కాకినాడ రూరల్ మండలం పండూరు గ్రామం ఎంపీటీసీ -1 నందిపాటి అనంత లక్ష్మి త్రిమూర్తులు, నందిపాటి రమణ ఆధ్వర్యంలో పండూరు వైసీపీ నాయకులు భావిశెట్టి వెంకటేశ్వర రావు నాయకత్వం లో సుమారు 100 మంది జనసేన పార్టీ సిద్ధాంతాలు, పవన్ కళ్యాణ్ నాయకత్వం నచ్చి జనసేన, టీడీపీ పార్టీల కాకినాడ రూరల్ అసెంబ్లీ అభ్యర్థి , జనసేన పార్టీ రాష్ట్ర పిఎసి సభ్యులు పంతం నానాజీ సమక్షంలో జనసేన పార్టీ లో చేరారు. వీరందరికి పార్టీ కండువాలు వేసి పార్టీ లోకి సాధారంగా ఆహ్వానం పలికారు. నానాజీ మాట్లాడుతూ జనసేన పార్టీ టిడిపి పార్టీ కలయిక వలన వైఎస్ఆర్సిపి పార్టీ కి వణుకు పుట్టిందని, ప్రజలు మా సిద్ధాంతాలను అర్థం చేసుకుని మాతో కలిసి వస్తున్నారని వారు. ప్రతి ఒక్కరికి జనసేన తెలుగుదేశం పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామని అన్నారు. ఈ కార్యక్రమం లో జనసేన నాయకులు గరగా శ్రీనివాస్, మండల అధ్యక్షులు కరెడ్ల గోవింద్ మరియు స్థానిక టీడీపీ నాయకులు భావిశెట్టి శ్రీనివాస్, కొల్లాబత్తుల వీరబాబు, గుమ్మేళ్ల శ్రీనివాస్,కొప్పిశెట్టి రమణ, భావిశెట్టి ప్రసాద్, జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.
Janasena
జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఘాటు లేఖ రాశారు. పవన్ నమ్మంచి మోసం చేశాడని సీరియస్ అయ్యారు. మీ నిర్ణయాలు మీ చేతుల్లో లేవు అంటూ మండిపడ్డారు. రెండు పర్యాయాలు కిర్లంపూడి వస్తానని మీరు నాకు కబురు పంపారు… ఎలాంటి కోరికలు లేకుండా మీతో కలుస్తానని చెప్పడం జరిగిందన్నారు.. అన్ని వర్గాలకు న్యాయం చేయాలని ఆశించి మీతో కలిసి సేవ చేయాలనుకున్నానని… కానీ మీరు నన్ను కలవడానికి మీకు ఎన్నో చోట్ల అనుమతులు అవసరమని తెలుసుకున్నాని తెలిపారు.
మీ నిర్ణయాలు మీ చేతుల్లో లేవని.. పవర్ షేరింగ్ అనేది లేదని అర్ధమైందని ముద్రగడ అన్నారు. మీ 24 సీట్ల కోసం నా అవసరం రాదు.. రాకూదనే భగవంతున్ని కోరుకుంటున్నానని ముద్రగడ తెలిపారు. మీలా గ్లామర్ ఉన్నవాన్ని కాకపోచ్చు… ప్రజల్లో పరపతి లేకపోవడం వల్ల మీ దృష్టిలో లాస్ట్ గ్రేడ్ వ్యక్తిగా తుప్పు పట్టిన ఇనుములా గుర్తించారని ఆవేదన వ్యక్తం చేశారు. నా 40 ఏళ్ల రాజకీయ జీవితంలో డబ్బు కోరడం గానీ.. పదవులు కోసం పెద్ద నాయకుల గుమ్మాల వద్ద పడిగాపులు కాయడం చేయలేదని ముద్రగడ తన లేఖలో విమర్శించారు.
