కృష్ణా జిల్లా, అవనిగడ్డ నియోజకవర్గం అంగన్వాడీ ఉద్యోగులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేర్చాలి. అంగన్వాడీఉద్యోగులకు మద్దతుగా వామపక్ష పార్టీ నేతలు ధర్నా. చల్లపల్లి ప్రదానరహదారి దిగ్బంధం. ఆందోళనకారులను చెదరగొట్టిన పోలీసులు. అంగన్వాడి కార్యకర్తలకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని వామపక్ష పార్టీ నేతలు రహదారులను నిర్బంధించారు. చల్లపల్లి బస్టాండ్ సెంటర్ లో అంగన్వాడీల దీక్షకు మద్దతుగా రోడ్డు దిగ్భందించి నిరసన తెలియజేస్తున్న అఖిలపక్ష ఆందోళనకారులను స్థానిక ఎస్ఐ. చిన్నాబాబు చెదరగొట్టి ట్రాఫిక్ అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోన్నారు.
crime news
మంచిర్యాల జిల్లా, మందమర్రి ప్రభుత్వ ఆదర్శ పాఠశాల మోడల్ స్కూల్ మందమర్రి పరీక్ష సెంటర్ లొ ఈ రోజు జరుగుచున్న నవోదయ విద్యాలయం ప్రవేశ పరీక్ష లకు హాజరు అవుతున్న 143 మంది విద్యర్థి ని విద్యార్థులకు ఉదయం 10-30 వరకు పరీక్ష కేంద్రానికి చేరుకున్నరు విద్యార్థులు పరీక్ష కేంద్రం లొ బ్లూ, బ్లాక్ పెన్, హల్ టికెట్ ఫొటో గుర్తింపు కార్డు తెచ్చుకోవాలి, అని పరీక్ష చీఫ్ సూపరింటెండెంట్ పాఠశాల ప్రిన్సిపాల్ జయకృష్ణ రెడ్డి తెలిపారు. టిజీటి కాగజ్ నగర్ నవోదయ విద్యాలయం నుంచి విద్య అధికారులు పర్యవేక్షణ లొ ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నారు పోలీస్ భద్రత ఏర్పాటు చేసారు.
పశ్చిమ గోదావరి జిల్లా, మొగల్తూరు లో ఘనంగా మాజీ కేంద్రమంత్రి సినీ నటుడు రెబల్ స్టార్ యు.వి.కృష్ణంరాజు జయంతి వేడుకలు. స్వగ్రామం మొగల్తూరు లో జయంతి వేడుకల్లో పాల్గొన్న భార్య శ్యామల దేవి, కుమార్తె ప్రసిద్ధ. కృష్ణంరాజు నివాసానికి భారీగా చేరుకున్న అభిమానులు. అభిమానులు ఏర్పాటు చేసిన కేకు ను కట్ చేసిన కృష్ణంరాజు భార్య, కుమార్తె. కృష్ణంరాజు పుట్టినరోజు సందర్భంగా మొగల్తూరు లో ఉచిత షుగర్ వ్యాధి మెగా వైద్య శిబిరం.
మంచిర్యాల జిల్లా, వేమనపల్లి మండలంలోని జాజుల పేట గ్రామానికి చెందిన పూజిత అనే నిండు గర్భిణికి అర్థరాత్రి పురిటి నొప్పులతో బాధపడుతుండడంతో సమాచారం అందుకున్న 108 సిబ్బంది ఆసుపత్రికి తరలిస్తుండడంతో మార్గమధ్యలో తీవ్రమైన నొప్పులు రావడంతో 108 వాహనాన్ని పక్కకి నిలిపి సిబ్బంది చాక చక్యంగా సుఖ ప్రసవం నిర్వహించారు. ఆ గర్భిణి పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం చెన్నూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి మెరుగైన వైద్య సేవలు అందిస్తున్న ఆసుపత్రి సిబ్బంది.
