ఎండాకాలం తాగు నీటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. జలాశయాలు డెడ్ స్టోరేజీకి చేరుకున్న నేపథ్యంలో సచివాలయంలో ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. రానున్నది ఎండాకాలం కాబట్టి.. నీటి అసవరాలకు అనుగుణంగా అత్యవసరం అయితే.. నీళ్ల కోసం KRMBకి లేఖ రాయాలని సూచించారు. నగరాలు, పట్టణాలు, పల్లెలు, తండాలు, కాలనీలు అనే తేడా లేకుండా ప్రతి ఇంటికీ తాగు నీరు అందేలా సాగు నీరు, పట్టణాభివృద్ధి, పురపాలక, పంచాయతీరాజ్, శాఖల సమగ్ర కార్యాచరణ ప్రణాళికలు రూపొందించాలని సీఎం అధికారులను ఆదేశించారు. అయితే.. తాగు నీటి కోసమంటూ నాగార్జున సాగర్ నుంచి ఏపీ 9 TMC లకు పైగా నీరు తీసుకుపోతోందని అధికారులు సమావేశంలో వివరించారు. అంత పెద్ద మొత్తంలో తాగు నీరు ఎక్కడ వినియోగిస్తున్నారని, సరైన గణాంకాలు తీసుకొని ఇతర అవసరాలకు నీరు తీసుకుపోకుండా చూడాలని అధికారులను సీఎం ఆదేశించారు.
cm revanth reddy
తెలంగాణ కుంభమేళా, మేడారం జాతరను సీఎం రేవంత్ రెడ్డి సందర్శించారు. సీఎంకు మంత్రి సీతక్క, అధికారులు స్వాగతం పలికారు. సీఎం హోదాలో రేవంత్ రెడ్డి తొలిసారి అమ్మవార్లను దర్శించుకున్నారు. అమ్మవార్లకు రేవంత్ రెడ్డి నిలివెత్తు బంగారం సమర్పించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు సీతక్క, కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, శ్రీధర్ బాబు, సీఎస్ శాంతి కుమారి పాల్గొన్నారు. మేడారం సమ్మక్క సారక్కలను దర్శించుకున్న అనంతరం ఆరు గ్యారెంటీల అమలు పై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఫిబ్రవరి 27న రూ. 500కే గ్యాస్, 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ అమలు చేస్తామని చెప్పారు. పథకం అమలు కార్యక్రమానికి ప్రియాంక గాంధీ వస్తారని తెలిపారు. గతంలో కేసీఆర్ దర్శించుకోలేదు కాబట్టే ఓడిపోయారని అన్నారు. జాతరకు కోటిన్నరకు పైగా భక్తులు వస్తే ఈ పండుగను జాతీయ పండుగగా మార్చమని కేంద్రాన్ని కోరామని కానీ అందుకు కేంద్రం పట్టించుకోలేదని చెప్పారు. దక్షిణాది కుంభమేళాకు కేంద్రం ఇచ్చేది రూ. 3 కోట్ల రూపాయలేనా అని ప్రశ్నించారు. ముఖ్యమైన ఏ కార్యక్రమం తీసుకున్న ఇక్కడి నుంచే మొదలు పెట్టామని రేవంత్ రెడ్డి చెప్పారు. హాత్ సే హాత్ జోడో యాత్ర ఇక్కడి నుంచే ప్రారంభించామని అన్నారు. సమక్క సారక్క దీవెనలతోనే ప్రజా ప్రభుత్వం ఏర్పడిందన్నారు. యాత్ర సమయంలో ఎలాంటి ఆకంటం లేకుండా జాతర జర్పిస్తామని మాట ఇచ్చామని మాట ప్రకారం జాతర కోసం రూ. 110 కోట్ల రూపాయలు నిధులు విడుదల చేశామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.
ఆరు గ్యారంటీల అమలుపై దృష్టి :
ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీల అమలుపై దృష్టిసారించిన తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం మరో కీలకమైన హామీల అమలుకు సిద్ధమైంది. ఇళ్లకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌కు ఉద్దేశించిన ‘గృహజ్యోతి’, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, గ్యారంటీలను ఈ నెల 27 లేదా 29 తేదీల్లో ప్రారంభించాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఈ రెండు పథకాల అమలుకు తక్షణమే సన్నద్ధమవ్వాలని సీఎం రేవంత్ సూచించారు. మార్చి నెల మొదటి వారం నుంచి ‘జీరో’ కరెంట్ బిల్లులు జారీ చేయాలని ఆదేశించారు.
మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కన్నుమూత..!
