డ్రేనేజీ, వాటర్ ప్రభుత్వ స్దలాలు కాపాడుటకై తాము చిత్తశుద్దితో పని చేస్తామని కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ అభ్యర్ది కొలన్ హన్మంత్ రెడ్డి తెలిపారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్ది కొలన్ హనుమంత్ రెడ్డి బాచుపల్లిలోని కాంగ్రెస్ కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కుత్బుల్లాపూర్ లో రోడ్ల గుంతలమయం అవ్వడంతో గతంలో బాచుపల్లి రెడ్డి లాబ్స్ దగ్గర్లో తండ్రీ కూతురు బస్ కింద పడిన ఘటన, బాచూపల్లి ఇందరమ్మ కాలనీలో నీళ్ల సమస్య, స్కూల్ పిల్లల స్కూల్ కి వెళ్ళాలి అంటే రోడ్ల పైన సాహసం చేయాల్సిన దుస్థితి, దేవేందర్ నాగర్ పేట్ బషీరబాద్ లలో ప్రభుత్వ స్దలాలు కబ్జాకు గురైయ్యాయని…కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే డ్రైనేజీ, వాటర్, డెవలప్ మెంట్ తదితర అన్ని సమస్యల పట్ల చిత్తశుద్దితో పని చేస్తామని పేర్కొన్నారు. అనంతరం కుత్బుల్లాపూర్ BRS సీనియర్ నాయకుడు కొలన్ శ్రీనివాస్ రెడ్డి BRS కు రాజీనామా చేసిన విషయాన్ని తెలుసుకొని ఆయనను పార్టీలోకి ఆహ్వానించడానికి శ్రీనివాస్ రెడ్డి నివాసానికి వెల్లాడు. రేపు రేవంత్ రెడ్డి సమక్షంలో కొలన్ శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ లో చేరుతాడని కొలన్ హన్మంతరెడ్డి తెలిపాడు.
congress
ప్రచారంలో డాక్టర్ కోట నీలమకి అడుగడుగునా ప్రజలు ఘననిరాజనం. సనత్ నగర్ నియోజకవర్గం అమీర్‌పేట్ డివిజన్ బల్కంపేట లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ కోటా నీలిమ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో డాక్టర్ కోట నీలమ కి అడుగడుగునా ప్రజలు ఘననిరాజనం. ఈ సందర్భంగా డాక్టర్ కోట నిలిమ మాట్లాడుతూ కాంగ్రెస్ ట్రైనింగ్ ఏంటి అంటే భయంతో గాని బెదిరింపులతో కానీ ఓట్లు ఎలక్షన్స్ గెలవాలని కాంగ్రెస్ పార్టీకి ఉద్దేశం ఉండదు నీలిమ. ప్రేమతో అభిమానంతో ఓటర్స్ రెస్పెక్ట్ సంపాదించుకోవాలి వాళ్ల మనసు గెలుచుకోవాలి వాళ్ళ అభిమానం గెలుచుకోవాలి ఆ తర్వాత ఓటు అడగాలి ఆ తర్వాత ఎలక్షన్ గెలవాలి ఇది కాంగ్రెస్ సిద్ధాంతం బైట్ సనత్ నగర్ నియోజకవర్గం అభ్యర్థి డాక్టర్ కోట నిలిమ.
మహేశ్వరం నియోజక వర్గం కాంగ్రెస్ అభ్యర్థి KLR మేయర్ పారిజాత నర్సింహ రెడ్డి ఇంటికి వచ్చి నేను ఇక ముందు నేను రాజకీయాలకు దూరంగా ఉండాలని అనుకుంటున్నాను. నా చెల్లెలు అయిన పారిజాత నర్సింహ రెడ్డి లకు హామీ ఇస్తున్నా వారికి రాహుల్ గాందీ , ప్రియాంక గాంధీ లేదా సోనియా తో మాట్లాడిస్తనని హమీ ఇస్తున్నారు. తప్పకుండా పారిజాత నర్సింహారెడ్డి కి గౌరవ మైన స్థానం కల్పిస్తానని తెలుపుతున్నారు. ఎమ్మెల్యే పోటీ చేసి న తరువాత ఎంపీ కూడా ఇక్కడి నుండి పోటీ చేస్తానని అన్నారు. నాకు ఎక్కడ ఇల్లు లేదు. కేవలం తుక్కుగుడ లో నే ఉన్నది కాబట్టి నేను ఇక్కడ గట్టిగా పోటీ చేసి సభితమ్మ ను ఓడించి తీరుతామని ఆ పోరాటం లో పారిజాత నుండి పూర్తి సహకారం అందుతుంది అని ఆశాభావం వ్యక్తం చేశారు. తప్పకుండా నర్సింహ రెడ్డి మరియు పారిజాత గారికి రాత పూర్వకంగా అధిష్టానం నుండి తెలుప్తని అని అన్నారు. మహేశ్వరం నుండి కాంగ్రెస్ అన్ని చోట్ల నాయకులు కార్యకర్తలు ఏకమై సబితా ఇంద్రారెడ్డి ని ఓడించి తీరుతామని KLR అన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అభివృద్ధికి తిలోదకాలు ఇచ్చి కక్షపూరిత రాజకీయాలకు పెద్దపీట వేస్తూ పరిపాలన కొనసాగిస్తున్న ఈ ప్రభుత్వానికి అధికారంలో కొనసాగే అర్హత లేదని బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. పుట్టపర్తిలో పురందేశ్వరి అధ్యక్షతన పోలింగ్ బూత్ మరియు శక్తి కేంద్ర ప్రముఖుల సమావేశం జరిగింది. పురందేశ్వరి మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి అక్రమాలు విధానపరమైన లోపాలను ఎత్తిచూపితే వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి టిడిపి కోవర్టు అంటారా అంటూ ప్రశ్నించారు .రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యాల గురించి ప్రశ్నించకూడదా ప్రశ్నిస్తే
ప్రతిపక్షాల గొంతు నొక్కుతారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మద్యం అక్రమాలపై కేంద్ర హోంమంత్రికి ఫిర్యాదు చేశామన్నారు. నిరుపేదల ఇళ్ల కోసం కేంద్ర ప్రభుత్వం 18 లక్షల ఇళ్లు కేటాయిస్తే ఎన్ని ఇళ్లు నిర్మించారో వైసీపీ ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు. ప్రస్తుతం బిజెపి జనసేన పార్టీ పొత్తులో కొనసాగుతున్నామని స్పష్టం చేశారు.
పటాన్ చెరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నీలం మధు ముదిరాజ్ కు టికెట్.. టిపీసీసీ నిర్ణయంపై కాటా శ్రీనివాస్ గౌడ్ వర్గీయుల అసంతృప్తి చెందారు. టిపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి డౌన్ డౌన్ అంటూ కాటా శ్రీనివాస్ గౌడ్ అభిమానుల నినాదాలు చేశారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రేవంత్ రెడ్డి పోస్టర్లు బ్యానర్లు కాల్చి ఆందోళన వ్యక్తం చేశారు. గడిచిన 9 సంవత్సరాలుగా పార్టీని కార్యకర్తలను కాపాడిన కాటా శ్రీనివాస్ గౌడ్.. 2018 ఎన్నికలలో చివరి తొమ్మిది రోజుల ముందు టికెట్ అధిష్టానం నిర్ణయించిన 80 వేల ఓట్లు తెచ్చుకున్నారు. కష్టపడ్డ వారికి టికెట్టు కేటాయించకుండా కేవలం రాజకీయ ప్రలోభాలకు పార్టీలోకి వచ్చిన వారికి టికెట్ కేటాయించడం పై కాంగ్రెస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఛత్తీస్గడ్ అసెంబ్లీ ఎన్నికల తొలి విడత పోలింగ్ ఉదయం 8 గంటలకు ప్రారంభమయింది. నక్సల్స్ ప్రభావిత బస్తర్ జిల్లాలోని పలు ప్రాంతాలు సహా మొత్తం 20 నియోజకవర్గాలకు ఓటింగ్ జరుగుతోంది. ఓటింగ్ ప్రక్రియను రెండు టైమ్ స్లాట్స్‌గా విభజించారు. మొదటి స్లాట్ ఉదయం 8 గంటలకు ప్రారంభమయ్యి సాయంత్రం 5 గంటల వరకు ఓటింగ్ జరగనుంది. ఇక రెండో స్లాట్‌లో ఉదయం 7 గంటలకు ఓటింగ్ మొదలై మధ్యాహ్నం 3 గంటలకు ముగియనుంది. నక్సల్స్ ప్రభావిత ప్రాంతం కావడంతో పకడ్బందీ భద్రతా చర్యలను ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది. తొలి దశ ఎన్నికల్లో బస్తర్, రాజ్‌నంద్‌గావ్ జిల్లాల నుంచి 223 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 4,078,681 మంది ఓటు హక్కును ఉపయోగించుకోనున్నారు. ఇందులో 2,084,675 మంది మహిళలు, 1,993,937 మంది పురుషులు, 69 మంది ట్రాన్స్‌జెండర్ వ్యక్తులు ఓటర్లుగా ఉన్నారు. మొదటి దశ పోలింగ్‌లో పలువురు ముఖ్యనేతలు తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. అధికార కాంగ్రెస్ పార్టీ ఛత్తీస్‌గఢ్ చీఫ్, ఎంపీ దీపక్ బైజ్ (చిత్రకూట్), మంత్రులు కవాసీ లఖ్మా, మోహన్ మార్కం , మహ్మద్ అక్బర్ , ఛవీంద్ర కర్మతోపాటు పలువురు ముఖ్యనేతలు ఉన్నారు. బీజేపీకి చెందినవారిలో మాజీ ముఖ్యమంత్రి రమణ్ సింగ్, మాజీ మంత్రులు లతా ఉసెండి , విక్రమ్ ఉసెండి , కేదార్ కశ్యప్ , మహేష్ గగ్డా , మాజీ ఐఏఎస్ అధికారి నీలకంఠ్ టేకం ముఖ్యమైన అభ్యర్థుల జాబితాలో ఉన్నారు.
సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో సీపీఐ నేతలతో రేవంత్ భేటీ అయ్యారు పొత్తులు, సీట్ల సర్దుబాటుపై ఫైనల్ చర్చలు నిర్వహించారు. . అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పని చేసే విషయంలో ఇరు పార్టీల మధ్య గత కొంత కాలంగా చర్చలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో సీపీఐకి కొత్తగూడెం టికెట్‌తో పాటు ఓ ఎమ్మెల్సీ ఇచ్చేందుకు కాంగ్రెస్ అధిష్టానం అంగీకరించినట్లు రేవంత్ రెడ్డి తెలిపారు.
మునుగోడులో స్నేహపూర్వక పోటీ చేసేందుకు సీపీఐ ఆలోచన చేసినా అందుకు కాంగ్రెస్ ఒప్పుకోలేదు. దీనికి సీపీఐ నాయకత్వం సైతం సుముఖత తెలపడంతో సీట్ల సర్దుబాటు అంశం దాదాపుగా కొలిక్కి వచ్చింది. ఈ మేరకు ఇవాళ సీపీఐ నేతలతో రేవంత్ రెడ్డి ఫైనల్ డిస్కషన్స్ చేసి పొత్తుపై అధికారిక ప్రకటన చేశారు.
అరటి పళ్ళు అమ్ముతూ … ఎల్బీ నగర్ లో కొనసాగుతున్న కాంగ్రెస్ అభ్యర్థి మధుయాస్కి పాదయాత్ర
హైదరాబాద్ ఎల్బీనగర్ నియోజకవర్గం లోని గడ్డి అన్నారం నుండి ఎమ్మెల్యే అభ్యర్థి మధు యాష్కీ గౌడ్ పాదయాత్ర ప్రారంభమైంది. స్వచ్ఛందంగా జనం పోటెత్తారు.
అడుగడుగునా జననీరాజనం పలికారు.
నీవే మా ఎమ్మెల్యే అంటూ
నినాదాలతో హోరెత్తించారు. ఎల్బీనగర్ మార్గమధ్యలో ఇస్త్రీ చేస్తూ, అరటి పళ్ళు అమ్ముతూ, సామాన్య ప్రజల్లో ఒకడిగా ప్రతి కుటుంబాన్ని పలకరిస్తూ.. హస్తం గుర్తుకు ఓటేయవలసిందిగా కోరుతున్నారు మధు యాష్కీ. పాదయాత్రకు బ్రహ్మాండమైన స్పందన రావడం ఎంతో ఆనందంగా ఉందని ఆయన చెప్పుకొచ్చారు
కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు బీసీలను చిన్నచూపు చూస్తున్నాయని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ విమర్శించారు. జనాభాలో అధిక శాతంగా ఉన్న వర్గాన్ని అణిచివేయాలని భావిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కరీంనగర్లో మీడియాతో సంజయ్ మాట్లాడారు. అణగారిన వర్గాల పట్ల కాంగ్రెస్, బీఆర్ఎస్ వైఖరి మార్చుకోవాలని.. వెంటనే వారికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. బీసీ వర్గమంతా బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తోందన్నారు. ఎస్సీ, ఎస్టీలతో పాటు అగ్రవర్ణాల్లో పేదలు కూడా మా పార్టీకి మద్దతిస్తున్నారన్నారు. బీసీలకు బీఆర్ఎస్ కేవలం 23, కాంగ్రెస్ 19 సీట్లే ఇచ్చాయన్నారు. బీజేపీలో సీఎం అభ్యర్థిని ఎప్పుడూ ముందు ప్రకటించమన్నారు. ఎన్నికల తర్వాత గెలిచిన ఎమ్మెల్యేలు, అధిష్ఠానం కలిసి ఆ అభ్యర్థిని నిర్ణయిస్తారన్నారు. ఎవరు సీఎం అని ముందుగా ప్రకటించే సిస్టమ్ బీజేపీలో లేదన్నారు. ఒకరిద్దరు చెప్తే సీఎం అయ్యే వ్యక్తిని కాదన్నారు. అధిష్ఠానం తీసుకునే నిర్ణయానికి కట్టుబడి పార్టీ సిద్ధాంతం కోసం పనిచేసే చిత్తశుద్ధి గల కార్యకర్తను అని బండి సంజయ్ అన్నారు.




Total views : 141791