2024 ఎన్నికల్లో టిడిపి తరపున పోటీ చేసేది నేనే, అత్యధిక మెజార్టీతో గెలవబోయేది నేనేనని నెల్లూరు జిల్లా వెంకటగిరి టీడీపీ మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ అన్నారు. ఈనెల 9వ తేదీన వెంకటగిరిలో జరగాల్సిన రా కదలిరా సభ… చంద్రబాబు కేంద్ర ఎన్నికల సంఘం అధికారులను కలవాల్సిన కారణంగా వాయిదా పడిందని తెలిపారు. త్వరలో వెంకటగిరిలో జరగాల్సిన చంద్రబాబు సభ తేదీని ప్రకటిస్తామని తెలిపారు.
chandrababu
ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. సీఎం జగన్తో కీలక భేటీ అనంతరం కేశినేని నాని మీడియా సమావేశంలో మాట్లాడారు. తనను టీడీపీలో తీవ్రంగా అవమానించారని, తన రాజీనామాను ఆమోదించిన అనంతరం వైసీపీలో చేరతానని ఆయన తెలిపారు. టీడీపీ కోసం ఎంతో కష్టపడ్డానని, స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా పార్టీ గెలుపు కోసం పని చేశానని, చంద్రబాబు చెబితే కొందరికి నెల వారీ జీతాలు కూడా ఇచ్చానన్నారు. 2014 కు ముందు టీడీపీలో చేరతానంటే.. చాలా మంది మా సామాజిక వర్గం వాళ్లే నన్ను మందలించి చేరొద్దన్నారని కేశినేని నాని పేర్కొన్నారు. రాజకీయాల కోసం రూ. 2 వేల కోట్ల ఆస్తులను అమ్ముకున్నానని ఆయన వెల్లడించారు. చంద్రబాబు తీరుతో వ్యాపారాన్ని కూడా ఆపేశానన్నారు.
రాతియుగం వైపు వెళతారా… స్వర్ణయుగం కోసం నాతో వస్తారా? అని చంద్రబాబునాయుడు ప్రశ్నించారు. వైసీపీ పాలనలో రాష్ట్రం ధ్వంసమైందని విమర్శించారు. ఆళ్లగడ్డలో నిర్వహించిన ‘రా కదలిరా’ బహిరంగసభలో జగన్ సర్కార్ పై చంద్రబాబు నిప్పులు చెరిగారు. ఐదేళ్లలో యువత నిరుద్యోగులుగా మారారని ఆవేదన వ్యక్తం చేశారు. భస్మాసురుడి లాంటి నేతను తెచ్చుకుని కష్టాలు పడుతున్నామన్నారు. యువత టిడిపి – జనసేన జెండా పట్టుకుని ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని టిడిపి అధినేత పిలుపునిచ్చారు.
రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్ రాక్షస పాలనను అంతమొందించడానికి ‘రా కదలిరా’ పేరిట మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర వ్యాప్త పర్యటన చేపట్టారని టిడిపి పోలిట్ బ్యూరో సభ్యులు మాజీ మంత్రి పితాని సత్యనారాయణ తెలిపారు. ఈ నెల 7న చంద్రబాబు ఆచంట పర్యటన ఖరారైన నేపథ్యంలో స్థానిక స్వీట్ హోమ్ ఏడు ఎకరాల స్థలంలో ఏర్పాటు చేస్తున్న బహిరంగ సభ, పార్కింగ్, హెలిప్యాడ్లను శనివారం ఆయన పరిశీలించారు. అనంతరం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రజల్లో చైతన్యం రగిలించడానికి చంద్రబాబు చేపట్టిన బహిరంగ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. రైతులు నిరుద్యోగ యువత సుమారు 1,30,000 మంది ఈ కార్యక్రమానికి హజరవునున్నారని ముఖ్యంగా దళిత కులానికి చెందిన కుల సంఘాలు కదలి వస్తున్నాయని రాష్ట్ర స్థాయిలోను, ఉభయ గోదావరి జిల్లా స్థాయిలోను ముఖ్యంగా యువత, నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొంటారని అన్నారు. ఆచంట లో పెద్ద ఎత్తున జరిగే రా కదలిరా కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ ఇదే ఆహ్వానంగా భావించాలని పిలుపునిచ్చారు. జరగబోయే ఎన్నికలకు ఇది ఒక శంఖారావ సభలా ప్రతి ఒక్కరూ పరిగణలోకి తీసుకోవాలని అన్నారు. అలాగే జనసేన పార్టీకి చెందిన ఇంచార్జి లు పాల్గొంటారని ఆయన తెలిపారు. తమ సమస్యలు పరిష్కరించాలని అంగన్వాడీలు ఇన్ని రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్నా సీఎం జగన్ కు కనికరం లేకుండా పోయిందని మండిపడ్డారు.