ఇక తెల్ల రేషన్‌కార్డు ఉండి నెలకు 200 యూనిట్లలోపు విద్యుత్ వాడేవారందరికీ గృహజ్యోతి పథకాన్ని వర్తింపజేయాలని సీఎం క్లారిటీ ఇచ్చారు. దరఖాస్తుల్లో ఎవరైనా రేషన్ కార్డు లేదా ఇతర వివరాలు పొరపాటుగా నమోదు చేసి సరిచేసుకునే అవకాశాన్ని కల్పించాలని ఆదేశించారు. తప్పులను సవరించుకున్న వారికి తదుపరి నెల నుంచి ఉచిత విద్యుత్ పథకాన్ని వర్తింపజేయాలని రేవంత్ రెడ్డి ఆదేశాలు ఇచ్చారు. ఈ విషయం ప్రతి గ్రామంలో ప్రజలందరికీ తెలిసేలా ఫ్లెక్సీల ద్వారా ప్రచారం చేయాలని సూచించారు.
Follow us on : Facebook, Instagram & YouTube.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మునుగోడు (Munugodu):
పార్లమెంటు ఎన్నికల దృశ్య వివిధ పార్టీల నుండి చేరికలు చేసుకోవచ్చని అధిష్టానం నుండి పిలుపు రావడంతో ఫిబ్రవరి 16వ తేదీన ఎఐసిసి ఇంచార్జ్ దీపా మున్సీదాస్ ఆధ్వర్యంలో గాంధీభవన్ లో గత ఎన్నికల్లో మునుగోడు బీజేపీ పార్టీ నుండి పోటీ చేసిన అభ్యర్థి చలమల కృష్ణారెడ్డి పార్టీ కండువా కప్పుకొని పార్టీ లో చేరడం జరిగిందని సోషల్ మీడియాలో పలు వీడియోలు, ఫోటోలు రావడంతో దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వర్గం అంతటితో ఆగకుండా చలమల కృష్ణారెడ్డి శనివారం రోజు చౌటుప్పల్ మండలం దామేర గ్రామంలో తన క్యాంప్ కార్యాలయంలో మునుగోడు నియోజకవర్గ పలు మండలాల ముఖ్య నేతలను, కార్యకర్తలనతో ముఖ్య సమావేశం నిర్వహించి తాను రెండు రోజుల క్రితమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలవడం జరిగింది.
రథసప్తమి రోజు మంచి రోజు కావడం తో జాయిన్ అయ్యానని తాను మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ అభిమానినని, తను బీజేపీ పార్టీలో ఉన్న తన మనసు కాంగ్రెస్ పార్టీ లో వున్నదని, మరో రెండు రోజుల్లో ఐదు వేల మంది కార్యకర్తలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో గాంధీభవన్‌లో మరోసారి జాయిన్ అయితా అని తెలుపుతూ, స్థానిక ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డితో కలిసి పనిచేయడం తనకు ఎటువంటి అభ్యంతరం లేదని పార్టీ ఎవరికి ఆదేశిస్తే పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ కోసం పని చేస్తామని తెలపడంతో పాటు పార్టీ ఆదేశిస్తే టికెట్ ఇస్తే ఎంపీగా కూడా ఉంటానని తెలిపారు.
Follow us on :Facebook, Instagram& YouTube.
దీనిని ఖండిస్తూ నల్గొండ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు శంకర్ నాయక్ మరియు యాదాద్రి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అండం సంజీవరెడ్డి చలమల కృష్ణారెడ్డి చేరిక చెల్లదని తాను మాత్రమే పార్టీలో చేరానని చెప్పుకుంటున్నాడు తప్ప ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ ఆఫీషియల్ గా తెలపలేదని తాను గత ఎన్నికల్లో బీజేపీ పార్టీ నుండి పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ ఓటమి కోరుకున్నాడని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రావడంతో తన ఆస్తులు కాపాడుకోవడం కోసమే పార్టీలో చేరుతున్నట్టు చేరానంటూ చెప్పుకుంటున్నాడని దీన్ని ఖండిస్తున్నామని ఉమ్మడి నల్గొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తెలిపారు.
చలమల కృష్ణారెడ్డి చేరికపై ఇప్పటివరకు మునుగోడు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ పలు మండలాల సోషల్ మీడియా గ్రూపులలో ఒకరి పై ఒకరు చర్చించుకుంటున్నారు తప్ప రాజగోపాల్ రెడ్డి ఇప్పటివరకు చలమల కృష్ణారెడ్డి చేరిక ను ఉద్దేశించి మాట్లాడకపోవడం గమనార్హం. పార్లమెంటు ఎన్నికలు దగ్గర్లోనే ఉండడంతో సగటు కార్యకర్త ఈ గ్రూపు రాజకీయాలు ఏందీ అని మునుగోడు నియోజక వర్గ వ్యాప్తంగా జోరుగా చర్చించుకుంటున్నారు. దీనిపై పూర్తి అవగాహన రావాలంటే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడితేనే స్పష్టమైన అవగాహన వస్తుందని కార్యకర్తలు గుసగుసలాడుకుంటున్నారు. Read Also..
