మడకశిర (Madakasira) లో టిడిపి వర్గపోరు ఈరోజు తారాస్థాయికి చేరింది. మడకశిరలో టిడిపి రెబల్ అభ్యర్థి సునీల్ కుమార్ వర్గీయులు. మడకశిర టిడిపి అభ్యర్థిగా ఎమ్మెస్ రాజుకు బీఫామ్ రావడంతో మడకశిర ఆత్మీయ సమావేశానికి విచ్చేస్తున్న ఎంఎస్ రాజు, హిందూపురం టిడిపి పార్లమెంట్ అభ్యర్థి పార్థసారథి కారులో వస్తుండగా మడకశిర పట్టణంలో వారి కార్లపై రాళ్లతో దాడి చేసారు. టిడిపి వర్గాలు నాలుగు కార్లు అద్దాలు పగలగొట్టి ధ్వంసం చేసారు. ఈరోజు మడకశిర టిడిపి రెబల్ అభ్యర్థి నామినేషన్ దాఖలు చేస్తున్న సందర్భంలో వీరు అటుగా రావడంతో కార్యకర్తలు ఒక్కసారిగా దాడికి పాల్పడ్డారు. ఒక్కసారిగా కంగు తిన్న ఎమ్మెస్ రాజు, పార్థసారతులను తరిమికొట్టగా కారులో వెనుతిరిగి వెళ్ళిపోయారు. వారి కారు అద్దాలను రాళ్లతో చెప్పులతో దాడి చేసి పగలగొట్టారు. పోలీసులు జోక్యం చేసుకొని దాడికి పాల్పడిన వారిని బెదరగొట్టారు. మడకశిరలో టిడిపి వర్గపోరు ఈరోజు తారాస్థాయికి చేరింది.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- బి.కొత్తకోటలో గ్యాస్ సిలిండర్ల కోసం ఆందోళన.అన్నమయ్య జిల్లా బి.కొత్తకోట పట్టణంలోని పిటియం రోడ్డులో ఉద్రిక్తత నెలకొంది. పెద్దతిప్పసముద్రం మండలంలో వంట గ్యాస్ సిలిండర్ల కోసం లబ్ధిదారులు రోడ్డెక్కారు. ఇండియన్ గ్యాస్ యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నిసార్లు గ్యాస్ బుక్ చేసుకున్నా.. బుకింగ్‌ను రద్దు…
- అంబటి రాంబాబుకు ఈడీ నోటీసులు.ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబుకు ఈడీ నోటీసులు జారీ చేసింది. రేపు ఉదయం పదున్నర గంటలకు హైదరాబాద్‌లోని ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని ఫోన్ ద్వారా సమాచారం అందించారు. అయితే…
- తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా వినాయక నిమజ్జనాలు.తెలుగు రాష్ట్రాల్లో వినాయక నవరాత్రి ఉత్సవాలు అంబరాన్నింటుతున్నాయి. ఊరూ వాడా ఏకదంతుడి జయజయధ్వానాలతో ప్రతిధ్వనిస్తున్నాయి. భక్తి శ్రద్ధలు, కోలాటాలు, డప్పు చప్పుళ్లతో లంబోదరుడికి భక్తులు ఘనంగా వీడ్కోలు పలుకుతున్నారు. అయితే.. భక్తజన సందోహం మధ్య అత్యంత వైభవంగా, సంతోషంగా సాగాల్సిన ఈ…