తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సునామీ లాగా ఎగిసిపడి భారి స్థాయిలో సీట్లని కైవసం చేసుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోందని కాంగ్రెస్ అభ్యర్థి పాయం వెంకటేశ్వర్లు అన్నారు.. టిఆర్ఎస్ ప్రభుత్వంలో సాగించిన అవినీతి, ప్రజా వ్యతిరేక పాలనకు ఈ ఫలితాలు నిదర్శనమని.. నిరుద్యోగులు, యువత, ప్రభుత్వ ఉద్యోగులు, మహిళలు, అన్ని వర్గాల ప్రజలు బిఆర్ఎస్ ప్రభుత్వ పాలన చూడలేక ఇంటికి పంపించడం జరిగిందని ఆయన అన్నారు. పినపాక నియోజకవర్గం లో స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే పైన పూర్తి వ్యతిరేకత ఏర్పడిందని, 34 వేల పైచిలుకు భారీ మెజారిటీ వెనకాల ప్రజలు, మిత్రపక్షాల సపోర్ట్ ఉందని.. ఈ విజయాన్ని అందించిన ప్రజలకు ఓటర్ మహాశయులకు కృతజ్ఞతలు తెలియజేశారు. తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజా రంజక పాలన ఉంటుందని ఆయన అన్నారు.
Cvr telugu news
1) గొరిగే మల్లేష్ (బీఎస్పీ)54
2) నోముల దయానంద్ గౌడ్ (బీజేపీ)273
3) పగడాల యాదయ్య (సీపీఎం)71
4) మల్ రెడ్డి రంగారెడ్డి (కాంగ్రెస్)1927
5) మంచిరెడ్డి కిషన్ రెడ్డి (బిఆర్ఎస్)630
26వ రౌండ్ కాంగ్రెస్1297 ఆధిక్యం
బీఎస్పీ మొత్తం ఓట్లు : 2556
బిజెపి మొత్తం ఓట్లు : 15064
సీపీఎం మొత్తం ఓట్లు : 8710
కాంగ్రెస్ మొత్తం ఓట్లు : 124447
బిఆర్ఎస్ మొత్తం ఓట్లు : 84320
కాంగ్రెస్ అభ్యర్థి రంగారెడ్డి 40127 ఓట్లతో గెలుపు
ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఓటరు తీర్పు మరికొద్ది గంటల్లో వెలువడనున్నది. పటిష్ట బందోబస్తు నడుమ ఓట్ల లెక్కింపునకు అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. ఉదయం 5 గంటలకే అధికారులు లెక్కింపు కేంద్రాలకు చేరుకున్నారు. ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభంకానున్నది. నగరంలో తొలి ఫలితం చార్మినార్ నియోజకవర్గం నుంచి వచ్చే అవకాశం ఉండగా, చివరి ఫలితం శేరిలింగంపల్లి నియోజకవర్గంలో వెల్లడికావచ్చు. హైదరాబాద్ జిల్లాలో అత్యధికంగా 14 లెక్కింపు కేంద్రాలు ఏర్పాటు చేయగా, యూసుఫ్‌గూడ కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో ఖైరతాబాద్, జూబ్లీహిల్స్ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. మిగిలిన 13 నియోజకవర్గాలకు విడిగా కేంద్రాలు ఏర్పాటు చేశారు.





Total views : 90593