Thursday, July 9, 2026
News Navigation
Thursday, July 9, 2026
News Navigation

Breaking

Thursday, July 9, 2026
Home Health ఆరోగ్యం, అందం పెంచే కొత్తిమీర..!

ఆరోగ్యం, అందం పెంచే కొత్తిమీర..!

by Satya
Coriander

కొత్తిమీరలో విటమిన్లు, ఖనిజాలు సమృద్దిగా ఉంటాయి. వంటకాలలో రుచి కోసం, వాసన కోసం, గార్నిష్ కోసం కొత్తిమీరను ఎక్కువగా వాడుతారు. ఇది రుచికి మాత్రమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. కొత్తిమీర ఉపయోగాలు తెలుసుకుందాం. కొత్తిమీర ఆకులు హానికరమైన కొవ్వును తగ్గించి, ఆరోగ్యకరమైన కొవ్వు స్థాయిలను పెంచుతుంది. ముఖం పైన ఉండే మొటిమలకు, పొడి చర్మం, నల్లటి మచ్చలను తగ్గించటంలో కొత్తిమీర ప్రధానపాత్ర వహిస్తుంది. కొత్తిమీర యాంటీ-ఆక్సిడెంట్స్‌లను కలిగి ఉండటం వల్ల కంటి వ్యాధులు రాకుండా ఆపుతుంది. పిల్లలు, పెద్దల్లో వచ్చే యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్‌ను నివారించుకోవచ్చు. కొత్తిమీర బ్లడ్ ఫ్యూరిఫైయర్‌గా పనిచేస్తుంది. కొత్తిమీరలో పోషకాలతో పాటు, ఐరన్ కంటెంట్ ఉండటం వల్ల ఇది అనీమీయాను తగ్గిస్తుంది. ఎముకలు బలంగా ఉండటానికి కావలసిన విటమిన్ కె కొత్తిమీరలో పుష్కలంగా ఉంటుంది. అజీర్ణం, వాంతులు వంటి వాటిని తగ్గించడంలో కొత్తిమీర సహాయపడుతుంది.

Advertisements

You may also like

Our Visitor

039105
Total views : 194294

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: