ప. గో. జిల్లా, పెనుగొండ జగన్నన్న కాలనీలో ఒక కుటుంబం పై మరొక కుటుంబ సభ్యుల దాడి. పక్కింటి నుంచి పొగ వస్తుందనే కారణంతో తల్లీ కొడుకులపై నలుగురు దాడి. విచక్షణ రహితంగా సుత్తి తో దాడి చేయడంతో తల్లి కొడుకులకు తీవ్ర గాయాలు. ఇరు కుటుంబాలు పరస్పర దాడి కి దిగటం తో పరిస్థితి తీవ్రంగా మారింది. తల్లీ కొడుకులు ని చికిత్స నిమిత్తం ఆసుపత్రి కి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులకు పిర్యాదు చేసిన బాధితులు.
devotional news
కాకినాడ జిల్లా జగ్గంపేట, ముద్రగడ పద్మనాభం నివాసం వద్ద రాత్రి జనసేన నాయకుల సందడి. జనసేన లేబుల్ తో ఉన్న కార్లు ముద్రగడ ఇంటికి రావడంతో నియోజకవర్గంలో తీవ్ర చర్చ. ముద్రగడను కలిసిన వారిలో బొలిశెట్టి శ్రీనివాస్ తాడేపల్లిగూడెం జనసేన పార్టీ ఇంచార్జ్, కలవలపల్లి తాతాజీ కాపు జేఏసీ నాయకుడు. మర్యాదపూర్వకంగా ముద్రగాడని కలిశామంటున్న జనసేన నేతలు. ఒకటి రెండు రోజుల్లో జనసేన ముఖ్య నేతలు ముద్రగాడను కలుస్తారని సమాచారం. ఇంకా ఏ పార్టీ చేరుతున్నది క్లారిటీ ఇవ్వని ముద్రగడ కుటుంబం.
మున్సిపాలిటీల్లో అవిశ్వాస బలా బలాల సమయం ఆసన్నమైంది. నేడు మంచిర్యాల మున్సిపాలిటీ లో అవిశ్వస తీర్మానం. రేపు బెల్లంపల్లి మున్సిపాలిటీ లో అవిశ్వాస తీర్మానం. నిర్మల్ మున్సిపాలిటీలో న్యాయస్థానం నుండి స్టే తీసుకురావడం తో పులిస్టాప్ పడింది. మంచిర్యాల మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్లపై గురువారం అవిశ్వాస తీర్మాన సమావేశం నిర్వహణకు కలెక్టర్ నోటీసులు జారీ చేశారు. మున్సిపాల్టీలో 36వార్డులు ఉన్నాయి. 26మంది బీఆర్ఎస్, తొమ్మిది మంది కాంగ్రెస్, ఒకరు బీజేపీ కౌన్సిలర్లు ఉండగా. బీఆర్ఎస్ కు చెందిన 17మంది కౌన్సిలర్ల చేరిక తో కాంగ్రెస్ పార్టీ సభ్యుల బలం 26కు చేరింది. చైర్మన్, వైస్ చైర్మన్లపై అవిశ్వాసాన్ని ప్రతిపాదిస్తూ హైదరాబాద్ సమీపంలోని శిబిరానికి వెళ్లిన కౌన్సిలర్లు గురువారం నేరుగా మున్సిపల్ కార్యాలయంలో జరిగే సమావేశానికి హాజరు కానున్నారు.
దుష్టశిక్షణ, శిష్ట రక్షణ, ధర్మసంస్థాపన ల కోసం పందొమ్మిదవ శతాబ్దంలో ఈ భువిపై వెలసిన సమర్థ సద్గురువు శ్రీ సాయినాధుడు. తనను మనస్ఫూర్తిగా విశ్వసించి తన భక్తులకు ఎల్లవేళలా వెన్నంటి వుండి వారికి తన అమూల్యమైన, అభేద్యమైన రక్షణ కవచం అందించడమే కాక, తన బోధనలతో, ఉపదేశములతో వారిలో పరివర్తన గావించి, సన్మార్గంలో నడిపించే అద్భుతమైన దైవం శ్రీ సాయి. శ్రీ సాయిని నమ్మిన లక్షలాది మంది ఈనాటికీ సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవిస్తున్నారు. శ్రీ సాయి తన భక్తులను రక్షించి, వారి సమస్యలను, చింతలను, దూరం చేసే పద్ధతి చాలా విచిత్రమైనది. ఆది ఏ సంప్రదాయాలకు, మతాలకు చెందినది. అటువంటి ఒక విచిత్రమైన లీలలను ఇప్పుడు స్మరించుకుందాం.
