అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు మండలంలో రాజోలు అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ నాయకులు కార్యకర్తలు గౌరవ వేతనం వద్దు కనీస వేతనం ముద్దు అంటూ సిఐటియు జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ గత 39 రోజులు నుంచి విరామం లేకుండా శాంతియుతంగా సమ్మె నిర్వహిస్తున్నటువంటి తమకు ఫోకస్ నోటీసులు జారీ చేసి తమను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని అన్నారు. ఇప్పటికే ఆరుసార్లు చర్చలకు పిలిచి తమకు ఎటువంటి న్యాయం చేయలేదని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అంగన్వాడీ వర్కర్స్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం కి వినిపించడం లేదా అక్కా చెల్లెళ్ళు ఆడపడుచులు చేస్తున్నటువంటి సమ్మె జగన్మోహన్ రెడ్డి కి కనిపించడం లేదా అని రాబోయే ఎన్నికల్లో ఈ ప్రభుత్వానికి ఓటు అనే ఆయుధంతో తగిన బుద్ధి చెబుతాం అని అంగన్వాడి వర్కర్స్ వాపోతున్నారు.
crime news
స్థానిక టిడిపి కార్యాలయంలో శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలోమాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు మాట్లాడుతూ దళితులను జగన్ రెడ్డి ఐదేళ్ల పాలనలో 125 వేల అడుగులకు అనిచివేసి 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం పెడితే దళితులకు మీరు చేసిన పాపాలన్ని తొలగిపోతాయ అని విమర్శించారు. చంద్రబాబు నాయుడు దళితులను గౌరవిస్తూ విదేశీ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పేరు పెట్టి పది నుండి 15 లక్షలు విదేశీ విద్యకు విధులు కేటాయించి పేదలకు విదేశీ విద్య అందించడం జరిగిందని అటువంటి పథకానికి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పేరు మార్చి జగన్మోహన్ రెడ్డి పేరు పెట్టుకోవడం దళితులకు అగౌరవం అన్నారు. టిడిపి పాలనలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కార్పొరేషన్ ద్వారా అనేకమందికి రుణాలు అందించి ఆదుకుంటే వైసిపి పాలనలో జగన్ రెడ్డి కార్పొరేషన్ నిధులు కేటాయించకుండా దగా చేశాడని ఎద్దేవా చేశారు. 50 వేల బ్యాక్లాగ్ పోస్టులు ఖాళీగా ఉంటే దళితులపై ప్రేమ ఉన్న జగన్ రెడ్డి ఐదేళ్లలో ఎందుకు భర్తీ చేయలేదు అని ప్రశ్నించారు. దళిత వాడలకు 200 యూనిట్లు లోపు కరెంటు ఉచితంగా చంద్రబాబు నాయుడు నాడు అందిస్తే జగన్ రెడ్డి ప్రభుత్వం ఉచిత కరెంటు ఎత్తివేసి అధిక బిల్లులతో దళితులను దోపిడీ చేశారని అన్నారు. 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం పెట్టినంతమాత్రాన చేసిన దుర్మార్గాలను మర్చిపోరని, అంబేద్కర్ రాజ్యాంగానికి వ్యతిరేక పాలన సాగిస్తున్న జగన్ రెడ్డికి అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరించే నైతిక హక్కు లేదని అన్నారు.
