సీఎం జగన్‌పై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సీఎం జగన్ తనని తాను అర్జునుడు అని పోల్చుకుంటున్నారన్నారు. నిజానికి జగన్ అర్జునుడో, అభిమన్యుడో కాదు భస్మాసురుడు అని చంద్రబాబు విమర్శించారు. నెల్లూరు ఎస్వీజీఎస్ గ్రౌండ్స్‌లో జరిగిన రా కదలిరా సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. జగన్ పాలనలో ఆంధ్రప్రదేశ్ పూర్తిగా నష్ట పోయిందన్నారు. బెదిరించి, భయపెట్టి తరిమేసే పరిస్థితికి వచ్చారన్నారు. తుగ్లక్ ఆలోచనలు. సైకో పాలనతో ఏపీలో జగన్ విధ్వంసం సృష్టించారన్నారు. రాష్ట్రంలో ఏ వర్గమైనా ఆనందంగా ఉన్నారా అంటూ ప్రశ్నించారు. రైతు చితుకుపోయాడంటూ ఆరోపించారు. అప్పులు ఎక్కువ ఉండే రైతాంగం, ఆత్మహత్యలు చేసుకునే వారి సంఖ్య అధికంగా ఉండే రాష్ట్రంగా ఏపీ తయారైందన్నారు. ఇప్పుడు కూడా అబద్దాలే చెబుతున్నాడంటూ విమర్శలు చేశారు. అబద్దాల్లో సీఎం జగన్‌కి డాక్టరేట్ ఇవ్వాలంటూ వ్యాఖ్యానించారు.
chandrababu
చంద్రబాబు పై ఎంపీ కేశినేని నాని ఘాటు వ్యాఖ్యలు చేశారు. పేదవారికోసం పనిచేసే వ్యక్తి సీఎం జగన్ మోహన్ రెడ్డి ధనికుల కోసం పనిచేసే వ్యక్తి చంద్రబాబు నాయుడు అంటూ విమర్శించారు. తన పనికిరాని కొడుకుని ముఖ్యమంత్రిని చేసుకోవడం కోసం పరితపించే వ్యక్తి చంద్రబాబు నాయుడు. రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం నీ కొడుకు కూ డబ్బు సంపాదించి పెట్టడం కోసం 29వేల మంది రైతులను మోసం చేశావు. 33 వేల ఎకరాలు ఇచ్చిన అమరావతి రైతులను మోసం చేసింది చంద్రబాబునాయుడు అని అన్నారు. రాజధాని కట్టాలంటే అంత భూమి అవసరం లేదు. ఈ ప్రపంచంలో కోట కట్టిన రాజు ఉన్నాడు, కానీ నగరం కట్టిన రాజు ఎవరూ లేరులేరన్నారు. కీర్తి కాంక్ష డబ్బుకాంక్షతోనే చంద్రబాబు నాయుడు అమరావతి రాజధాని గా మొదలుపెట్టాడు అంటూ విమర్శించారు. 29 గ్రామాల కోసం ఈ ప్రాంతాన్ని మొత్తం నాశనం చేశాడు. జగన్ మోహన్ రావు వచ్చే ఎన్నికల్లో 30 వేల పైచిలుకు ఓట్ల మెజార్టీతో గెలుపొందుతారు. రాసి పెట్టుకోండి బాక్సులు ఓపెన్ చేసాక మీరు చెప్పింది నిజమైందని అంటారు అని కేశినేని నాని తెలిపారు.
పీలేరులో టీడీపీ రా కదలిరా కార్యక్రమానికి పెద్ద ఎత్తున టీడీపీ, జనసేన నాయకులు తరలి వచ్చారు. టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు రేణిగుంట నుండి హెలికాప్టర్లో పీలేరు కు చేరుకోనున్నారు. ఈ నేపథ్యంలో పీలేరు సభాస్థలి వద్దకు జనసేన, టీడీపీ నాయకులు కార్యకర్తలు చేరుకున్నారు. పీలేరు నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డిని, జనసేన నాయకులు టీడీపీ కార్యకర్తలు, కలసి గెలిపించుకుంటామని అంటున్నా పీలేరు జనసేన నాయకులు కామిసెట్టి సుధాకర్.
