అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని గుంతకల్ రోడ్డులో గురువారం తెల్లవారుజామున వరుసగా ఆరు దుకాణాలలో గుర్తుతెలియని దుండగులు చోరీ చేయగా మరో మూడు దుకాణాలలో చోరీకి యత్నించారు. ఈ సందర్భంగా దుకాణాల యజమానులు మాట్లాడుతూ గత నెల 6 షాపుల్లో గుర్తుతెలియని దుండగులు చోరీకి పాల్పడి రూ.10 వేలు నగదును ఎత్తుకెళ్లారన్నారు. అయితే మరోసారి సుమారు 6 దుకాణాలలో దుండగులు చోరీ చేసి రూ. 15,000 నగదును ఎత్తుకెళ్లినట్లు షాప్ యజమానులు వెల్లడించారు. అయితే ఇప్పటికైనా పోలీసులు రాత్రి సమయాలలో గస్తీ తిరిగి చోరీల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని షాపు యజమానులు సంబంధిత పోలీసు అధికారులకు విన్నవించారు.సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి వెళ్లి సంఘటన స్థలాన్ని పరిశీలించి బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మీదకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
cvr news channel
తుపాను ప్రభావిత ప్రాంతాల్లో యుద్ధప్రాతిపదికన విద్యుత్ ను పునరుద్ధరించాలని సీఎం జగన్ ఆదేశించారు. ఏపీలో తుపాను ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో సీఎం జగన్మోహన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్ప్ లో మాట్లాడారు. ఈ సందర్భంగా తుపాను ఎఫెక్ట్, పునరావాస చర్యలు, నష్టం అంచనాలు తదితర అంశాలపై సీఎం జగన్ చర్చించారు. ప్రతి రైతునూ ఆదుకుంటామని హామీ ఇచ్చారు. సబ్సిడీపై విత్తనాల సరఫరాకు సిద్ధం కావాలని అధికారులను ఆదేశించారు. రోడ్లు దెబ్బతిన్న ప్రాంతాల్లో రవాణా పునరుద్ధరణకు వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. వర్షాలు తగ్గుముఖం పట్టిన ప్రాంతాల్లో వ్యాధులు ప్రబలకుండా పారిశుద్ధ్యంపై దృష్టిపెట్టాలని ఆదేశించారు.
చెట్టుకూలి చనిపోయిన కానిస్టేబుల్ కుటుంబానికి రూ.30 లక్షల సహాయాన్ని అందిస్తామన్నారు. రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందిని హామీ ఇచ్చారు. పంట పొలాల్లో ఉన్న వరదనీటిని పూర్తిగా తొలగించడంపై దృష్టిపెట్టాలని ఆదేశించారు.
తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సీఎల్పీ నేత రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. తన ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారోత్సవానికి ఆహ్వానిస్తూ లేఖ రాశారు. ప్రజా ప్రభుత్వ స్వీకారానికి ఆహ్వానం పలుకుతున్నట్లు చెప్పారు. ఈ మేరకు ఆయన బుధవారం లేఖను విడుదల చేశారు. తెలంగాణ ప్రజలకు అభినందనలు… విద్యార్థుల పోరాటం, అమరుల త్యాగం, సోనియాగాంధీ ఉక్కు సంకల్పంతో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో మనందరి ఆకాంక్షలు నెరవేరే ఇందిరమ్మ రాజ్యస్థాపనకు సమయం ఆసన్నమైందని పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్య, పారదర్శక పాలన అందించేందుకు బలహీన వర్గాలు, దళిత, గిరిజన, మైనార్టీ, రైతు, మహిళ, యువత సంక్షేమ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు మీ అందరి ఆశీస్సులతో 2023 డిసెంబర్ 7న మధ్యాహ్నం 1.04 నిమిషాలకు ఎల్బీ స్టేడియంలో ప్రజా ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేయబోతుందన్నారు. ఈ మహోత్సవానికి రావాల్సిందిగా అందరికీ ఆహ్వానం పంపుతున్నామని పేర్కొన్నారు.
తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి రేపు ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఎల్బీ స్టేడియం వేదికగా జరిగే ఈ కార్యక్రమంలో రేవంత్ చేత గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. గురువారం మధ్యాహ్నం జరగనున్న ప్రమాణస్వీకారానికి రావాలని ఏఐసిసి చీఫ్ మల్లిఖార్జున్ ఖర్గేతో పాటు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీని రేవంత్ రెడ్డి ఆహ్వానించారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పలు రాష్ట్రాల సీఎంలు, మాజీ సీఎంలు, వివిధ రాజకీయ పార్టీల నేతలకు టీపీసీసీ ఆహ్వానాలు పంపింది. అలాగే ఏపీ సీఎం వైఎస్ జగన్, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ తో పాటు చంద్రబాబునాయుడుకి, కెసిఆర్ ను కూడా ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించారు. కాంగ్రెస్ గెలుపులో కీలకపాత్ర పోషించిన కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ను ప్రమాణ స్వీకార మహోత్సవానికి ఆహ్వానించారు. వీరితోపాటు హైకోర్టు చీఫ్ జస్టిస్ అలోక్, తెలంగాణ అమరవీరుల కుటుంబాలకూ టీపీసీసీ ఆహ్వానం పంపింది. టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం, ప్రొఫెసర్ హరగోపాల్, కంచె ఐలయ్యతో పాటు వివిధ కుల సంఘాల నేతలు, సినీ ప్రముఖులకు ఆహ్వానాలు వెళ్లాయి.
ఎంపిపి మద్దిరేవుల సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలో లక్కిరెడ్డిపల్లెలో ఘనంగా జరిగిన అయ్యప్ప స్వామి అంబులం పూజలో ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి. అయ్యప్ప మాలధారణం నియమాల తోరణమని ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి అన్నారు. బుధవారం రాత్రి ఎంపిపి మద్దిరేవుల సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలో లక్కిరెడ్డిపల్లెలో ని వారి స్వగృహంలో ఘనంగా జరిగిన అయ్యప్ప స్వామి అంబలం పూజలో శ్రీకాంత్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు గావించారు. అంబులం పూజ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన 18 మెట్ల మండపం భక్తులను ఎంతగానో ఆకట్టుకుంది. అయ్యప్ప మాలధారణ స్వాములు, గురుస్వాముల భక్తి పాటలతో ఈ ప్రాంతం పులకరించింది. పూజ అనంతరం సుదర్శన్ ఆధ్వర్యంలో భారీ ఎత్తున భిక్ష ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ అయ్యప్ప దీక్ష ఆరోగ్య రక్ష అని అన్నారు.చిన్నా పెద్ద అని తేడా లేకుండా ప్రతి వ్యక్తిని దైవ స్వరూపంగా భావించడమే దీక్ష పరమార్థమన్నారు. ఆధ్యాత్మిక చింతన పెరగడమే కాకుండా దురలవాట్లకు దూరమై సంపూర్ణ ఆరోగ్యం క్రమశిక్షణతో కూడినజీవన విధానం , ధార్మిక భావాలు అలవడు తున్నాయన్నారు. కార్తీక మాసంచాలా విశిష్టమైనదని, నియోజకవర్గంలో కార్తీక మాస శోభ సంతరించుకోవాలని ఆయన ఆకాంక్షించారు.
మాజీ ఎంపిపి అంపాబత్తిన రెడ్డెయ్య,వైస్ ఎంపిపి సుబ్బరాయుడు, సర్పంచులు వెంకట నారాయణరెడ్డి , జనార్దన్ రెడ్డి, ఎంపిటిసి లు లక్ష్మీ నారాయణ,జగన్ మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
రాటేటర్ కఫ్ అనేది భుజం యొక్క నాలుగు కండరాల సమూహం. ఇవి భుజం కీలును స్థిరంగా ఉంచడానికి మరియు భుజాన్ని అన్ని దిశలలో కదిలించడానికి సహాయపడతాయి.
రాటేటర్ కఫ్ గాయాల యొక్క లక్షణాలు:
- భుజం నొప్పి
- భుజం బలహీనత
- భుజం కదలిక పరిమితి
- భుజం క్లిక్ చేయడం లేదా పాపింగ్ శబ్దాలు
రాటేటర్ కఫ్ గాయాలకు కారణాలు:
- ఓవర్‌యూజ్: భుజాన్ని పునరావృతంగా ఉపయోగించడం, క్రీడలు, పని లేదా ఇతర కార్యకలాపాల వల్ల రాటేటర్ కఫ్ గాయాలు సంభవిస్తాయి.
- ట్రామా: భుజంపై పడిపోవడం లేదా డైరెక్ట్ బ్లో వల్ల రాటేటర్ కఫ్ గాయాలు సంభవిస్తాయి.
- వయస్సు: వయస్సు పెరిగేకొద్దీ, రాటేటర్ కఫ్ కండరాలు బలహీనపడతాయి మరియు గాయానికి ఎక్కువ అవకాశం ఉంటుంది.
