అధికారం ఉన్నా లేకున్నా మానకొండూర్ నియోజకవర్గ ప్రజలకు సేవచేయడానికే అందుబాటులో ఉంటానని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పేర్కొన్నారు. కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండల కేంద్రం లో బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు, సుడా చైర్మన్ జీవి రామకృష్ణారావు నివాసం లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశం లో ఆయన మాట్లాడుతూ…కష్టపడి పనిచేసిందుకు బీఆర్ఎస్ కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. మన ప్రజల కోసం చిత్తశుద్ధితో పనిచేద్దామని కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేసే దాక ప్రజాక్షేత్రంలో ఉండి పోరాటం చేస్తానని తెలిపారు.అలాగే బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు,నాయకులు అధైర్యం చెందవద్దని ప్రజల తో ఉంటూ ప్రజా సమస్యలపై పోరాడాలని పిలుపునిచ్చారు. అలాగే బీఆర్ఎస్ పార్టీ కోసం పనిచేసిన సోషల్ మీడియా వారియర్స్ కు ధన్యవాదాలు తెలిపారు. అదేవిధంగా మానకొండూర్ నియోజకవర్గం ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
karimnagar district news
పెద్దపల్లి జిల్లా మంథని నియోజకవర్గ కేంద్రంలో ఎన్నికల వాతావరణం పోటా పోటీగా సాగుతోంది. ఈ క్రమంలో తెలంగాణ మున్నూరు కాపు మహా సభ రాష్ట్ర అధ్యక్షుడు మడికొండ వెంకటేశ్వర్ రావు, పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు మల్క రామస్వామి, జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు పెండేల సంపత్, మంథని కో ఆర్డినేటర్ ఆకుల కిరణ్ తో పాటు పలువురు నాయకులు శనివారం మంథని పట్టణ కేంద్రంలోని ప్రెస్ భవన్ లో మీడియా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ…ఒక బిసి బిడ్డ అయిన పుట్ట మధుకర్ కు కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ నుండి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినందుకు హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు మహా సభ తరుఫున కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపారు. మంథని నియోజకవర్గంలో పుట్ట లింగమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో, బీఆర్ఎస్ ప్రభుత్వ పథకాలతో పుట్ట మధుకర్ ప్రజలకు చేసిన అభివృద్ధి ఎనలేనిదనీ కొనియాడారు. 2 జిల్లాలలోని 10 మండలాలలో విస్తరించి ఉన్న మంథని నియోజకవర్గంలో మొత్తం మున్నూరు కాపుల ఓట్లు 45000 పైగా ఉన్నాయని, నియోజకవర్గంలోని అన్ని మున్నూరు కాపు ఓట్లు వేసి పుట్ట మధుకర్ ను గెలిపించుకుంటామని ముక్త కంఠంతో అన్నారు.
మంథని చౌరస్తాలో నడిరోడ్డుపై నిల్చుంటా బీఆర్ఎస్ నేతలను వచ్చి నన్ను చంపమను అంటూ పోలీసుల పై ఆగ్రహం వ్యక్తం చేసారు మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు. మహాముత్తారంలో ఓడేడు సర్పంచ్ బక్కారావుపై జరిగిన దాడిని ఖండిస్తూ మంథని ఎన్నికల రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేసారు. మంథనిలో రౌడీయిజం, గూండాయిజం చేసే సంస్కృతిని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రోత్సహిస్తున్నారన్నారు. పుట్ట మధు గురించి మాట్లాడితే బక్కన్న కు పట్టిన గతే కాంగ్రెస్ నాయకులకు పడుతుందని సోషల్ మీడియాలో వార్నింగ్ ఇచ్చిన బీఆర్ఎస్ నేతపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు. మంథని నియోజకవర్గంలో శాంతియుతంగా ఎన్నికల నిర్వహణకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు ఫిర్యాదు చేస్తామన్నారు.. ఎన్నికల్లో ఇతర పార్టీల అభ్యర్థులు పోటీ చేయవద్దా అని ముఖ్యమంత్రి కేసీఆర్ ను,ప్రభుత్వాన్ని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు ప్రశ్నించారు.
