తెలంగాణ సచివాలయంలో మార్పులు జరుగుతున్నాయి. తూర్పు వైపు ఉన్న ప్రధాన ద్వారాన్ని మూసేస్తున్నారు. ఇందులో భాగంగా కేసీఆర్ ఆనవాళ్ళను టార్గెట్ చేస్తున్న రేవంత్ రెడ్డి ప్రధాన ద్వారం తలుపులు తీసేసి ఆ ప్రాంతంలో రేకులను ఏర్పాటు చేశారు. ఈశాన్యం గేటుకు తూర్పు వైపుకు ప్రధాన ద్వారం రానుంది. ఇక్కడ మరో గేటును ఏర్పాటు చేయనున్నారు. మిగతా గేట్లను యథావిధిగా ఉంచనున్నారు. డిసెంబర్ 9న తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ ఉండటంతో ఆ లోపు వాస్తు మార్పులు పూర్తి చేసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు.
దాదాపు 3కోట్ల 20 లక్షలతో ప్రభుత్వం ఈ మార్పులు చేస్తోంది. సచివాలయానికి ప్రస్తుతం నాలుగు వైపుల ప్రధాన గేట్లు ఉన్నాయి. తూర్పు వైపు లుంబినీ పార్క్ ఎదురుగా ఉన్న బాహుబలి గేటు నుంచి మాజీ సీఎం కేసీఆర్ రాకపోకలు జరిపేవారు. ఆ గేటు నుంచి సచివాలయం లోపల ప్రధాన ద్వారం వరకు రాకపోకలను కొంతకాలం నిలిపేశారు. ఆ దారిలోనే తెలంగాణ తల్లి విగ్రహంతో పాటు చుట్టూ లాన్, ఫౌంటెయిన్లు ఏర్పాటు చేస్తున్నారు. నైరుతి, ఈశాన్య గేట్లను కలుపుతూ రోడ్డును కూడా వేస్తున్నారు. పశ్చిమం వైపు మింట్ కాంపౌండ్ ఉంది. ఈ ద్వారాన్ని ఎక్కువగా ఉపయోగించడం లేదు. ఇక్కడ ఎలాంటి మార్పులూ చేయడం లేదు. సచివాలయం నిర్మాణం తర్వాత మార్పులు చేయడం ఇదే తొలిసారి. కొత్త సచివాలయ భవనాన్ని కేసీఆర్ గత ఏడాది ఏప్రిల్ నెలలో ప్రారంభించారు

FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- ఐఐటి ఫలితాలలో విశ్వభారతి విజయకేతనం.ఐఐటి ఫలితాలలో కృష్ణాజిల్లా గుడివాడ విశ్వభారతి విద్యాసంస్థలు విజయకేతనం ఎగురవేశాయి. ఆల్ ఇండియా సెకండ్ ర్యాంక్ సాధించిన తోట సాయి వినీల్ కు పాఠశాల చైర్మన్ పొట్లూరి శ్రీమన్నారాయణ శుభాకాంక్షలు తెలియజేశారు. తమ పాఠశాలలో ఎనిమిదవ తరగతి నుండి పదవ తరగతి…
- హైదరాబాద్ ఉప్పల్ లో కాంగ్రెస్ నేత దౌర్జన్యం.హైదరాబాద్ ఉప్పల్ లో అమానవీయ ఘటన వెలుగుచూసింది. చిన్నారులు ఇంటి ముందు క్రికెట్ ఆడారని అధికార పార్టీ నాయకుడు పిల్లల తల్లిదండ్రుల పట్ల అమానుషంగా ప్రవర్తించిన ఘటన వీడియో వైరల్ అయింది. తల్లిదండ్రులపై దాడి చేయడమే కాకుండా తన అధికార బలంతో…
- జనసేన అధినేత పవన్‌కల్యాణ్ సంచలన నిర్ణయం.ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు, సేనా గళం పేరుతో కొత్త కమిటీ ఏర్పాటు చేశారు.అమరావతిలో జనసేన ముఖ్య నేతలతో సమావేశమయ్యారు పవన్ కళ్యాణ్. వివిధ అంశాలపై చర్చించారు. అనంతరం సేనా గళం పేరుతో…
- అమెరికాలో ఓ భారత సంతతి కుటుంబంలో విషాదం.అమెరికాలో ఓ భారత సంతతి కుటుంబంలో పెళ్లి సంబరాలు విషాదంగా మారాయి. వివాహం జరిగిన కొద్ది గంటల్లోనే వరుడు హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడంతో ఇరు కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి. జార్జియాలో జరిగిన ఈ ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. కేరళ…
- శ్రీశైలం మహాక్షేత్రంలో భక్తుల సందడి..నంద్యాల జిల్లా శ్రీశైలం మహాక్షేత్రంలో భక్తులు సందడి నెలకొంది. వేసవి సెలవులు కావడంతో భక్తులు భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనానికి పోటెత్తారు. క్యూలైన్లన్నీ భక్తులతో నిండిపోయాయి. భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో అలంకార దర్శనానికి అనుమతినిచ్చారు. ముందుగా ఆన్లైన్లో బుక్…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




Total views : 91108