రాష్ట్రంలో రైతులు పండించిన పత్తినంతా సీసీఎల్ కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకుంటామని రాష్ట్ర వ్యవసాయ, జౌళి శాఖ మంత్రులు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. రాష్ట్రంలో పత్తి సాగు, ఉత్పత్తి పెరగడంతో పాటు రైతులకు ఆర్థిక భరోసా కలిగేలా నూతన వంగడాల అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని అన్నారు. రాష్ట్రంలో రైతుల దగ్గర పత్తి కొనుగోలు చేస్తేనే సెస్ తొలగిస్తామని పత్తి స్పిన్నింగ్, జిన్నింగ్ వ్యాపారులకు మంత్రులు స్పష్టం చేశారు. పత్తి రైతుల దగ్గర మొత్తం పంట కొనుగోలు చేసేలా సీసీఎల్ కు, కేంద్రానికి లేఖ రాయనున్నట్లు వెల్లడించారు. ఈ క్రాప్‌లో తప్పనిసరిగా పత్తి రైతులు తమ పేర్లు నమోదు చేసుకోవాలని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. ఈ క్రాప్‌లో నమోదు చేసిన పంటనంతా సీసీఐ కొనుగోలు చేయాలని ఆ సంస్థ ప్రతినిధికి స్పష్టం చేశారు. అదే సమయంలో ఈ క్రాప్‌లో నమోదు వల్ల ప్రభుత్వం అందించే ఫలాలతో లబ్ధిపొందొచ్చునని రైతులకు అవగాహన కల్పించాలన్నారు.పత్తి రైతులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్.పత్తి సేకరణలో ప్లాస్టిక్ వినియోగంపై నివారణకు జిన్నింగ్, స్పిన్నింగ్ మిల్లర్లు ముందుకు రావాలన్నారు. ప్లాస్టిక్ సంచుల్లో వచ్చే పత్తిని కొనుగోలు చేయబోమని రైతులకు తేల్చి చెప్పాలన్నారు. ప్రభుత్వం కూడా ప్లాస్టిక్ వినియోగంపై ఉక్కుపాదం మోపుతుందన్నారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- విజయేంద్ర ప్రసాద్ చేతులమీదుగా ఆవిష్కరించిన “కళ్యాణం కమనీయం జీవితం” సినిమా పోస్టర్.వివిఫై మీడియా ఫిల్మ్ ఫ్యాక్టరీ పతాకంపై, ఖాన్ దురాని, సాహితి ఆవంచ హీరోయిన్ గా రవి లోకిరెడ్డి డైరెక్షన్ లో పైలా ప్రసాద్ రావు కిషోర్ గుండాల సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం కళ్యాణం కమనీయం జీవితం. ఈ సినిమా ఫస్ట్ లుక్…
- RAPO23 పూజా కార్యక్రమంతో గ్రాండ్ గా లాంచ్- రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం.ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరో, దర్శకుడిగా రాపో సినిమాటిక్స్ బ్యానర్‌పై కృష్ణ పోతినేని నిర్మిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ #RAPO23 పూజా కార్యక్రమంతో గ్రాండ్ గా లాంచ్- రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని కెరీర్లోనే అత్యంత…
- ‘ఇరుముడి’ నుంచి గూస్బంప్స్ తెప్పించే డివైన్ ఫస్ట్ సింగిల్ ‘ఇరుముడి కట్టు’ రిలీజ్.మాస్ మహారాజా రవితేజ, శివ నిర్వాణ, మైత్రీ మూవీ మేకర్స్, జి.వి. ప్రకాశ్ కుమార్ ‘ఇరుముడి’ నుంచి గూస్బంప్స్ తెప్పించే డివైన్ ఫస్ట్ సింగిల్ ‘ఇరుముడి కట్టు’ రిలీజ్ మాస్ మహారాజా రవితేజ మోస్ట్ అవైటెడ్ ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ‘ఇరుముడి’.…
- హర్మన్ పోరాటం వృథా.. ఆస్ట్రేలియా చేతిలో భారత్‌కు చేదు ఓటమి.భారత శిబిరంలో నిరాశ నెలకొంది. మ్యాచ్ ముగిసిన తర్వాత ఆటగాళ్లు హ్యాండ్‌షేక్‌ల కోసం వరుసగా నిలబడగా వారి ముఖాల్లో తీవ్ర నిరుత్సాహం కనిపించింది. ఇన్నింగ్స్ చివర్లో కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ ఆడిన మెరుపు ఇన్నింగ్స్ భారత జట్టుకు మంచి ఊపు తీసుకొచ్చింది.…
- భారీ వర్షాల కారణంగా మధిర సభ రద్దు.రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలు ప్రభుత్వ కార్యక్రమాలపైనా ప్రభావం చూపుతున్నాయి. ఖమ్మం జిల్లా మధిరలో రేపు జరగాల్సిన సీఎం రేవంత్ రెడ్డి ‘రైతు ఆశీర్వాద సభ’ను చివరి నిమిషంలో రద్దు చేశారు. వర్షాల కారణంగా సభను హైదరాబాద్‌కు మార్చుతూ ప్రభుత్వం నిర్ణయం…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి





Total views : 181008