తిరుపతి జిల్లాకు తుఫాను ముప్పు పొంచి ఉన్నట్లు ఐ ఎం డి నుండి సమాచారం అందిందని జిల్లా కలెక్టర్ కె .వెంకటరమణా రెడ్డి శనివారం తెలిపారు. ఐఎండి హెచ్చరికల ఆధారంగా కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసి మండల స్థాయి, గ్రామస్థాయిలో ఉన్నటువంటి అధికారులను అప్రమత్తం చేయడం జరిగిందని ప్రస్తుత సమాచారం మేరకు డిసెంబర్ 2 నుంచి డిసెంబర్ 5వ తేదీ వరకు అత్యధిక వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని, 50 నుంచి 75 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశాలు కూడా ఉన్నాయని, ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, ఎవరు భయపడాల్సిన అవసరం లేదని అన్నారు . అధికారులందరూ అప్రమత్తమై ఉన్నారని, ప్రజలందరూ అవగాహన కలిగి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉందని, ముఖ్యంగా 4,5 ఈ రెండు తేదీలలో పిల్లలు, గర్భిణీ స్త్రీలు, చిన్నపిల్లల తల్లులు, వృద్దులు బయటకు రాకుండా జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉందని తెలిపారు. రెవెన్యూ శాఖ అధికారులు అందరూ మునిసిపల్ ఏరియాలలో మరియు రూరల్ ఏరియాలలో రిహాబిలిటేషన్(పునరావాస కేంద్రాలు) సెంటర్లు ఏర్పాటు చేయడం జరగుతుందనీ, అలాగే ఈ సెంటర్లలో 24 గంటలు వసతి, ఫుడ్ మరియు ఇతర మెడికల్ సదుపాయాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.హెల్త్ డిపార్ట్మెంట్ మరియు ఐసిడిఎస్ ముఖ్యంగా 10 రోజుల లోపు డెలివరీ అయ్యే గర్భిణీ స్త్రీలు ఎవరైతే ఉన్నారో వారిని ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా హాస్పిటల్స్ కు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. చిన్నపిల్లల తల్లులు కూడా రిహాబిలిటేషన్ సెంటర్లను సద్వినియోగం చేసుకోవాలని అందులో పిల్లలకు సంబంధించిన పాలు, ఆహారం వంటివి అందేలా చూస్తున్నామన్నారు. ప్రధానంగా దృష్టి గుడిసెలలో ఉన్నవారు, కచ్చా గృహాల్లో నివసిస్తున్న వారు కూడా ఈ పునరావాస కేంద్రాలను వినియోగించుకోవాలని, ఎక్కడా కూడా ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా చర్యలు తీసుకుంటున్నామని అధికారులందరూ అప్రమత్తమై వున్నారని, ప్రజల నుంచి కూడా సహకారం కావాలని అందరిని కోరుకుంటున్నానని అన్నారు. ప్రజలందరూ ప్రభుత్వం ఇచ్చేటటువంటి సలహాలను పాటిస్తూ ఉన్నట్లయితే ఈ తుఫానును సునాయాసంగా ఎదుర్కొనవచ్చునని తెలిపారు.
