నాలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు. గెలుపు, ఓటములతో సంబంధం లేకుండా సిద్ధాంతపరమైన యుద్ధం కొనసాగిస్తామని ట్వీట్ చేశారు. ప్రజల నిర్ణయాన్ని గౌరవిస్తున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి అధికారాన్ని కట్టబెట్టిన తెలంగాణ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చేందుకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. దొరలకు, ప్రజలకు మధ్య జరిగిన యుద్ధంలో చివరికి ప్రజలే విజయం సాధించారని వెల్లడించారు.
#congress
తెలంగాణలో కేసీఆర్ పని అయిపోయిందని… ఇక సూట్ కేస్ సర్దుకోవడమేనని వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ కు హైప్ రావడం వల్ల కేసీఆర్ ను దించే అవకాశం ఆ పార్టీకి వచ్చినందువల్ల ఆ పార్టీకి తాము మద్దతుగా నిలిచామని చెప్పారు. ఎన్నికల్లో పోటీ చేయకపోవడం ఆత్మహత్యా సదృశం అయినప్పటికీ… కేసీఆర్ వ్యతిరేక ఓటు చీల్చకూడదనే ఉద్దేశంతో ఎన్నికల్లో పోటీ చేయలేదని అన్నారు. బీఆర్ఎస్ గెలిస్తే కేసీఆర్ మళ్లీ సీఎం అవుతారు కాబట్టి… తాము కాంగ్రెస్ కు మద్దతిచ్చామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ వల్ల అయినా కేసీఆర్ పాలనకు ముగింపు పలకాలనుకున్నానని తెలిపారు. కేసీఆర్ పై ఎంతో పోరాటం చేసిన తర్వాత మళ్లీ ఆయనతో ఎందుకు కలిశారని ప్రశ్నించారు.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై ఎలక్షన్ కమిషన్‌కు బీజేపీ ఫిర్యాదు చేసింది. రాహుల్ గాంధీ శనివారం తన ఎక్స్ ఖాతా ద్వారా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీలను పేర్కొంటూ తమకే ఓటేయాలని రాజస్థాన్ ప్రజలను అభ్యర్థించారు. అయితే ఈ పోస్టు ద్వారా పోలింగ్‌కు 48 గంటల పాటు ఎలాంటి ప్రచారాన్ని చేయకూడదన్న నిబంధనను ఉల్లంఘించారని ఎన్నికల కమిషన్‌కు బీజేపీ శనివారం లేఖ రాసింది. రాహుల్ గాంధీ ఎన్నికల మార్గదర్శకాలను ఉల్లంఘించారని ఫిర్యాదుచేసింది. రాహుల్ గాంధీ సోషల్ మీడియా ఖాతాను సస్పెండ్ చేసి ఆయనపై ఇతర చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని కోరింది.
బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు రైతుల పాలిట శత్రువులని విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి విమర్శించారు. రైతులకు రైతుబంధు నిధులను ఇవ్వకుండా ఉండేందుకు కాంగ్రెస్ పార్టీ ఎన్ని అడ్డంకులు సృష్టించినా, ఎన్నికల సంఘం అనుమతి ఇవ్వడంతో రైతులకు న్యాయం జరిగిందని మంత్రి పేర్కొన్నారు. శనివారం నాడు రావిర్యాల, మోహబ్బత్ నగర్, కే. సి. తండా, మహేశ్వరం, తుక్కు గూడ జరిగిన రోడ్ షో లలో మంత్రి ప్రసంగించారు. తెలంగాణలో కర్ణాటక మోడల్ అమలు చేస్తామని పేర్కొంటూ రైతులకు మూడు గంటల కరెంటు చాలని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి అనడం శోచనీయమని మంత్రి పేర్కొన్నారు. ప్రస్తుత ప్రభుత్వం 24 గంటల పాటు నాణ్యమైన విద్యుత్తు అందిస్తున్నా, కేవలం మూడు గంటలు రైతులకు చాలని అవమానపరచడం కాంగ్రెస్ పార్టీకి తగదని మంత్రి పేర్కొన్నారు. అవసరమైతే రైతులు 10 ఎచ్ పి మోటార్లు బిగించుకోవాలని కాంగ్రెస్ నాయకులు ఉచిత సలహాలు ఇస్తున్నారని విమర్శించారు. మరో వైపు కేంద్రంలోని బీజేపీ సర్కారు మోటార్లకు మీటర్లు పెట్టాలని తెలంగాణ ప్రభుత్వంపై ఒత్తిడి చేసిందని, మీటర్లు పెట్టకపోతే రాష్ట్రానికి రావాల్సిన నిధులకు కోత పెడుతామని బెదిరించిందని, అయినా మోటార్లకు మీటర్లు పెట్టేది లేదని సీఎం కేసీఆర్ తెగేసి చెప్పారని మంత్రి వివరించారు. దేశంలో మోటార్లకు మీటర్లు పెట్టని ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని చెప్పారు. తెలంగాణలో మోటార్లకు మీటర్లు పెట్టకపోవడం