మచిలీపట్నం పార్లమెంట్ కార్యాలయంలో జెండా ఊపి జయహో బీసీ రథాలను మాజీమంత్రి కొల్లు రవీంద్ర, మాజీ పార్లమెంటు సభ్యులు కొనకళ్ళ నారాయణరావు, జనసేన ఇంచార్జ్ బండి రామకృష్ణ, తెదేపా బిసి నాయకులు ముందుకు పంపించారు. అనంతరం మాజీ మాత్రి కొల్లు రవీంద్ర మీడియా సమావేశంలో మాట్లాడుతూ ప్రజలను మరోసారి చైతన్య వంతులుగా చేసేందుకే జయహో బీసీ కార్యక్రమమని ఆయన అన్నారు. జయహో బీసీ కార్యక్రమం ద్వారా రాబోయే తెలుగుదేశం ప్రభుత్వంలో బీసీలకు చేయబోయే కార్యక్రమాలను వివరించడంతో ప్రజలు వారికి అడుగడుగునా నీరాజనాలు పలుకుతున్నారని అన్నారు. జగన్ ని తరిమికొట్టడం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వల్లే సాధ్యమని, జగన్ ఓటమికి సిద్ధమయ్యాడని అన్నారు. జగన్ చెస్ గేమ్ ఆడుతున్న అనుకుంటున్నాడు కానీ తను ఆడుతుంది వైకుంఠపాళీ అని అతనికి తెలియడం లేదని ఆయన ఎద్దేవా చేశారు. ఐదేళ్ల ప్రభుత్వంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలను పావులుగా వాడుకున్నాడని, బీసీలు పక్కన పెట్టాడని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉద్యోగస్తులను మారుస్తున్నట్టు MLA లను పక్క నియోజకవర్గాలకు జగన్ బదిలీ చేస్తున్నాడని అన్నారు. MLA క్యాండెట్స్ మార్చడం కాదు ముందు జగన్ ని మార్చాలని, సూపర్ సిక్స్ ద్వారా ప్రజల్లోకి వెళుతున్నామని ఆయన అన్నారు. పంచాయతీ రాజ్ వ్యవస్థను నిర్వీర్యం చేశారని, టీడీపీ వచ్చాక మళ్ళి పంచాయతీ రాజ్ వ్యవస్థను బలోపేతం చేస్తామని అన్నారు. బీసీలకు జగన్ అన్ని రకాలుగా అన్యాయం చేశాడని, లక్షాధికారులను చేస్తానని చెప్పి 56 కార్పొరేషన్లు పెట్టి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని అన్నారు. బీసీలను దగా చేస్తున్నాడని, 300 మంది బీసీలను పొట్టన పెట్టుకున్నాడని ఆయన జగన్ పై మండిపడ్డారు. ఈ నెల 7 వ తేదీన నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో తిరువూరులో రా కదలిరా అనే నినాదంతో భారీ బహిరంగ సభ జరగనున్నది. 18వ తేదీన మచిలీపట్నం పార్లమెంట్, గుడివాడ నియోజకవర్గం లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో బిసి ప్రధాన కార్యదర్శి వీరంకి గురుమూర్తి, చిత్తజిల్లు నాగ రాము, అక్కు మహాంతి రాజా, గోపు సత్యనారాయణ, లంకె నారాయణ ప్రసాద్ , పళ్లపాటి సుబ్రమణ్యం , వూకంటి రాంబాబు, లంకే శేషగిరి, తిరుమణి నారాయణ, కాగిత గోపాలరావు, తదితర బీసీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
అవ్వా తాతలు, వితంతువులు, వికలాంగులకు రూ 3 వేలు పెన్షన్ ఇస్తున్న దేశంలోనే ఏకైక రాష్టం ఆంధ్రప్రదేశ్ అని, ఈ ఘనత సీఎం జగన్ కు దక్కుతుందని ప్రభుత్వ విప్, శాసనసభ్యులు కొరముట్ల శ్రీనివాసులు అన్నారు. రైల్వే కోడూరు తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో పండుగ వాతావరణంలో జరిగిన రైల్వే కోడూరు మండల పెన్షన్ల పెంపు మరియు నూతనంగా మంజూరైన పెన్షన్ల పంపిణీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్లను పెంచి మాట నిలబెట్టుకున్నారన్నారు. రైల్వే కోడూరు మండలంలోనే సుమారు 11 వేలుకు పైగా పెన్షన్లు పంపిణీ అవుతున్నాయన్నారు. నెలకు పెన్షన్ల క్రింద రైల్వే కోడూరు మండల