బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పిటిషన్‌పై విచారణను సుప్రీం కోర్టు మార్చి 13కు వాయిదా వేసింది. విచారణకు తగిన సమయం లేదంటూ మరో తేదీని కేటాయించింది. ఢిల్లీ మద్యం కేసులో ఈడీ ఇచ్చిన సమన్లను రద్దు చేయాలని కవిత సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తనపై ఈడీ చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని ఆ పిటిషన్లో కోరారు. అయితే ఈ రోజు కోర్టు సమయం ముగియడంతో కవిత తరఫు న్యాయవాది కపిల్ సిబాల్ ప్రత్యేకంగా ఈ పిటిషన్‌ను ప్రస్తావించారు. త్వరగా విచారణ జరపాలని సర్వోన్నత న్యాయస్థానానికి విజ్ఞప్తి చేశారు. అయితే విచారణకు సమయం లేదంటూ మార్చి 13వ తేదీకి వాయిదా వేసింది.
Brs
తెలంగాణ రాష్ట్రంలో ఆరు గ్యారెంటీల పేరుతో మోసం చేసి కాంగ్రెస్ పార్టీ గద్దెనెక్కిందని, బిఆర్ఎస్, కాంగ్రెస్ ఇద్దరు తోడు దొంగలని రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ అన్నారు. నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ లో 8వ రోజు బీజేపీ విజయ సంకల్ప యాత్ర ప్రారంభం అయింది. ముఖ్య అతిధితులుగా రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్, ఎమ్మెల్యే కాటేపల్లి వెంకటరమణ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు ఎల్లేని సుధాకర్ రావు, బంగారు శృతి పాల్గొన్నారు. సోమశిల, సింగోటం ఆలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కొల్లాపూర్, కోడెర్, పెద్దకొత్తపల్లి మీదుగా విజయ సంకల్ప యాత్ర కొనసాగింది. విజయ సంకల్ప యాత్ర నరేంద్రమోదీని మూడోవసారి ప్రధాని చేయడం లక్ష్యంగా, పార్లమెంట్ ఎన్నికలలో బీజేపీ విజయం లక్ష్యంగా ముందుకు సాగుతుందని రాజ్యసభ సభ్యుడు బంగారు లక్ష్మణ్ అన్నారు. బీజేపీ పది సంవత్సరాలలో అభివృద్ధి, పేదల సంక్షేమ పథకాలు, సహసాపేతమైన నిర్ణయాలు తీసుకున్నారు. బిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ తొడు దొంగలు, బీజేపీ ఎప్పటికి బిఆర్ఎస్ తో కలవదు అన్నారు. యూపీఐ కుంభకోణాలకు నిలయం అన్నారు. కూటమికి నాయకుడు లేడు, నీతి నిజాయితి లేదని విమర్శించారు. పల్లెలు, పట్టణాలలో, నగరాలలో విజయ సంకల్పయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని ఆయన అన్నారు. పార్లమెంట్ ఎన్నికలలో కమలం గుర్తుకు ఓటు వేసి నరేంద్రమోదీని ప్రధానిని చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
Bandi Sanjay :
రేషన్ కార్డులు ఉన్నవారికే 6 గ్యారంటీలు అమలు చేస్తామంటే పేదలను మోసం చెయ్యడమేనని, ముందు అర్హులైన పేదలకు నూతన రేషన్ కార్డులు ఇచ్చిన తర్వాతే గ్యారంటిలు అమలు చేయాలని బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ కు ఎంపీ బండి సంజయ్ నిర్వహిస్తున్న ప్రజాహిత యాత్ర చేరుకున్న సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ పై చురకలు విసిరారు. గత ప్రభుత్వంపై ప్రజల సమస్యల కోసం కొట్లాడితే నా మీద వంద కేసులు పెట్టి జైలుకు పంపారని, ఇక్కడున్నా నాయకుడు పెద్దమనిషి ఏమయినా కొట్లాడాడా ఆయన మీద ఏమైనా కేసులు అయ్యాయా అని ప్రశ్నించారు. గౌరవెల్లి భూ నిర్వాసితులకు ఇంతవరకు పరిహారం అందలేదని, వారు జైలుపాలు, గాయల పాలై ఉంటే రాత్రికి రాత్రి వచ్చి వారిని ఆస్పత్రికి తీసుకుపోయి కాపాడనన్నారు.
