కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఘర్షణ పడితే ప్రజలకు నష్టమని.. స్టేట్, సెంట్రల్ గవర్నమెంట్ల మధ్య సామరస్యపూర్వక వాతావరణం ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఎన్నికల సమయంలోనే రాజకీయాలు చేయాలని.. తెలంగాణ అభివృద్ధి కోసం కేంద్రంతో కలిసి ముందుకు పోతామని స్పష్టం చేశారు. హైదరాబాద్లోని మూసీ నది అభివృద్ధికి కేంద్రం సహకరించాలని సీఎం రేవంత్ రెడ్డి రిక్వెస్ట్ చేశారు. ఆదిలాబాద్ జిల్లా పర్యటనకు వచ్చిన ప్రధాని మోడీకి సీఎం రేవంత్ రెడ్డి స్వాగతం పలికారు. తాము అధికారంలోకి వచ్చాక తెలంగాణ సమస్యలను ప్రధాని మోడీ దృష్టికి తీసుకెళ్లామని గుర్తు చేశారు. పలు అంశాలపై కేంద్ర సానుకూలంగా నిర్ణయం తీసుకుందన్నారు. స్కైవేల నిర్మాణానికి డిఫెన్స్ భూములను ఇచ్చారని చెప్పారు. తెలంగాణ అభివృద్ధికి సహకరించింనందుకు ప్రధాని మోడీకి రేవంత్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.
modi
వచ్చే పార్లమెంట్ ఎన్నికల కోసం 195 లోక్ సభ స్థానాల్లో అభ్యర్థులను ప్రకటిస్తూ బీజేపీ కేంద్ర నాయకత్వం తొలి జాబితాను విడుదల చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి వారణాసి నుంచి పోటీ చేయనున్నారు. తెలంగాణ నుంచి 9 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేశారు. బీజేపీ మొదటి జాబితాలో 47 మంది యువతకు, 28 మంది మహిళలకు, 27 మంది ఎస్సీలకు, 18 మంది ఎస్టీలకు, 57 మంది ఓబీసీలకు సీట్లు దక్కాయి. ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులకు కూడా సీట్లు దక్కాయి. అసోంలోని 14 లోక్ సభస్థానాలకు గాను 11 స్థానాల్లో అభ్యర్థులను బీజేపీ ప్రకటించింది. అసోం సీఎం శరబానంద సోనోవాల్ కూడా దిబ్రూఘర్ లోక్ సభ స్థానం నుంచి పోటీ చేయనున్నారు. బెంగాల్ నుంచి ఇరవై, మధ్యప్రదేశ్ నుంచి ఇరవై నాలుగు, గుజరాత్ నుంచి పదిహేను, రాజస్థాన్ నుంచి పదిహేను, కేరళ నుంచి పన్నెండు, తెలంగాణ నుంచి తొమ్మిది, అసోం, ఝార్ఖండ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి పదకొండు సీట్ల చొప్పున, ఢిల్లీ నుంచి ఐదు స్థానాలలో అభ్యర్థులను ఖరారు చేశారు. వారణాసి నుంచి ప్రధాని మోదీ, అరుణాచల్ ప్రదేశ్ నుంచి కిరణ్ రిజిజు, ఉత్తర ఢిల్లీ నుంచి మనోజ్ తివారీ, త్రిసూర్ నుంచి సురేశ్ గోపి, గాంధీ నగర్ నుంచి అమిత్ షా, విదిశ నుంచి శివరాజ్ సింగ్ చౌహాన్ పోటీ చేయనున్నారు.
సంగారెడ్డి జిల్లా(Sangareddy):
సంగారెడ్డి జిల్లా(Sangareddy) పటాన్చెరు పట్టణం(Patancheru)లో ఈ నెల 5వ తేదీన భారత ప్రధాని నరేంద్ర మోడి(Prime Minister Narendra Modi) సభ జరగనుంది. ఈ సభను పురస్కరించుకొని బీజేపీ రాష్ట్రస్థాయి నాయకులు సన్నాహక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ప్రధాన మంత్రి సభకి లక్ష మంది జనాలు వచ్చేలా చూడాలన్నారు సభకు వచ్చిన ముఖ్యనేతలు. ఎవరికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని రకాల వసతులు కల్పించాలని సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
ఇది చదవండి: మొదటిసారి హైదరాబాద్ కు బిల్ గేట్స్…
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి.