శ్రీ సాయికి అత్యంత సన్నిహిత , ముఖ్యమైన భక్తుడైన బాపూసాహెబ్ బూటీ ఒకసారి జిగట ఇరోచనముల వలన తీవ్రంగా బాధపడ్డాడు. స్వతహాగా ధనవంతుడవడం వలన ఎందరో ప్రసిద్ధులైన డాక్టరుకు చూపించుకొని వారిచ్చే మందులను వాడాడు కానీ ఏమీ ప్రయోజనం లేకపోయింది. కొద్ది రోజులలోనే బ్యూటీ బాగా నీరసించిపోయాడు. కదల లేకపోవడం వలన శ్రీ సాయి దర్శనానికి మశీదుకు పోలేకపోయాడు. అప్పుడు బాబా అతనిని మశీదుకు రమ్మని కబురు పంపించి, బూటీ రాగానే తన ముందు కూర్చోబెట్టుకొని తన చూపుడు వేలు ఆడించుచూ“ తస్మాత్ జాగ్రత్త ! నీవిక విరేచనము చేయకూడదు“ అని దృఢంగా పలికారు. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు రాజాధి రాజు అయిన బాబా ఆ మాటలను అనగానే వెంటనే విరేచనాలు ఆగిపోయాయి. గొప్ప గొప్ప డాక్టర్లు, విలువైన మందులు కుదర్చలేని జబ్బును ఆ మహానుభావుడు కేవలం తన మాటలతో కుదిర్చిన వైనం అత్యంత విశిష్టమైనది.
మరొక సందర్భంలో బూటీకి కలరా వ్యాధి సోకింది. ఒక రోజులో తీవ్రంగా నీరసించిపోయాడు.ఏ విధమైన ఆహారాన్ని, కనీసం నీరును కూడా తాగలేకపోయాడు. బూటీకి సన్నిహితుడు డాక్టర్ పిళ్లై తన వద్ద వున్న ఔషధముల నింటినీ ప్రయత్నించాడు. కానీ ఇది కొద్దిపాటి ఉపశమనాన్ని కూడా ఇవ్వలేకపోయారు. అప్పుడు బూటీ మశీదుకు వెళ్ళి బాబా కాళ్ళపై పడి తన వ్యాధిని తగ్గించమని ప్రాధేయపడ్దాడు. అప్పుడు శ్రీ సాయి బాదాముపప్పు, పిస్తా,అక్రోటు లను బాగా నానబెట్టి, పాలు, చక్కెరలో ఉడికించి సేవించమని చెప్పారు. ఆ మాటలను విన్న వారందరూ ఎంతగానో ఆశ్చర్యపోయారు. ఎందుకంటే వైద్య శాస్త్రం ప్రకారం ఈ మిశ్రమాన్ని సేవిస్తే జబ్బు మరింత తీవ్రమై చివరకు ప్రాణాలకే ముప్పు కలుగవచ్చును. కానీ బూటీ బాబా ఆజ్ఞను శిరసావహించి ఆ మిశ్రమాన్ని సేవించాడు. చిత్రాతిచిత్రంగా బ్యూటీ యొక్క కలరా వ్యాధి కొద్ది గంటలలోనే తగ్గిపోయి అతనికి పూర్తి స్వస్థత చేకూరింది.