మంత్రి పొన్నం ప్రభాకర్, కేటీఆర్ కు కేవలం తన మీద ఆడిపోసుకోవడం తప్ప వేరే పనిలేదన్నారు. కాంగ్రెస్ వాళ్లు ఇందిరమ్మ రాజ్యం తేస్తామంటూ ఆమె పాలనలో వచ్చిన ఎమర్జెన్సీని తెస్తారేమోనని అనుమానం వస్తుందన్నారు. 90 రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చెయ్యనోల్లు పది రోజుల్లో చేస్తారా అని, గ్యారంటీల అమలు విషయమై తను మాట్లాడితే రాముని విషయం వారు మాట్లాడుతున్నరన్నారు. రేవంత్ రెడ్డి పిసీసీ అధ్యక్షుడిగా ఉండడం ఇష్టం లేకనే ఆయనను తీసేయాలని ఇక్కడున్న పెద్ద మనిషి పొన్నం గొడువ చేస్తున్నడన్నారు. కేసిఆర్ పది ఎండ్లలో 5 లక్షల కోట్ల అప్పు చేస్తే, 2 నేలల్లోనే కాంగ్రెస్ వాళ్లు 10 వేల కోట్ల అప్పు చేశారని ఎద్దేవా చేశారు.
Follow us on : Facebook, Instagram & YouTube.
రాముడు అయోధ్య లో పుట్టిండ అని కాంగ్రెస్ వాళ్లు అంటున్నారని, తను మా అమ్మకు పుట్టినట్టు గ్యారంటీ అక్కడున్న నర్సులు, డాక్టర్ లు చెప్తారన్నారు.
ఈ విషయమంటే తన పై కాంగ్రెస్ నాయకులు అనవసర ఆరోపణలు చేస్తూ రాద్దాంతం చేస్తున్నరన్నారు. సంస్కార హీనులు కాంగ్రెస్ వాళ్లని, తను సంస్కార హినున్ని కాదని, మా తల్లి ఆయన తల్లి అయిన ఇద్దరు తనకు సమానమేనన్నారు. అందరూ తల్లులు నా తల్లితో సమానమని, మీరు చెడు ఉద్దేశాలు అపదించుకొని ఆమెను అవమాన పరుస్తున్నరన్నారు. తను ఎంపిగా గెలవకుంటే రాజకీయ సన్యాసం తీసుకుంటానని, మీరు పెట్టిన కాంగ్రెస్ అభ్యర్థి ఓడిపోతే నువ్వు మంత్రి పదవికి రాజీనామా చేసి రాజకీయ సన్యాసం తీసుకుంటావో లేదో చెప్పాలి.
కేటీఆర్ తో బీఆర్ఎస్ కథమైందని, ఇక్కడున్న పెద్ద మనిషి పొన్నం ప్రభాకర్ తో కాంగ్రెస్ కూడా నాశనం అవుతుందని ఎద్దేవా చేశారు. రేషన్ బియ్యం మీద ఫోటోలు పెట్టుకుంటున్న కాంగ్రెస్ నాయకులు, ఇప్పుడు బియ్యం ఇవ్వవద్దని ప్రధాని మోడీకి లేఖ రాస్తానని, ఇక రేపటి నుండి వాళ్ళ రేషన్ బియ్యం ఇవ్వాలన్నారు. అభివృద్ధికి కలిసి పనిచేద్దామంటే, అనవసరంగా తనను గెలుకుతున్నారని మండి పడ్డారు. ఆరు గ్యారంటీలు ఎప్పుడు అమలు చేస్తారని అడిగితే తన ఫ్లెక్సీలు చింపేయడంతోపాటు అందులోని రాడ్లు కూడా ఎత్తుకెళ్తున్నారని విమర్శించారు.
