తెలంగాణలోని జనగామలో ఆర్టీసీ బస్సులు డిపోకే పరిమితమయ్యాయి. ఓ కండక్టర్‌ను అన్యాయంగా సస్పెండ్ చేశారంటూ ఉద్యోగులు డిపో ఎదుట ఆందోళన నిర్వహించారు. ఓ మహిళా ప్యాసింజర్ ఫిర్యాదుతో కండక్టర్ శంకర్‌ను సస్పెండ్ చేశారు. అయితే కండక్టర్‌పై ఎలాంటి విచారణ జరపకుండా… అతనిని అన్యాయంగా సస్పెండ్ చేశారంటూ ఉద్యోగులు ధర్నా చేపట్టారు. సస్పెండ్ చేసిన కండక్టర్ శంకర్‌ను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఉద్యోగుల ఆందోళనతో బస్సులు డిపోకే పరిమితమయ్యాయి. జనగామ ఆర్టీసీ డిపో ఎదుట కండక్టర్ల ఆందోళన. ఈ నెల 1న జనగామ నుంచి హన్మకొండకు వెళుతున్న బస్సులో ఓ గర్భిణీ ఎక్కింది. బస్సు కిక్కిరిసి ఉండటంతో కండక్టర్ శంకర్ గర్భిణీ కోసం ఓ సీటును ఆపాడు. ఈ విషయమై ప్రయాణికులతో వివాదం తలెత్తింది. ఈ గొడవ అధికారుల దృష్టికి వెళ్లింది. దీంతో అధికారులు… శంకర్‌ను సస్పెండ్ చేశారు. అయితే ఏం జరిగిందో తెలియకుండా ఉద్యోగిపై చర్యలు తీసుకోవడం ఏమిటని ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. శంకర్‌ను తిరిగి విధుల్లోకి తీసుకోవాలంటూ సీఐటీయూ ఆధ్వర్యంలో డిపో ఎదుట బైఠాయించారు. ఎలాంటి విచారణ లేకుండా కండక్టర్‌ను సస్పెండ్ చేసినందుకు అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- గ్రాండ్‌గా జరిగిన “ఆర్ కే దీక్ష” సాంగ్స్, టీజర్ లాంచ్ ఈవెంట్ – జూన్ 12న మూవీ రిలీజ్ ..ఆర్ కె ఫిలిమ్స్, సిగ్ధ క్రియేషన్స్ బ్యానర్లపై డా. ప్రతాని రామకృష్ణ గౌడ్ దర్శకత్వం వహించి నిర్మించిన చిత్రం “ఆర్ కే దీక్ష”. డి.ఎస్. రెడ్డి సమర్పణలో రూపొందిన ఈ చిత్రంలో ఢీ, జోడి ఫేమ్ అక్స ఖాన్, అలేఖ్య రెడ్డి…
- ప్రపంచంలోనే పెద్ద ఫ్యామిలీ: 181 మంది సభ్యులు..100 గదుల ఇల్లు..ప్రపంచంలోనే పెద్ద ఫ్యామిలీ: 181 మంది సభ్యులు..100 గదుల ఇల్లు ఇంట్లో ఐదారుగురు ఉంటేనే సందడి..సందడిగా ఉంటుంది. అలాంటిది అక్కడ ఏకంగా 181 మంది నివసిస్తున్నారు. అలాగని అది హాస్టల్ కాదు… కుటుంబం..! ప్రపంచంలోనే అతి పెద్ద కుటుంబం..! చిన్న కుటుంబం…
- పోలవరం బ్యాక్ వాటర్‌తో బూర్గంపాడుకు భారీ ముంపు ముప్పు..గోదావరి నదిపై నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టు ప్రభావం ఇప్పుడు తెలంగాణ సరిహద్దు ప్రాంతాలపై తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా బూర్గంపాడు మండలం ప్రజలు ముంపు భయంతో వణికిపోతున్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 45.72 మీటర్లు .నీటి నిల్వ…
- ఢిల్లీలో స్వచ్ఛ భారత్ మిషన్–అర్బన్ 2.0 జాతీయ సమీక్ష..న్యూఢిల్లీలో స్వచ్ఛ భారత్ మిషన్–అర్బన్ 2.0 అమలు పురోగతిపై జాతీయ స్థాయి సమీక్ష సమావేశం ప్రారంభమైంది. విజ్ఞాన్ భవన్లో కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ అధ్యక్షతన జరుగుతున్న ఈ రెండు రోజుల సమావేశానికి తెలంగాణ…
- భారత్‌కు అమెరికా మెగా రక్షణ ప్యాకేజీ..భారత్-అమెరిక మధ్య మెగా రక్షణ ప్యాకేజీ డీల్ కుదిరింది. భారత సైన్యానికి చెందిన అత్యాధునిక అపాచీ అటాక్ హెలికాప్టర్లు, ‘M777’ ఆల్ట్రా-లైట్ హోవిట్జర్ ఫిరంగుల సహాయక సేవలు, రక్షణ పరికరాల సరఫరా కోసం సుమారు 428 మిలియన్ డాలర్ల ఒప్పందానికి అమెరికా…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి






Total views : 80837