వల్ల రాష్ట్రానికి రావాల్సిన 25 వేల కోట్ల రూపాయల నిధులను నిలిపివేశామని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ పేర్కొనడాన్ని ప్రజలు గుర్తుంచుకోవాలని కోరారు. రాష్ట్రానికి రావాల్సిన నిధుల్లో రూ.25 వేల కోట్ల నష్టం చేసిన బీజేపీకి ఓట్లడిగే అర్హతే లేదని అన్నారు. మోటార్లకు మీటర్లు పెట్టమని బీజేపీ సర్కారు ఒత్తిడి చేసిందని మేము చెబుతుంటే లేదు లేదు తమ ప్రభుత్వం ఆ మాటే అనలేదని తెలంగాణ బీజేపీ నేతలు అదరగొట్టిండ్రని చెప్పారు. సీఎం కేసీఆర్ రైతుల పక్షపాతి అని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాల్లో కూడా మోటార్లకు మీటర్లు పెట్టారని, ఒకవేళ కాంగ్రెస్ గెలిచినా రాష్ట్రంలో రైతుల మోటార్లకు మీటర్లు పెడుతారని అన్నారు. పొరపాటున కూడా బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు ఓటు వేయవద్దని కోరారు. అభివృద్ధి సంక్షేమ రంగాల్లో రాష్ట్రాన్ని ప్రథమ స్థానంలో నిలిపిన ముఖ్యమంత్రి కేసీఆర్ ను మరోసారి ముఖ్యమంత్రి స్థానంలో నిలపాలని ప్రజల్ని కోరారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను సంపూర్ణంగా అమలు చేసిన కేసీఆర్ ప్రభుత్వం, ప్రస్తుత ఎన్నికల్లో ఇస్తున్న హామీలను కూడా తప్పని సరిగా నెరవేరుస్తుందని పేర్కొన్నారు.
ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా ఎమ్మెల్సీ, భద్రాచలం నియోజవర్గ ఇన్చార్జి అయిన తాత మధు మాట్లాడుతూ భద్రాచలం నియోజకవర్గానికి ఎటువంటి అభివృద్ధి చేశారో, మీకు ఛాలెంజ్ దమ్ముంటే రా, ప్రజల ముందుకొచ్చి భద్రాచలం నియోజకవర్గానికి మీరు మీ పార్టీ ఏమి అభివృద్ధి చేశారో, అని ఘాటు వ్యాఖ్యలు చేస్తూ ఏ వేదిక పైనా అయినా మీ సిద్ధం అంటూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన పొదెం వీరయ్య కు సవాల్ విసిరారు. తుమ్మల నాగేశ్వరరావు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పై గత ఎన్ని సంవత్సరాలు టిఆర్ఎస్ పార్టీలో ఉన్న మీరు తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అంటూ చెప్పుకోవడం సిగ్గుచేటు అంటూ తుమ్మల పొంగులేటి పై ఘాటు గా విమర్శలు చేశారు. సీతారామ ప్రాజెక్టును అడ్డుకొని సుప్రీంకోర్టులో కేసు వేసింది మీరు కాదా, భద్రాచలం సీతారామస్వామి, మేడారం సమ్మక్క సారక్క ల సాక్షిగా గద్దల మీద ప్రమాణం చేయడానికి మేము సిద్ధం, మీరు సిద్ధమా అంటూ భద్రాచలం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పొదెం వీరయ్య కు బహిరంగా సవాల్ విసిరారు ఖమ్మం జిల్లా ఎమ్మెల్సీ తాత మధు.
Read Also..
రేవంత్ రెడ్డి స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ విజయభేరి యాత్రలో పాల్గొన్నారు. కేసీఆర్ సీఎం, రాజయ్య ఎమ్మెల్యే అయ్యాక ఆడబిడ్డలకు ఇంట్లో నుంచి కాలు బయట పెట్టలేని పరిస్థితి ఏర్పడిందని రేవంత్ రెడ్డి అన్నారు. ఎమ్మెల్యే రాజయ్య, బీఆర్ఎస్ అభ్యర్థి కడియం శ్రీహరి మహిళలకు గౌరవం ఇవ్వాలని సూచించారు. వీరిద్దరి గురించి మనం పెద్దగా చెప్పవలసిన పని లేదన్నారు. శ్రీహరి గురించి రాజయ్య, రాజయ్య గురించి శ్రీహరి చెప్పారన్నారు. వీళ్లిద్దరికీ ఓ సారూప్యత ఉందని, వీరిద్దరూ ఉపముఖ్యమంత్రులుగా పని చేసి ఉద్యోగం ఊడగొట్టుకున్నారన్నారు. వీరి గురించి కేసీఆర్‌కు తెలుసు కాబట్టే ఉద్యోగం ఊడగొట్టారన్నారు. ఇలాంటి వారిని ఎమ్మెల్యేలుగా ఎన్నుకుందామా? అన్నారు. ఈ పదేళ్లలో వారు సరిగ్గా పాలన అందిస్తే, ఇచ్చిన హామీలు అమలు చేస్తే ఇలాంటి పరిస్థితి వచ్చేదా? అన్నారు. కేసీఆర్ కేబినెట్లో మాదిగ సామాజిక వర్గానికి, మహిళలకు సరైన ప్రాధాన్యత లేదని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో నలుగురు మహిళా మంత్రులు ఉంటారన్నారు.