రాష్ట్రంలో జనసేన అత్యంత బలంగా ఉన్న నియోజకవర్గాలలో పిఠాపురం మొదటి స్థానంలో ఉందని చెపుతారు. నిజంగా పార్టీ ఇక్కడ బలంగా ఉంది. కానీ గత కొంతకాలంగా అసమ్మతి పెరిగింది. తొలుత పిఠాపురం ఇన్చార్జిగా మాకినీడి శేషు కుమారి వ్యవహరించారు. హఠాత్తుగా ఆమెను తొలగించి పార్టీ అధినేత పవన్ కు సన్నిహితుడైన టీడీపీ అధినేత తంగేళ్ల ఉదయ శ్రీనివాసును నియమించారు. ఆయన రావడంతోనే ఆమె రాజీనామా చేసి వెళ్లిపోయారు. కొంత కాలం పాటు ఉదయ శ్రీనివాస్ కార్యక్రమాలు సాఫీగానే జరిపారు. ఇదే పార్టీలో సీనియర్లను గుర్తించడం లేదని ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. డాక్టర్ పిల్లా శ్రీధర్, అదే విధంగా గతంలో పవన్ కళ్యాణ్ వారాహి యాత్రకు వచ్చినప్పుడు గొల్లప్రోలులో ఆయన బస చేసిన ఇంటి అధినేత, విద్యావేత్త, సీనియర్ నేత ఇలా ఎందరినో తంగిళ్ళ పట్టించుకోవడం లేదు. వారంతా పార్టీ కోసం పనిచేస్తున్నారు. కానీ ప్రాధాన్యత లేదని వాపోతున్నారు. మరోపక్క టీడీపీ ఇన్చార్జి వర్మ తానే అభ్యర్థని ప్రచారం చేసుకుంటున్నారు. ఇలాంటి నేపథ్యంలో అందరినీ కలుపుకొని పోవలసిన ఉదయ శ్రీనివాస్ ఏకపక్షధోరణి పై విమర్శలు తలెత్తుతున్నాయి. ఇప్పటికే టీడీపీ జనసేన నాయకులు పిఠాపురం సమావేశంలో కుర్చీలతో కొట్టుకున్నారు. ఇలాంటి నేపథ్యంలో కొత్తగా జనసేనకు తలనొప్పులు ప్రారంభమయ్యాయి.
కాగా రెండు రోజుల క్రితం పిఠాపురంలో జయహో బీసీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన మాజీ మంత్రి, టీడీపీ ఫైర్ బ్రాండ్ చింతకాయల అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యలు జనసేనలో కలవరాన్ని పుట్టిస్తున్నాయి. జనసేన ఇంచార్జ్ తంగేళ్ల ఉదయ శ్రీనివాస్ స్థానికేతుడు అంటూ ఆయన పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు. తంగేళ్ల అనుచరులు దీనిపై మండిపడుతున్నప్పటికీ ఆయన వ్యతిరేకవర్గం మాత్రం హర్షం వ్యక్తం చేస్తోంది. అయ్యన్నపాత్రుడు నిజమే చెప్పాడని వారు వ్యాఖ్యనిస్తున్నారు. జనసేన రెండో వర్గం అయ్యన్న పాత్రుడు వ్యాఖ్యలను సమర్ధించడం మరో వివాదాస్పదమైంది.
టీడీపీ హయాంలో జన్మభూమి కమిటీ స్థాయి నుంచి సీఎం స్థాయి వరకు లంచాలిస్తేనే పనులు జరిగేవని ముఖ్యమంత్రి జగన్ విమర్శించారు. అనంతపురం జిల్లా ఉరవకొండలో వైఎస్సార్ ఆసరా నిధుల జమ కార్యక్రమానికి సీఎం జగన్ హాజరయ్యారు. ఇప్పుడు అర్హులైన ప్రతి ఒక్కరికీ పారదర్శకంగా సంక్షేమ పథకాలు అందుతున్నాయని చెప్పారు. వైసీపీ పాలనలో అక్కాచెల్లెమ్మల ముఖంలో చిరునవ్వులు కనిపిస్తున్నాయని అన్నారు. గత ప్రభుత్వంలో ఈ మంచి ఎందుకు జరగలేదని అందరూ ఆలోచించాలని సూచించారు. గతంలో దోచుకో, పంచుకో అన్నట్టుగా ఉండేదని ఇప్పుడు మీ బిడ్డ బటన్ నొక్కితే, నేరుగా మీ ఖాతాల్లోకి డబ్బు జమ అవుతోందని ఈ తేడాను గమనించాలని కోరారు. పొదుపు సంఘాల రుణమాఫీ చేస్తానని చెప్పిన చంద్రబాబు ఆ తర్వాత ఆ మాటను గాలికొదిలేశారని జగన్ విమర్శించారు. చంద్రబాబుతో పొదుపు సంఘాలకు నష్టం జరిగిందని అన్నారు. ఇప్పుడు అవే పొదుపు సంఘాలు మంచి శాతంతో గ్రేడులు సాధించి గర్వంగా నిలబడ్డాయని చెప్పారు. కుట్రలు, కుతంత్రాల జెండాలు కట్టడమే చంద్రబాబు అండ్ కో అజెండా అని ప్రజల గుండెల్లో గుడి కట్టడమే మీ జగన్ అజెండా అని అన్నారు. పేదల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధే తన లక్ష్యమని చెప్పారు.