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్, బి ఆర్ ఎస్, ఎంఐఎం పార్టీలు కుట్రలు పన్ని రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బిజెపిని ఓడించేందుకు కంకణం కట్టుకున్నారని కేంద్రమంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు జి కిషన్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి, టిఆర్ఎస్ పార్టీకి, ఎంఐఎంకు ఓటు వేసిన ఎవరూ ప్రధాని కాలేరని ఆయన ఎద్దేవా చేశారు. దేశం కోసం మోదీ, మోడీ కోసం మనం ఫిర్ ఎక్ బార్ మోడీ సర్కార్ అంటూ నిర్వహించిన విజయ సంకల్పయాత్రలో భాగంగా రాంనగర్ చౌరస్తాలో జరిగిన బహిరంగ సభలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ముఖ్య అతిధి హాజరై మాట్లాడారు. దేశంలో కుటుంబ పాలన కోసం పనిచేసే కాంగ్రెస్, టిఆర్ఎస్ లకు ఓటు వేస్తే వచ్చేది ఏమీ లేదన్నారు. ప్రజలను మభ్య పెట్టేందుకు కాంగ్రెస్ పార్టీ అప్పుడు వాగ్దానాలు చేసిందని, గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను ఇప్పటివరకు అమలు చేయ లేదనీ అన్నారు. రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ టిఆర్ఎస్, ఎంఐఎం పార్టీలకు ఓటు వేస్తే ఆ ఓటు వృధా అయిపోతుందనీ దేశ ప్రజల కోసం యువత కోసం నిత్యం ఆలోచించే దేశ ప్రధాని నరేంద్ర మోదిని మూడోసారి గెలిపిస్తేనే దేశానికి, దేశంలో ఉన్న యువత, ప్రజలకు మంచి భవిష్యత్తు ఉంటుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఏది ఏమైనా రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్, టిఆర్ఎస్, ఎంఐఎం పార్టీలను చిత్తుగా ఓడించి బిజెపికి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 17 ఎంపీ స్థానాల్లో బిజెపిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు.
దేశంలోని అన్ని పార్టీలు తమ వారసులను ప్రధానమంత్రి, ముఖ్య మంత్రి చేయాలని చేస్తున్నారు కానీ మోడీ మాత్రం దేశ ప్రజల కోసం పని చేస్తున్నారని, మోడీ అవినీతి పై పోరాటం చేస్తున్నాడు. దానికి మీ సహకారం కావాలి పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ కి ఓటు వేసి మరోసారి మోడీ బీజేపీ కి అవకాశం ఇవ్వాలని దేశం మరియు ప్రపంచం మొత్తం మోడీ వైపే చూస్తుందని విజయ సంకల్ప యాత్రలో పాల్గొంటున్న అశేష జనవాహిని చూస్తుంటే మళ్ళీ మోడీ ప్రధాని కావడం తధ్యమని కేంద్ర మంత్రి పరుషోత్తం రూపాల ఆశాభావం వ్యక్తం చేశారు.
బీజేపీ తెలంగాణ శాఖ నిర్వహిస్తున్న విజయ సంకల్పయాత్ర లో భాగంగా పెద్దపల్లి నియోజకవర్గంలో బీజేపీ విజయ సంకల్ప యాత్ర సభ పెద్దపల్లి పట్టణం జండా చౌరస్తాలో ఏర్పాటు చేయగా ముఖ్యఅతిథిగా కేంద్ర ఫిషర్స్ అండ్ పశు సంవర్దక శాఖ మంత్రి పరుషోత్తం రూపాల పాల్గొన్నారు. తెలంగాణాలో బీజేపీ విజయ సంకల్ప యాత్రతో మంచి స్పందన వస్తుందని, మోడీ నేత్రుత్వం లో పారదర్శక పాలన కొనసాగుతుందని, అయోధ్యలో రామమందిరం నిర్మాణం 500 సంవత్సరాల దేశ ప్రజల కళ మోడీ నేత్రత్వంలో రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ట చేసి దేశ ప్రజలకు భాగ్యం కల్పించారు. ఎలాంటి అవినీతి లేకుండా పాలన జరుగుతుంది
దేశంలోని అన్ని పార్టీలు తమ వారసులను ప్రధానమంత్రి, ముఖ్య మంత్రి చేయాలని చేస్తున్నారు కానీ మోడీ మాత్రం దేశ ప్రజల కోసం పని చేస్తుందని, మోడీ అవినీతి పై పోరాటం చేస్తున్నాడు దానికి మీ సహకారం కావాలి పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ కి ఓటు వేసి మరోసారి మోడీ కి అవకాశం ఇవ్వాలని కోరారు.
