Ktr
వికారాబాద్ జిల్లాలోని కుల్కచర్లలో మంత్రి కేటీఆర్ రోడ్ షో నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎవరైనా ఓట్లు అడిగే ముందు గతంలో ఏం చేశారో, గెలిస్తే ఏం చేస్తారో చెప్పాలన్నారు. ఈ క్రమంలోనే తెలంగాణలో మరోసారి బీఆర్ఎస్ కు పట్టం కడితే నాలుగు కొత్త కార్యక్రమాలు తెస్తామని మంత్రి కేటీఆర్ తెలిపారు.కేసీఆర్ బీమా పేరుతో రూ.5 లక్షలు అందిస్తామన్నారు.సౌభాగ్యలక్ష్మి కింద 18 ఏళ్లు నిండిన ఆడబిడ్డలకు నెలకు రూ.3 వేలు అందించడంతో పాటు తెల్ల రేషన్ కార్డులు ఉన్న ప్రతి ఇంటికి సన్నబియ్యం పంపిణీ చేస్తామని తెలిపారు. అలాగే అసైన్డ్ భూములపై సంపూర్ణ హక్కులు కల్పిస్తామని పేర్కొన్నారు. అంతేకాకుండా భవిష్యత్ లో కేసీఆర్ భరోసా కింద మరిన్ని కార్యక్రమాలు చేపడతామని హామీ ఇచ్చారు.హనుమంతుని గుడి లేని ఊరు లేదన్న కేటీఆర్ బీఆర్ఎస్ సంక్షేమం అందని ఊరు కూడా లేదన్నారు
ఎమ్మెల్యే సీతక్క ములుగు నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. మంత్రి హరీశ్ రావుపై సీతక్క మండిపడ్డారు. అగ్గిపెట్టె దొరకని హరీశ్ రావు ఇప్పుడు కారుకూతలు కూస్తున్నాడంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘సీతక్క మంత్రి అవుతుందట’ అంటూ ఎద్దేవా చేస్తున్నాడని విమర్శించారు. ‘ఏ.. నేను మంత్రిని కావొద్దా? నా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవద్దా’ అని మంత్రిని నిలదీశారు. బీఆర్ఎస్ నేతలకు బడుగుబలహీన వర్గాలంటే గిట్టదని సీతక్క ఆరోపించారు. ములుగులో తనను ఓడించేందుకు సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్ రావు, కేటీఆర్ లు నియోజకవర్గంలో డబ్బులు వెదజల్లుతున్నారని ఆరోపించారు. నోట్ల కట్టలతో ప్రజలను కొనాలని చూస్తున్నారు కానీ ములుగు ప్రజలు అమ్ముడుపోరనే విషయం వారికి తెలియదన్నారు. బీఆర్ఎస్ నేతలు ఇచ్చే డబ్బులు తీసుకోవాలని ఓటర్లకు ఆమె సూచించారు. వాళ్లు పంచే డబ్బంతా గత పదేళ్లలో ప్రజల నుంచి దోచుకున్నదేనని చెప్పారు. వారిచ్చే డబ్బులు తీసుకుని ఓటు మాత్రం తనకే వేయాలని విజ్ఞప్తి చేశారు.
కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడి ఘటనకు సంబంధించిన రిమాండ్ రిపోర్ట్‌ను ఇప్పటివరకు ఎందుకు బయట పెట్టలేదని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. దాడి విషయంలో మంత్రి హరీష్ రావు నటనకు తెలంగాణ యువకులు భావోద్వేగానికి లోనయ్యారని ఎద్దేవా చేశారు. నిందితుడు రాజు రిమాండ్ రిపోర్టు బయటపెట్టలేదని ఆయన అన్నారు. కుట్రలు జరగబోతున్నాయని కేటీఆర్ అన్నారని, ఆయన మాటలను సుమోటోగా స్వీకరించి విచారణకు ఆదేశించాలని రేవంత్ డిమాండ్ చేశారు.అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజుపై దాడి ఘటనపై స్పందిస్తూ.. అదంతా డ్రామా అని రేవంత్ కొట్టిపారేశారు.