ముస్లిం మైనార్టీల సంక్షేమం బీఆర్ఎస్ తోనే సాధ్యమని రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ అన్నారు. పెద్దపెల్లి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మైనార్టీల ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్యఅతిథిగా హాజరై మహమ్మద్ అలీ మాట్లాడుతూ…. కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ ముస్లిం మైనార్టీల అభివృద్ధి కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారన్నారు. షాదీ ముబారక్ తో నిరుపేద ఆడపిల్లల వివాహానికి చేయూతనిస్తున్నారని,
మైనార్టీ పాఠశాలలు, కళాశాలలు ఏర్పాటు చేసి నాణ్యమైన విద్యను అందిస్తున్నారన్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ 50ఏళ్లు పరిపాలించినా ముస్లింలను ఓటు బ్యాంకుగానే చూసారని, వారి సంక్షేమం కోసం కృషి చేయలేదన్నారు.పెద్దపల్లిలో దాసరి మనోహర్ రెడ్డి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశారని, ముస్లిం మైనారిటీలతో ఆయనకు సత్సంబంధాలు ఉన్నాయన్నారు. మైనార్టీల సంక్షేమం కోసం కృషి చేస్తున్న దాసరి మనోహర్ రెడ్డిని మరోసారి భారీ మెజార్టీతో గెలిపించి అసెంబ్లీకి పంపాలని కోరారు.
ఈనెల 25 న వేములవాడ కు ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాత్ వస్తున్నారని భాజపా జిల్లా అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ తెలిపారు. తెలంగాణ లో బిజెపి పాగా వేసేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తుంది. ఈ నేపథ్యంలో బిజెపి అభ్యర్థి చెన్నమనేని వికాస్ రావు తరపున వేములవాడ లో బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు. యోగి రాక సందర్భంగా కట్టుదిట్టమైన భద్రత చర్యలు చేపట్టనున్నారు. హెలిప్యాడ్ నుండి బహిరంగ సభ స్థలం వరకు 5 వేల మంది తో భారీ ర్యాలీ చేపట్టనున్నారు
ఈరోజు తెలంగాణ తెలుగుదేశం పార్టీ పెద్దపల్లి పార్లమెంటు అధ్యక్షులు బి సంజయ్ కుమార్ ఆధ్వర్యంలోమందమర్రి పట్టణ తెలుగుదేశం పార్టీ గౌరవనీయులు నారా చంద్రబాబునాయుడు కి బెయిల్ రావడం సందర్భంగా పట్టణ మార్కెట్ కూడలి అంబేద్కర్ విగ్రహం వద్ద పెద్ద ఎత్తున బాణాసంచాకాల్చి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగాబి. సంజయ్ కుమార్ మాట్లాడుతూ….. గత 53 రోజులుగా చంద్రబాబు గారిని అక్రమంగా అరెస్టు చేసి జైలు పంపించడం జరిగింది ఎలాంటి ఆధారాలు చూపకుండా యొక్క జగన్ రాక్షస పాలనకు చరమగీతం పాడాలని చివరికి న్యాయం గెలిచిందని రెండు తెలుగు రాష్ట్రాలే కాకుండా దేశంలో గాని ప్రపంచవ్యాప్తంగా ప్రతి తెలుగు వారు ఆయనకు మద్దతు నిలవడం జరిగినది. తెలుగు రాష్ట్రాల్లో అభివృద్ధి చేసి చూపించిన నాయకుడు చంద్రబాబు