రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం జిల్లేడు చౌదరిగుడ మండలంలోని పెద్ద ఎల్కిచర్ల అటవీ క్షేత్రంలో చిరుత పులి అనుమానస్పద రీతిలో మృత్యు వాత పడింది. గత ఐదారు మూడు రోజుల క్రితమే చిరుత మృత్యువాత పడ్డట్టు ప్రాథమిక అంచనాగా అటవి అధికారులు గుర్తిస్తున్నారు. అటవీశాఖ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని చిరుత కళేబరానికి పోస్టుమార్టం నిర్వహిస్తున్నారు. చిరుత పులి మృతికి కారణాలను పరిశీలిస్తున్నారు. పెద్ద ఎల్కిచర్ల పెద్దడవి 654 ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది. ఈ అడవిలో క్రూర మృగాలు ఉన్నట్టు గ్రామస్తులు చెబుతున్నారు. అయితే గొర్ల కాపరులకు చిరుత మరణించిన విషయం తెలుసుకొని గ్రామంలో ఈ సమాచారాన్ని చెప్పారు. దీంతో సమాచారం అందుకున్న అటవి శాఖ సిబ్బంది ప్రస్తుతం సంఘటనా స్థలాన్ని సందర్శించి సంఘటనపై వివరాలు సేకరిస్తున్నారు. చిరుత పులి పోస్టుమార్టం అనంతరం నివేదికను ఉన్నతాధికారులకు పంపనున్నారు. ఆ తర్వాత మీడియాకు జరిగిన సంఘటనపై వివరాలు తెలిపే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా క్రూరమృగాలు సంచరిస్తున్న ఈ అటవీ చుట్టుపక్కల గ్రామాలలో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారని, అటవీశాఖ అధికారులు చిరుతపులులు జనావాసాల్లోకి రాకుండా ప్రత్యేక ఏర్పాటు చేయాలని కోరుతున్నారు..
cheetah
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గంలో గత వారం రోజుల నుంచి పులి, చిరుతపులి సంచరిస్తుందని వద్దంతులు వినిపిస్తుడడంతో ఫారెస్ట్ అధికారులు రంగంలోకి దిగారు గ్రామస్తులు తెలిపిన విధంగా అడుగులను పరిశీలించగా అవి కుక్క జాతికి చెందిన అడుగులుగా గుర్తించారు అయినా సరే వాళ్లు అప్రమత్తంగా ఉండి ట్రాకింగ్ కెమెరాలు ఏర్పాటు చేసి వైల్డ్ ఫుట్ ఎక్స్పర్ట్ ను రప్పించి పరిశీలన చేయగా వారికి తేలింది ఏమనగా ఇక్కడ ఎలాంటి పులి కాని చిరుత పులి కాని సంచరిస్తున్నట్టు ఆనవాళ్లు లేవని ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ప్రతిమ తెలిపారు. ఈ నేపథ్యంలో ఆమె ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ ఎవరు భయపడవద్దని ఇక్కడ పులి కానీ చిరుత పులికాని సంచరించిన ఆనవాళ్ళు లేవని అది కేవలం కుక్క జాతికి చెందిన కళ్ల గుర్తులే అని ఆమె ఈరోజు తెలిపారు
ఈ నేపథ్యంలో ఇంక వారు వాళ్ళ రెస్క్యూ టిం రంగంలోనే ఉండి ఇంక గమనిస్తూనే ఉన్నామని ఇంకా వీలైనన్ని ట్రాకింగ్ కెమెరాలను ఎర్పాటు చేసి ఎప్పటికపుడు ప్రజలకు సమాచారం ఇస్తామని తెలిపారు. ప్రజలు రాత్రి పూట ఒంటరిగా తిరిగొద్దని ప్రజలకు తెలిపారు. చేవెళ్ల పోలీసు కూడా రాత్రిపూట పెట్రోలింగ్ చేస్తున్నారని ఏమైనా సమాచారం ఉంటే తెలుపాలని ఆమె ఈ సందర్భంగా తెలిపారు.





Total views : 80709