దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో దూసుకుపోయాయి. నిన్నటి నష్టాలకు చెక్ పెట్టేశాయి. తొలుత నష్టాలతో మొదలైన సూచీలు ఇంట్రాడేలో బాగా కోలుకున్నాయి. ఒడిదుడుకులకు లోనయ్యాయి. మార్కెట్లు ముగిసే సమయానకి బాంబే స్టాక్ ఎక్స్ ఛేంజీ – బీఎస్ఈ సెన్సెక్స్ 689 పాయింట్ల లాభంతో 71,060 వద్ద ముగిసింది. దీంతో మరోసారి 71 వేల మార్కు అధిగమించినట్లయింది. నేషనల్ స్టాక్ ఎక్స్ ఛేంజీ – నిఫ్టీ కూడా లాభాల బాటలోనే సాగింది. 215 పాయింట్ల లాభంతో 21,453 వద్ద నిఫ్టీ పరుగు చాలించింది. బ్యాంక్ నిఫ్టీ 53 పాయింట్లు, ఫైనాన్స్ నిఫ్టీ 67 పాయింట్లు పైకి ఎగశాయి. నిఫ్టీలో హిండాల్కో, డాక్టర్ రెడ్డీస్, టాటా స్టీల్, పవర్ గ్రిడ్ కార్పొ, హెచ్.సి.ఎల్ షేర్లు అదరగొట్టాయి. సెన్సెక్స్ లో ఐ.ఎఫ్.సి.ఐ, బాంబే డయింగ్, హెచ్ఎఫ్సీఎల్, సౌత్ ఇండియన్ బ్యాంక్, మిశ్రధాతు నిగమ్ షేర్లు అత్యధిక లాభాలను ఆర్జించాయి.
international news
అధ్యక్ష ఎన్నికల రేసులో అత్యంత కీలకమైన రిపబ్లికన్ ప్రైమరీ ఎలక్షన్లో మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అత్యంత కీలక విజయం సాధించారు. న్యూ హాంప్‌షైర్ ప్రైమరీని ఆయన గెలిచారు. దీంతో రిపబ్లికన్ ప్రెసిడెన్షియల్ నామినేషన్‌ను ఖరారు చేసుకోవడానికి ఆయన చేరువయ్యారు. ఇక ఈ గెలుపుతో అధ్యక్షుడు జో బైడెన్‌తో సమానంగా ట్రంప్ నిలిచారు. అయితే రిపబ్లికన్ పార్టీలో ట్రంప్‌నకు ఏకైక పోటీదారుగా భావిస్తున్న నిక్కీ హేలీకి గట్టి ఎదురుదెబ్బ తగిలినట్టు తెలుస్తోంది. నిక్కీ హేలీ రేసు నుంచి తప్పుకునే స్థాయిలో ట్రంప్ విజయం సాధించారా లేదా అనేది తెలియాల్సి ఉంది. కౌంటింగ్ ఇంకా కొనసాగుతుండడంతో ఈ విషయంలో అస్పష్టత నెలకొంది. కాగా అధ్యక్షుడు జో బైడెన్‌ను ట్రంప్ మాత్రమే ఓడించగలరని రిపబ్లికన్లు భావిస్తున్నారు. అందుకే ఆయనకు మద్ధతు ఇస్తున్నారు. నిక్కీ హేలీ కూడా గతంలో ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అధ్యక్ష ఎన్నికల రేసులో తాను చాలా దూరంలో ఉన్నానని అన్నారు. అయితే న్యూ హాంప్‌షైర్ ప్రైమరీలో ఓటు అనుకూలంగా పడుతుందని ఆమె భావించారు. కానీ ప్రాథమిక సమాచారం ప్రకారం నిక్కీ హేలీ ఓటమి అంచున నిలిచారు. అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ట్రంప్‌పై రెండుసార్లు అభిశంసన తీర్మానాలు, ఆయనపై నాలుగు క్రిమినల్ కేసులో విచారణలో ఉన్నప్పటికీ రిపబ్లికన్లు ఆయనవైపే మొగ్గు చూపుతున్నారు.