ఎంపీ భరత్ వ్యాఖ్యలు (MP Bharath Comments):
రాజమండ్రి జనసేన నాయకుడు కందుల దుర్గేష్ మంచి నేత అని, జనసేన అధినేత పవన్ ఆయనకు టికెట్ కన్ఫార్మ్ చేసిన చంద్రబాబు అడ్డుపడటం శోచనీయమని రాజమండ్రి ఎంపీ భరత్ అన్నారు. మంగళవారం ఎంపీ భరత్ ను మీడియా అడిగిన ఒక ప్రశ్నకు బదులిస్తూ ఆయనే (కందుల) కనుక తమ వైఎస్సార్ సీపీలో మొదటి నుండీ ఉండి ఉంటే ఈ పాటికి ఎమ్మెల్యే అయ్యేవారన్నారు. కందుల దుర్గేష్ ను మీ వైసీపీ ఆహ్వానిస్తుందా అని మరో విలేఖరి అడిగిన ప్రశ్నకు సమర్థతగల నాయకుడిని ఎవరైనా ఆహ్వానిస్తారని.. అయినా ఆ విషయం అధిష్టానం తీసుకోవాల్సిన నిర్ణయమన్నారు. ఇదే సందర్భంలో రాజమండ్రి అర్బన్ ఎమ్మెల్యే కూడా మంచివారేనని.. కానీ ఆమె ప్రజలకు అందుబాటులో లేకపోవడం దురదృష్టకరం అన్నారు. మనపై నమ్మకంతో ఓట్లేసి గెలిపిస్తే.. వారికి అందుబాటులో లేకపోతే ఎలా అన్నారు. ప్రజాప్రతినిధిగా ప్రజావసరాలు, సమస్యలు తీర్చవలసిన ఎమ్మెల్యే కనిపించకపోతే ఆమెపై ఉన్న సదభిప్రాయం పోతుందన్నారు.
Follow us on : Facebook, Instagram & YouTube.
ఇది చదవండి: 161 వ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ సునీల్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఐదు కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్ష టీడీపీ జనసేన పొత్తు. జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో 99 ఎమ్మెల్యే అభ్యర్థుల ఉమ్మడి జాబితా విడుదల చేశారు. ఈ అభ్యర్థులను చూసి వై నాట్ 175 అన్న జగన్ మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ కనిపించింది. 63 మంది పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ముగ్గురు డాక్టర్లు ఒక ఐఏఎస్ అధికారితో పాటు అందరూ ఉన్నత విద్య చదివిన వారే కచ్చితంగా గెలిచే అభ్యర్థులకే సీటు కేటాయించిన ఘనత చంద్రబాబుకి దక్కింది.
కాపు రిజర్వేషన్ క్యాన్సిల్ చేసినప్పుడు అంబటి రాంబాబు, పేర్ని నాని ఎక్కడికి వెళ్లారు గాడిదలు కాస్తున్నారా స్వాతంత్ర కాలం నుండి రాజంపేట కాపులకు ఇచ్చారు. వైఎస్ఆర్సిపి ప్రభుత్వం వచ్చాక మిథున్ రెడ్డికి కేటాయిస్తే వీళ్ళందరూ ఎందుకు ప్రశ్నించలేదు. ముఖ్యంగా ఈ జాబితాలో దళితులకు అత్యధిక ప్రాధాన్యత కల్పించి సామాజిక న్యాయం చేశారు. పొత్తుపై అవాక్కులు, చవాక్కులు పేలుస్తున్న వారికి నా సమాధానం కోటి 3 లక్షల 33 వేల ప్రజాభిప్రాయ సేకరణ మేరకే అభ్యర్థుల ఖరారు చేశారు గెలిచే అభ్యర్థులకే సీటు ఇచ్చారు అని తెలిపారు.
రానున్న ఎన్నికల్లో పొత్తులో భాగంగా జనసేనకు 24 సీట్లను కేటాయించారు. ఈ నేపథ్యంలో మంత్రి రోజా జనసేనాని పవన్ పై సెటైర్లు వేశారు. పవన్ కు సీఎం అయ్యేంత సీన్ లేదని తేలిపోయిందని ఆయనను టీడీపీ 24 సీట్లకే పరిమితం చేసిందని అన్నారు. 2019 ఎన్నికల సమయంలో చంద్రబాబు, లోకేశ్ ను పవన్ ఏమన్నారో పవన్ ను చంద్రబాబు ఏమన్నారో వాళ్లు మర్చిపోయారని అన్నారు. సింగిల్ గా అయితే జగన్ ను ఎదుర్కోలేమనే అన్నీ పక్కన పెట్టి కలిసిపోయారని విమర్శించారు.
