విజయవాడ, బుద్ధ వెంకన్న, టిడిపి ఉత్తరాంధ్ర ఇంఛార్జ్. కొడాలి నాని గుడివాడ పిచ్చికుక్క. కొడాలి నానికి రేబీస్ ఇంజెక్షన్లు చేయించాలి అని చాలా సార్లు చెప్పాను. జనవరి 18న ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా చంద్రబాబు గుడివాడలో సభ పెడుతున్నారు. ఊరంతా తిరుగుతానని అంటున్నాడు కొడాలి నాని.. ఏం చేస్తాడో అని ఇంజెక్షన్లు కొన్నాను. నా సొంత డబ్బులతో 5 రేబీస్ ఇంజెక్షన్లు కొని గుడివాడ పార్శిల్ చేస్తున్నా. జనాల సేఫ్టీ కోసం ఇంజెక్షన్లు కొన్నాను. కొడాలి నాని రెండు కాళ్ళూ విరగొట్టి పొయ్యిలో పెడతా చంద్రబాబు ను తిడితే. కొడాలి నానికి ఇంజెక్షన్లు చేయించాలని గుడివాడ ప్రజలకు విజ్ఞప్తి. తెలంగాణ ఉద్యమ సారధి నేను. కనకదుర్గమ్మ ఫ్లైఓవర్ దీక్షలు పూనింది నేను. కేశినేని నాని ఆఫీసు బోర్డులపై బుద్ధ వెంకన్న కామెంట్లు కనకదుర్గమ్మ ఫ్లైఓవర్ పేటెంట్ రైట్స్ నావి, చంద్రబాబు వి. కనకదుర్గ ఫ్లైఓవర్ మేమే పెట్టామని బోర్డులు పెట్టుకుంటే అదంతా అభూతకల్పన. మరో నలుగురైదుగురికి రేబిస్ ఇంజెక్షన్లు పంపాలి. డబ్బులు టైట్ గా ఉన్నాయి చూసుకుని పంపిస్తా. ఉషశ్రీ, శంకరనాయక్, కాపు రామచంద్రారెడ్డి, పార్థసారథి లాంటి బలహీన వర్గాలనే టార్గెట్ చేస్తున్నారు. బలహీన వర్గాలు చంద్రబాబు కు కొమ్ము కాస్తున్నారని టార్గెట్. బిసి బస్సు యాత్రలో మొత్తం రెడ్లే. I am BC… చంద్రబాబు కు బిసిలు కమిట్మెంట్ గా ఉంటారు.
devotional news
విజయవాడ, కేశినేని భవన్ రూపురేఖలు పూర్తిగా మార్పు. నిన్నటివరకూ చంద్రబాబు, కెసినేని నాని, కేశినేని శ్వేత ఫ్లెక్సీ లతో పసుపుమయంగా ఉన్న ఎంపీ ఆఫీస్. పూర్తిగా పసుపు ఫ్లెక్సీలు తొలగింపు. పార్టీలతో సంబంధం లేకుండా ఐ లవ్ విజయవాడ టైటిల్ తో ఫ్లెక్సీలు ఏర్పాటు. బెజవాడ లో నిర్మించిన మూడు ఫ్లై ఓవర్ ల ఫోటోలతో కూడిన ఫ్లెక్సీ ల ఏర్పాటు. ఎన్టీఆర్ ఫోటో తో పాటు కేశినేని నాని, శ్వేత ఫోటోలు మాత్రమే ఉండేలా ఫ్లెక్సీల ఏర్పాటు.
కేంద్రం నూతన చట్టానికి నిరసన సెగ. కేంద్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన భారత న్యాయ సంహిత చట్టానికి వ్యతిరేకంగా నిర్మల్ జిల్లా భైంసా డిపో పరిధిలో నిలిచిపోయిన ఆర్టీసీ అద్దె బస్సులు. డిపో పరిధిలో అద్దె బస్సులను నిలిపివేసి ప్రైవేటు బస్ డ్రైవర్లు ఆందోళనకు దిగారు. కొత్త చట్టంలో హిట్ అండ్ రన్ కేసులో శిక్ష పెంపును వ్యతిరేకిస్తూ దేశంలోని వివిధ ప్రాంతాల్లో నిరసన చేపట్టారు. పాత చట్టం ప్రకారం హిట్ అండ్ రన్ కేసులో దోషిగా తేలితే రెండేళ్ల జైలు శిక్ష విధించేవారు. నూతనంగా తీసుకొచ్చిన భారత న్యాయ సంహిత చట్టంలో పదేళ్లు జైలు శిక్ష, రూ.ఏడు లక్షలు జరిమానా విధించేలా మార్పులు చేశారు.
జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని గడి బురుజు వద్ద గల సూపియాన్ కట్టే మిషన్ లో భారీ అగ్ని ప్రమాదం సంబవించింది. తెల్లవారుజామున ప్రమాదవశాత్తు ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. దుకాణంలో కర్రలు పెద్ద ఎత్తున నిలువ ఉండడంతో మంటలు ఒక్కసారిగా చెలరేగాయి. జనావాసాల మధ్యనే కట్టే మిషన్ దుకాణం ఉండడంతో ఎగిసిపడుతున్న మంటలను చూసి చుట్టుపక్కల ప్రజలు ఆందోళనకు గురయ్యారు. గమనించిన స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. హుటాహుటిన అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. అప్పటివరకు ఎగిసిపడిన మంటలు కాస్త తగ్గడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదానికి కారణాలు తెలియాల్సి ఉంది .కాలిపోయిన కర్ర విలువ సుమారు కోటి రూపాయల వరకు ఉంటుందని స్థానికులు అంటున్నారు.
విజయనగరం జిల్లా, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు జిల్లా పర్యటన. బొబ్బిలి వేదికగా బహిరంగ సభ. తెలుగు తమ్ముళ్లలో నూతనుత్తేజం కనిపిస్తోంది. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఈరోజు జిల్లాకు రానున్నారు. బొబ్బిలిలోని రాజా కాలేజి మైదానంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ఆయన పాల్గొననున్నారు. ఇందుకు ఆ పార్టీ నాయకులు భారీ ఏర్పాట్లు చేశారు. తెలుగు తమ్ముళ్లను భారీగా తరలించేందుకు పార్టీ నాయకులు సన్నాహాలు చేశారు. ఇప్పటికే గ్రామ స్థాయిలో ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేసుకున్నారు. ఎన్నికల వాతావరణం దగ్గరపడడంతో ప్రచారం ముమ్మరం చేయనున్నారు. ఇందులో భాగంగానే ‘రా… కదిలి రా’ అనే కార్యక్రమంలో భాగంగా అధినేత చంద్రబాబు మరోసారి జిల్లాకు వస్తున్నారు. ఇటీవలే భోగాపురం మండలం పోలిపల్లిలో నిర్వహించిన యువగళం విజయోత్సవ సభకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో కలిసి ఎన్నికల శంఖారావం పూరించారు. ఈసారి బొబ్బిలి వేదికగా విజయనగరం – పార్వతీపురం మన్యం జిల్లాల కేడర్‌కు బాబు దిశానిర్థేశం చేయనున్నారు. బొబ్బిలి కేంద్రం ఈ రెండు జిల్లాలకు సమాంతర దూరంలోనూ, పార్టీకి కాస్త బలమైన నియోజకవర్గంగాను గుర్తించిన పార్టీ ఇక్కడ సభ నిర్వహించేందుకు నిర్ణయించినట్టుగా టిడిపి నాయకులు చెబుతున్నారు. బాబు వరుస పర్యటనలతో టిడిపి నాయకులు, కార్యకర్తలు, అభిమానుల్లో జోష్ కనిపిస్తోంది. విజయనగరం, బొబ్బిలి, రాజాం, చీపురుపల్లి నియోజకవర్గాల్లో సీట్ల కేటాయింపునకు సంబంధించి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. గజపతినగరం, నెల్లిమర్ల, ఎస్.కోట నియోజకవర్గాల టికెట్ల పై కూడా కసరత్తు ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలో ఆయా నియోజకవర్గాల్లోని ఆశావహులు తమ వంతు ప్రయత్నాలు చేసుకుంటున్నారు. బహిరంగ సభకు వస్తున్న నేపథ్యంలో బాబు దృష్టిలో పడేందుకు కూడా తహతహలాడుతున్నారు. గత నెల 20న పోలిపల్లి బహిరంగ సభ మాదిరిగానే దారిపొడవునా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. నేడు జరగనున్న బహిరంగ సభల్లో కేడర్‌ను ఎన్నికలకు సమాయత్తం చేయడం, వైసిపిలోనూ, ప్రభుత్వంలోనూ లోపాలను, వైసిపి ప్రభుత్వం చేపడుతున్న ప్రజా వ్యతిరేక విధానాలను, అమలుకాని హామీలను ఎత్తి చూపడమే బాబు ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది.