శ్రీ సత్యసాయి జిల్లా, హిందూపురం పట్టణంలోని ముక్కిడి పేటలో గల మున్సిపల్ మెటీరియల్ రికవరీ ఫెసిలిటీ కేంద్రంలో మంటలు చెలరేగాయి. స్థానికులు గమనించి పోలీస్ స్టేషన్ కు తెలపడంతో ఫైర్ సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మంటల్ని ఆర్పడానికి ప్రయత్నించారు అయితే మంటలు పెరిగిపోవడంతో పూర్తిగా దగ్ధమైంది మున్సిపల్ అధికారులు పరిశీలించి పాతయంత్ర సామాగ్రి, రీసైక్లింగ్ అట్టపెట్టెలు రేకుల షెడ్డు మొత్తంగా 16 నుండి 18 లక్షల వరకు హిందూపురం మున్సిపాలిటీకి నష్టం వాటిల్లినట్లు తెలిపారు.
నల్లగొండ జిల్లా నకిరేకల్ లో గంజాయి విక్రయిస్తున్న ఐదుగురు యువకులను నకిరేకల్ పోలిసులు అదుపులోకి తీసుకోని అరెస్టు చేశారు. నకిరేకల్ కు చెందిన ముగ్గురు యువకులు గంజాయి విక్రయిస్తుండగా యాదాద్రి జిల్లా అడ్డ గూడూరు మండలం గట్టు సింగారం గ్రామానికి చెందిన మరో ఇద్దరు యువకులు కోనుగోలు చేస్తుండగా వారిని నకిరేకల్ పోలిసులు అదుపులోకి తీసుకుని వారి వద్ద ఉన్న గంజాయి మరియు సేవిస్తున్నా సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.
గత కొన్ని సంవత్సరాలుగా వీరు జల్సాలకు అలవాటు పడి గంజాయి మత్తుకు బానిసైతున్నారాని. నకిరేకల్ లో మాదకద్రవ్యాలు విక్రయించే స్థావరాలపై స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తామని నకిరేకల్ సిఐ రాజశేఖర్ తెలిపారు.
తొమ్మిదో తరగతి చదువుతున్న మైనర్ బాలుడిని ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న అమ్మాయిని ప్రేమిస్తున్నాడని అనుమానంతో అమ్మాయి అన్న అతని ఆరుగురు స్నేహితులు కలిసి మైనర్ బాలుడు మరియు అతని ఇద్దరు స్నేహితులను స్వగ్రామ మైన ముక్తాపూర్ వద్ద పొలం గట్ల మధ్య తీసుకెళ్లి విచక్షణారహితంగా కొట్టడంతో పాటు ఐరన్ రాడులను కాల్చి వాతలు పెట్టారు అర్ధరాత్రి ఐనా పిల్లలు రాలేదని తల్లిదండ్రులు వారికి ఫోన్ చేయడంతో సదరు మైనర్ బాలురను వదిలిపెట్టిన నిందితులు. దెబ్బలను గ్రహించిన తల్లిదండ్రులు మందలించడంతో బయటికి వచ్చిన పూర్తి వ్యవహారం తెలుసుకొని, తెల్లవారుజామున పోలీస్ స్టేషన్లో బాధితుడి తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి ఏడుగురు నిందితుల కోసం గాలిస్తున్న పోలీసులు ప్రస్తుతం చికిత్స పొందుతుండగా బాధితులు. నిందితులు పరారీలో ఉన్నట్టు తెలిపిన భూదాన్ పోచంపల్లి పోలీసులు.