- హైదరాబాద్ ఉప్పల్ లో కాంగ్రెస్ నేత దౌర్జన్యం.by CVR NEWSహైదరాబాద్ ఉప్పల్ లో అమానవీయ ఘటన వెలుగుచూసింది. చిన్నారులు ఇంటి ముందు క్రికెట్ ఆడారని అధికార పార్టీ నాయకుడు పిల్లల తల్లిదండ్రుల పట్ల అమానుషంగా ప్రవర్తించిన ఘటన వీడియో వైరల్ అయింది. తల్లిదండ్రులపై దాడి చేయడమే కాకుండా తన అధికార బలంతో…
- కొండమల్లేపల్లి–నాంపల్లి ప్రధాన రహదారి దుస్థితిపై ప్రజల ఆగ్రహం.by CVR NEWSనల్గొండ జిల్లాలో అధికారుల నిర్లక్ష్యానికి ఇది పరాకాష్టగా చెప్పవచ్చు. కొండమల్లేపల్లి నుంచి నాంపల్లి వెళ్లే ప్రధాన రహదారి గత ఏడాదిన్నరగా పూర్తిగా శిథిలావస్థకు చేరింది. గుంతలతో నిండిన ఈ రోడ్డు వాహనదారులకు నిత్యం ప్రమాదకరంగా మారింది. దుమ్ము, ధూళితో కప్పుకుపోయిన ఈ…
- ఈత సరదా అమెరికాలో తెలంగాణ విద్యార్థి మృతి..by CVR NEWSఅమెరికాలోని లూసియానాలో విషాద ఘటన చోటుచేసుకుంది. తెలంగాణవాసి అనురూప్ రెడ్డి ..ముగ్గురు స్నేహితులను కాపాడి..అనూహ్య రీతిలో ప్రాణాలు కోల్పోయాడు. సరదాగా ముగ్గురు స్నేహితులతో కలిసి ఈత కొట్టేందుకు లూసియానాలోని టొరోడో పార్క్‌లోని సెబాన్ రివర్‌లోకి కోడూరు అనురూప్ రెడ్డి వెళ్లాడు. హఠాత్తుగా…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
తెలంగాణ నుంచి రాజ్యసభ ఎన్నికల బరిలో ముగ్గురు అభ్యర్థులు నిలిచారు. కాంగ్రెస్ తరపున రేణుకా చౌదరి, అనిల్ కుమార్ యాదవ్… బీఆర్ఎస్ తరపున వద్దిరాజు రవిచంద్ర ఎన్నికల బరిలోకి దిగారు. వద్దరాజు రవిచంద్ర తన నామినేషన్ దాఖలు చేశారు. రేణుకా చౌదరి, అనిల్ కుమార్ యాదవ్ లకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఫామ్ లను అందజేశారు. వీరు తమ నామినేషన్లను సమర్పించనున్నారు. మరోవైపు ఏపీలో మూడు రాజ్యసభ స్థానాలకు వైవీ సుబ్బారెడ్డి, మేడా రఘునాథ్ రెడ్డి, గొల్ల బాబూరావులు నామినేషన్ వేశారు. తగినంత బలం లేకపోవడంతో రాజ్యసభ ఎన్నికలకు దూరంగా ఉండాలని టీడీపీ నిర్ణయించింది. దీంతో ముగ్గురు వైసీపీ నేతలు రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నిక కాబోతున్నారు.
తెలంగాణ శాసనసభ సమావేశాలు ఆరోరోజు కాసేపట్లో ప్రారంభం కానున్నాయి. ఈ క్రమంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరిగేషన్ శాఖపై శ్వేత పత్రం విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా ఇరిగేషన్ శాఖపై సభలో వాడివేడిగా చర్చ జరిగే అవకాశముంది. ఇప్పటికే కృష్ణ ప్రాజెక్టులను బోర్డుకి అప్పగించబోమంటూ అసెంబ్లీలో తీర్మానం చేశారు. కాగా మంగళవారం కాంగ్రెస్, సీపీఐ, ఏంఐఏం ఎమ్మెల్యేలు కాలేశ్వరం ప్రాజెక్టును పరిశీలించారు. బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ సీఎం కేసీఆర్ అసెంబ్లీకి రావాలంటూ సీఎం రేవంత్ రెడ్డి పదేపదే ఆహ్వానిస్తున్నారు. నిన్న మేడిగడ్డ నుంచి కూడా కేసీఆర్ సభకు రావాలంటూ కామెంట్స్ చేశారు. కేసీఆర్ అసెంబ్లీకి వస్తే అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం మరింత పెరగనుంది.
మరిన్నితాజావార్తలకోసంఇక్కడ క్లిక్ చేయండి.