Cvr telugu news
జాతీయ కాలుష్య నియంత్రణ దినోత్సవం సందర్భంగా జి వి ఎస్ ఎం ప్రభుత్వ జూనియర్ కళాశాల, ఉలవపాడు నందు ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో ప్రిన్సిపాల్ సయ్యద్ జిలానీ బాషా, ఎన్ ఎస్ ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ గారపాటి గోపీ చంద్ ప్రకాష్, కామర్స్ అధ్యాపకులు జ్యోతి, కెమిస్ట్రీ అధ్యాపకులు సుభాషిణి, బోటనీ అధ్యాపకులు గంగా భవాని, హిందీ అధ్యాపకులు రఫీ, ఫిజిక్స్ అధ్యాపకులు చల్లా శ్రీనివాసులు, జువాలాజి అధ్యాపకులు వెంకటేశ్వర్లు, తెలుగు అధ్యాపకులు మాధవరెడ్డి, ఇంగ్లీష్ అధ్యాపకులు సుబ్బాచారి, మ్యాథ్స్ అధ్యాపకులు మల్లికార్జున మరియు ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ కళాశాల ఆవరణలో మొక్కలు నాటారు.జాతీయ కాలుష్య నియంత్రణ దినోత్సవం సందర్భంగా జి వి ఎస్ ఎం ప్రభుత్వ జూనియర్ కళాశాల, ఉలవపాడు నందు ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో ప్రిన్సిపాల్ సయ్యద్ జిలానీ బాషా, ఎన్ ఎస్ ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ గారపాటి గోపీ చంద్ ప్రకాష్, కామర్స్ అధ్యాపకులు జ్యోతి, కెమిస్ట్రీ అధ్యాపకులు సుభాషిణి, బోటనీ అధ్యాపకులు గంగా భవాని, హిందీ అధ్యాపకులు రఫీ, ఫిజిక్స్ అధ్యాపకులు చల్లా శ్రీనివాసులు, జువాలాజి అధ్యాపకులు వెంకటేశ్వర్లు, తెలుగు అధ్యాపకులు మాధవరెడ్డి, ఇంగ్లీష్ అధ్యాపకులు సుబ్బాచారి, మ్యాథ్స్ అధ్యాపకులు మల్లికార్జున మరియు ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ కళాశాల ఆవరణలో మొక్కలు నాటారు.
సోమవారం భీమవరం పంచాయతీ సచివాలయం 2 దగ్గర సెప్టిక్ ట్యాంక్ గుంటలో ప్రమాదవశాత్తు పడి మరణించిన శెట్టిపల్లి సాకేత్ సన్నాఫ్ ఖాదర్ బాషా శవం శనివారం భీమవరం గ్రామపంచాయతీ స్మశానంలో పోస్ట్ మార్టం జరిగింది. ఈ పోస్ట్ మార్టం సందర్భంగా కందుకూరు సిఐ. నఫీజ్ భాష ఉలవపాడు ఎస్ఐ బాజీ రెడ్డి, ఎంపీడీవో చెంచమ్మ, ఎమ్మార్వో బ్రహ్మయ్య, వీఆర్వోలు, ఉపాధి హామీ సిబ్బంది, సచివాలయం సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు. నిజంగా ఆ బాలుడు చనిపోక ముందే సెప్టిక్ ట్యాంకి పైన ముల్లకంప వేసి ఉంటే ఈరోజు సాకేత్ మరణించేవాడు కాదు అందువల్ల సాకేత్ మరణం అధికారుల నిర్లక్ష్యం వల్లనే జరిగిందని అర్థం అవుతుంది. మరణానికి కారుకులైన అధికారులు పైన, సాకేత్ మరణానికి కారుకులైన అధికార యంత్రాంగంపై చర్యలు తీసుకొని బాధ్యత కుటుంబాన్ని ఆదుకోవాలని కోరుతున్నారు.
ఈ సందర్భంగా ఐ ఎఫ్ టి యు జిల్లా కార్యదర్శి ఆర్ మోహన్ మాట్లాడుతూ అధికార యంత్రాంగం నిర్లక్ష్యం వల్లనే ఒక దళిత బాలుడు ప్రాణాలు కోల్పోయాడని బిడ్డను కోల్పోయిన కుటుంబాన్ని ఒక అధికారి కూడా సందర్శించి సానుభూతి తెలియజేయలేదని అంత అమానవీయంగా అధికార యంత్రాంగం వ్యవహరించిందని అదే సందర్భంలో ఎన్నికల సమయంలో ఓట్ల కోసం జనాలకి నిద్ర పట్టకుండా ఓట్ల వేట్ల కొనసాగించే అధికార ప్రతిపక్ష నాయకులు ఆ కుటుంబాన్ని ఆదుకునేందుకు ముందుకు రాలేదని ఆర్ మోహన్ ఆవేదన వ్యక్తం చేశారు.తక్షణమే ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా. వేములవాడ పట్టణంలోని గాంధీ నగర్ లో తాళం వేసిన ఇంట్లో అర్ధరాత్రి గుర్తుతెలియని దుండగులు ఇంట్లోకి ప్రవేశించి 40 వేల రూపాయల నగదు, తులం బంగారం దొంగతనం చేశారు. తిప్పాపూర్ లోని గురుకుల పాఠశాలలో ప్రభుత్వ టీచర్లుగా పనిచేస్తున్న భార్యాభర్తలు ఎలక్షన్ డ్యూటీలో వెళ్లిన సమయంలో చోరీ జరిగినట్లు తెలుస్తుంది. గుర్తుతెలియని వ్యక్తి ఇంట్లోకి చొరబడే ముందు సిసి కెమెరాలో దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. బాధితుల ఫిర్యాదు మేరకు వేములవాడ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేయగా, క్లూస్ టీం రంగంలోకి ఆధారాలు సేకరిస్తుండగా, దొంగ తెలివిగా తన చేతికి గ్లౌజులు వేసుకోవడంతో వేలిముద్రలు సేకరించడంలో కష్టతరంగా మారింది.
