టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షిస్తూ నెల్లూరు కు చెందిన తెదేపా నేత చింతల అశోక్ శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నుండి తిరుమల వరకు పాదయాత్రను ప్రారంభించారు. టిడిపి ఇచ్చాపురం ఎమ్మెల్యే డాక్టర్ బెందాళం అశోక్ జెండా ఊపి ఈ పాదయాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ అశోక్ మాట్లాడుతూ టిడిపి అధినేత చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని కోరుతూ 1200 కిలోమీటర్ల పాదయాత్రను చేపట్టడం చాలా ఆనందదాయకమని అన్నారు. రాష్ట్రంలో ప్రజా వ్యతిరేక పరిపాలన సాగుతోందని, అన్ని వ్యవస్థలు ధ్వంసం అయ్యాయని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో టిడిపి – జనసేన ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి రాబోతోందని పేర్కొన్నారు. పాదయాత్ర చేస్తున్న అశోక్ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి పరిపాలన పిచ్చోడి చేతిలో రాయి ఉన్నట్టు ఉంది అన్నారు. రాష్ట్రంలో అరాచక పాలన సాగుతుందన్నారు. ఎక్కడ చూసినా అరాచకాలు, వైసీపీ నాయకుల దాడులు చూస్తూనే ఉన్నామన్నారు. రాష్ట్రానికి రాజధాని అనేది లేకుండా జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని అధోగతిపాలు చేశారన్నారు. రాష్ట్రంలో సామాన్యులు ప్రశాంతంగా బ్రతకాలంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షించారు. అనుభవజ్ఞుడైన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే రాబోయే ఐదు సంవత్సరాలలో ఆంధ్ర రాష్ట్రంను ప్రపంచ పటంలో చూపించగలరన్నారు.
Chandra babu
ప.గో.జిల్లా, తణుకు టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద ధర్నా చేపట్టిన మాజి ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ ,తెలుగుదేశం కార్యకర్తలు. నియోజకవర్గంలో చేపట్టిన బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీని పోలీస్ లు అడ్డుకుంటున్నారంటూ ధర్నా. మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరావు ఒత్తిడితో పోలీసులు టిడిపి శ్రేణులను అడ్డుకుంటున్నారు. బాబు షూరిటీ భవిష్యత్ గ్యారెంటీ కి ఎన్ని అడ్డంకులు పెట్టినా ప్రజల్లోకి తీసుకెళ్తామని మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు .
ఎపి రాష్ట్ర భవిష్యత్తు చంద్రబాబుతోనే సాధ్య పడుతుందన్నారు రాష్ట్ర టీడీపీ కార్యదర్శి భత్యాల చెంగల రాయుడు, జనసేన నేత అత్తిగారి దినేష్. అన్నమయ్య జిల్లా రాజంపేట మన్నూరు లో టీడీపీ నేతలు గగ్గుటూరి ఖాదర్ బాషా గగ్గుటూరి హుమయూన్ ఆధ్వర్యం బాబు సూరిటీ భవిష్యత్తుకి గ్యారంటీ భారీ ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీడీపీ కార్యదర్శి భత్యాల చెంగల రాయుడు, జనసేన నేత అత్తిగారి దినేష్ ఇరువురు హాజరయ్యారు. ర్యాలి తో పాటు ఇంటింటికీ వెళ్లి చంద్రబాబు రాబోవు ఎన్నికలలో అధికారంలోకి వచ్చిన వెంటనే నేవేర్చే హమిలన్నింటిని కుడా ప్రజలకు కరపత్రాల ద్వారా చైతన్య వంతులను చేస్తూ వారి ప్రచారం కోనసాగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఏడాదికి ఒక జాబు క్యాలెండర్ అన్నారు మరి నాలుగన్నర సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ ఎన్ని జాబు క్యాలెండర్లు విడుదల చేసారో యువత తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ ప్రభుత్వంలో ఎ ఒక్కరు సంతోషంగా లేరని ఎప్పుడప్పుడు ఎన్నికలు వస్తాయా జగన్ ప్రభుత్వాన్నిఎప్పుడు గద్దె దించూదామా అన్నట్టు ప్రజలు ఎదురు చుస్తున్నరన్నారు. జగన్ సామజిక బస్సు యాత్ర కేవలం సోకు మాత్రమే తప్ప ప్రజలలో మాత్రం ఎటువంటి స్పందలేదన్నారు. యువత భవిష్యత్తు బాగుండాలన్న రాష్ట్రంలో సిఎం గా చంద్రబాబు గారు రాజంపేట ఎమ్మెల్యే, ఎంపి అభ్యర్ధులను కచ్చితంగా గెలిపించుకునేందుకు ప్రతి ఒక్కరు సైనికుల్లా కష్ట పడలన్నారు. ఇప్పటికే జగన్ ప్రభుత్వానికి ఓటమి భయం పుట్టిందన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం, జనసేన, పార్టీ నాయకుల, కార్యకర్తలు తో పాటు మైనార్టీ నాయకుల పాల్గొన్నారు.
