జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ కుంగిన పిల్లర్లు, వంతెనను తెలంగాణ జన సమితి అధ్యక్షుడు, ప్రొఫెసర్ కోదండరాం పరిశీలించారు.లక్ష్మీ బ్యారేజ్ కుంగడం పై శ్వేతపత్రం విడుదల చేయాలని దేశంలో జరిగిన కుంభకోణాలలో కాళేశ్వరం ప్రాజెక్ట్ కూడా ఒకటి అన్నారు. గతంలో నిర్మించిన ఎల్లంపల్లి,SRSP ప్రాజెక్టులకు ఏలాంటి డోకా లేదన్నారు. బ్యారేజ్ కుంగడానికి గల కారణాలు తెలియజేయాలి. ప్రాజెక్ట్ పై న్యాయ విచారణ చేపట్టాలని,బాద్యులపై చర్యలు తీసుకోవాలని కోదండరాం డిమాండ్ చేసారు.
Medigadda Barrage Pillar
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కుంగిన మేడిగడ్డ బ్యారేజీని పరిశీలించారు. ఇవాళ భూపాలపల్లి జిల్లాలోని మేడిగడ్డ వద్ద నిర్మించిన లక్ష్మీ బ్యారేజీని రాహుల్ గాంధీతో పాటు రేవంత్ రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క పరిశీలించారు. మేడిగడ్డ బ్యారేజీ పరిశీలనకు ఇతరులను అనుమతి ఇవ్వలేదు. బ్యారేజీ కుంగిన పిల్లర్లను రాహుల్ గాంధీ సహా ఇతర నేతలు పరిశీలించారు. ఆ తర్వాత హెలికాప్టర్ ద్వారా ఏరియల్ సర్వే నిర్వహించారు. మేడిగడ్డ బ్యారేజి వద్దకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. ఈ ప్రాంతంలో బారికేడ్లు ఏర్పాటు చేశారు. బారికేడ్లను తోసుకుంటూ మేడిగడ్డ బ్యారేజీ వైపునకు కాంగ్రెస్ కార్యకర్తలు వెళ్లే ప్రయత్నం చేశారు. అయితే కాంగ్రెస్ శ్రేణులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం ప్రాజెక్ట్ సమస్యల సుడిగుండంలో కూరుకుపోతోంది. కన్నేపల్లి పంప్ హౌస్ హెడ్ రెగ్యులేటర్ వద్ద గేట్లు విరిగిపోయి ఫోర్ బీలో వాటర్ ఫోర్స్ల్ గా బయటకు చిమ్ముతోంది. నాసిరకంగా కట్టిన పంప్ హౌస్ కూడా వాటర్ ఫోర్స్ తో కూలగా.. ఆరు మోటార్లు తుక్కుతుక్కయ్యాయి. మొదటిసారి వాటర్ పంపింగ్ స్టార్ట్ చేసిన తర్వాత నాసిరకమైన పనులతోని కన్నెపల్లి పంపు హౌస్ నుండి అన్నారం బ్యారేజ్ కి వాటర్ ని తరలించే కెనాల్ సైడ్ వాల్ కూలిపోయింది. దానిని ఇప్పటివరకు సరి చేయలేకపోయారు అధికారులు. ప్రస్తుతం మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టుకు తలభాగమైన మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్ కుంగి బ్రిడ్జి కిందికి వంగింది.





Total views : 78422