Read Also…
మహేశ్వరం మాజీ శాసనసభ్యులు తీగల కృష్ణారెడ్డి వారి కోడలు రంగారెడ్డి జిల్లా జడ్పీ చైర్ పర్సన్ తీగల అనిత హరినాథ్ రెడ్డి గార్లు బిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. వారికి మద్దతుగా మహేశ్వరం నియోజకవర్గం టిఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు వివిధ పదవుల్లో ఉన్న నాయకులు తీగల కృష్ణారెడ్డి గారికి మద్దతుగా నిలిచారు మాజీ శాసనసభ్యులు తీగల కృష్ణారెడ్డి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నందమూరి తారక రామారావు పిలుపు మేరకు 1983 నుండి తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తూ కూడా చైర్మన్ గా నగర మేయర్ గా పార్టీ లో పలు పదవులు నిర్వహించాను. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ బీఫామ్ పై ఎమ్మెల్యేగా గెలిచాను. మహేశ్వరం నియోజకవర్గ అభివృద్ధి కొరకు కేసిఆర్ పిలుపుమేరకు టిఆర్ఎస్ పార్టీలో చేరాను మహేశ్వర నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా నేను చేసిన అభివృద్ధి ఇప్పటికీ కనిపిస్తుంది. నేను ఓడిన గత ఐదు సంవత్సరాలుగా టిఆర్ఎస్ పార్టీలో పని చేస్తూ వస్తున్న నాకు సముచిత స్థానం కల్పించలేకపోయారు. కనుక రేవంత్ రెడ్డి గారి పిలుపుమేరకు కాంగ్రెస్ పార్టీలో ఈనెల చేవెళ్లలో ప్రియాంక గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టు ప్రకటించారు. రంగారెడ్డి జిల్లా జడ్పీ చైర్మన్ తీగల అనిత హరినాద్ రెడ్డి మాట్లాడుతూ క్యాబినెట్ పోస్టు ఉన్న నాకు సంక్షిత స్థానం కల్పించకపోవడంతో ఎమ్మెల్యేలకు సంచితస్థానం కల్పించడంపై టిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ఆమె ప్రకటించారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మెడకు ఉచ్చు బిగుస్తోంది. ఈ కేసులో కవితను నిందితురాలిగా సీబీఐ చేర్చింది. ఈనెల 26న ఢిల్లీలోని సీబీఐ కార్యాలయానికి విచారణకు రావాలని ఆదేశించింది. విచారణకు హాజరుకావాలని 41ఏ కింద సమన్లు జారీ చేసింది. వాస్తవానికి 26న విచారణకు రావాలని సీబీఐ ఇంతకు ముందే నోటీసులు ఇచ్చింది. అయితే గత నోటీసుల్లో ఆమెను సాక్షిగా పేర్కొన్న సీబీఐ… దాన్ని సవరిస్తూ ఇప్పుడు నిందితురాలిగా పేర్కొంది. ఈ పరిణామం బీఆర్ఎస్ శ్రేణులను కలవరపాటుకు గురి చేస్తోంది. గత డిసెంబర్ లో కవితను సీబీఐ విచారించింది. ఇప్పటి వరకు ఈడీ మూడు సార్లు విచారణ జరిపింది. అయితే సీబీఐ విచారణకు కవిత హాజరవుతారా? లేదా కోర్టును ఆశ్రయిస్తారా? అనే విషయంలో ఆసక్తి నెలకొంది. గతంలో ఈ కేసులో కేవలం సాక్షిగా మాత్రమే ఉన్న కవిత… ఇప్పుడు నిందితురాలిగా మారడంతో కేసు విచారణ కీలక మలుపు తిరిగినట్టయింది.
కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతిపట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం తెలిపారు. రోడ్డు ప్రమాదంలో ఆమె అకాల మరణం చెందడం ఎంతో బాధాకరమన్నారు. అతిపిన్న వయస్సులో ఎమ్మెల్యేగా నందిత ప్రజల మన్ననలు పొందారని చెప్పారు. కష్టకాలంలో వారి కుటుంబానికి బీఆర్ఎస్ అండగా ఉంటుందని తెలిపారు. లాస్య నందిత కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
Follow us on : Facebook, Instagram & YouTube.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
సీఎం రేవంత్‌రెడ్డి ట్వీట్ :
కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత అకాల మరణం తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని సీఎం రేవంత్‌రెడ్డి ట్వీట్ చేశారు. నందిత తండ్రి స్వర్గీయ సాయన్నతో తనకు సన్నిహిత సంబంధం ఉండేదన్నారు. గతేడాది ఇదే నెలలో స్వర్గస్తులవడం, ఇదే నెలలో నందిత కూడా ఆకస్మికంగా మరణం చెందడం అత్యంత విషాదకరమన్నారు. వారి కుటుంబసభ్యులకు రేవంత్‌రెడ్డి ప్రగాఢ సానుభూతి తెలిపారు. లాస్య నందిత ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని సీఎం రేవంత్‌రెడ్డి ట్వీట్ చేశారు.