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నేకేశవరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్ ప్రభుత్వం పై బురద చల్లందుకే పని కట్టుకొని కొంతమంది ఎల్లో మీడియాలో తప్పుడు కథనాలు రాస్తున్నారు. ఓ పచ్చ మీడియాలో విద్యార్థులకు ట్యాబ్ లు ఇవ్వడం వల్ల చెడిపోతున్నారని తప్పుగా రాస్తున్నారు. ఆ ట్యాబ్ ల వల్ల అసభ్యకర వీడియోలు చూస్తున్నారని ఎల్లో మీడియా ఆరోపిస్తున్నారు. కానీ ప్రస్తుత టెక్నాలజీ కాలంలో పిల్లలే కాకుండా ఎంపీ, ఎమ్మెల్యే లు కుడా అసభ్యకర వీడియోలు చూస్తున్నరన్నారు. ఎవరో ఒకరు చేసిన తప్పుకు ఇలా అందరికి ట్యాబులు, లాప్టాప్ లు ఇవ్వకూడదని చెప్పడం దుర్మార్గమన్నారు. కార్పొరేట్ స్కూలుకు దీటుగా పోటీపడేందుకు జగన్ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందన్నారు. రాష్ట్రంలో కేవలం చంద్రబాబు మనవడు, పవన్ కళ్యాణ్ కొడుకులు మాత్రమే పెద్ద చదువులు చదువుకోవాలనుకోవడం దుర్మార్గపు చర్య అని ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవరెడ్డి అన్నారు.
మిచౌంగ్ తుఫాను ప్రభావంతో నష్టపోయిన రైతులను పరామర్శించి, పంట పొలాలు పరిశీలిస్తారు. బాపట్ల తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ వేగేశన నరేంద్ర వర్మ మీడియాతో మాట్లాడుతూ.. మిచౌంగ్ తుఫాను ప్రభావంతో బాపట్ల జిల్లా తీవ్రంగా నష్టపోయింది. బాపట్ల పట్టణంలో పారిశుధ్యం అధ్వాన్నంగా తయారైంది, వర్షపునీరు మురుగునీరు ఎక్కడికక్కడే ఆగిపోయింది. బాపట్ల మండలం భర్తిపూడి గ్రామంలో మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు శిలా విగ్రహం తలను పగలకొట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పిరికి పందల చర్య, విగ్రహం ధ్వంసం చేసిన వారిని తక్షణమే శిక్షించాలి. తెలుగు వారి ఖ్యాతిని దశదిశలా వ్యాప్తి చెందేలా చేసిన నాయకులు నందమూరి తారక రామారావు, సంస్కార లేని వైసిపి మూకలు చేసిన దుశ్చర్య గా భావిస్తున్నాం . కూడు, గూడు, గుడ్డ సామాన్యుడి కి అందించాలనే లక్ష్యంతో తెలుగుదేశం పార్టీ ఏర్పడింది. ఎవరేమనుకున్నా సరే రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది, రాగానే అల్లరి మూకల ఆటకట్టిస్తాం.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర డిసెంబరు 17తో ముగియనుంది. భీమిలి నియోజకవర్గంలో యువగళం ముగింపు సభను భారీ ఎత్తున నిర్వహించనున్నారు. ఈ సభకు టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్ హాజరుకానున్నారు. ఈ మేరకు టీడీపీ విశాఖ పార్లమెంటు స్థానం అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు వెల్లడించారు. యువగళం పాదయాత్ర డిసెంబరు 6న అనకాపల్లి జిల్లాలోని పాయకరావుపేటకు చేరుకుంటుందని, పాయకరావుపేట 7న మొదలయ్యే యువగళం డిసెంబరు 17తో సమాప్తం అవుతుందని పల్లా శ్రీనివాసరావు వివరించారు. నారా లోకేశ్ జనవరి 27న కుప్పంలో యువగళం పాదయాత్ర షురూ చేశారు. 4 వేల కిలోమీటర్లు, 400 రోజుల పాటు పాదయాత్ర సాగించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. మధ్యలో చంద్రబాబు అరెస్ట్ కావడంతో యువగళానికి తాత్కాలికంగా బ్రేక్ పడింది. ఇటీవలే లోకేశ్ యువగళాన్ని పునఃప్రారంభించారు.