గారు అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మందమరి పట్టణ అధ్యక్షులు జక్కుల సమ్మయ్య మహిళా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎండి షరీఫా పట్టణ ప్రధాన కార్యదర్శి కారం రాజు ఉపాధ్యక్షులు వడ్డాల సత్యనారాయణ కరిడే తిరుపతిమున్సిపల్ ఇంచార్జి ముల్కల లక్ష్మీరాజ్యం గోలేటి సురేందర్ జిల్లా నాయకులు వాసాల సంపత్ పట్టణ మహిళా అధ్యక్షురాలు అనంతలక్ష్మి పట్టణ మహిళా మున్సిపల్ ఇన్చార్జి ఆర్ జయ ఉపాధ్యక్షురాలు సంధ్య సువర్ణ ప్రధాన కార్యదర్శి రజియా ఐద లక్ష్మి, కవిత మమత రసూల భాగ్య కవిత కమల పాల్గొన్నారు
పార్టీలో టికెట్లు ఇస్తానని చెప్పి కోట్ల రూపాయలు వసూళ్లు చేసిన వ్యక్తి బండి సంజయ్ అని ఆ అవినీతి సొమ్ముతో గెలిచేందుకు మళ్ళీ వస్తున్నాడని బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్ రూరల్ మండలం బొమ్మకల్ గ్రామంలో మంగళవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామస్థులు పెద్ద ఎత్తున డప్పు చప్పుళ్ళు, తెలంగాణ సాంప్రదాయం ఉట్టి పడేలా బతుకమ్మ బోనాలతో ఘన స్వాగతం పలికారు. మంత్రి గంగుల ఇంటింటికి తిరుగుతూ ఓట్లు అభ్యర్థించారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ…బీసీ బిడ్డ తుల ఉమ పోటీ చేసేందుకు సిద్ధం కాగా ఆమెకు వ్యతిరేకంగా నిలిచిన వ్యక్తికి 20 కోట్ల రూపాయలకు టికెట్ బండి సంజయ్ అమ్ముకున్నడని ఆరోపించారు. సంజయ్ ఎన్నికలు వచ్చిన ప్రతీ సారి ఎదో ఒక డ్రామా ఆడి ఓట్లు దండుకావాలని చూస్తాడని, ఆయన యాక్టింగ్ బ్రహ్మానందం, ప్రకాష్ రాజ్ లను మించిపోయిందని ఎద్దేవా చేసారు. భు మాఫియాకు మారుపేరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అని, ఆయన సర్పంచ్ గా అవకాశం ఇస్తే కబ్జాలు చేసిన వ్యక్తి ఎమ్మెల్యే అయితే మీ భూములు, ప్రభుత్వ భూములు కబ్జా చేస్తాడని అన్నారు. బీజేపీ కాంగ్రెస్ అభ్యర్థులు భూమాఫియా లో భాగస్వాములు అని అన్నారు. తనకు వ్యాపారాల వల్ల డబ్బులు సంపాదిస్తే బీజేపీ కాంగ్రెస్ అభ్యర్థులు ఏ వ్యాపారం చేసి కోట్ల రూపాయలు సంపాదించారో చెప్పాలని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కబ్జాల వల్ల బొమ్మకల్ గ్రామంలోని భూ రికార్డులు సీబీసీఐడీ వద్ద ఉండే దుస్థితి దాపురించింది అని అన్నారు. 12 ఇళ్లులు కట్టుకున్న కాంగ్రెస్ అభ్యర్థి గ్రామపంచాయతీ భవనం కట్టలేకపోయడని అన్నారు. ఎంపీగా బండి సంజయ్ ను గెలిపిస్తే ఒక్క రోజు ఏ గ్రామానికి రాని వ్యక్తి మళ్ళీ ఓట్ల కోసం ఏ ముఖం పెట్టుకొని వస్తున్నాడని, మహిళలు నిలదీయాలని కోరారు. రానున్న ఎన్నికలు మీ బిడ్డల భవిష్యత్ ను సూచించే ఎన్నికలు అని, ఒక్క ఓటు తప్పు జరిగితే మీ పిల్లల భవిష్యత్ అంధకారం అవుతుందని అన్నారు.
మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలోని రాపన్ పెల్లి వద్ద గల అంతర్ రాష్ట్ర చెక్ పోస్ట్ వద్ద రూరల్ సీఐ విద్యాసాగర్ ఆధ్వర్యంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు..త్వరలో జరుగబోయే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా అనుమానిత వ్యక్తుల వివరాలు అడిగి తెలుసుకొని ముమ్మర వాహన తనిఖీలు నిర్వహించారు..ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు చెక్ పోస్టులు కీలకం అని సీఐ విద్యాసాగర్ పేర్కొన్నారు..సాయుధ బలగాలతో కూడిన పహారా పకడ్బందీగా చెక్ పోస్టులు నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు..అక్రమ మార్గంలో మద్యం,డబ్బులు ప్రజలను ప్రలోభపెట్టే వస్తువులను రాకుండా రక్షణ చర్యలు చేపట్టినట్లు ఆయన చెప్పారు…అధికారులు సమన్వయంతో మెదిలి ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చూడాలని ఆయన సూచించారు…అనంతరం పోలీసులకు తగు సూచనలు,సలహాలు అందించారు.. ఆయన వెంట పోలీస్ సిబ్బంది వున్నారు..
మీరు వేసే ఓటు మీ ఐదేళ్ల తలరాతను మారుస్తుందని, రాయి ఏదో.. రత్నం ఏదో ప్రజలు ఆలోచించుకోవాలని బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ కోరారు.మంచి పార్టీకి ఓటు వేస్తే.. అంతా మంచే జరుగుతుందన్నారు. హుజూరాబాద్ నియోజకవర్గ పరిధిలోని జమ్మికుంటలో నిర్వహించిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ ప్రసంగించారు. బీజేపీ ప్రభుత్వం దేశంలో 157 మెడికల్ కాలేజీలు మంజూరు చేసింది. కానీ, ఒక్క వైద్య కళాశాల కూడా తెలంగాణకు ఇవ్వలేదన్నారు. జిల్లాకో నవోదయ పాఠశాల మంజూరు చేయాలని చట్టంలో ఉన్నా.. కేంద్రానికి లేఖలు రాసినా పట్టించుకోలేదన్నారు. ఒక్క మెడికల్ కాలేజీ కూడా ఇవ్వని బీజేపీకి ఒక్క ఓటు కూడా ఎందుకు వేయాలిన్నారు. రైతుల మోటార్లకు మీటర్లు పెట్టలేదని తెలంగాణకు వచ్చే నిధుల్లో రూ.25వేల కోట్లు కేంద్రం కోత పెట్టిందన్నారు. రైతు బంధు రూ.16వేలు రావాలంటే హుజూరాబాద్‌లో కౌశిక్‌రెడ్డిని గెలిపించాలన్నారు. గతంలో నన్ను ఒకసారి బాధ పెట్టారు. ఈసారి అలా జరగొద్దన్నారు. పాలిచ్చే బర్రెను వదిలి పెట్టి ఎవరైనా దున్నపోతును తెచ్చుకుంటారా? అని ప్రశ్నించారు. కౌశిక్‌రెడ్డికి ఓటు వేయండి.. హుజూరాబాద్ ప్రజలకు అండగా ఉంటని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు.
పెద్దపల్లి జిల్లా గోదావరిఖని పట్టణంలోని పలు మసీదుల వద్ద వివిధ రాజకీయ పార్టీల నేతలు ముస్లిం సోదరులను కలిసి ఓట్లను అభ్యర్థించారు. శుక్రవారం ముస్లింల ప్రత్యేక నమాజు ల అనంతరం పార్టీల అభ్యర్థులు, స్వతంత్ర అభ్యర్థులు తమకు ఓటు వేయాలంటూ ప్రచారం నిర్వహించారు. పోటాపోటీగా పార్టీల ప్రచార నినాదాలతో మసీదుల వద్ద అభ్యర్థుల అనుచరులు సందడి చేశారు. కాగా అభ్యర్థులు ఒకరికొకరు తారస పడిన ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా తమ ప్రచారం ముగించుకుని అక్కడి నుంచి జారుకున్నారు. ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.
Read Also….





Total views : 90578