెండు పర్యాయాలు ఓడిన ప్రజాబలం అండగా నిలిచింది, ఈరోజు ఈ స్థాయిలో ఉన్న అంటే కూడ మీరిచ్చే ధైర్యమని, ఎదగడానికి కారణమైన ప్రజలను గుండెల్లో పెట్టుకుని కాపాడుకునే భాద్యత నాదని అన్నారు. సీడ్ వ్యాపారం పెట్టి ప్రజల రక్తాన్ని పీల్చిన వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో వుంటూ దొంగల మాదిరి రాత్రి పూట వచ్చి భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలు ఏ మాత్రం పొరపాటు చేసిన గద్వాలలో చీకటి రోజులు వస్తాయి. 50 వేల మెజారిటీతో గెలుస్తున్నామని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అన్నారు.
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గంలో BRS అభ్యర్ధి దుర్గం చిన్నయ్యకు శాసనసభ సర్వత్రిక ఎన్నికల ప్రచారంలో నిరసన జ్వలాలు ఎదురుకుంటున్నారు. 2014 లో జరిగిన ఎన్నికలు, తెలంగాణ సెట్టిమెంట్ తో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది 2018లో ఎన్నికలు రెడోదాపా సంక్షేమ పథకాల,, అభివృద్ధి పూర్తి స్థాయిలో జరగాలంటే మళ్ళీ గులాబీ పార్టీని గెలుపుంచాలన్న వాదం తో ప్రజల్లోకి వెళ్లారు కానీ 2023 శాసనసభ సర్వత్రిక ఎన్నికల్లో మూడో దాఫా విజయం పొందాలన్న ఆతృతతో గులాబీ తహ తహ లాడుతుంది కానీ అందుకు భిన్నంగా నియోజకవర్గల్లో అభ్యర్థుల పాలన పై అసంతృప్తి వెల్లువేత్తుతుంది భూ కబ్జాలు, ప్రభుత్వ భూములను ధరదాత్తం చేయడం, మౌలిక వసతులను సమాకుర్చడంలో విఫలం కావడం తో ప్రజల్లో ఆదరణ కరువైంది సొంత గ్రామాన్ని( జెండా వెంకట పూర్ ) అభివృద్ధి చేయకపోవడంతో గ్రామంలో వ్యతిరేక పావనాలు విస్తున్నాయి సొంత పార్టీ నాయకులు, ఇద్దరు మున్సిపల్ కౌన్సిలర్లు పార్టీని విడారు , మరి కొందరు కౌన్సిలర్లు పార్టీ వీడేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తుంది రెండు పర్యాయలు గెలిచినా దుర్గం చిన్నయ్య హైట్రిక్ గెలుపు నల్లేరు మీద నడక అన్నట్లుగా మారింది.