Read Also..
Read Also..
స్థానిక టిడిపి కార్యాలయంలో శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలోమాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు మాట్లాడుతూ దళితులను జగన్ రెడ్డి ఐదేళ్ల పాలనలో 125 వేల అడుగులకు అనిచివేసి 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం పెడితే దళితులకు మీరు చేసిన పాపాలన్ని తొలగిపోతాయ అని విమర్శించారు. చంద్రబాబు నాయుడు దళితులను గౌరవిస్తూ విదేశీ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పేరు పెట్టి పది నుండి 15 లక్షలు విదేశీ విద్యకు విధులు కేటాయించి పేదలకు విదేశీ విద్య అందించడం జరిగిందని అటువంటి పథకానికి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పేరు మార్చి జగన్మోహన్ రెడ్డి పేరు పెట్టుకోవడం దళితులకు అగౌరవం అన్నారు. టిడిపి పాలనలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కార్పొరేషన్ ద్వారా అనేకమందికి రుణాలు అందించి ఆదుకుంటే వైసిపి పాలనలో జగన్ రెడ్డి కార్పొరేషన్ నిధులు కేటాయించకుండా దగా చేశాడని ఎద్దేవా చేశారు. 50 వేల బ్యాక్లాగ్ పోస్టులు ఖాళీగా ఉంటే దళితులపై ప్రేమ ఉన్న జగన్ రెడ్డి ఐదేళ్లలో ఎందుకు భర్తీ చేయలేదు అని ప్రశ్నించారు. దళిత వాడలకు 200 యూనిట్లు లోపు కరెంటు ఉచితంగా చంద్రబాబు నాయుడు నాడు అందిస్తే జగన్ రెడ్డి ప్రభుత్వం ఉచిత కరెంటు ఎత్తివేసి అధిక బిల్లులతో దళితులను దోపిడీ చేశారని అన్నారు. 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం పెట్టినంతమాత్రాన చేసిన దుర్మార్గాలను మర్చిపోరని, అంబేద్కర్ రాజ్యాంగానికి వ్యతిరేక పాలన సాగిస్తున్న జగన్ రెడ్డికి అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరించే నైతిక హక్కు లేదని అన్నారు.
తెలుగుదేశం పార్టీ రా కదలిరా కార్యక్రమంలో భాగంగా నేడు వెంకటగిరి పట్టణానికి రానున్న టిడిపి అధినేత చంద్రబాబు. ఈ ఉదయం ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా విజయవాడ నుంచి వెంకటగిరి కి రానున్న బాబు. చంద్రబాబు బహిరంగ సభకు సర్వం సిద్ధం చేసిన ఆ పార్టీ శ్రేణులు. తిరుపతి పార్లమెంటు పరిధిలోని ఏడు నియోజకవర్గాల నుంచి భారీగా తరలిరానున్న, టిడిపి, జనసేన పార్టీ శ్రేణులు.