Follow us on : Facebook, Instagram & YouTube.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రధాన పార్టీ నాయకులు మధ్య డైలాగ్ వార్ కొనసాగుతోంది. ఆరోపణలు, ప్రత్యారోపణలతో తెలంగాణ రాజకీయాలు హీటెక్కుతున్నాయి. రాష్ట్రంలో బీజేపీ, బీఆర్ఎస్ దోస్తీ అందరికీ తెలుసని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. మహారాష్ట్రలో కూల్చిన విధంగా.. తెలంగాణలో ప్రభుత్వాన్ని కూల్చడం కుదరదని ఓ రేంజ్లో ఫైర్ అయ్యారు.
Follow us on : Facebook, Instagram & YouTube.
ఇన్నాళ్లు బీజేపీని వ్యతిరేకించిన ప్రతి ఒక్కరిని జైలుకు పంపారని, అదే తెలంగాణ సంపదను ప్రాజెక్టుల పేరిట దుర్వినియోగం చేసిన కేసీఆర్ కుటుంబాన్ని బీజేపీ పెద్దలు ఎందుకు జైలుకు పంపడం లేదంటూ ప్రశ్నించారు. ఎన్నికల ముందు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా కిషన్‌రెడ్డిని నియమించారని, అయితే, ఆ నియామకాన్ని అందరూ ‘కిషన్ రెడ్డి.. నామినేటెడ్ బై కేసీఆర్’ అన్నారంటూ పొన్నం ఎద్దేవా చేశారు. కిషన్‌రెడ్డికి దమ్ము, ధైర్యం ఉంటే కాంగ్రెస్‌ను టచ్ చేసి చూడాలని పొన్న సవాల్ విసిరారు.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో 17 సీట్లు గెలవడానికే పోటీ చేస్తున్నామని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. అంతేగానీ ఏదో పోటీ చేయాలని ఎన్నికల బరిలో నిలబడటం లేదన్నారు. బీఆర్ఎస్ పార్టీకి పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఎజెండా లేదని విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న హిమాచల్ ప్రదేశ్, కర్ణాటకలో కూడా బీజేపీకి అత్యధికంగా ఎంపీ సీట్లు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో వ్యతిరేకత ప్రారంభమైందన్నారు. సోనియాకు ఎలా సేవ చేయాలి సోనియాగాంధీ కుటుంబానికి సూట్ కేసులు ఎలా పంపాలనే ఆలోచన తప్ప కాంగ్రెస్‌కు మరొకటి లేదన్నారు. రైతు రుణమాఫీ ఎలా చేస్తారో, రైతుబంధు, నిరుద్యోగ భృతి ఏ విధంగా చేస్తారో సమాధానం చెప్పాలన్నారు. తెలంగాణలో ఒంటరిగా పోటీ చేస్తామని ఎవరితోనో పొత్తు ఉండబోదని స్పష్టం చేశారు. నారాయణపేట జిల్లాలో విజయ్ సంకల్ప యాత్ర కొనసాగుతోందని కిషన్ రెడ్డి తెలిపారు.
Follow us on : Facebook, Instagram & YouTube.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కాళేశ్వరం ప్రాజెక్టు (Kaleswaram Project):
కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు డ్రామాలాడుతూ ప్రజలను దారి మళ్లిస్తున్నాయని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ మండిపడ్డారు. ఈ ప్రాజెక్టు నిర్మాణంలో కేసీఆర్ ప్రభుత్వ ఘోర వైఫల్యముందని నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ(ఎన్డీఎస్ఏ) నివేదిక ఇచ్చిన విషయాన్న గుర్తు చేశారు. దీంతోపాటు రాష్ట్ర విజిలెన్స్ కూడా రిపోర్ట్ ఇచ్చిందన్నారు. గతంలోనే కాంగ్రెస్ ప్రభుత్వంలోని మంత్రులు కాళేశ్వరం సందర్శించి వచ్చారన్నారు. అయినప్పటికీ మళ్లీ కాళేశ్వరం సందర్శన, విచారణ పేరుతో ఈ డ్రామాలేందని నిలదీశారు. ఈ సందర్భంగా బండి సంజయ్ కాళేశ్వరం ప్రాజెక్టుపై ఎన్డీఎస్ఏ రూపొందించిన నివేదికలోని అంశాలను మీడియాకు వివరించారు. ఈరోజు సిరిసిల్ల జిల్లా అగ్రహారంలో ప్రజాహిత తొలిదశ యాత్ర ముగిసింది. ఈ సందర్భంగా బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు.. ఏమన్నారంటే…
బండి సంజయ్ వ్యాఖ్యలు:
కొండగట్టు అంజన్న స్వామిని దర్శించుకుని ప్రజాహిత యాత్ర తొలిదశ యాత్రను ప్రారంభించాం. ఈరోజు అగ్రహారం వద్ద ముగించాను. జిల్లాలోని అన్ని మండలాల్లో ప్రజాహిత యాత్రను కొనసాగించాను. ఎక్కడికి పోయినా మోదీ గురించి మాట్లాడుతున్నారు. దేశానికి మోదీ చేసిన సేవలను చెబుతున్నారు. ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చి ప్రజాహిత యాత్రను ఆశీర్వదించారు. ఈ యాత్ర సందర్భంగా కేంద్ర ప్రభుత్వం నా పార్లమెంట్ నియోజకవర్గ అభివ్రుద్ధికి, ముఖ్యంగా ప్రధానంగా 7 సంక్షేమ పథకాలకు మాత్రమే ఖర్చు చేసిన నిధుల వివరాలను గ్రామ గ్రామాన వివరించాను.