రాటేటర్ కఫ్ గాయాలకు చికిత్స:
రాటేటర్ కఫ్ గాయాలకు చికిత్స గాయం యొక్క తీవ్రతను బట్టి ఉంటుంది. చాలా సందర్భాలలో, రాటేటర్ కఫ్ గాయాలు ఇంటి చికిత్సతో మెరుగ్గా ఉంటాయి. ఇంటి చికిత్సలో విశ్రాంతి, మంచు, కుదింపు మరియు ఎలివేషన్ (RICE) ఉన్నాయి. ఓవర్-ది-కౌంటర్ నొప్పి నివారణ మందులు కూడా సహాయపడవచ్చు.
తీవ్రమైన రాటేటర్ కఫ్ గాయాలకు శస్త్రచికిత్స అవసరం కావచ్చు. శస్త్రచికిత్సలో గాయపడిన కండరాలను మరమ్మత్తు చేయడం లేదా భుజం జాయింట్‌ను మరింత స్థిరంగా చేయడానికి శస్త్రచికిత్సలు ఉండవచ్చు.
రాటేటర్ కఫ్ గాయాలను నివారించడం:
రాటేటర్ కఫ్ గాయాలను నివారించడానికి, మీరు:
- భుజం వ్యాయామాలు చేయండి: భుజం కండరాలను బలపరిచే మరియు సాగదీసే వ్యాయామాలు చేయండి.
- భుజం యొక్క ఓవర్యూజ్ను నివారించండి: భుజాన్ని పునరావృతంగా ఉపయోగించే కార్యకలాపాలను నివారించండి లేదా క్రీడలు ఆడేటప్పుడు లేదా పని చేసేటప్పుడు విరామాలు తీసుకోండి.
- సరైన శరీర నిర్మాణాన్ని నిర్వహించండి: మంచి శరీర నిర్మాణాన్ని నిర్వహించడం వల్ల భుజంపై ఒత్తిడి తగ్గుతుంది మరియు గాయాల ప్రమాదం తగ్గుతుంది.
శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో సభ్యులంతా ఫలప్రదమైన చర్చలు జరపాలని ప్రధాని నరేంద్ర మోదీ కోరారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో మీ ఓటమి తాలూకు అసహనాన్ని పార్లమెంట్లో ప్రదర్శించొద్దు అని మోదీ కాంగ్రెస్‌కు హితవు పలికారు.శీతాకాల సమావేశాల నిమిత్తం పార్లమెంట్‌కు వచ్చిన ప్రధాని మీడియాతో మాట్లాడారు. గత 9 ఏళ్లుగా వారికి అలవాటుగా మారిన నెగెటివిటీని పక్కనబెట్టి ఈ ఓటమి నుంచి పాఠాలు నేర్చుకోవాలన్నారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు సంతృప్తినిచ్చాయన్నారు. సుపరిపాలన, జనహితం కోసం పాటుపడిన వారికి ప్రజలు పట్టం కట్టారని తెలిపారు. ప్రజల సంక్షేమం కోసం నిబద్ధతతో పనిచేస్తే.. ప్రభుత్వ వ్యతిరేకత అనే పదం ఉండదని రుజువైందని ప్రధాని స్పష్టం చేశారు.
కరీంనగర్ జిల్లా గంగాధర మండలం బూరుగుపల్లి చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ తన నివాసంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. ప్రతిపక్ష పాత్ర పోషించి ప్రజల సంక్షేమం కోసం కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చుకుంటే ప్రజల పక్షాన ఉండి పోరాటం చేస్తామని. అధికారంలో ఉన్న లేకున్నా ఎపుడైనా ప్రజలకు అందుబాటులో ఉంటా. కార్యకర్తలు ఎవరు అధైర్య పడద్దని మనమంతా బిఆర్ఎస్ కుటుంబం అని యావత్ తెలంగాణ కెసిఆర్ లేని తెలంగాణను ఊహించలేకపోతున్నాం ఒక కేసీఆర్, కేటీఆర్ లేని తెలంగాణను ఊహించలేకపోతున్నాం అంటూ కన్నీరు పెట్టుకున్న ఎమ్మెల్యే సుంకె రవిశంకర్…
విజయవాడ సెంట్రల్ అజిత్ సింగ్ నగర్ లో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ నూతన భవనాన్ని డీజీపీ రాజేంద్ర నాధ్ రెడ్డి ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మల్లాది విష్ణు, మేయర్ రాయన భాగ్యలక్ష్మి,వైసీపీ నాయకులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ…విజయవాడ నగర అభివృద్ధి విస్తరించడంతో పెరుగుతున్న ట్రాఫిక్ ను నియంత్రించడానికి ఈ నూతన పోలీస్ స్టేషన్ ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. నగర శివారు ప్రాంతాల్లో ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నాం అనీ తెలిపారు.




Total views : 196404