జోగులాంబ గద్వాల జిల్లాలో రోడ్డు ప్రమాదం ముగ్గురిని బలిగొంది. డివైడర్‌ను ఢీ కొట్టి కారు పల్టీలు కొట్టగా ముగ్గురు మృతి చెందారు. గద్వాల పట్టణం జమ్మిచేడు సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అతివేగంతో కారు రోడ్ డివైడర్‌ను ఢీకొట్టడంతో కార్ పల్టికొట్టింది. కారులో ఉన్న ఆరుగురు లో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. గద్వాలలోని ఓ వైద్యుని కుమార్తె పుట్టిన రోజు వేడుకలకు హాజరై గద్వాల నుండి పెబ్బేరుకు వెళ్తుండగా జమ్మిచేడు సమీపంలో అర్థరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో మృతులు నరేష్ పవన్ కుమార్, ఆంజనేయులు సంఘటన స్థలంలోనే మృతి చెందగా కారులో వున్న మరో ముగ్గురు గోవర్ధన్ నవీన్ మహబూబ్ లకు తీవ్ర గాయాలు కావడంతో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
విపరీతమైన మెడనొప్పి తో ఇబ్బంది పడుతున్నారా? ముఖ్యంగా సాఫ్ట్ వేర్ జాబ్ లు, డెస్క్ జాబ్ లు చేసేవాళ్ళు వారి కూర్చునే భంగిమ వల్ల, అలాగే ఆధునిక జీవితంలోని స్థిరమైన ఒత్తిళ్ల కారణంగా మెడ సంబంధిత సమస్యలకు ఎక్కువగా లోనవుతున్నారు. మీరు నిరంతరం మెడ నొప్పి లేదా ఇతర మెడ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వారైతే, చాలా మెడ సమస్యలకు కారణాలు ఏమిటి అనేది తెలుసుకోవడం కూడా అవసరం.
- కోవిడ్ సమయంలో డెస్క్ వర్క్‌తో ఉన్న వ్యక్తులు ల్యాప్‌టాప్‌ల వాడకాన్ని పెంచారని మరియు అందువల్ల మెడ నొప్పి ఎక్కువ అవుతుందని వైద్యులు చెబుతున్నారు. సిస్టమ్ ముందు కూర్చుని పనిచేసే క్రమంలో భంగిమ మీ ఆరోగ్యాన్ని మీరు అర్థం చేసుకునే దానికంటే ఎక్కువగా దెబ్బతీస్తుంది.
- మీరు కూర్చునే తప్పు భంగిమ మీ మొత్తం ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది మరియు మెడ, భుజం, వెన్ను ఒత్తిడికి మరియు కీళ్ల క్షీణతకు కూడా కారణమవుతుంది. సుదీర్ఘమైన ఒత్తిడి, అసౌకర్య స్థితిలో నిద్రించడం, ఒత్తిడికి మెడనొప్పి కారణమవుతుంది.
- ఒత్తిడి కూడా మెడలోని కండరాలపై ప్రభావాన్ని చూపుతుంది. మీరు ఒత్తిడికి గురైనప్పుడు, మీ మెడ కండరాలు బిగుతుగా ఉండటం వల్ల మెడ నొప్పి వస్తుంది. దీర్ఘకాలిక మెడ నొప్పి కూడా చిరాకు, అలసట మరియు మీ జీవితానికి చాలా ఒత్తిడిని కలిగించే నిరాశకు కారణం కావచ్చు.
బిగుతుగా ఉన్న మెడ కండరాలను నార్మల్ గా మార్చటానికి ఫిజియోథెరపీ గొప్పది. ఫిజియోథెరపీ ద్వారా ఒత్తిడి వల్ల వచ్చే వెన్ను నొప్పిని తగ్గించుకోవచ్చు. ఫిజియోథెరపీ లో వారు మీకు మెడ నొప్పి వ్యాయామాలను బోధించగలరు మరియు ఇప్పుడు మెడ కండరాల నొప్పులను తగ్గించడంలో సహాయపడగలరు మరియు భవిష్యత్తులో మీరు వాటిని కలిగి ఉండకుండా నిరోధించడంలో కూడా సహాయపడగలరు.