బుధవారం ఉదయం 10.15గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్టులో బయలుదేరి, 11గంటలకు విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి బొబ్బిలి రాజా కాలేజీ మైదానానికి 11.40గంటలకు చేరుకుంటారు. 12గంటలకు సభ ప్రారంభమై 1.30గంటలకు ముగుస్తుంది. అనంతరం 2.30గంటలకు తిరుగు ప్రయాణమవుతారు. మిగిలిన గంట వ్యవధిలో పార్టీ కీలక నాయకులు, కార్యకర్తలతో జిల్లాలోని రాజకీయ పరిస్థితులపై చర్చించే అవకాశం ఉంది. బహిరంగ సభ ఏర్పాట్లును మంగళవారం టిడిపి నాయకులు కిమిడి కళా వెంకటరావు, మాజీ మంత్రి సుజరుకృష్ణరంగారావు, నియోజకవర్గ ఇన్చార్జి బేబినాయన, కూన రవికుమార్ తదితరులు పరిశీలించారు..
కృష్ణాజిల్లా కూచిపూడి అనగానే తెలుగువారికి ప్రత్యేకమైన నృత్యం గుర్తుకువస్తుంది. ఆ కూచిపూడికి సమీపంలో ఉన్న మొవ్వ పేరు వినగానే వేణుగోపాలుడు మదిలో నిలుస్తాడు. మొవ్వలో ఉన్న వేణుగోపాలుని ఆలయం ఈనాటిది కాదు. ఆ స్వామి మహత్యమూ సామాన్యమైనది కాదు. ఒకప్పుడు మౌద్గల్యుడు అనే గొప్ప రుషి ఉండేవారు. ఆయన మొవ్వకి సమీపంలో ఉన్న కృష్ణానదీ తీరంలో ఘోర తపస్సు చేసుకోసాగారు. ఒక రోజు ఆ మహర్షికి నదీతీరంలో వేణుగోపాలస్వామి విగ్రహం దొరికింది. ఆ విగ్రహాన్ని స్వామివారి అనుగ్రహంగా భావించారు మౌద్గల మహర్షి. దానిని స్వామి ప్రతిరూపంగా తలచి నిత్యం పూజించేవారు. క్రమేపీ మౌద్గల్య మహర్షి కొలిచిన ఆ విగ్రహం చుట్టూ ఒక ఆలయం రూపొందింది. వేణుగోపాల స్వామి విగ్రహం చాలా ప్రత్యేకమైనదని చెబుతారు. స్వామి వెనుక వున్న మకరతోరణం పై దశావతారాలు ఉన్నాయి. స్వామి ప్రక్కన రుక్మిణీ సత్యభామలు కూడా దర్శనమిస్తారు. చేతిలో వేణువుకు గాలి వూదే రంధ్రాలు కూడా స్పష్టంగా కనబడతాయి. ఈ విగ్రహం ఇసుక నుంచి ఉద్భవించింది కావడంతో కాలక్రమంలో కొంచెం దెబ్బతిన్నది. ఆ కారణంగా 2000 సంవత్సరంలో స్వామివారి విగ్రహాన్ని పోలిన మరో విగ్రహాన్ని రూపొందించి ప్రతిష్టంచారు. అయినా ఇప్పటికీ పాత విగ్రహాన్ని మనం ఆలయం వెనుక ఉన్న గదిలో చూడవచ్చు. ఆలయ ప్రాంగణంలో ఆంజనేయ స్వామి వారి ఉపాలయం కూడా ఉంది. స్వామివారి కుడిచేతిలో ఖడ్గం, ఎడమచేతిలో సంజీవని ఉంటాయి. ఒకపక్క కోరుకున్న వరాలను అందిస్తూనే, మరోపక్క దుష్టులను శిక్షిస్తాడనేందుకు సూచనగా స్వామివారి చేతులలో ఖడ్గమూ, సంజీవనీ రెండూ కనిపిస్తాయి. మువ్వ పేరు వినగానే వేణుగోపాల స్వామి ఆలయమే కాదు, ఆ స్వామి మహత్తుతో అద్భుతమైన పద్యాలు రాసిన క్షేత్రయ్య కూడా గుర్తుకు వస్తాడు. క్షేత్రయ్య పెద్ద పండితుడు మీ కాదు. ఆ మాటకు వస్తే అతను అక్షరాలు కూడా రాని ఒక గోవుల కాపరి. కానీ నిత్యం మొవ్వ గోపాలుని సేవించుకునేవాడు. వరదయ్య భక్తికి మెచ్చిన ఆ వేణుగోపాలుడు, అతని నాలుక మీద బీజాక్షరాలు రాశారు. దీంతో వరదయ్య స్వామి వారి మీద గీతాలు రచించేంత జ్ఞానిగా మారాడు. తనని తాను గోపికగా భావిస్తూ రసభక్తితో పదాలు సృష్టించాడు. ఆ పదాలు పాడుతూ అనేక క్షేత్రాలు తిరిగేవాడు. అలా ఆయనకు క్షేత్రయ్య అని పేరు స్థిరపడిపోయింది. మొవ్వ వేణుగోపాలుడు దర్శిస్తే ఎవరి జీవితమైనా తరించిపోతుంది.