పోలింగ్ తేదీ దగ్గరపడుతున్న వేళ మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ భవన్లో కాంగ్రెస్ మహిళా నాయకురాలు పాల్వాయి స్రవంతి బీఆర్ఎస్లో చేరారు. ఆమెకు కేటీఆర్ కండువా కప్పి ఆహ్వానించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. ఎన్నికల్లో ఎలాగైనా లబ్ది పొందాలని కాంగ్రెస్, బీజేపీలు కొత్త కుట్రలకు తెరలేపాయని అనుమానం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో ఢిల్లీ పెద్దలు వదంతులు సృష్టిస్తారు.. రాష్ట్ర ప్రజలందరూ ఉండాలని పిలుపునిచ్చారు. దేశంలో కేసీఆర్ చక్రం తిప్పకుండా కుట్రలకు ప్లాన్ చేస్తున్నారని ఆరోపించారు. ఎన్నికలే లక్ష్యంగా రాబోయే 15 రోజుల పాటు ఇవే కుట్రలకు ప్లాన్ చేస్తున్నారని వ్యాఖ్యానించారు. మన ఆలోచనలకు మార్చడానికి తీవ్రంగా ప్రయత్నిస్తారు.. ఎట్టి పరిస్థితుల్లో ప్రజలు గాడి తప్పొద్దు.. అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
Read Also..
Read Also..
కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కార్పొరేటర్ పగుడాల శిరీష బాబురావు తో కలిసి బాలాజీ నగర్ డివిజన్ లోని వివిధ ప్రాంతాల్లో అసోసియేషన్ సభ్యులతో ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాలు నిర్వహించారు.. ఇందులో భాగంగా ఆంజనేయ నగర్… బాలాజీ నగర్, కెపిహెచ్బి రోడ్ నెంబర్ 1..3.. లో ప్రజలతో మాట్లాడుతూ ఒకప్పుడు బాలాజీ నగర్ డివిజన్లో మంచినీళ్లు కొరతతో చాలా ఇబ్బంది పడే వారమని ఇప్పుడు 24 గంటలు విద్యుత్ మంచినీరు, సిసి రోడ్లు వంటి మౌలిక సదుపాయాలకు ఎక్కడ ఇబ్బందులు లేకుండా ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ నాయకత్వంలో చేసి చూపించామని అన్నారు. బాలాజీ నగర్ లో ఇంకా ఉన్న డ్రైనేజీ సమస్యను పరిష్కరించాల్సిన ఆవశ్యకత ఉందని ఇప్పటికే ప్రణాళిక బద్ధంగా డ్రైనేజీ సమస్యను పరిష్కరించి వస్తున్నామని భవిష్యత్తులో నాళాలు సమస్య అనేది లేకుండా చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే చెరువులు సుందరీ కరణతో ఇప్పటికే రంగధామును చెరువును అత్యద్భుతంగా తీర్చిదిద్దుకున్నామని మిగిలిన చెరువులను కూడా సుందరీకరించుకుని ఎస్టీపి ప్లాంట్లు నిర్మాణం పూర్తిచేసుకుని కూకట్పల్లి నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా మార్చబోతున్నామని అన్నారు.. ఇంత అత్యద్భుతమైన ప్రణాళికలు ఉండబట్టే నేడు తెలంగాణ రాష్ట్రం ఇంత అభివృద్ధి చెందుతుందని ఇటువంటి ముందుచూపు ఉన్న వ్యక్తినే మళ్లీ సీఎం గా కొనసాగించాలని అందుకనే ముఖ్యమంత్రి కేసీఆర్ కు అఖండ మెజారిటీ ఇచ్చి గెలిపించుకుందామని.. తాను పోటీ చేస్తున్న కూకట్పల్లి నియోజకవర్గంలో అత్యధిక మెజారిటీ ఇప్పించి గెలిపించాలని కోరారు.. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ పగుడాల బాబురావు డివిజన్ అధ్యక్షులు ప్రభాకర్ గౌడ్.. నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు..
ఉమ్మడి ఏపీలో విద్యుత్, తాగునీటి సమస్యలు తీవ్రంగా ఉండేవని మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణలో గతంలో తరచూ విద్యుత్ కోతలు, తాగునీటి కోసం నిరసనలు జరిగేవని చెప్పారు. హైదరాబాద్‌లో రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ల ప్రతినిధుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘‘మిషన్ భగీరథ ద్వారా హైదరాబాద్‌లో తాగునీటి సమస్య లేకుండా చేశామన్నారు. నిరంతరాయంగా విద్యుత్ సరఫరా అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని అన్నారు. హైదరాబాద్‌లో కాలుష్య రహిత ప్రజా రవాణా అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. నగరంలో 24 గంటల తాగునీటిని అందించాలన్నదే మా స్వప్నమని చెప్పారు. మెట్రోను రాబోయే 10 ఏళ్లలో 415 కి.మీ విస్తరించాలన్నదే మా ఎజెండా అని మంత్రి కేటీఆర్ తెలిపారు.