ఈ ఒక్క సిరిసిల్ల జిల్లాకు 1408 కోట్ల రూపాయల నిధులిచ్చాం. అంత పెద్ద ఎత్తున నిధులు మోదీ ప్రభుత్వం ఇస్తుందని తెలుసుకుని ప్రజలే ఆశ్చర్యపోయారు. కేంద్రం నయాపైసా ఇయ్యలేదు.. అభివ్రుద్ధి నిధులన్నీ రాష్ట్రానివేనని కేసీఆర్, కేటీఆర్ ఇన్నాళ్లు చేసిన ప్రచారమంతా ఒట్టిదేనని ప్రజలు గ్రహించారు. బీఆర్ఎస్ మూర్ఖులు కూడా వాస్తవాలు గ్రహించాలి. దేశంతో రాష్ట్రానికి కూడా కేంద్రం నిధులిస్తోంది.. కొత్తేముందని ఇప్పుడు చెబుతున్న బీఆర్ఎస్ నాయకులు తెలంగాణలో గ్రామాల అభివ్రుద్ధికి, ఇండ్ల కోసం మంజూరు చేసిన నిధులను ఎందుకు దారి మళ్లించారో సమాధానం చెప్పాలి. 14, 15 ఆర్దిక సంఘం నిధుల్లో గోల్ మాల్ జరిగింది. మొక్కల పెంపకం కోసం ఇచ్చిన వందల కోట్ల నిధులను దోచుకుతిన్నారు… ఇదేమని ప్రశ్నిస్తే… జవాబు చెప్పలేక నాపై దుష్ప్రచారం చేస్తున్నారు.మేం గ్రామాలకిచ్చిన నిధులపై పోస్టర్లు వేస్తే తప్పేంది? స్వయం ప్రకటిత మేధావి ఎందుకు అభ్యంతరం చెబుతున్నారు. మేం పోస్టర్లు వేస్తే మీరు మెడలో బోర్డులు వేసుకుని తిరుగు.. ఎవరు వద్దన్నారు? నన్ను గెలికితే ఊరుకునే ప్రసక్తే లేదు. గచ్చిబౌలిలో రూ.600 కోట్ల విలువ చేసే భూదాన భూములను ఏ విధంగా అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారో, బోయినిపల్లి మండలంలోని నర్సింగాపూర్ లో 20 ఎకరాల సింగిల్ బిట్ ఎట్లా కొన్నారో అన్నీ బయటపెట్టాల్సి వస్తది.
Follow us on : Facebook, Instagram & YouTube.