ఈ విధంగా వైద్య విజ్ఞాన శాస్త్రాలు అన్నింటికీ విరుద్ధంగా బాబా తనదైన ప్రత్యేక శైలిలో తన భక్తుల రోగాలను తగ్గించి వేశారు. ఇందులో మనం గ్రహించవలసింది ఏమిటంటే బాబా మాటలే ఈ ప్రకృతి అంతటికి శిరోధార్యం. బాబా పలుకులే వేద, విజ్ఞాన శాస్త్రాలు. సాంప్రదాయములు, ఆచార వ్యవహారములు, మంత్ర శక్తులు, వైద్య విధానాలు అన్నీ బాబా యొక్క అపూర్వమైన యోగ శక్తి ముందు దిగదుడుపే!బాబా ఆజ్ఞను శిరసా వహించి వారికి ఆయన యొక్క అనుగ్రహ,కరుణా కటాక్షములు లభ్యమై జీవితం ఆనందంగా, సాఫీగా సాగిపోతుంది.
Read Also..
Read Also..
పెళ్లి చేసుకుంటానంటూ యువతిని నమ్మించాడు. శారీరకంగా లోబర్చుకొని ఎనిమిదేళ్లుగా చిత్రహింసలకు గురిచేస్తున్నాడు. తాజాగా మరో యువతితో సంబంధం పెట్టుకున్న ఆ యువకుడిని జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించారు. పోలీసుల కథనం ప్రకారం కోదాడకు చెందిన గంగినేని గణేశ్ (27) పదేళ్ల కిందట నగరానికి వచ్చి యూసుఫ్‌గూడలో ఉంటున్నాడు. ఎనిమిదేళ్ల కిందట అతడికి ఓ యువతి పరిచయమైంది. ప్రేమిస్తున్నానని ఆమెను నమ్మించి సన్నిహితంగా మెలిగిన గణేశ్. ఆమెను గదికి తీసుకెళ్లి శారీరకంగా లోబర్చుకున్నాడు. ఆమె వద్ద నుంచి డబ్బులు తీసుకొని జల్సాలు చేశాడు. బాధిత యువతిని పెళ్లి చేసుకుంటానని, ఉద్యోగం వచ్చిన తర్వాత తీసుకున్న డబ్బులు తిరిగి ఇస్తానంటూ నమ్మించాడు. అతడి మాటలు నమ్మిన యువతి సర్వస్వం అర్పించింది. ఆమె గర్భం దాల్చగా మూడుసార్లు అబార్షన్ చేయించాడు. ఇదిలా ఉండగా వరంగల్‌కు చెందిన మరో యువతితో సుమారు ఏడేళ్లుగా గణేశ్ శారీరక సంబంధం కలిగి ఉన్నట్లు ఇటీవల బాధితురాలికి తెలిసింది. ఈ విషయం పై నిలదీసేందుకు ఈనెల 8న అతడి గదికి వెళ్లింది. అలాంటిదేమీ లేదని, పెళ్లి చేసుకుందామంటూ గణపతి కాంప్లెక్స్ వద్దకు తీసుకొచ్చి స్నేహితులతో కలిసి దాడికి పాల్పడ్డాడు. ఆమె ఫోన్ పగలగొట్టారు. ఈ ఘటనపై బాధితురాలు రెండురోజుల కిందట జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా. కేసు నమోదు చేశారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా. నేరం అంగీకరించాడు. అయితే, ఆమెను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని తేల్చి చెప్పాడు. బాధితురాలు బుధవారం మరో ఫిర్యాదును జూబ్లీహిల్స్ పోలీసులకు ఇచ్చింది. దీంతో గణేశ్‌తో పాటు ఇతర నిందితులపై పోలీసులు కేసు నమోదు చేసి, ప్రధాన నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
అనధికార లావాదేవీల ద్వారా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సనత్ నగర్ శాఖ మేనేజర్ గా పని చేసిన వ్యక్తి రూ.4.75 కోట్ల నిధుల స్వాహా. సనత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సనత్ నగర్ డివిజన్లో ఉన్న SBI బ్యాంకులో ఖాతాదారుల ఫిక్స్డ్ డిపాజిట్ డబ్బును ఖాతాదారులకు తెలియకుండా డ్రా చేసుకున్న బ్యాంక్ మేనేజర్ కార్తీక్ రాయ్. సుమారుగా 4.75 లక్షల రూపాయలు ఖాతాదారుల సొమ్ము కాజేసినట్లు పలువురు బాధితులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు. ఒక సాఫ్ట్వేర్ అమ్మాయి ఖాతాలోనే సుమారుగా 48 లక్షలు కాజేసినట్లు ఆ అమ్మాయి ఆరు నెలలుగా అడుగుతున్న ఇవ్వకపోవడంతో సనత్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసిన మహిళ. ఖాతాదారుల నగదును మాయం చేసిన బ్యాంక్ మేనేజర్ తో పోలీసులు విచారణ చేపట్టారు. లక్షలాది రూపాయలు ఖాతాదారుల డిపాజిట్ నుంచి విత్ డ్రా చేసుకున్న బ్యాంక్ మేనేజర్ పై చర్యలు తీసుకోవాలని పలువురు పోలీసులను ఆశ్రయించారు. బాధితుల ఫిర్యాదు మేరకు సనత్ నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు.
