కొత్తిమీరలో విటమిన్లు, ఖనిజాలు సమృద్దిగా ఉంటాయి. వంటకాలలో రుచి కోసం, వాసన కోసం, గార్నిష్ కోసం కొత్తిమీరను ఎక్కువగా వాడుతారు. ఇది రుచికి మాత్రమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. కొత్తిమీర ఉపయోగాలు తెలుసుకుందాం. కొత్తిమీర ఆకులు హానికరమైన కొవ్వును తగ్గించి, ఆరోగ్యకరమైన కొవ్వు స్థాయిలను పెంచుతుంది. ముఖం పైన ఉండే మొటిమలకు, పొడి చర్మం, నల్లటి మచ్చలను తగ్గించటంలో కొత్తిమీర ప్రధానపాత్ర వహిస్తుంది. కొత్తిమీర యాంటీ-ఆక్సిడెంట్స్లను కలిగి ఉండటం వల్ల కంటి వ్యాధులు రాకుండా ఆపుతుంది. పిల్లలు, పెద్దల్లో వచ్చే యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ను నివారించుకోవచ్చు. కొత్తిమీర బ్లడ్ ఫ్యూరిఫైయర్గా పనిచేస్తుంది. కొత్తిమీరలో పోషకాలతో పాటు, ఐరన్ కంటెంట్ ఉండటం వల్ల ఇది అనీమీయాను తగ్గిస్తుంది. ఎముకలు బలంగా ఉండటానికి కావలసిన విటమిన్ కె కొత్తిమీరలో పుష్కలంగా ఉంటుంది. అజీర్ణం, వాంతులు వంటి వాటిని తగ్గించడంలో కొత్తిమీర సహాయపడుతుంది.
Coriander
కర్నూలు జిల్లా గోనెగండ్ల మండల పరిధిలోని హెచ్ కైరవాడి గ్రామంలో కొత్తిమీర సాగు చేసిన రైతు లబోదిబోమంటున్నాడు. కొత్తిమీర పంటకు గిట్టుబాటు ధర లేక పండిన పంటను గొర్రెలను మేతగా వదిలాడు. రైతు రాముడు రెండు ఎకరాల్లో కొత్తిమీర పంటను సాగు చేసేందుకు గాను రూ 2లక్షల వరకు పెట్టుబడి పెట్టామని,ఈ పంట 40 రోజుల్లో కోతకు వస్తుందని తెలిపాడు. అదును తప్పితే, ఇక పంట ముదురుతే కొనేందుకు వ్యాపారులు రారని,దీంతో పంట లేతగా ఉన్న సమయంలోనే అమ్మకాలు జరగాలి, కాని గిట్టుబాటు ధర పలకడం లేదని రైతు ఆవేదనా వ్యక్తం చేస్తున్నాడు. కొత్తిమీరను వ్యాపారులు బెడ్లు ప్రకారం కొనుగోలు చేస్తారని, బెడ్ ప్రస్తుతం రూ.100 పలుకుతుండగ ఒక కొత్తిమీరా కట్ట రూ.5 పలుకుతూ,వ్యాపారం రూ. 10వేలు దాటడంలేదని పెట్టుబడి కూడా రావడం లేదు. కూలీలు కూడా గిట్టుబాటు కాకపోవడంతో రైతు రాముడు తాను రెండు ఎకరాల్లో సాగుచేసిన కొత్తిమీర పంటను గొర్రెలకు మేతగా వేశాడు.
తమను ప్రభుత్వమే ఆదుకోవాలని వేడుకుంటున్నాడు.




Total views : 78892