కర్నూలు, పత్తికొండ మండలం చిన్నహుల్తి వద్ద కాల్పులు కలకలం. పార్కింగ్ విషయంలో ఘర్షణ పడ్డ ఇద్దరు లారీ డ్రైవర్లు. వెంకటేశం అనే లారీ డ్రైవర్ పై రాయితో దాడి చేసిన మరో లారీ డ్రైవర్ శ్రవణ్ కుమార్. గాయాలపాలైన వేంకటేశం తన వద్ద లైసెన్స్ పిస్టల్‌తో గాల్లోకి కాల్పులు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు. పిస్టల్, బుల్లెట్లు స్వాధీనం చేసుకొని ఇరువురు లారీ డ్రైవర్ల పై కేసు నమోదు చేసారు.
దళితుడిని చంపిన వాడికి అందలం…. చిన్న కోడి కత్తితో గుచ్చిన వాడికి జైలా?
జగన్మోహన్ రెడ్డి తన స్వార్దం కోసం కోడి కత్తి శ్రీనివాసరావు ను బలిపశువును చేసారని తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతు శిరీష అన్నారు. దళిత వర్గాలకు మేలు పేరుతో దగా చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి అని పేర్కొన్నారు. జగన్మోహన్ రెడ్డి అధికార కాంక్షకు శ్రీను బలయ్యాడన్నారు. చిన్న ఆయుధంతో తనపై హత్యా ప్రయత్నం జరిగిందని సానుభూతి నాటకాలతో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి అతని కుటుంబాన్ని రోడ్డుకి ఎక్కించారన్నారు. చెయ్యని తప్పుకు విడుదలకు అవకాశం లేకుండా జైల్లో ఉంచే కుట్ర జగన్మోహన్ రెడ్డి అన్నారు. అంబేద్కర్ ఒక్క దళితులకు మాత్రమే కాకుండా ప్రతి ఒక్క భారతీయునికి ఆరాధ్యుడన్నారు. మహనీయుని రాజ్యాంగ అమలు వలనే అందరూ సుభిక్షంగా ఉన్నారని పేర్కొన్నారు. జగన్మోహన్ రెడ్డికి అంబేడ్కర్ విగ్రహ ఆవిష్కరణకు ఎటువంటి అర్హత లేదన్నారు. ఒక దళితుడిని చంపి డోర్ డెలివరీ చేసిన అనంత్ బాబును బెయిల్ పై విడుదల చేసి తన కార్యక్రమంలో ఉంచిన వ్యక్తి జగన్మోహన రెడ్డి అని అన్నారు. దళితుడిని చంపిన వాడికి అందలం చిన్న కోడి కత్తితో గుచ్చిన వాడికి జైలా? ఇంతలా దళితులను మోసం చేస్తూ అంబేడ్కర్ విగ్రహం ప్రారంభమా? దళిత డాక్టర్ నూ అన్యాయంగా చనిపోయాలే చేసిన ఈ జగన్మోహన్ రెడ్డి పాలన ఎవరు మరచిపోరని మండిపడ్డారు.
నంద్యాల జిల్లా నంద్యాలలో జేసీ బంగ్లాను రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసిందని అందులో ఇది ఒకటిని ఆయన పేర్కొన్నారు. బిల్డింగ్ ని కేవలం కోటి రూపాయలతోనే సుందరవణంగా తీర్చిదిద్దామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నంద్యాల ఎమ్మెల్యే శిల్ప రవి, ఎంపీ పోచ బ్రహ్మానందరెడ్డి, జిల్లా కలెక్టర్ మంజీర జిలానీ, జెసి రాహుల్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.