నంద్యాల మండలం సుగలిమెట్ట వద్ద పోలంలో బయటపడిన అమ్మవారి విగ్రహం. హైదరాబాద్ కు చెందిన వ్యక్తి మహనంది దర్శించడానికి వెళ్తుండగా సదరు వ్యక్తికి ఇక్కడ నేనున్నానని చెవిలో చెప్పిన అమ్మవారు. గత రెండు రోజుల నుండి వెతుకగా సుగాలిమెట్ట వద్ద బయటపడ్డ అమ్మవారి విగ్రహం. అమ్మవారి దర్శనానికి బారులు తీరిన భక్తులు. అమ్మవారి విగ్రహం బయటపడడంతో కోలాహలంగా మారిన సుగాలిమెట్ట ప్రాంతం. అమ్మవారిని దర్శించుకుని పూజలు టెంకాయలు అర్పిస్తున్న భక్తులు….
latest news
సుబ్రహ్మణ్య షష్టి పురస్కరించుకుని ద్రాక్షారామ భీమేశ్వర స్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు. శ్రీ మాణిక్యాంబ అమ్మ వారిని, శ్రీ భీమేశ్వర స్వామి వారిని దర్శించుకున్న భక్తులు. ఆలయ ప్రాంగణంలో గల శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. పువ్వు,పడగలు పెట్టి మొక్కులు తీర్చుకున్నారు. తెల్లవారుజామునుంచి భక్తులు ఇక్కడకు చేరుకోవడంతో క్యూలైన్లు అన్నీ బారులు తీరాయి. భక్తులు రద్దీకి తగ్గట్టుగా దేవాదాయ,ధర్మాదాయ శాఖ అధికారులు ఏర్పాట్లు చేశారు…
సుబ్రహ్మణ్యేశ్వ స్వామి షష్ఠి మహోత్సవాలను సోమవారం కొత్తపేట నియోజకవర్గం లో వాడ వాడలా ఘనంగా నిర్వహించారు.భక్తులు వేకువ జామున నుంచే ఆలయాలకు చేరుకొని స్వామిని దర్శించుకుని పూలు,పడగలు సమర్పించుకున్నారు.పెద్ద ఎత్తున భక్తులు తరలి రావడంతో ఆలయాలన్నీ కిటకిటలాడాయి.ముఖ్యంగా కొత్తపేట మండల పరిధిలోని వాడపాలెం లో వేంచేసియున్న శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో తెల్లవారు జామున నుండే స్వామి వారికి ప్రధాన అర్చకులు శ్రీను,మణి,సాయి గార్ల చే ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు.అత్యధిక సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలి వచ్చి స్వామి వారిని దర్షించుకున్నారు.అలాగే కొత్తపేటలో పురాణ ప్రసిద్ది చెందిన హరి హర దేవాలయం ప్రాంగణంలో గల వల్లీ దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో భక్తులు అత్యధిక సంఖ్యలో స్వామి వారిని దర్శించుకున్నారు.ఆలయాల వద్ద రద్దీ ఎక్కువవడంతో భక్తుల క్యూ లైన్లుతో ఎక్కడికక్కడ బారులు తీరారు.నియోజకవర్గం లోని పలు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి.మండలం లో ఆయా ఆలయాల వద్ద షష్ఠి తీర్థాలు ఘనంగా నిర్వహించారు.
పాలు మరియు పసుపు రెండూ భారతీయ సంస్కృతిలో చాలా ముఖ్యమైన ఆహార పదార్థాలు. పాలు ప్రోటీన్, కాల్షియం మరియు ఇతర పోషకాలకు మంచి మూలం. పసుపు యాంటీఆక్సిడెంట్లు మరియు ఇతర ఔషధ గుణాలకు మంచి మూలం.
పాలు మరియు పసుపు రెండూ కలిపి తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి :
- రోగనిరోధక శక్తిని పెంచుతుంది: పసుపులోని యాంటీఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి. ఇది మన శరీరాన్ని వ్యాధుల నుండి రక్షించడంలో సహాయపడుతుంది.
- మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది: పసుపులోని కుర్కుమిన్ మెదడు పనితీరును మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఇది మెమరీ, ఏకాగ్రత మెరుగుపరచడంలో సహాయపడుతుంది.
- గాయాలను నయం చేస్తుంది: పసుపులోని యాంటీఆక్సిడెంట్లు మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు గాయాలను నయం చేయడంలో సహాయపడతాయి. ఇది వాపు మరియు నొప్పిని తగ్గించడంలో సహాయపడుతుంది.