తెలుగుదేశంపార్టీ ఆదేశాలతో కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ నియోజకవర్గం కాకినాడ రూరల్ మండలం ఇంద్ర పాలెం గ్రామంలో పిల్లి అనంతలక్ష్మి సత్యనారయణ మూర్తి కళ్యాణ మండపంలో టి.డి.పి రాష్ట్ర కార్యదర్శి పిల్లి సత్యనారాయణ మూర్తి ఆధ్వర్యంలో జయహో బీసీ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజి మంత్రి పితాని సత్యనారాయణ, తెలుగుదేశం పార్టీ బిసి సాధికార శెట్టి బలిజ విభాగం కుడిపుడి సత్తిబాబు, కాకినాడ మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పాల్గొన్నారు. ముందుగా జ్యోతి లాల్ పులే చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీసీ సామాజిక వర్గానికి సముచిత స్థానం తెలుగుదేశంపార్టీ అధ్యక్షులు ఎన్టీఆర్, చంద్రబాబు కల్పించారన్నారు. వైసిపి పాలనలో బీసీలు వెనకబడి పోయారని, బీసీ సంక్షేమానికి ఆనాడు చంద్రబాబు అనేక సంక్షేమ పథకాలు, వివిధ కార్పొరేషన్ ల ద్వారా చేయూత అందించారని, నేడు రాష్ట్ర ప్రభుత్వం అవి అన్నీ అమలు చేయకుండా బీసీలను చిన్న చూపు చూస్తోందన్నారు. ఈ రాష్ట్ర భవిష్యత్ దృష్ట్యా బీసీలు అందరు ఎకతాటిపైకి వచ్చి తెలుగుదేశం పార్టీ కి మద్దతుగా నిలవాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీసీ నాయకులు చొలంగి వేణుగోపాల్, టిడిపి నాయకులు నురుకుర్తి వెంకటేశ్వరరావు, చప్పిడి వెంకటేశ్వరరావు, రామకృష్ణ, అధిక సంఖ్యలో బీసీ సామాజిక వర్గానికి చెందిన మహిళలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
పత్తికొండ తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు నియోజకవర్గ ఇంచార్జ్ కె యి శ్యామ్ కుమార్ ఆధ్వర్యంలో రాంపల్లి గ్రామానికి చెందిన మద్దికేర సూరన్న, ఊరు ఆవుల పెద్దయ్య, కురువ రంగన్న, కురువ మల్లికార్జున, మద్దికేర ఓబులేసు, మారికి కోదండ బావిగడ్డ పెద్ద ఓబులేసు, ఏకాశి ప్రసాద్, ముట్టి వెంకట్ రాముడు, మద్దికేర పరుశురాముడు, కిష్టయ్య, బుగ్గల బ్రహ్మయ్య, మహేష్ మద్దికేర సుఖాలు, మారికి పెద్దయ్య, చిట్యాల రంగన్న, చందోలి గ్రామానికి చెందిన సలీం తదితరులు వారి 20 కుటుంబాలు తెలుగుదేశం పార్టీకి ఆకర్షితులై పార్టీలో చేరడం జరిగింది.
ఆస్తికోసం కన్నతల్లిని కడతేర్చిన సంఘటన కర్నూలు జిల్లా తుగ్గలి మండలంలో చోటుచేసుకుంది. తుగ్గలి మండలం రాతన కొత్తూరుకు చెందిన లక్ష్మీదేవిని(55) పొలాన్ని తన పేరు పైకి మార్పించాలని ఒత్తిడి చేస్తూ ఆమె ఒప్పుకోకపోవడంతో కొడుకు లిఖిత్ రెడ్డి ఇనుప రాడ్డుతో కొట్టి చంపాడు. లక్ష్మీదేవికి ఒక కొడుకు ఒక కూతురు ఉన్నారు. కొంతకాలం కిందటే భర్తను పోగొట్టుకున్న లక్ష్మీదేవి కూతురికి పెళ్లి చేసింది. ఆ తర్వాత పొలాన్ని తన పేరు పైకి మార్చాలని తల్లితో తరచుగా లిఖిత్ రెడ్డి గొడవపడేవాడు. కొడుకుతో గొడవ పెట్టుకోవడం ఇష్టం లేక రాతనలోని తన బంధువుల ఇంట్లో లక్ష్మీదేవి ఉంటుంది. అయితే గత రాత్రి తల్లికి ఫోన్ చేసి పెళ్లి సంబంధానికి వస్తున్నారని రావాలని చెప్పాడు. హత్య చేయాలని ఉద్దేశంతోనే తనను రమ్మన్నాడని తెలుసుకోలేని తల్లి స్వగ్రామానికి వచ్చింది. ముందుగానే అనుకున్న ప్రకారం ఇంటికి చేరుకున్న లక్ష్మీదేవిని వ్యవసాయానికి వాడే ఇనుప రాడ్డుతో కొట్టి హత్య చేశాడు. గ్రామస్తులకు విషయం తెలియడంతో అక్కడికి చేరుకునే లోపు పరారయ్యాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని జనసేన పార్టీ కార్యాలయం నందు నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులకు మరియు కార్యకర్తలకు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా జనసేన పార్టీ నియోజకవర్గ ఇంఛార్జ్ ఇమ్మడి కాశీనాథ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాశీనాథ్ మాట్లాడుతూ నియోజకవర్గంలో ప్రధానంగా ప్రజా సమస్యలను తెలుసుకుంటూ వాటిని పరిష్కరించే ప్రయత్నంలో భాగంగా పాదయాత్ర చేపడుతున్నట్లు తెలియజేశారు. రాబోయే ఎన్నికల్లో వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేయడం, మార్కాపురం కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేయడం ఎజెండాగా పాదయాత్ర చేపడుతున్నట్లు తెలియజేశారు. ఈ నెల 28వ తేదీ నుండి పాదయాత్ర మొదలుపెట్టి నియోజకవర్గంలోని ప్రజలకు వెలుగొండ ప్రాజెక్టు ప్రాధాన్యత మరియు మార్కాపురం జిల్లా ఆవశ్యకత గురించి వివరిస్తూ ముందుకెళ్లడం జరుగుతుందన్నారు. ఈ పాదయాత్రలో కలిసి వచ్చే పార్టీలను అన్నింటిని కలుపుకొని ప్రజల్లోకి వెళ్లడం జరుగుతుందన్నారు. పాదయాత్ర రూట్ మ్యాప్ త్వరలోనే ప్రకటిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
మంచిర్యాల జిల్లా జన్నారం మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే బొజ్జు పటేల్, అన్ని శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అధికారులు ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని మీ స్థాయిలో కాని పనులను నా దృష్టికి తీసుకురావాలని అన్నారు, ఏ అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నా తన దృష్టి కి తీసుకు రావాలని సూచించారు. వెనుకబడిన జిల్లా ఆదిలాబాద్ అభివృద్ధి కి రేవంత్ ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలతో రూపకల్పన చేస్తోంది అని అన్నారు.
దొంగ ఓట్లతో గెలుపొందిన తిరుపతి వైకాపా ఎంపీ గురుమూర్తిపై కేంద్ర ఎన్నికల సంఘం అనర్హత వేటు వేయాలని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. తిరుపతి ఉప ఎన్నిక సందర్భంగా చోటు చేసుకున్న అక్రమాల్లో కేంద్ర ఎన్నికల సంఘం ఆలస్యంగానైనా కఠిన చర్యలు తీసుకోవడం స్వాగతిస్తున్నామన్నారు. అన్నమయ్య జిల్లా కలెక్టర్ గిరీషా ఇతర కిందిస్థాయి అధికారులను సస్పెండ్ చేయడం ఇతర అధికారులకు హెచ్చరిక లాంటిదని గుర్తు చేశారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ దొంగ ఓటర్ కార్డులు సృష్టించి తిరుపతి ఉప ఎన్నికల్లో ఓటు వేయడం జగన్ ఆటవిక పాలనకు నిదర్శనమన్నారు. దొంగ ఎపిక్ కార్డులు తయారు చేయడంలో భాగస్వామ్యులైన మంత్రి పెద్దిరెడ్డి, ఎంపీ మిథున్, ఇతర వైకాపా ఎమ్మెల్యేలు భవిష్యత్ ఎన్నికల్లో పోటీ చేయకుండా ఎలక్షన్ కమిషన్ కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. శ్రీవారి భక్తుల ముసుగులో దొంగ ఓట్లు వేయడానికి వేలాది మందిని వాహనాల్లో తరలించి ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేశారని పేర్కొన్నారు. తాము మొదటి నుంచి ఆరోపిస్తున్నా ఎలక్షన్ కమిషన్ ఎట్టకేలకు స్పందించి కఠిన చర్యలు తీసుకోవడం అభినందనీయమన్నారు. ఒకప్పుడు నిజాయితీ ఐఏఎస్ అధికారిగా పేరు తెచ్చుకున్న గిరీషా అధికార పార్టీ నేతల వత్తిల్లకు తలొగ్గడం వల్లే సస్పెండ్ అయ్యారని పేర్కొన్నారు. ఇప్పటికైనా జగన్ భజన చేస్తున్న పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఎలక్షన్ కమిషన్ ఆదేశాలను తూచా తప్పక పాటించి ఎన్నికలను నిస్వార్ధంగా జరిపించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని, తమ పోరాటం కొనసాగిస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో టిడిపి రాష్ట్ర రైతు సంఘం ఉపాధ్యక్షుడు మల్లారపు రవి ప్రకాష్ నాయుడు ఇతర నేతలు పాల్గొన్నారు.