తెలుగు ప్రజలు సిరిసంపదలతో, సుఖ సంతోషాలతో జీవించేలా, వారికి సేవ చేసే అవకాశం ఇమ్మని అమ్మవారిని వేడుకున్నానని తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. శనివారం విజయవాడలోని దుర్గమ్మ గుడికి భార్యతో కలిసి వెళ్లారు. అమ్మవారిని దర్శించుకున్నాక బయట మీడియాతో మాట్లాడారు. తెలుగుజాతిని అగ్రస్థానంలో నిలబెట్టాలనేదే తన లక్ష్యమని, అందుకు ఎన్ని ఆటంకాలు ఎదురైనా, దుష్టశక్తులు అడ్డుకున్నా తన ప్రయనం ఆగబోదని స్పష్టం చేశారు. మానవ సంకల్పానికి దైవం ఆశీస్సులు ఉండాలని, అందుకే తాను ఈ యాత్ర చేపట్టానని చెప్పారు. శుక్రవారం తిరుమల వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నట్లు వివరించారు. దుష్టుల నుంచి సమాజాన్ని రక్షించాలని శక్తి స్వరూపిణి కనకదుర్గమ్మను ప్రార్థించినట్లు చంద్రబాబు తెలిపారు. తనకు అన్యాయం జరిగినప్పుడు దేశవిదేశాల్లోని తెలుగు వారంతా న్యాయం కోసం, ధర్మం కోసం పోరాటాలు చేశారన్నారు. కాగా, చంద్రబాబు దంపతులకు ఆలయ అధికారులు స్వాగతం పలకకగా ఆలయ అర్చకులు వేదాశీర్వచనం చేసి, అమ్మవారి తీర్థప్రసాదాలు, ఫొటో అందజేశారు. చంద్రబాబుకు కేశినేని నాని, కేశినేని చిన్ని, జనసేన నేత పోతిన మహేశ్, పంచుమర్తి అనురాధ, అశోక్ బాబు, దేవినేని ఉమా, కొల్లు రవీంద్ర, యార్లగడ్డ వెంకట్రావు, బోండా ఉమా, మాగంటి బాబు, బుద్దా వెంకన్న తదితరులు స్వాగతం పలికారు.
తిరుమలలో నేడు శ్రీవారి దర్శనార్థం మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సాయంత్రం 4 గంటలకు తిరుమలకు చేరుకోనున్నారు. రేణిగుంట విమానాశ్రయం నుండి రోడ్డు మార్గాన తిరుమలకు ప్రయాణమవుతారు. రాత్రికి తిరుమలలోనే బస చేసి డిసెంబర్ 1వ తేది ఉదయం 7 గంటలకు ముందుగా వరాహ స్వామి దర్శనం చేసుకొని 8 గంటలకు స్వామివారిని దర్శించుకోనున్నారు.
Read Also..
రాష్ట్ర భవిష్యత్తు బాబు షూరిటితోనే సాధ్యమని మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. స్థానిక బీసీ కాలనీలో భవిష్యత్తుకు గ్యారెంటీ.. బాబు షూరిటి కార్యక్రమాన్ని బుధవారం పల్లె చేపట్టారు. తెలుగు తమ్ముళ్లు, మహిళలు పల్లెకు హారతితో ఘన స్వాగతం పలికారు. జనసేన పార్టీ నాయకులతో కలిసి పల్లె ఇంటింట కలియ తిరుగుతూ భవిష్యత్తుకు గ్యారెంటీ… బాబు షూరిటి పథకాలను ప్రజలకు వివరించారు. కాలనీలోని మసీదులో ముస్లిం మత పెద్దలతో మాట్లాడారు. రానున్న ఎన్నికల్లో రాష్ట్ర భవిష్యత్తు కోసం తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని పల్లె ముస్లిం మత పెద్దలను కోరారు. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి ఆడబిడ్డ కు నెలకు రూ. 1500 రూపాయలు, చదువుకునే పిల్లలకు ఒక్కొక్కరికి ఏడాదికి రూ. 15,000, ప్రతి రైతుకు ఏడాదికి, రూ. 20వేల రూపాయలు, నిరుద్యోగులకు యువగళం నిధి నుంచి నెలకు రూ.3 వేలు, నిరుద్యోగ భృతి, ఇంటింటికి తాగునీటి కులాయి కనెక్షన్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం జరుగుతుందని ప్రజలకు వివరించారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా బీసీ వర్గాలపై దాడులు ఎక్కువయ్యాయని, టిడిపి మినీ మేనిఫెస్టోలోని సూపర్ సిక్స్ పథకాల్లో చెప్పిన విధంగా రాష్ట్రంలో టిడిపి అధికారంలోకి రాగానే బీసీలకు రక్షణ కల్పించే చట్టాన్ని తీసుకొస్తామని పల్లె హామీ ఇచ్చారు. కావున ప్రతి ఒక్కరూ బాగా కష్టపడి వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురావాలని పల్లె కాలనీవాసులకు పిలుపునిచ్చారు.