Follow us on : Facebook, Instagram & YouTube.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కు కృతజ్ఞతలు తెలిపిన టిడిపి అధికార ప్రతినిధి పి.గన్నవరం ఎమ్మెల్యే అభ్యర్థి మహాసేన రాజేష్. పి గన్నవరం టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థిగా రాష్ట్రంలో ప్రతిష్టాత్మకమైన పి.గన్నవరం నియోజవర్గానికి నన్ను ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించటం ఆనందంగా ఉందని మహసేన రాజేష్ అన్నారు. ఎమ్మెల్యే అభ్యర్థి అవుతానని కలలో కూడా ఊహించలేదని అలాంటిది బాధ్యతలు అప్పగించి నన్ను ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించడం ఆనందంగా ఉందన్నారు. 2019లో వైసీపీని గెలిపించడానికి దళితులంతా పని చేస్తే జగన్మోహన్ రెడ్డి మాపైనే కేసులు పెట్టి జైలుకు పంపించి దాడులు చేసి ఎసేంట్ భూములు లాక్కుని దళితులను అనేక రకాలుగా ఇబ్బంది పెట్టి జాతికి అన్యాయం చేశాడని అన్నారు. దళిత వర్గానికి చెందిన 18 మంది టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించడం గర్వంగా ఉందన్నారు.
టీడీపీ-జనసేన ఫస్ట్ లిస్ట్ రిలీజ్:
టీడీపీ-జనసేన ఉమ్మడి అభ్యర్థుల జాబితా విడుదలపై నెలకొన్న తీవ్ర ఉత్కంఠకు తెరపడింది. ఎట్టకేలకు టీడీపీ-జనసేన ఉమ్మడి అభ్యర్థుల తొలి జాబితా విడుదల అయ్యింది. 118 మంది అభ్యర్థులతో ఫస్ట్ లిస్ట్‌ను టీడీపీ, జనసేన అధ్యక్షులు చంద్రబాబు, పవన్ కల్యాణ్ విడుదల చేశారు. 118లో టీడీపీ 94, జనసేనకు 24 అసెంబ్లీ, 3 పార్లమెంట్ స్థానాలు కేటాయించారు. టీడీపీ-జనసేన పార్టీల్లోని కీలక నేతల పేర్లు ఫస్ట్ లిస్ట్‌లోనే ఖరారు అయ్యాయి.
ఏపీలో టెన్త్, ఇంటర్ విద్యార్థులకు.. APSRTC శుభవార్త
టీడీపీ చీఫ్ చంద్రబాబు మరోసారి కుప్పం నియోజకవర్గం నుండే బరిలోకి దిగనుండగా గత ఎన్నికల్లో ఓటమి పాలైన భీమవరం నుండే మరోసారి పోటీ చేయాలని పవన్ కల్యాణ్ నిర్ణయించుకున్నారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మంగళగరి, ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయడు టెక్కలి, జనసేన కీలక నేత నాదెండ్ల మనోహర్ తెనాలి నుండి బరిలోకి దిగనున్నారు.
Follow us on : Facebook, Instagram & YouTube.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
జనసేన (Janasena) మాస్ వార్నింగ్:
అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గ కేంద్రంలో నిర్వహించిన మీడియా సమావేశంలో జనసేన జిల్లా కార్యదర్శి అల్లం అప్పారావు, చోడవరం మండల పార్టీ అధ్యక్షుడు గూనూరు మూలు నాయుడు మాట్లాడుతూ.. జనసేన ఇంచార్జ్ పీవీఎస్ఎన్ రాజు పై ఎమ్మెల్యే ధర్మశ్రీ అవాకులు చవాకులు పేలడమే కాకుండా తన అనుచరులతో కూడా అసభ్యంగా మాట్లాడిస్తూ ధర్మశ్రీ జనసేన నాయకులను రెచ్చగొట్టడం మాని నియోజకవర్గ ప్రజల సమస్యలు, అభివృద్ధి పై దృష్టి పెడితే కనీసం ఎమ్మెల్యే టికెట్ అయినా వస్తుందని ఇలాంటి చిల్లర వేషాలు వేస్తే ప్రజలే బుద్ధి చెప్పడానికి రెడీగా ఉన్నారని తెలిపారు. నియోజకవర్గం లో అభివృద్ధి కార్యక్రమాలు చేయడమంటే అసెంబ్లీ లో పాటలు పాడి జగన్మోహన్ రెడ్డిని పొగిడినంత ఈజీ కాదని ఎద్దేవా చేసారు.