- అల్జీమర్స్ మరియు పార్కిన్సన్స్ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది: పసుపులోని కుర్కుమిన్ అల్జీమర్స్ మరియు పార్కిన్సన్స్ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది మెదడు కణాలను రక్షించడంలో మరియు వాటి క్షీణతను నిరోధించడంలో సహాయపడుతుంది.
- క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది: పసుపులోని యాంటీఆక్సిడెంట్లు క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి.
పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం లో దొంగల హల్చల్, మాచర్ల నెహ్రూ నగర్ 2వ. లైన్ లో నివాసం ఉంటున్న మేకల సురేష్ ఇంట్లో దొంగతనం. శనివారము రెంటచింతలో అత్త రింటికి వెళ్లి ఆదివారం తిరిగి మధ్య హనం ఇంటికి వచ్చి చూసుకునే లోపు దొంగతనం, సుమారు మూడు లక్షల బంగారు ఆభరణాలు, 50000 నగదు దొంగతనం జరిగిందని మాచర్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు. కేస్ నమోదు చేసి విచారిస్తున్న పోలిసులు.
రిగేషన్ అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష. హాజరైన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇరిగేషన్ అధికారులతో ముగిసిన సీఎం సమీక్ష. మేడిగడ్డపై పూర్తి వివరాలివ్వండి అంటూ అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం. కుంగిన మేడిగడ్డ ప్రాజెక్టుకు సంబంధించి పూర్తి వివరాలు అందించాలని నీటిపారుదల శాఖ అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఆదివారం తన నివాసంలో నీటిపారుదల శాఖ అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో ప్రస్తుతం నీటిపారుదల రంగం పరిస్థితిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. గత ప్రభుత్వ హయాంలో కొత్తగా నిర్మించిన ప్రాజెక్టుల ఖర్చులకు సంబంధించి పూర్తి వివరాలు అందించాలన్నారు. ఇతర రాష్ట్రాలతో జల వివాదాలకు సంబంధించి కృష్ణా ట్రిబ్యునల్ వద్ద వినిపించాల్సిన వాదనలు, ముందు ముందు ఇబ్బందులు తలెత్తకుండా తీసుకోవాల్సిన చర్యలపై సమావేశంలో చర్చించారు. యాసంగి పంటలకు నీళ్లిచ్చేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. నీటి లభ్యత, ఇతర అంశాలపై పలు సూచనలు చేశారు. అంతర్రాష్ట్ర జలవివాదాలను త్వరగా పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో చర్చించిన అంశాలకు సంబంధించి వీలైనంత త్వరగా పూర్తి వివరాలను అందించాలని అధికారులను ఆదేశించారు సీఎం. ఈ సమీక్షా సమావేశంలో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఈఎన్ సీ మురళీధర్, సంబంధిత శాఖ అధికారులు పాల్గొన్నారు.
నంద్యాల జిల్లా శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయానికి భారీగా పెరిగిన భక్తుల రద్దీ సోమవారం కావడంతో భక్తుల రద్దీ భారీగా పెరిగింది క్షేత్రమంత భక్తజనంతో సందడి నెలకొంది భక్తులు వేకువజామున నుండే పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించి శ్రీ భ్రమరాంబ మల్లికార్జునస్వామి అమ్మవార్ల దర్శనార్థమై క్యూలైన్స్ లో దర్శన కంపార్టుమెంట్లలో బారులు తీరారు శ్రీ స్వామి అమ్మవారి దర్శనానికి సుమారు 5 గంటల సమయం పడుతుంది భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయ క్యూలైన్లలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా శ్రీస్వామి అమ్మవార్లను దర్శించుకునేలా ఆలయ ఈవో పెద్దిరాజు ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు దర్శనార్థమై క్యూలైన్లు,కంపార్ట్మెంట్లలో ఉన్న భక్తులకు ఎప్పటికప్పుడు అల్పాహారం,పాలు,మంచినీరు అందిస్తున్నారు.
హైదరాబాద్ పబ్బుల్లో సోదాలు చేస్తున్న పోలీసులు. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 10, 36, 45 లోని పబ్ లో సోదాలు నిర్వహిస్తున్న పోలీసులు. అన్ని పబ్బుల్లో ఆకస్మిక తనిఖీలు చేస్తున్న పోలీసులు. నిక్స్. డౌన్ టన్. పబ్బులు స్లీపర్ స్నిపర్ లను తీసుకువెళ్లి తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులు. పబ్ లో డ్రగ్స్ , గంజాయి అమ్మకాలపై దృష్టి సారించిన పోలీసులు. మొదటిసారి స్నిపర్ డాగులను వెంటబెట్టుకొని సోదాలు నిర్వహిస్తున్న పోలీసులు.