నేటి నుంచి ఎనిమిదవ తేదీ వరకు మావోయిస్టు 23వPLGO వారోత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో. తెలంగాణ -చత్తీస్గడ్ రాష్ట్ర సరిహద్దులోని దండకారణ్య ప్రాంతంలో హై అలర్ట్. వెంకటాపురం ఏజెన్సీని జల్లెడ పడుతున్న పోలీసు బలగాలు. ఏజెన్సీలో ఉనికిని చాటుకోవడం కోసం మావోయిస్టులు, సమర్థవంతంగా తిప్పుకుంటే ప్రయత్నంలో పోలీసులు. అటవీ ప్రాంత గిరిజన గ్రామాలపై డ్రోన్ కెమెరా, హెలికాప్టర్లతో, నిఘ వ్యవస్థను పటిష్టం చేసిన పోలీసులు. గోదావరి తీర ప్రాంతం పై డేగ కన్ను వేసిన పోలీసులు. వెంకటాపురం-వాజేడు, భద్రాచలం -వెంకటాపురం రహదారులపై వాహనాలను తనిఖీ చేస్తూ, అనుమానితుల వద్ద వివరాలు సేకరిస్తూ, గ్రామాలకు కొత్త వ్యక్తులు గాని అపరిచిత వ్యక్తులుగా కనపడితే పోలీసులకు సమాచారం తెలపాలని ప్రజలకు సూచిస్తున్నారు పోలీసులు.
గజపతినగరం జాతీయ రహదారి పక్కనే నిర్మాణంలో ఉన్న భవనంపై విద్యుత్ షాక్ తో వ్యక్తి మృతి చెందాడు. మృతి చెందిన వ్యక్తి విశాఖ జిల్లా పద్మనాభం మండలం కృష్ణాపురం గ్రామానికి చెందిన రామస్వామి (45) గా గుర్తింపు.. పద్మభనాభం మండలం నుండి ఇటుకలు వ్యాను తీసుకొని గజపతినగరం వచ్చిన రామస్వామి… ఇటుకలు అన్ లోడ్ చేసిన అనంతరం మూడవ అంతస్థు పైకి ఎక్కడం తో సమీపంలో గల 11 కేవి విద్యుత్ తీగలు తగిలి మృతి చెందాడు.
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ఆదివారానికి తుపాను గా మారి కృష్ణా జిల్లా మచిలీపట్నానికి సమీపంలోనే తీరాన్ని దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో కేంద్ర హోంశాఖ కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబ.. ఏపీ సీఎస్ జవహర్ రెడ్డితో సమీక్ష నిర్వహించారు. ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఏపీ, తమిళనాడు, ఒడిశా, పుదుచ్చేరి సీఎస్‌లు, డీజీపీలతో కేంద్ర కేబినెట్ కార్యదర్శి సమీక్షించారు. రాగల రెండు మూడు రోజుల్లో దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నట్టు వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసిందని సీఎస్ వివరించారు. తీరప్రాంతాల్లో 100 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు కూడా వీచే అవకాశముందని తెలిపారు. మత్స్యకారులెవరూ సముద్రంలో చేపలవేటకు వెళ్లొద్దని హెచ్చరించారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను కూడా సన్నద్ధం చేసినట్లు తెలిపారు. తూర్పు నౌకాదళ కమాండ్ కూడా అత్యవసర సామగ్రి, నౌకలతో సిద్ధంగా ఉన్నట్టు వివరించారు.