కృష్ణా జిల్లా, గుడివాడ చంద్రబాబు పై ఫైర్ అయిన మాజీ మంత్రి కొడాలి నాని. కోడాలి నాని మాట్లాడుతూ.. నేడు గుడివాడలో టిడిపి వర్ధంతి చేసి, చంద్రబాబు పిండం పెట్టాడు. తనపై, సీఎం జగన్ పై పిచ్చి ఆరోపణలు చేసి, సొల్లు నాయుడు వెళ్ళాడు. సీఎం లుగా వైఎస్ఆర్, జగన్ హయాంలో ఇళ్ల స్థలాలు,నీటి అవసరాలకు 6వందల ఎకరాల భూసేకరణ చేశారు. 14ఏళ్లు సీఎం గా ఉన్న చంద్రబాబు పేదల కోసం ఒక్క ఎకరా సేకరించినట్లు నిరూపిస్తే రాజకీయాలను వదిలేస్తా. ఎన్నికల్లో పోటీ చేయను, మగాడివైతే నా సవాల్ స్వీకరించాలని ఛాలెంజ్ చేసిన కొడాలి నాని. చావటానికైన సిద్ధంగా ఉన్నా. చంద్రబాబు ఉడత ఊపుడికి భయపడను. గుడివాడలో చంద్రబాబు పిచ్చి కబుర్లు ఎవ్వరూ నమ్మరు. నేను గుడివాడ ముద్దు బిడ్డను. నాలుగు సార్లు గెలిచిన చరిత్ర నాది, మరో నాలుగేళ్లు గెలుస్తా. చంద్రబాబు పార్టీని ఎన్ని సార్లు గెలిపించారు. తెలంగాణ లో బూ స్థాపితం చేశాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కాళ్ళు పట్టుకున్నాడు. 5వేల కుర్చీలు వేసి పది నియోజకవర్గాల నుండి మనుషులని రప్పించి చంద్రబాబు ఏం సాధించారు. లోకేష్ కు అడ్డు వస్తాడనే జూ ఎన్టీఆర్ పైకి, బాలయ్యను వదిలాడు. లోకేష్ లాంటి కొడుకు శత్రువుకు కూడా ఉండకూడదు. వైఎస్సార్ కొన్న స్థలంలో, టిడ్కో ఫ్లాట్ల పునాదులు వేసి చంద్రబాబు వదిలేసాడు. కనీసం కాంట్రాక్టర్ కు డబ్బు కూడా చెల్లించలేదు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఫ్లాట్ల నిర్మాణం పూర్తి చేసి. పూర్తి స్థాయి అభివృద్ధి చేసిన లబ్ది దారులకు అప్పగించిన ఘనత సీఎం జగన్ ది. 75ఏళ్లు వచ్చి కూడా చంద్రబాబు పచ్చి అబద్ధాలు ఆడుతున్నాడు. ఎన్టీఆర్ గంజాయి మొక్క అని చెప్పి, సీఎం పదవి దోచుకున్న రోజులను ఎవ్వరూ మర్చిపోరు. కాంగ్రెస్ దగ్గర ఓనమాలు నేర్చుకున్న చంద్రబాబు మా గురించి మాట్లాడటం హాస్యాస్పదం. మరదలిని చంపి, తమ్ముడిని పిచ్చొడిని చేసిన దుర్మార్గుడు చంద్రబాబుకు తన గురించి మాట్లాడే అర్హత లేదు. తనకు బూతుల కోటలో ఎమ్మెల్యే పదవి వస్తే, కోతల కోటాలో చంద్రబాబుకు వచ్చిందా అని ప్రశ్నించారు.
మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆధ్వర్యంలో సంక్రాంతి సంకల్పం లో భాగంగా నేటి ఉదయం గొల్లపూడి లో పల్లె పిలుస్తోంది రా కదలిరా పేరుతో టీడీపీ భోగి సంకల్పం నిర్వహించారు. తొలుత గొల్లపూడి వన్ సెంటర్ లో ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించి భోగి మంటలు వేసిన తెదేపా నేత, మాజీ మంత్రి దేవినేని ఉమా. ఏపీకి పట్టిన కీడు తొలగాలని కోరుకుంటూ సమస్యల ఫోటోలను, జగన్ ప్రభుత్వ అక్రమ జీవోలను దేవినేని ఉమ, జనసేన తెదేపా శ్రేణులు, మరియు గ్రామస్తులు భోగిమంటల్లో తగలబెట్టారు. సైకో పోవాలి.. సైకిల్ రావాలి’.. కీడు తొలగాలి.. ఏపీ వెలగాలి అంటూ పెద్ద ఎత్తున నినాదాలతో గొల్లపూడిని హోరెత్తించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి ఉమా మాట్లాడుతూ తెలుగు వారందరికీ భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు తెలిపారు. సంక్షేమ పథకాల ఆరాధ్యుడు స్వర్గీయ నందమూరి తారకరామారావు తెలుగుజాతి ఆత్మగౌరవాన్ని చాటారు తెలుగువారి ఆత్మవిశ్వాసాన్ని చంద్రబాబు నిలబెట్టారు అన్నారు. 55 నెలల్లో ప్రజా పరిపాలన విధ్వంసం అయ్యిందని చంద్రబాబు నాయుడు జాతి సంపద సృష్టించేవాడని వివరించారు. ఐటీ రంగ విప్లవంతో అద్భుతాలు సృష్టించిన వ్యక్తి చంద్రబాబు అన్నారు. అబద్దపు హామీలతో నమ్మించి, వంచించిన జగన్ పై, వైసీపీపై ప్రజలు కోపంతో రగిలి పోతున్నారన్నారు. 