కృష్ణా జిల్లా, పామర్రు నియోజకవర్గం తిరువూరు ఎమ్మెల్యే రక్షణ నిధి మాట్లాడుతూ నాకు తిరువూరు సీటు ఇవ్వకపోవడం పట్ల నా మనసు గాయపడింది. ఒక ఎంపీ చెప్పిన మాట విని, ఒక ప్రణాళిక ప్రకారం, రెండుసార్లు గెలుపొందిన నాకు సీట్ లేకుండా చేశారు. నా నిర్ణయం రెండు రోజుల్లో ప్రకటిస్తా. నేను పోటీ చేయడం ఖాయం. ఎక్కడి నుంచి చేస్తాను అన్నది త్వరలో తెలియపరుస్తా. నేను ఈ పది సంవత్సరాల రాజకీయ చరిత్రలో చంద్రబాబు నాయుడు కానీ, లోకేష్ పవన్ కళ్యాణ్ ను కానీ దూషించిన సందర్భాలు లేవు. అది కూడా ఒక కారణం కావచ్చు అని నేను భావిస్తున్నాను. వారి ప్రణాళికలు ముందుగానే పసిగట్టి 20 రోజుల నుంచి నేను నియోజకవర్గానికి దూరంగా ఉంటున్నాను.
అధిక ధ్వని స్థాయిల కారణంగా వీడియో గేమర్లలో కోలుకోలేని వినికిడి నష్టం మరియు టిన్నిటస్ ప్రమాదాన్ని కొత్త పరిశోధన కనుగొంది. వీడియో గేమర్లు కోలుకోలేని వినికిడి లోపం లేదా టిన్నిటస్‌కు గురయ్యే ప్రమాదం ఉందని కొత్త అధ్యయనం చూపిస్తుంది.
వినోద వ్యాపారంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రదేశాలలో వీడియో గేమింగ్ ఒకటి. అయినప్పటికీ, దాని పెరుగుతున్న ప్రజాదరణ ప్రజల శారీరక మరియు మానసిక ఆరోగ్యంపై దాని ప్రభావం గురించి ఆందోళనలను కూడా పెంచింది. ఇప్పుడు, కొత్త పరిశోధన అధిక ధ్వని స్థాయిల కారణంగా వీడియో గేమర్లలో కోలుకోలేని వినికిడి నష్టం మరియు టిన్నిటస్ ప్రమాదాన్ని కనుగొంది.
50,000 కంటే ఎక్కువ మంది వ్యక్తులతో కూడిన BMJ పబ్లిక్ హెల్త్ జర్నల్‌లో ప్రచురించబడిన సమగ్ర సమీక్ష పత్రం , గేమింగ్‌లో ధ్వని స్థాయిలు తరచుగా సురక్షిత పరిమితులకు సమీపంలో లేదా మించిపోతున్నట్లు కనుగొంది. గేమింగ్ నుండి ధ్వని స్థాయిలు గేమింగ్ సెంటర్లలో 80-89 డెసిబెల్స్ (dB) వరకు చేరుకుంటాయి మరియు ఇంపల్స్ సౌండ్లు, గేమ్‌ప్లే టచ్ సమయంలో 119 dB కంటే ఎక్కువ ఉండే సమయంలో పేలుళ్లు ఒక సెకను కంటే తక్కువగా ఉంటాయి. ఇవి సురక్షితమైన ఎక్స్పోజర్ పరిమితులను మించిపోయాయి, ఒక పత్రికా ప్రకటన వివరించింది.