పర్యావరణ మార్పులను ఎదుర్కొనేందుకు అభివృద్ధి చెందుతున్న దేశాలకు.. సంపన్న దేశాలు తమ సాంకేతికతను బదిలీ చేయాలని ప్రధాని మోదీ కోరారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని దుబాయ్ వేదికగా జరుగుతున్నకాప్-28 ప్రపంచ వాతావరణ సదస్సులో ప్రధాని మోదీ పాల్గొన్నారు. పర్యావరణ మార్పులను ఎదుర్కోనేందుకు ఐక్యరాజ్య సమితి నిర్దేశించిన విధానాలకు భారత్ కట్టుబడి ఉందన్నారు. అందుకే.. 2028లో ఈ కాప్-33 సదస్సును భారత్‌లో నిర్వహించాలని ఈ వేదిక మీద ప్రతిపాదిస్తున్నా అని ప్రధాని తెలిపారు. ఈ సందర్భంగా ప్రజల భాగస్వామ్యంతో కర్బన ఉద్గారాలను తగ్గించే గ్రీన్ క్రెడిట్ ఇనిషియేటివ్ ప్రోగ్రామ్ గురించి ప్రస్తావించారు. తక్కువ జనాభా కలిగిన దేశాలతో పోలిస్తే భారత్‌లో కర్బన ఉద్గారాల స్థాయి చాలా తక్కువ. ప్రపంచ జనాభాలో 17శాతం భారత జనాభానే. కానీ, కర్బన ఉద్గారాల్లో మా దేశ వాటా కేవలం 4శాతమే అని మోదీ ఈ సందర్భంగా వెల్లడించారు.
చేవెళ్ల మండలంలో పులి సంచారం చేస్తుండటంతో ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. రంగారెడ్ది జిల్లా చేవెళ్ల నియోజకవర్గం లోని ఊరెల్లా మొండి వాగు మరియు కొత్తపల్లి పరిసర ప్రాంతాలలో పులి సంచరించడాన్ని అయ్యప్ప స్వాములు చూశారు. దీంతో పులి అడుగులను పరిశీలించిన గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ముడిమ్యాల ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ప్రతిమకు గ్రామాల్లో పులి తిరుగుతున్నట్లు తెలిపారు. గత నెలలో వికారాబాద్ అనంతగిరి అడవుల్లో సంచరించిన పులి…ఇక్కడ కూడా తిరుగుతున్నట్లు అటవీ శాఖ అధికారులు భావిస్తున్నారు. సాధ్యమైనంత త్వరగా పులిని పట్టుకుంటామని ఫారెస్ట్ అధికారులు తెలిపారు.
అసెంబ్లీలో తీర్మానించి పంపిన బిల్లులకు తమిళనాడు గవర్నర్ ఆమోద ముద్ర వేయకపోవడంపై ప్రతిష్టంభన కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో సమస్య పరిష్కారానికిగానూ సీఎం ఎంకే స్టాలిన్‌తో సమావేశం నిర్వహించాలని గవర్నర్ ఆర్ఎన్ రవిని సుప్రీం కోర్టు కోరింది. అసెంబ్లీ రెండోసారి ఆమోదించిన బిల్లులను రాష్ట్రపతి పరిశీలనకు గవర్నర్ పంపలేదని స్పష్టం చేసింది. అసెంబ్లీ తీర్మానించిన బిల్లులను గవర్నర్ ఉద్దేశపూర్వకంగానే ఆమోదించడం లేదంటూ తమిళనాడు ప్రభుత్వం సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. సీఎంను గవర్నర్ ఆహ్వానించి.. సమస్య పరిష్కారానికి చర్చలు జరుపుతారని ఆశిస్తున్నాం అని ధర్మాసనం పేర్కొంది.





Total views : 90577