175 నియోజకవర్గాల్లో టిడిపి, జనసేన నేతల గెలుపు ఖాయమని అన్నారు. అందరూ పండుగలో భాగస్వాములు కావాలని కోరుకుంటున్నామన్నారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండి రామరాజ్యం రావాలంటే చంద్రబాబు అధికారంలోకి రావాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి, జనసేన, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఎప్పటి నుంచో జనసైనికులు ఊహించిందే. టీడీపీ నుంచి ఎక్కువ మంది నేతలు జనసేన పార్టీలో చేేరతారని అంచనా వేశారు. అది పార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబు స్ట్రాటజీ. తన పార్టీ నేతలనే పొత్తులో ఉన్న పార్టీలోకి పంపి అక్కడ టిక్కెట్లు కేటాయించి గెలిపించుకోవడం చంద్రబాబుకు ఇప్పటి నుంచి కాదు.. ఎప్పటి నుంచో చేస్తున్న పనే. అదే విషయాన్ని అనేక మంది సోషల్ మీడియా ద్వారా తమ అభిప్రాయాలను చెప్పారు. అయితే ఇప్పటి వరకూ అలాంటి చేరికలు లేకపోవడంతో పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఇక టీడీపీ నేతలు జనసేనలోకి వరస పెడుతుండటంతో జనసైనికుల అనుమానం నిజంగా మారనుంది. పొత్తు ధర్మంలో భాగంగా జనసేన ఈసారి ఎక్కువ స్థానాలను కోరే అవకాశముంది. చంద్రబాబుకు కూడా ఈ ఎన్నికలు అసవరం కావడంతో పవన్ కల్యాణ్ కు అడిగినన్ని కాకపోయినా.. హర్ట్ కాకుండా మెరుగైన సంఖ్యలోనే చంద్రబాబు సీట్లను ఇచ్చే అవకాశాలున్నాయి. దీంతో తెలుగుదేశం పార్టీలో సుదీర్ఘంగా ఉన్న నేతల సీట్లు కూడా పొత్తులో భాగంగా కోల్పోయే అవకాశముంది. ఇది గ్రహించిన నేతలు కొందరు టీడీపీలో ఉంటే సీట్లు రావని, జనసేనలో చేరి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. పవన్ కల్యాణ్ కూడా అమాయకంగా వారికి కండువాలను కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తుండటంతో ఆశ్చర్యపోవడం జనసైనికుల వంతయింది. నిన్న మాగంటి బాబు జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను కలిశారు. ఆయన ఏలూరు పార్లమెంటు నియోజకవర్గం నుంచి కానీ, కైకలూరు శాసనసభ స్థానం నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. కానీ టీడీపీలో ఉంటే సీటు రాదేమోనని భావించి మాగంటి బాబు పవన్ పంచన చేరారు. ఆయన జనసేనలో చేరి ఈ రెండు స్థానాల్లో ఒకచోట నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. అలాగే బూరగడ్డ వేదవ్యాస్ కూడా అంతే. ఆయన పెడన నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. టీడీపీలో సీటు డౌట్ కొట్టడంతో ఆయన పవన్ ను కలిశారన్న ప్రచారం పెద్దయెత్తున జరుగుతుంది. అయితే మర్యాదపూర్వక భేటీ అని చెబుతున్నా చేరిక కోసమే వారు జనసేన కార్యాలయానికి వచ్చారని అంటున్నారు. ఇన్నాళ్లూ ఏం చేశారు?నిజంగా జనసేన మీద ప్రేమ ఉంటే ఇన్ని రోజులు ఏం చేశారన్న ప్రశ్నను సోషల్ మీడియాలో జనసైనికులు వేస్తున్నారు. ఎన్నికల ముందు చేరుతున్నారంటే వీరిని టీడీపీ నేతలుగానే చూడాల్సి ఉంటుందని ఎక్కువ మంది అభిప్రాయపడుతున్నారు. అదే జరిగితే పవన్ కల్యాణ్ రాజకీయానికి భవిష్యత్ లో ఇబ్బందులు తప్పవన్న హెచ్చరికలు జారీ అవుతున్నాయి. అయినా వస్తున్న నేతలను కాదనలేని పరిస్థితి పవన్ కల్యాణ్‌ది. టీడీపీ నుంచి వచ్చిన నేతలకు ఆయన టిక్కెట్లు ఇస్తారా? లేక పక్కన పెడతారా? అన్నది ఇంకా నిర్ణయం కాకపోయినా టీడీపీ నుంచి నేతల వలసలు పెద్దయెత్తున సాగుతాయన్న ప్రచారానికి ఇది అద్దం పడుతుందనే కామెంట్స్ మాత్రం ఎక్కువగా వినపడుతున్నాయి.






Total views : 90582