అనంతపురం జిల్లా కుందుర్పి మండలం తెనగల్లు గ్రామంలో ఈరోజు సుమారు 12 గంటల ప్రాంతంలో ఇంట్లో షార్ట్ సర్క్యూట్ తో లీక్ అవుతున్నటువంటి గ్యాస్ తో ఇంట్లో ఉన్న రెండు సిలిండర్లు పేలి రెండు ఇల్లులు నేలమట్టం అయ్యాయి. సుమారు 6 మందికి గాయాలు అందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. ఈ సందర్భంగా గ్రామస్తులు ఫైర్ ఇంజన్ కు ఫోన్ చేయగా సకాలంలో ఫైర్ ఇంజన్ వచ్చి మంటలు ఆపడం జరిగింది. రెండిళ్ల నేలమట్టం కావడంతో ఆస్తి నష్టం జరిగినట్టు బాధితులు చెపుతున్నారు. ఈ సందర్భంగా గాయపడిన వారిని కళ్యాణదుర్గం ప్రభుత్వాసుపత్రికి తరలించడమైనది. ఇద్దరు పరిస్థితి విషమంగా ఉండడంతో అనంతపురంనకు రిఫర్ చేయడం జరిగింది. గ్రామంలో ఈ సంఘటన జరగడంతో ఒక్కసారిగా విషాదఛాయలు అలముకున్నాయి.
Tag:
gas cylinder blast
కాకినాడ జిల్లా యు.కొత్తపల్లి మండలంలోని ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ లీక్ అయి పేలుడు సంభవించింది. గ్రామ ఉపసర్పంచ్ మామిడి మల్లిబాబు నివాసంలో వంట చేస్తుండగా పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 14 ఏళ్ల శ్రావణి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. చిన్నబాబు అనే వ్యక్తి తీవ్రంగా గాయపడగా, మరో ఇద్దరు స్వల్పంగా గాయపడ్డారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పేలుడు భారీగా జరగడంతో ఇంట్లోని సామగ్రి ధ్వంసం కాగా, ఇల్లు పూర్తిగా దెబ్బతింది. పిఠాపురం సీఐ శ్రీనివాస్ సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.





Total views : 78690