జనగామ జిల్లా కేంద్రంలోని 13 వ వార్డు లో పళ్ళ రాజేశ్వర్ రెడ్డి ప్రచారం నిర్వహించడం జరిగింది… ప్రచారంలో భాగంగా బీడీలు చుట్టి గడప గడప తిరుగుతూ ఓటర్స్ తో ముచ్చటించారు.. జనగామ పట్టణం ఇప్పటికే బాగా అభివృద్ది అయింది ఇంకా బాగా కావాల్సిన అవసరం ఉన్నది జిల్లా అయిన తరవాత చుట్టుపక్కల ప్రజలు ఇక్కడికి వచ్చి స్థిరపడుతున్నారు కాబట్టి వాళ్ల అందరికి విద్యా ఉద్యోగాలు ఉపాధి అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉన్నది చేసే పనులు చేస్తున్నాం అని చెప్తున్నాం చేయలేని పనిలు కాదు అని వివరిస్తున్న జనగాం పట్టణములో చాలామంది పేదలకి ఇళ్లు లేని వారికీ కచ్చితంగా గృహలక్ష్మి ఇస్తాం అని మాట ఇచ్చిన జనగాం సమగ్ర అభివృద్ధిలో భాగంగా పేదలకు ఇళ్లు ఇస్తాం ఎవరికైతే పెన్షన్ రాలేదో ఒకటే నెలలో పెన్షన్ ఇస్తాం కేసిఆర్ కొత్తగ ప్రవేశ పెట్టిన పథకాలు ఏవైతే ఉన్నాయో గృహ లక్ష్మి, పెన్షన్ పెంపు, గ్యాస్ ధర 400 పథకాలు ప్రచారం చేస్తున్నాం..
డిక్లరేషన్ పేరుతో కాంగ్రెస్ పార్టీ కుల, మతాల చిచ్చు పెట్టాలి అని చూస్తుంది- కేటీఆర్
కాంగ్రెస్ పార్టీకి తప్పుడు వాగ్ధానాలు చేయడం కోత్తేమీ కాదని, గతంలోనూ చాలా సార్లు ఇలాంటి తప్పుడు వాగ్ధానాలు ఇచ్చిందని మంత్రి కేటీఆర్ ఆరోపించారు. ముస్లిం మైనారిటీలను బీసీలుగా గుర్తిస్తామని కాంగ్రెస్ పార్టీ చెబుతోందని, అలా చేస్తే మైనారిటీలు ప్రత్యేక హోదా పోతుందని అన్నారు. మైనారిటీ డిక్లరేషన్ పేరుతో బీసీలకు, ముస్లింలకు మధ్య చిచ్చు పెట్టాలని కాంగ్రెస్ పార్టీ చూస్తోందని, ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో చిచ్చు పెట్టాలని కుట్ర చేస్తోందని విమర్శించారు.
శేర్లింగంపల్లిలోని చందానగర్ డివిజన్ లో ప్రజల నుంచి అపూర్వ స్పందన లభిస్తుందన్నారు ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ.. ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమం వలన ప్రజల మన్ననలు పొందామన్నారు.. శేరిలింగంపల్లి నియోజకవర్గంలో తొమ్మిది వేల కోట్ల రూపాయల తో అభివృద్ధి పనులు జరిగాయని, ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు చేరాయని వాటిని ప్రజలకు వివరిస్తూ ఓట్లు అడుగుతున్నామన్నారు… బూటకపు మాటలతో బురద చల్లే పార్టీ లను ప్రజలు తిరస్కరించిండానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు.. శేరిలింగంపల్లి లో గులాబీ జెండా ఎగుర బోతుందని, హ్యాట్రిక్ ముఖ్యమంత్రి గా కేసీఆర్ రికార్డు కొట్టబోతున్నారని ఉద్ఘాటించారు.