శ్రీ సత్య సాయి జిల్లా, ముగ్గురి పై పిచ్చి కుక్క దాడి. గోరంట్ల మండలం కనగానపల్లి లో ముగ్గురి పై పిచ్చి కుక్క దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డ సంఘటన చోటు చేసుకుంది. మండలంలోని కాగానపల్లి గ్రామంలో బుధవారం సాయంత్రం రెండేళ్ల ధనుష్ అనే బాలుడి పై పిచ్చి కుక్క కరుస్తుండగా అడ్డు వెళ్లినటువంటి అవ్వ బురగ గంగులమ్మ తో పాటు మనుమరాలు గౌతమి ( 11) పై కూడా దాడి చేయడంతో గంగులమ్మ తలకు తీవ్ర గాయాలయ్యాయి, దీంతో వెంటనే చుట్టు ప్రక్కల వారు పిచ్చి కుక్క ను తరిమివేసి, వెంటనే గాయపడిన వారిని గోరంట్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. డాక్టర్ వినోద్ కుమార్ ప్రథమ చికిత్సలు అనంతరం మెరుగైన వైద్యం కోసం హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
కాకినాడ, ముద్రగడ ను కలిసిన జనసేన నేత బొలిశెట్టి శ్రీనివాస్. పవన్ కళ్యాణ్ నాలుగు రోజుల క్రితం రాసిన లేఖ అంశాన్ని ముద్రగడ దగ్గర ప్రస్తావించిన బొలిశెట్టి. పవన్ రాసిన లేఖను స్వాగతిస్తున్నానని, కాపు జాతి కలిసి పని చేయాల్సిన అవసరం ఉందని చెప్పిన ముద్రగడ. పవన్ కళ్యాణ్ మా ఇంటికి వస్తే ఆహ్వానిస్తానని బొలిశెట్టి కి చెప్పిన ముద్రగడ. త్వరలో జనసేనలోకి ముద్రగడ చేరే అవకాశము.
మంచిర్యాల జిల్లా, మందమర్రి పట్టణం లోని ప్రవేట్ హై స్కూల్ లో ముందస్తు సంక్రాంతి సంబరాల సందర్భంగా విద్యార్థులకు మెహందీ (మైదాకు) పోటీలు నిర్వహించరు. 4 నుంచి 9వ తరగతి వరకు 74 మంది విద్యార్థులు ఈ పోటీలో పాల్గొన్నారు. ఈ పోటీలు ప్రైమరీ కోఆర్డినేటర్ శ్రీమతి ఫరీదా ఆధ్వర్యంలో జరిగాయి. ఇలాంటి మెహందీ పోటీలలో పాల్గొన్న విద్యార్ధినులు, తల్లి తండ్రులు ఆనందం వ్యక్తం చేసారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు చంద్రమోహన్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
తాడేపల్లి, సీఎం క్యాంపు కార్యాలయ ముట్టడికి విద్యార్థి సంఘాల పిలుపు. మెగా డిఎస్సి ఇవ్వలేదని తాడేపల్లి సీఎం క్యాంప్ కార్యాలయం ముట్టడి పిలుపు ఇచ్చిన విద్యార్థి సంఘాలు. విద్యార్థి సంఘాల పిలుపుతో సీఎం క్యాంప్ కార్యాలయానికి వెళ్లే అన్ని రోడ్డు మార్గాలలో భద్రత పెంపు వాహనాలను తనిఖీ చేస్తున్న పోలీసు సిబ్బంది.