పరిధిలో రూ.10 కోట్ల రూపాయలు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. గతంలో కొత్త పెన్షన్ మంజూరు కావాలంటే ఎవరైనా చనిపోతేనే వచ్చేదన్నారు. జగన్ పాలనలో అర్హతే ప్రామాణికంగా అర్హులందరికీ పింఛన్లు అందుతున్నాయన్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా తాను పల్లెలకు వెళ్లినప్పుడు సంక్షేమ పథకాల లబ్ధిదారుల ముఖాల్లో చిరునవ్వులు కనిపిస్తున్నాయన్నారు. చంద్రబాబు పాలనలో చట్టబద్దత లేని జన్మభూమి కమిటీలు రాజ్యమేలాయన్నారు. జగన్ పాలనకు చంద్రబాబు పాలనకు బేరీజు వేసుకుని ప్రజలు వైఎస్ జగన్ ను మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన అన్నారు. అధికారమే పరమావధిగా చంద్రబాబు కుళ్ళు కుతంత్రాలతో, దుష్టచతుష్టయం తో పావులు కదుపుతున్నారన్నారు. పెన్షన్ లబ్ధిదారులకు నూతన సంవత్సర మరియు ముందస్తు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం లబ్ధిదారులకు పెన్షన్ తో పాటు స్వీట్స్ అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ ధ్వజ రెడ్డి, జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ సుకుమార్ రెడ్డి, ఏపీ టూరిజం డైరెక్టర్లు వత్తలూరు సాయి కిషోర్ రెడ్డి, మందల నాగేంద్ర, మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్ సుబ్బరామరాజు, ఉప సర్పంచ్ తోట శివ సాయి, పట్టణ కన్వీనర్ రమేష్ పాల్గొన్నారు.
టికెట్ల కేటాయింపులో అధిష్టానం నిర్ణయం మేరకూ అందరూ కలిసి పని చేస్తామని, ఎవరికి అసంతృప్తి లేదని ఏపీ మంత్రి మేరుగ నాగార్జున స్పష్టం చేశారు. విఐపి విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి మంత్రి మెరుగు నాగార్జున స్వామి వారి సేవలో పాల్గోని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా, ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు. ఆలయ వెలుపలకు వచ్చిన మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. రాబోయే ఎన్నికల దృష్ట్యా టికెట్లు కేటాయింపులో పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని, అయితే అధిష్టానం నిర్ణయం మేరకూ అందరు కలిసి పని చేస్తామని, రాబోయే ఎన్నికల్లో తానూ పోటీ చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. చంద్రబాబు, అతని టీం ఎందుకు భయపడుతుందో అర్ధం కావడం లేదని, మాతో చంద్రబాబుకు ఏం పనో అర్ధం కావడం లేదని, చంద్రబాబు తన పార్టీ వ్యవహారాలు చూసుకుంటే మంచిదన్నారు. చంద్రబాబు సొంత నియోజకవర్గంలో కాకుండా కుప్పంలో ఎందుకు పోటీ చేస్తున్నావో, లోకేష్ ఎందుకు మంగళగిరిలో పోటీ చేస్తున్నాడో చెప్పాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ లో సామాజిక విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకుంటూ జగన్మోహన్ రెడ్డి పరిపాలన సాగిస్తున్నారని, చంద్రబాబు హామీ ఇచ్చిన నెరవేర్చక పోవడం వల్లే ప్రజల్లోకి వెళ్ళలేక పోతున్నారని, పవన్ ను మళ్ళీ కలిసి చంద్రబాబు ఎన్నికల్లోకి వెళ్తున్నారే గానీ మాకు ఏ పార్టీతో పని లేదని, మంత్రి గుడివాడ అమర్నాథ్ వేరే చోట పని చేయబోతున్నారే గానీ, మా పార్టీలో అమర్నాథ్ చాలా స్ట్రాంగ్ పర్సన్ అని ఏపి మంత్రి మెరుగు నాగార్జున తెలియజేశారు.