కాంగ్రెస్ నేతలపై కక్ష పూరితంగా ఈడీ, సీబీఐ, ఐటీ దాడులు జరుగుతుంటే ఎన్నికల కమిషన్ ఏం చేస్తోందని కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు అన్నారు. కాంగ్రెస్ నేతలపై తనిఖీలు చేస్తున్న దర్యాప్తు సంస్థలు బీఆర్ఎస్, బీజేపీ నేతలపై ఎందుకు సోదాలు జరపడంలేదని ప్రశ్నించారు. ఆ రెండు పార్టీలలో డబ్బులు ఉన్నవారు లేరా అని నిలదీశారు. గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడుతూ.. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇంటిపై ఐటీ రైడ్స్ చేయడంతో పాటు వారి ఉద్యోగులపై థర్డ్ డిగ్రీ చేశారని మండిపడ్డారు. నా 50 ఏళ్ల జీవితంలో ఇలాంటి దాడులు చూడలేదన్నారు. అమిత్ షా పనిగట్టుకుని ఈ దాడులు చేయిస్తున్నారని ఆరోపించారు. సృజనా చౌదరి, సీఎం రమేష్ లు టీడీపీలో ఉన్నప్పుడు కేసులు వేశారు. వారు బీజేపీలో చేరగానే క్లీన్ చిట్ ఇచ్చారని ధ్వజమెత్తారు. ప్రజలు భయభ్రాంతులకు గురికావొద్దని అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్, ఏపీకి స్పెషల్ స్టేటస్ లపై కొట్లాడిన పవన్ కల్యాణ్ తిరిగి బీజేపీ వైపు చేరడంపై పునరాలోచన చేయాలన్నారు. ఇండియా కూటమిలో నితీష్, కుమార్, శరత్ పవార్, మమతా, స్టాలిన్ లు రాహుల్ కు మద్దతుగా ఉన్నారని ఈసారి కేంద్రంలో మోడీ, రాష్ట్రంలో కేసీఆర్ ఓడిపోవడం ఖాయమన్నారు.
ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ మండలం వరంగల్ క్రాస్ రోడ్డులో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనం లో కాంగ్రెస్ అభ్యర్ధి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీపీఐ రాష్ట్ర కమిటీ సభ్యులు దండి సురేష్ పాల్గొన్నారు. వీరికి కాంగ్రెస్ శ్రేణులు, సీపీఐ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాట ఇస్తే నిలబడే కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపించాలన్నారు. కేసీఆర్ ను నమ్మి రెండు సార్లు ఓట్లేసి గెలిపిస్తే నిరుద్యోగులకు ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదని పొంగులేటి విమర్శించారు. మూడోసారి కూడా ముఖ్యమంత్రి కావాలని చంద్రశేఖర్ రావు తహతలాడుతున్నాడని, ఈ సారి BRS పార్టీని కట్టడి చేయకపోతే కేసీఆర్ ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసే ప్రబుద్ధుడన్నారు. ప్రస్తుత ఎమ్మెల్యే స్థానికుడని అంటున్నారు, ఆయన హైదరాబాద్ ఉంటూ గత ఎన్నికలకి 15 రోజులు ముందు వచ్చాడని, కానీ నేను ఖమ్మం జిల్లాలోనే పుట్టి పెరిగానని అన్నారు. ఈ ఎమ్మెల్యే అనుచరులు మండలానికి ఒక షాడో ఎమ్మెల్యేలు ఉన్నారని, వారి అరాచకాలకు అడ్డు వేయాలంటే కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని అన్నారు.
సనత్ నగర్ నియోజకవర్గంలోని అల్లావుద్దీన్ కోటి లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ కోట నీలిమ గారు మాట్లాడుతూ… రాష్ట్రంలో అక్రమ అవినీతి పాలనకు చెక్ పెట్టాల్సిన సమయం ఆసన్నమైంది అని అన్నారు. నగరం నడి ఒడ్డున గల అల్లావుద్దీన్ కోటి ఎందుకు అభివృద్ధి చెందలేదని ప్రశ్నించారు. మైనార్టీలపై ప్రభుత్వంకు ప్రేమ ఉంటే ఈ ప్రాంతం అభివృద్ధి చెందేదని ప్రకటించారు. మైనార్టీ వర్గాలను ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని ఆవేదన వ్యక్తం చేశారు. మైనార్టీ అభివృద్ధికి , వారి సంస్కృతి పరిరక్షణకు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. బడుగు బలహీన వర్గాల వారికి విద్య , కనీస ఆదాయంపై కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక దృష్టి సారిస్తుందని ప్రకటించారు.





Total views : 90534