గ్రేటర్ లో బీఆర్ఎస్ పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింది. జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి దంపతులు సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. గతకొంతకాలంగా బీఆర్ఎస్ అధిష్టానంపై మోతే శోభన్ రెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. రెండు రోజుల్లో డిప్యూటీ మేయర్ దంపతులు కాంగ్రెస్ పార్టీలో చేరతారని తెలుస్తోంది. కొంత కాలంగా బీఆర్ఎస్ హైకమాండ్ పై శ్రీలత దంపతులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. శోభన్ రెడ్డి బీఆర్ఎస్ రాష్ట్ర కార్మిక విభాగం అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. ఈ సందర్భంగా డిప్యూటీ మేయర్ దంపతులు మాట్లాడుతూ కేసీఆర్, కేటీఆర్ తమను అవమానపరుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
మరిన్నితాజావార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పోలీస్ నియామకాల్లో జీవో నెంబర్ 46 రద్దు సాధ్యాసాధ్యాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైపవర్ కమిటీతో సమావేశమై చర్చించారు. త్వరలో పలు పోస్టులకు సంబంధించి నియామక పత్రాలు జారీ చేయనున్న నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలు, ఈ విషయంలో ఎలా ముందుకు వెళ్లాలి? అనే అంశంపై అడ్వొకేట్ జనరల్ సలహాలు, సూచనలు తీసుకున్నారు. ఈ భేటీలో మంత్రి శ్రీధర్ బాబు, ఏజీ సుదర్శన్ రెడ్డి, అదనపు ఏజీ రంజిత్ రెడ్డి, సీఎస్ శాంతికుమారి, ప్రిన్సిపల్ సెక్రటరీ శేషాద్రి, ఇంటెలిజెన్స్ చీఫ్ శివధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రెవెన్యూ జిల్లాల జనాభా ప్రాతిపదికన టీఎస్ఎస్పీ పోస్టులు కేటాయిస్తే గ్రామీణ యువతకు అన్యాయం జరుగుతుందనే ఆందోళనలు ఉన్నాయి. కటాఫ్ మార్కు వ్యత్యాసంతో రాజధాని ప్రాంతానికే ఎక్కువగా ఉద్యోగాలు దక్కుతాయనే ఆందోళనలు నెలకొన్నాయి. అయితే టీఎస్ఎస్పీ రాష్ట్రస్థాయి పోస్టులు కాబట్టి కటాఫ్ మార్కులు రాష్ట్రస్థాయిలోనే పరిగణించాలనే డిమాండ్లు కూడా ఉన్నాయి. ఈ క్రమంలో టీఎస్ఎస్పీ నియామకంలో జీవో నెంబర్ 46ని మినహాయించాలనే విజ్ఞప్తులు ఉన్నాయి.
మరిన్నితాజావార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌కు తెలంగాణ కేబినెట్ ఆమోదం తెలిపింది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన అసెంబ్లీలో జరిగిన సమావేశంలో మధ్యంతర బడ్జెట్‌కు మంత్రి మండలి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కేబినెట్ ఆమోదించడంతో డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క మధ్యాహ్నం 12 గంటలకు అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. అదే సమయంలో శాసన మండలిలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు బడ్జెట్ సమర్పించనున్నారు. కాగా, గత ఏడాది ప్రభుత్వం 2.90 లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశ పెట్టడంతో ఈ సారి బడ్జెట్ 3 లక్షల కోట్లు దాటనున్నట్లు తెలుస్తోంది. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఆరు గ్యారెంటీ స్కీమ్‌ల అమలుకు బడ్జెట్ కేటాయింపులపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఇక, పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టడంతో సెంట్రల్ నుండి రాష్ట్రానికి వచ్చే నిధులపై సరైన క్లారిటీ లేదు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్రం తరహాలోనే ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెడుతోంది. పార్లమెంట్ ఎన్నికల తర్వాత రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది.
మంచిర్యాల జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి చెప్పుల దండ వేయడం కలకలం రేపుతోంది. చెన్నూర్ పట్టణం లో బీఆర్ఎస్ పార్టీకి చెందిన కొంతమంది వ్యక్తులు ఈ దురాగతానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. దీంతో బీఆర్ఎస్ సోషల్ మీడియా కి చెందిన ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి చెప్పుల దండేవేసిన ఫోటో ను బీఆర్ఎస్ సోషల్ మీడియాకి చెందిన కొంతమంది పలు గ్రూప్స్ లో వైరల్ చేశారు. దీంతో ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. పట్టుబడ్డ వారిని పట్టణ పోలీస్ స్టేషన్ కి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి మరికొంతమందిని అరెస్ట్ చేసే యోచనలో పోలీసులు ఉన్నట్లు తెలుస్తోంది. Read Also..






Total views : 91157