అన్నమయ్య జిల్లా రాజంపేటలో గంటా నరహరి ఆధ్వర్యంలో న్యూ ఇయర్ సందర్భంగా అన్న క్యాంటీన్ ఘనంగా ప్రారంభం అయింది. అన్నా క్యాంటీన్ ముఖ్య అతిధిగా హాజరైన రాజంపేట పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చామర్తి జగన్మోహన్ రాజు. రాష్ట్రంలో పేదవాడి ఆకలి తీర్చేందుకు గతంలో తెలుగుదేశం పార్టీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నా క్యాంటీన్ ద్వారా భోజన పథకాన్ని ఏర్పాటు చేశారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నా క్యాంటీన్ అన్ని కూడా క్లోజ్ చేయించారు. కానీ ఇప్పుడు రాజంపేట నియోజకవర్గానికి దాదాపుగా నా సొంత ఖర్చుతో 8 అన్న క్యాంటిన్లు ప్రారంభిస్తున్నాను. పేద ప్రజలందరికీ కూడా ఉచితంగా భోజన సదుపాయాన్ని ఏర్పాటు చేస్తున్నాం అంటున్న గంట నరహరి సోమవారం నూతన సంవత్సర వేడుకల సందర్బంగా చంద్రన్న తీసుకొచ్చిన అన్నా క్యాంటీన్ రాజంపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నాయకుడు గంటా నరహరి చేతుల మీదుగా నాయకులు, కార్యకర్తలు, యువత, మహిళలతో పాటు కలిసి ప్రారంభించారు. ఈ సందర్బంగా గంటా నరహరి మాట్లాడుతూ రాష్ట్రంలో ఆరాచక పాలన సాగుతుందని, ప్రజలు తీవ్ర ఇబ్బంధులుకు గురవుతున్నారని తెలిపారు. ఈ సైకో పాలన అంతం కావాలంటే రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడుని అత్యధిక మెజారిటీతో గెలిపించుకొని ముఖ్యమంత్రిగా చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.
Read Also..
Read Also..
రాష్ట్రంలో వైసీపీ సినిమాకు ఇంకా వంద రోజులు మాత్రమే మిగిలి ఉందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. కుప్పం నియోజకవర్గంలో పర్యటిస్తున్న చంద్రబాబు గుడుపల్లిలో నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడారు. కుప్పం నాకు సొంత కుటుంబం లాంటిదని ఈసారి కుప్పంలో లక్ష ఓట్ల మెజార్టీతో గెలవబోతున్నామని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా ప్రకటించిన ‘సూపర్ సిక్స్’ హామీలు అమలు చేసే బాధ్యత నాదేనని స్పష్టం చేశారు. ప్రతి ఇంటికీ రెండు ఆవులు ఉంటే మంచిదని ఆనాడే చెప్పానని ఆవులు పెంచడం ఏంటని అప్పుడు నన్ను ఎగతాళి చేశారని గుర్తు చేశారు. పాడిని ఒక పరిశ్రమగా చేసి, మీ జీవితాల్లో వెలుగులు తీసుకొస్తానని ప్రజలకు భరోసా ఇచ్చారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పిస్తామని అదేవిధంగా నిరుద్యోగులకు నెలకు 3వేల రూపాయలు ఇస్తామని తెలిపారు. యువత ఇంట్లో కూర్చుంటే మార్పు రాదని 100 రోజులు నా కోసం, మీ కోసం పనిచేస్తే మీ జీవితాలు మార్చే బాధ్యత టీడీపీ – జనసేన తీసుకుంటుందని టీడీపీ అధినేత అన్నారు. రాష్ట్రంలో నాలాంటి వాడికే రక్షణ లేకుంటే సామాన్యుడి పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి పోలీసులు ముందుకు రావాలని చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు.
టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు కుప్పం పర్యటన రెండవ రోజు కొనసాగుతోంది. నిన్న బెంగళూరు నుంచి కుప్పంకు చేరుకున్న చంద్రబాబు నాయుడుకి కుప్పం సరిహద్దులలో టిడిపి నాయకులు కార్యకర్తలు మహిళలు ఘన స్వాగతం పలికి కర్పూర నీరాజనాలు పలికారు. రెండవ రోజు చంద్ర బాబు పర్యటన మరికాసెపట్లో ప్రారంభం కానుందని, నిన్న చంద్రబాబు నాయుడుకి స్వాగతం పలకడానికి వచ్చిన నాయకులను కార్యకర్తలను చూసి వైసిపి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని, ఈసారి కుప్పం ముద్దు బిడ్డ నారా చంద్రబాబు నాయుడుని లక్ష ఓట్ల మెజారిటీతో గెలిపించుకుంటామని ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ అన్నారు.
Read Also..





Total views : 90533