గుంటూరు జిల్లా కు చెందిన రామినేని మహేష్ బాబు(32) ఉద్యోగం నిమిత్తం 8 నెలల క్రితం నగరానికి వలస వచ్చీ రామచంద్రపురం LIG కాలనీ లో నివాసం ఉంటున్నాడు. నగరం లోని ఓ కంపెనీ లో సాప్ట్ వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్న మహేష్ బాబు. పని నిమిత్తం మియాపూర్ కు స్కూటీ పై వెళ్తున్న మహేష్ బాబు ను వెనుక నుండి అతి వేగంగా వచ్చి డీ కొట్టిన డీసీఎం వాహనం. తీవ్ర రక్తస్రావం అయిన మహేష్ బాబు ను చికిత్స నిమిత్తం స్థానిక ప్రైవేట్ హాస్పిటల్ కు తరలింపు. అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించిన వైద్యులు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం గాంధీ హాస్పిటల్ కు తరలింపు. భార్య రత్నంబా ఇచ్చిన ఫిర్యాదు తో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న పోలీసులు.
తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే టిడిపి ఇంచార్జ్ జి.శంకర్ యాదవ్ తలపెట్టిన జయహో బీసీ కార్యక్రమానికి పోలీసులు ఆంక్షలు విధించారు. అంగళ్లు లో ర్యాలీలకు ఎటువంటి పర్మిషన్ లేదంటూ అంగళ్లు 30 యాక్ట్ 144 సెక్షన్ అమల్లో ఉందని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై పోలీసులు ఆంక్షలు విధిస్తున్నారు. అంగళ్లు కూడలి వద్ద పెద్ద ఎత్తున పోలీసులు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు చేరుకున్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జన్మదిన సందర్భంగా అంగళ్ళలోని మూడు రోడ్ల కూడలి వద్ద టిడిపి శ్రేణులు చేయబోతున్న కేక్ కటింగ్ కు పర్మిషన్ లేదంటూ ఇక్కడ ఎవరైనా కేక్ కటింగ్ వంటి కార్యక్రమాలకు పాల్పడితే కేసులు నమోదు చేస్తామని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను మదనపల్లి రూరల్ సీఐ శివాంజనేయులు బెదిరింపులకు గురి చేస్తున్నారు.
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత చుండ్రు వీర్రాజు చౌదరి నేతృత్వంలో గొల్లపాలెం నుంచి ద్రాక్షారం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అడుగడుగున లోకేష్ కరపత్రాలు, పోస్టర్లు ఆవిష్కరించారు. అన్నదాన, రక్తదాన శిబిరాలు నిర్వహించారు. కోటిపల్లి శ్రీ సోమేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. లోకేష్ ఆధ్వర్యంలో చంద్రబాబు నేతృత్వంలో జనసేన సహకారంతో రెండు పార్టీలు అధికారంలోకి రావాలని కోరుతూ పూజలు నిర్వహించారు. వీర్రాజు చౌదరి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి కని విని ఎరుగని రీతిలో స్పందన లభించింది. పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీకి తన యువగళం ద్వారా కొత్త ఉత్సాహాన్ని తెచ్చిన లోకేష్ మరింత ఉన్నత స్థితికి ఎదగాలని ఆకాంక్షిస్తూ పూజలు చేసామని అదే విధంగా లోకేష్ ఆసయాలకు అనుగుణంగా అన్నదాన, రక్తదాన శిబిరాలు నిర్వహించమని వీర్రాజు చౌదరి తెలిపారు.
బాపట్ల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నారా లోకేష్ బాబు జన్మదినోత్సవ సందర్భంగా బాపట్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ వేగేశన నరేంద్ర వర్మ చేతుల మీదుగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలపడం జరిగింది. ఈ సందర్భంగా నరేంద్ర వర్మ మాట్లాడుతూ… నారా లోకేష్ యువ గళం అనే పేరుతో రాష్ట్రము మొత్తం చుట్టూ వచ్చి ఆంధ్ర రాష్ట్రం లో యువ గళమే నారా లోకేష్ అనే విధంగా ఆయన పేరు ను మైమరిపించే విధంగా చేశారు. నారా లోకేష్ కి తెలుగుదేశం పార్టీ తరఫున జన్మదినోత్సవ శుభాకాంక్షలు, లోకేష్ బాబు నిండు నూరేళ్లు సంపూర్ణ ఆయురారోగ్యంతో ఉండాలని పార్టీ శ్రేణుల్లో మరింత ఉల్లాసాన్ని ఉత్సాహాన్ని నింపాలని వేగేశన కోరారు.