అమరావతి, ఈనెల 11న వైసీపీ తీర్థం పుచ్చుకోవటానికి రంగం సిద్ధం చేసుకున్న కేసినేని నాని. తనతో పాటు మరో 5 అసెంబ్లీ సీట్లు కోరిన నాని. విజయవాడ తూర్పు నుండి తన కూతురు కేసినేని శ్వేతకు. విజయవాడ పశ్చిమ నుండి ఎంఎస్ బేగ్, నందిగామ నుండి కన్నెగంటి జీవరత్నం, తిరువూరు నుండి నల్లగట్ల స్వామి దాసుకు, మైలవరం నుండి బొమ్మసాని సుబ్బారావుకు ఇవ్వమని అడిగిన నాని. తనకు ఎంపీ పదవి తోపాటు రెండు సీట్లు మాత్రమే వాగ్దానం చేసిన అధిష్టానం.
కాకినాడ, ఆ అమ్మను తలుచుకోగానే పలికి వరాలిస్తుంది. అందుకే తలుపులమ్మ అని పిలుచుకున్నారు. ఈ అమ్మవారు కాకినాడ జిల్లా తుని మండలం లోవలో కొలువుదీరారు. తలుచుకోగానే ఆమె ఇంటికి వచ్చేది. ఓ రోజు పశువుల కాపరులకు కనిపించి తాను కొండ పై ఉన్న లోయలో విగ్రహ రూపంలో ఉన్నానని ప్రతిష్టించి పూజలు చేయాలని సూచించింది. వేల సంవత్సరాల ఆధ్యాత్మిక చరిత్ర గలిగిన ఆ ఆలయమే తలుపులమ్మ లోయ. కాలక్రమేణా తలుపులమ్మ లోవగా మారింది. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశం నలుమూలల నుంచి భక్తులు వస్తారు. కోరిన కోరికలు నెరవేర్చే తల్లిగా పేరుపొందారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఈ ఆలయానికి ఎస్కలేటర్ సౌకర్యంతో పాటు ఆధునిక వసతుల కోసం 14 కోట్ల రూపాయలు వెచ్చించి భక్తుల కోసం బహుళ అంతస్తుల భవనాలు, సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఆలయంలో పనిచేయడం తన పూర్వజన్మ సుకృతం అని చెబుతున్న తలుపులమ్మ లోవ కార్యనిర్వహణాధికారి పెన్మత్స విశ్వనాథరాజు.
విజయవాడ, ఏపీలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల నిర్వహణ పై రెండో రోజు కేంద్ర ఎన్నికల సంఘం సమీక్ష. నిన్న గుర్తింపు పొందిన పార్టీల నుండి వినతుల స్వీకరణ చేపట్టిన సీఈసీ రాజీవ్ కుమార్. విడతలవారీగా కలెక్టర్లు, ఎస్పీలు , ఉన్నతాధికారులతో సమావేశం ఏర్పాటు చేసిన కేంద్ర ఎన్నికల సంఘం. ఎన్నికల సన్నద్దత పై అధికారులకు దిశానిర్దేశం చేసిన సీఈసీ. నేడు పార్టీలు ఇచ్చిన వినతులు, ఫిర్యాదుల పై, ఎన్నికలకు అధికార యంత్రాంగం ఉన్నతస్దాయి చర్చ జరుపనున్న కేంద్ర ఎన్నికల సంఘం బృందం.