Follow us on : Facebook, Instagram & YouTube.
జనసేన పై పడి ఏడవడం ఆపి సొంత పార్టీని చక్కబెట్టుకోమని, నిన్ననే నియోజకవర్గ పరిధిలో బుచ్చయ్యపేట లో వైసీపీ నేతలు ధర్మశ్రీ కి టికెట్ ఇస్తే ఓడించి తీరుతామని ప్రెస్ మీట్ పెట్టి మరీ చెబుతున్నారని.. ధర్మ శ్రీ అవినీతిని తట్టుకోలేక వాడి పార్టీ నాయకులే దండం పెట్టి పార్టీ మారిపోవడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఇలాంటి చిల్లర వేషాలు మానకపోతే జనసైనికుల సత్తా ఏంటో చూపిస్తామని హెచ్చిరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా జనసేన కార్యదర్శి అల్లం అప్పారావు, చోడవరం మండల అధ్యక్షుడు గూనూరు మూలినాయుడు, కర్రి రమేష్, బలిజ మహారాజు తదితర జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. Read Also..
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఈ నెల 28 వ తేదిన తాడేపల్లిగూడెం నియోజకవర్గం ప్రత్తిపాడులో జనసేన, టీడీపీ మొదటి ఎన్నికల సంయుక్త ప్రచార సభ నిర్వహిస్తున్నామని, ప్రత్తిపాడు నియెజకవర్గ వ్యాప్తంగా జనసైనికులు అధిక సంఖ్యలో తరలి రావాలని జనసేన నియోజకవర్గ ఇంచార్జి వరుపుల తమ్మయ్యబాబు పిలుపునిచ్చారు.
సంయుక్త ప్రచారసభకు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, టీడీపీ అధినేత చంద్రబాబు హాజరవుతారని తెలిపారు. అధిక సంఖ్యలో జనసేన నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు, జనసైనికులు తరలిరావాలని కోరారు. సుమారు 15 లక్షల మంది జనసైనికులు హాజరయ్యే అవకాశం వుందని తెలిపారు.
జగన్ ప్రభుత్వాన్ని గద్దె దించే విధంగా జనసేన,టీడీపీ కార్యకర్తలు నడుం బిగించాలన్నారు.
ఈ నెల 28న జనసేన-టీడీపీ సభ నిర్వహిస్తోందని.. ఉమ్మడి ప్రణాళికలను సభ ద్వారా వెల్లడించబోతున్నామని జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ తెలిపారు. రాజకీయ లబ్ధి కోసం కాదు.. రాష్ట్ర భవిష్యత్ కోసమే తమ పొత్తు అని వివరించారు. ప్రజా ధనంతో జగన్ హెలికాప్టర్లు ఎలా సమకూర్చుకుంటారని ప్రశ్నించారు. దిగిపోయే ముందు కూడా జగన్ ఖజానా ఖాళీ చేస్తున్నారన్నారు. వైసీపీ ప్రచారం కోసం ప్రభుత్వ ధనం ఎలా వాడతారు? హెలికాప్టర్లను అద్దెకు తీసుకోవడంపై విచారణ చేపట్టాలన్నారు. జనసేన, టీడీపీతో బీజేపీ కలవాలని పవన్ కల్యాణ్ ఆకాంక్షిస్తున్నారన్నారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర సాయం అవసరం అని నాదెండ్ల అన్నారు.






Total views : 90702