మహబూబ్ నగర్ పార్లమెంటు పరిధిలో బిజెపి పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బిజెపి విజయ సంకల్ప యాత్ర నేడు జడ్చర్ల నియోజకవర్గానికి చేరుకుంది. ఈ కార్యక్రమంలో బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, రాష్ట్ర బిజెపి కోశాధికారి శాంత కుమార్, పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మొదటగా బాలనగర్ మండల కేంద్రానికి విజయ సంకల్ప యాత్ర చేరుకున్న సందర్భంగా గిరిజన మహిళలు వారికి సాంప్రదాయా నృత్యాలతో స్వాగతం పలికారు. మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని ఉద్దేశించి బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ మాట్లాడుతూ దేశంలో మరోసారి నరేంద్ర మోడీ ప్రధాని కాబోతున్నారని వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో బిజెపి పార్టీకి 400 పైగా సీట్లు రావడం ఖాయమని మోదీని ఆపే శక్తి దేశంలో ఏ పార్టీకి లేదని ఆమె ధీమా వ్యక్తం చేశారు. మరోవైపు ఇండియా కూటమే రాహుల్ గాంధీని ప్రధాని అభ్యర్థిగా అంగీకరించడం లేదని, రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆరు గ్యారంటీల అమలుపై పూర్తిగా విఫలం అయిందని వారన్నారు. భారతదేశం వికసించే భారత్ కావాలంటే దేశం మరింత అభివృద్ధి చెందేందుకు మరోసారి మోదీ ప్రధాని కావాల్సిందే అని ప్రజలంతా వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో బిజెపికి తమ మద్దతును తెలిపి ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించి కేంద్రంలో బిజెపి ప్రభుత్వం వచ్చేందుకు కృషి చేయాలని వారు ప్రజలకు పిలుపునిచ్చారు.
Vijaya Sankalpa Yatra :
త్వరలో జరగనున్న పార్లమెంటు ఎన్నికల్లో మల్కాజ్గిరి పై బీజేపీ జెండా ఎగరాలని విజయ సంకల్ప యాత్రకు ముఖ్య అతిథులుగా ఈటల రాజేందర్, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు, కామారెడ్డి ఎమ్మెల్యే కాటేపల్లి వెంకటరమణారెడ్డి లు అన్నారు. మల్కాజ్గిరి పార్లమెంట్ స్థాయిలో బీజేపీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న విజయ సంకల్ప యాత్ర శుక్రవారం సాయంత్రం ఎల్బీనగర్ నియోజకవర్గానికి చేరుకుంది. ఈ సందర్భంగా నాగోల్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన అయోధ్య రాముని చిత్రపటానికి పూలమాలలు వేసి పూజలు నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాలనలో దేశం అన్ని రంగాల్లో ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. మోదీ ప్రధానమంత్రి కాకముందు మన దేశం ప్రపంచ ఆర్ధిక వృద్దిలో 11వ స్థానంలో వుంటే, మోదీ పదేళ్ల పాలనలో దానిని 5వ స్థానానికి తీసుకువచ్చారని గుర్తు చేశారు. అంతేగాకుండా ఎన్నో అసాధ్యాలను సుసాధ్యం చేసి చూపిన ఘనత ఆయనకు దక్కిందన్నారు. కాంగ్రెస్ పాలనలో దశాబ్దాల తరబడి పరిష్కారానికి నోచని అయోధ్య రామ మందిరం, 370 ఆర్టికల్ రద్దు, మహిళా రిజర్వేషన్ బిల్లు లాంటి వాటిని తనదైన శైలిలో చేసి చూపించారని తెలిపారు. నరేంద్ర మోదీ భారతదేశ ప్రజలకు నిజమైన రాముడిలా, ఆరాధ్య దైవంగా మారారన్నారు. అలాగే పేద, మధ్య తరగతి ప్రజలు, రైతులకు ఉపయోగపడే సంక్షేమ పథకాలను అమల్లోకి తీసుకువచ్చారని వారు గుర్తు చేశారు. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని రానున్న పార్లమెంటు ఎన్నికల్లో అన్ని వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా బీజేపీ కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. రాష్ట్రంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు ఓటు వేయడం వల్ల ఎలాంటి ప్రయోజనం వుండదన్నారు. ఇటీవల కేసీఆర్ పై వ్యతిరేకతతో అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఓటువేసి అధికారాన్ని కట్టబెట్టిన ప్రజలు ఇప్పుడు ఆలోచనలో పడ్డారని తెలిపారు. ఆరు గ్యారంటీలను అమలు చేసేందుకు నిధులు లేకపోవడంతో రేవంత్ రెడ్డికి సిఎం పదవి ముళ్ల కిరీటంలా మారిందన్నారు. ఆరు గ్యారంటీలను అమలు చేయాలంటే 1.50 వేల కోట్లు అవసరం వుండగా, కేవలం రాష్ట్ర బడ్జెట్లో 60 కోట్లు మాత్రమే కేటాయించడం జరిగిందన్నారు. ఇక కాంగ్రెస్ తో రాష్ట్రం అభివృద్ధి చెందే పరిస్థితి లేదన్న విషయాన్ని ప్రజలు గ్రహించాలన్నారు. బీజేపీకి ఓటు వేయడం ద్వారా కేంద్రం ఇచ్చే నిధులతో రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందుతుందని వారు తెలిపారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో సిఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమావేశం ముగిసింది. ప్రధానికి శాలువా కప్పి సత్కరించి.. వెంకటేశ్వరస్వామి ప్రతిమను బహూకరించారు. ప్రధానితో సీఎం జగన్ సమావేశం దాదాపు గంటన్నర పాటు సాగింది. విభజన హామీలు, ఏపీకి రావాల్సిన పెండింగ్ నిధులు, తాజా రాజకీయ పరిణామాల గురించి సీఎం జగన్ ప్రధాని మోదీతో చర్చించినట్టు తెలుస్తోంది. ఈ సమావేశానికి పార్లమెంటులోని ప్రధాని కార్యాలయం వేదికగా నిలిచింది. ప్రధానితో సమావేశం అనంతరం సీఎం జగన్ పార్లమెంటులోని ఆర్థిక శాఖ కార్యాలయంలో కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ను కలిశారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పెండింగ్ బకాయిల గురించి చర్చించారు. Read Also..
బీజేపీ అగ్రనేత లాల్ కృష్ణ అద్వానీకి భారత రత్న అవార్డు దక్కింది. 1990వ దశకం ప్రారంభంలో అయోధ్యలోని రామ మందిరం కోసం రథ యాత్రతో..బీజేపీ నాయకుడు లాల్ కృష్ణ అద్వానీ పార్టీని జాతీయ స్థాయికి చేర్చారు. ఆయనకు భారత దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న రావడం పట్ల.. ప్రముఖ నాయకులంతా హర్షం వ్యక్తం చేశారు. అదే విధంగా అయోధ్య రామ మందిర నిర్మాణానికి ఆయన కృషి ఎనలేనిదని ప్రధానమంత్రి మోదీ అన్నారు. దేశ అభివృద్ధిలో అద్వానీది కీలక పాత్ర అని కొనియాడారు. ఆయనను కలిసి ప్రధాని మోదీ తన అభినందనలు తెలియజేశారు.
సార్వత్రిక ఎన్నికల ముంగిట భారీ అంచనాల నడుమ 2024-2025 బడ్జెట్ కు మోదీ సర్కార్ రంగం సిద్ధం చేసింది. ఈ బడ్జెట్ ను నేడు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్ సభలో ప్రవేశ పెట్టనున్నారు. త్వరలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపధ్యంలో ప్రభుత్వం ప్రస్తుతానికి మధ్యంతర బడ్జెట్ ను ప్రవేశపెట్టనుంది. సాధరణంగా మధ్యంతర బడ్జెట్ లో విధానపరమైన కీలక నిర్ణయాలేమి ఉండవు. అయితే మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనుకుంటున్న మోదీ రైతులను, మహిళలను ప్రసన్నం చేసుకునేందుకు తాయిలాలు ప్రకటించే అవకాశం ఉందని పలువురు విశ్లేషకులు భావిస్తున్నారు.





Total views : 91166