విజయనగరం జిల్లా, శృంగవరపుకోట, కిల్తంపాలెంలో బాబు ష్యురిటి భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమంలో పొల్గొన్న శృంగవరపుకోట నియోజకవర్గ ఇంచార్జి & మాజీ ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి. శృంగవరపుకోట మండలం, కిల్తంపాలెం పంచాయతీ దెప్పురు & కరక వంజురు గ్రామాల్లో ఏర్పాటు చేసిన బాబు ష్యురిటి భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో శృంగవరపుకోట నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జ్ కోళ్ల లలిత కుమారి పాల్గొన్నారు. బాబు ష్యురీటి భవిష్యత్తుకు గ్యారెంటీ భాగంగా ఇంటింటికి వెళ్లి రిజిస్ట్రేషన్ చేస్తూ కరపత్రాలను పంపణీ చేశారు. అనంతరం ప్రజలకు మినీ మేనిఫెస్టో పథకాల గురించి వివరించారు. ప్రతీ క్లస్టర్, యూనిట్, బూత్ కన్వీనర్ల పరిధిలో ఉన్న ఓటరు జాబితాలను పరిశీలించి దొంగ ఓట్లను గుర్తించాలని, టీడీపీ సానుభూతిపరుల ఓట్లను తొలగిస్తే వాటిని మరల చేర్పించాలని సూచించారు. త్వరగా కొత్త ఓట్లపైన ప్రత్యేకంగా దృష్టి సారించాలని పార్టీ నాయకులకు, కార్యకర్తలకు సూచించారు.
ట్రాన్స్జెండర్ వ్యక్తులు తరచుగా ఎదుర్కొనే ప్రత్యేక ఆరోగ్య అవసరాలను ఈ కేంద్రం దృష్టిలో ఉంచుకుని ప్రారంభించబడింది. ఎఎంఆర్ఐ ముకుందాపుర్ ఆస్పత్రిలో ఏర్పాటు చేయబడిన ఈ ప్రత్యేక యూనిట్ వైద్య పరీక్షలు, హార్మోన్ థెరపీ, శస్త్రచికిత్సా ప్రక్రియలు వంటి సేవలను అందిస్తుంది.
ట్రాన్స్జెండర్ వ్యక్తుల ఆరోగ్యంపై ప్రత్యేక శిక్షణ పొందిన వైద్య సిబ్బంది ఈ కేంద్రంలో పనిచేస్తారు. ఇది ట్రాన్సజెండర్స్ కు సానుకూల వాతావరణాన్ని అందిస్తుంది. రోగులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా మంచి వైద్య సేవలు అందిస్తుంది.
ట్రాన్స్జెండర్ ఆరోగ్యం యొక్క ప్రాముఖ్యత
ట్రాన్స్జెండర్ వ్యక్తులు సాధారణ జనాభా కంటే అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటారు. డిప్రెషన్, ఆందోళన, హై బీపీ మరియు గుండె జబ్బులు వంటి ప్రమాదం వారిలో ఎక్కువగా ఉంటుంది. ఈ కేంద్రం లో వారు ఎదుర్కొనే ఆరొగ్య సమస్యలకు మంచి పరిష్కార మార్గం లభిస్తుంది.
కోల్కతాలోని ఈ కొత్త యూనిట్ ట్రాన్స్జెండర్ వ్యక్తుల ఆరోగ్య సమస్యలు తెలుసుకొని మరియు వారికి మెరుగైన ఆరోగ్య ఫలితాలను సాధించడంలో సహాయపడుతుంది. ఇది ఇతర నగరాలకు ఆదర్శంగా ఉండాలి మరియు భారతదేశంలో ట్రాన్స్జెండర్ ఆరోగ్య సంరక్షణకు నమూనాగా ఉండాలి అని సంకల్పం తో ప్రారంభించారు.
ఈ కొత్త యూనిట్ ప్రారంభం ట్రాన్స్జెండర్ కమ్యూనిటీకి ఒక గొప్ప అవకాశం. ఇది వారి ఆరోగ్య అవసరాలను గుర్తించి, వారి మెరుగైన ఆరోగ్యనికి సహాయపడుతుంది.





Total views : 202791