కాంగ్రెస్, బీఆర్ఎస్ కాళేశ్వరం, క్రిష్ణా నది నీళ్లపై అసెంబ్లీ వేదికగా డ్రామాలాడుతున్నయ్. ప్రజలకిచ్చిన హామీల అమలుపై మాట్లాడటం లేదు. బీఆర్ఎస్ చేసిన మోసాలను బయటకు రాకుండా ఆ పార్టీ నేతలు కుట్ర చేస్తున్నరు. కాళేశ్వరం విషయానికొస్తే….నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సందర్శించి గత అక్టోబర్ లో సందర్శించింది. 20 అంశాలపై వివరణ అడిగితే కనీసం రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదు. నవంబర్ 1న కేంద్రం కాళేశ్వరం ప్రాజెక్టు (Kaleswaram Project) పై నివేదిక రూపొందించి రాష్ట్ర ప్రభుత్వానికి పంపింది. అందులో ఏముందంటే…(నివేదిక కాపీనీ చూపిస్తూ…) ‘‘నేషనల్ డ్యామ్ సేఫ్టీ యాక్ట్(2021) నిబంధనలను కేసీఆర్ ప్రభుత్వం పూర్తిగా ఉల్లంచింది. ఇది ఘోర తప్పిదం. రాష్ట్ర ప్రభుత్వ తప్పిదంవల్ల ప్రజల జీవితాలకు, ఆర్దిక వ్యవస్థకు తీవ్రమైన ప్రమాదం కలిగే అవకాశం ఏర్పడింది. మేడిగడ్డ బ్యారేజీలోని ఒక బ్లాక్ లో తలెత్తిన సమస్యవల్ల మొత్తం బ్యారేజీ సక్రమంగా పనిచేయని దుస్థితి నెలకొంది. ఈ సమస్య పరిష్కారమయ్యే వరకు మొత్తం బ్యారేజీని ఉపయోగించడానికి అవకాశమే లేదు.’’ అని నివేదికలో పేర్కొన్నారు.
’’బ్యారేజీలోని బ్లాక్ నెంబర్ 7లో నెలకొన్న సమస్య మరమ్మతు చేయడానికి వీలు లేకుండా పోయింది. ఆ బ్లాక్ మొత్తాన్ని పునాదుల నుండి తొలగించి మళ్లీ పునర్ నిర్మించాల్సిందే. ఈ నిర్మాణాన్ని పరిశీలిస్తే… మేడిగడ్డ బ్యారేజీలోని ఇతర బ్లాక్ లు కూడా దెబ్బతినే ప్రమాదం ఉంది. మొత్తం బ్యారేజీనే పునర్ నిర్మించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ పరిస్థితి తీవ్రం కాకముందే బ్యారేజీని పునరుద్దరించాలి.అంతవరకు రిజర్వాయర్ లో నీటిని నింపకూడదు. పెడచెవిన పెట్టి నీటిని నింపితే పైపింగ్ సమస్య ఏర్పడి ప్రజలకు నీటిని సరఫరా చేయలేని దుస్థితి ఏర్పడుతుంది. కాళేశ్వరంలో ప్రాజెక్టు (Kaleswaram Project) లోని అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు సైతం బలహీనంగా ఉన్నాయి. ఈ బ్యారేజీల్లో సైతం మేడిగడ్డ తరహాలో సమస్యలు ఉత్పన్నమయ్యే ప్రమాదం నెలకొంది. అన్నారం బ్యారేజీ దిగువన బాయిలింగ్ సమస్య సంకేతాలు కన్పిస్తున్నాయి. Read Also..
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- కొత్తగూడెంలో మార్మోగిన ఆదివాసీ పోరుకేక.by CVR NEWSమహబూబాబాద్ జిల్లా కొత్తగూడెం కేంద్రంగా ఆదివాసీలు తమ గళాన్ని వినిపించారు. ఆదివాసీ హక్కుల పోరాట సమితి (ఏహెచ్‌పీఎస్) తుడుం దెబ్బ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘ఆదివాసీ పోరుకేక’ భారీ బహిరంగ సభకు రాష్ట్రంలోని వివిధ ఏజెన్సీ ప్రాంతాల నుండి వేలాది మంది ఆదివాసీలు…
- ప్రశ్నించిన తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామ్‌చందర్ రావు.by CVR NEWSతెలంగాణలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ సభ పెడతానంటే కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని విమర్శించారు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు. ప్రజాస్వామ్య దేశంలో ఎవరైనా, ఎక్కడైనా సభ పెట్టుకునే హక్కు ఉందని స్పష్టం చేశారు.…
- సచివాలయంలో తెలంగాణ ఉద్యమకారులపై కీలక భేటీ..!by CVR NEWSతెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న అసలైన ఉద్యమకారుల గుర్తింపు అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది. హైదరాబాద్ సచివాలయంలో ప్రభుత్వ సలహాదారు కేకే అధ్యక్షతన నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో ఉద్యమకారుల గుర్తింపు ప్రక్రియపై విస్తృతంగా చర్చించారు. గత ప్రభుత్వ హయాంలో ఉద్యమకారులకు అన్యాయం జరిగిందన్న…




Total views : 92600