టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర ముగిసింది. చిత్తూరు జిల్లా కుప్పంలో జనవరి 27న ప్రారంభమైన లోకేష్ పాదయాత్ర నిన్నటితో పూర్తి అయింది. రాష్ట్రంలోని 11 ఉమ్మడి జిల్లాల్లో 97 అసెంబ్లీ నియోజకవర్గాలు, 232 మండలాలు, మున్సిపాలిటీలు, 2028 గ్రామాల మీదుగా 226 రోజుల పాటు దిగ్విజయంగా లోకేష్ పాదయాత్ర జరిగింది. మొత్తం 3వేల 132 కిలో మీటర్లు మేర లోకేష్ పాదయాత్ర చేశారు. గతంలో టీడీపీ అధినేత, తండ్రి చంద్రబాబు వస్తున్నా మీకోసం పాదయాత్రను ఎక్కడైతే ముగించారో లోకేష్ కూడా అక్కడే తన యువగళం పాదయాత్రను ముగించారు. ఈ సందర్భంగా విశాఖ జిల్లా అగనంపూడి వద్ద నారా లోకేష్ పైలాన్ ఆవిష్కరించారు. పాదయాత్ర ముగింపు కార్యక్రమానికి టీడీపీ, జనసేన శ్రేణులు భారీగా తరలివచ్చారు. వారందరికి లోకేష్ ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ జగన్పై విరుచుకుపడ్డారు. రాష్ట్రానికి అసమర్ధుడు సీఎం అయ్యారని, వ్యవస్థలన్నింటినీ సర్వ నాశనం చేశారని మండిపడ్డారు. నియంతృత్వంపై ప్రజా యుద్ధమే యువగళమని పేర్కొన్నారు. అణచివేతకు గురైన వర్గాలకు యువగళం గొంతుకైందని చెప్పారు. భవిష్యత్ పై ఆశలు కోల్పోయిన యువతకు తన యువగళం పాదయాత్రతో భరోసా కల్పించానని చెప్పారు. పాదయాత్రలో తాను ఇచ్చిన హామీలన్నింటికీ కట్టుబడి ఉన్నామని లోకేష్ స్పష్టం చేశారు.
nara lokesh
రేపు 20 వ తేదీన మధ్యాహ్నము 2గంటల నుండి పోలిపల్లి గ్రామంలో యువ గళం – నవ శకం, టీడిపి ఎన్నికల శంఖారావం సభకు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అభిమానుల తో పాటు భీమవరం, చింతల పూడి నియోజక వర్గాల టీడీపీ కుటుంబ సభ్యులు, నాయకులు, ప్రజలు పెద్ద ఎత్తున తరలి రావాలని టీడిపి రాష్ట్ర కార్యదర్శి, భీమవరం AMC మాజీ చైర్మన్,చింతల పూడి నియోజక వర్గ పరిశీలకులు, భీమిలి తాత్కాలిక పరిశీలకులు కోళ్ళ నాగేశ్వర రావు కోరారు.
ఎన్టీఆర్ జిల్లా నందిగామలో ఆదివారం రేపు జరిగే సామాజిక సాధికారిక యాత్రకు సర్వం సిద్దం చేసినట్లు ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ మీడియా సమావేశంలో తెలిపారు. స్థానిక వైయస్సార్ సిపి కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ నియోజకవర్గం వ్యాప్తంగా సుమారు 25 వేల మంది వైయస్సార్ సిపి నాయకులు కార్యకర్తలు బస్సు యాత్రలో పాల్గొంటారని తెలిపారు. యాత్రకు సంబంధించి ఇప్పటికే నియోజకవర్గం లో ని ప్రతి గ్రామం నుంచి భారీ బస్సు యాత్రకు తరలిరాన్నుట్లు తెలిపారు. బస్సు యాత్ర అనంతరం గాంధీ సెంటర్లో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ బహిరంగ సభకు అనేక మంది మంత్రులు, విడుదల రజిని మెరుగ నాగార్జున శాసన సభ్యులు,శాసన మండలి సభ్యులు, శాసన సభ్యులతో పాటు అన్ని రకాల కార్పొరేషన్ లో ఛైర్మన్ లు పాల్గొంటారని తెలిపారు. ఈ బహిరంగ సభలో గత నాలుగున్నర సంవత్సరాలో వైయస్సార్ సిపి ప్రభుత్వం ప్రజలకు చేసిన మంచిని వివరించనున్నట్లు తెలిపారు. అలాగే మళ్ళీ తిరిగి నందిగామ నియోజకవర్గంలో డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గెలుపుకు నాంది పలుకుతుందని తెలిపారు.
కాకినాడ జిల్లా తునిలో యువగళం పాదయాత్ర సందర్భంగా టీడీపీ నాయకుడు నారా లోకేష్ అక్కడి మత్యకారులతో మాట్లాడుతూ… మత్యకారులకు నాడు చంద్రబాబు ఎంతో మేలు చేస్తే.. నేడు సైకో జగన్ ప్రభుత్వం అన్నీ రద్దు చేసిందని ఆయన అన్నారు. మత్స్యకారుల తరపున బహిరంగ చర్చకు నేను సిద్ధమని, మత్యకార మంత్రి అప్పలరాజు సిద్ధమా అంటూ సవాల్ విసిరారు. టీడీపీ అధికారంలోకి వచ్బిన వంద రోజుల్లోపు జీవో 217 రద్దు చేస్తామని, బీసీలకు ప్రత్యేక రక్షణ చట్టం తీసుకువస్తామని ఆయన అన్నారు. కెమికల్ ఫ్యాక్టరీల వ్యర్థాల వల్ల మత్స్యకారులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, టీడీపీ అధికారంలోకి వచ్చాక పొల్యూషన్ లేని కంపెనీలు తీసుకువస్తామని ఆయన భరోసా ఇచ్చారు.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర డిసెంబరు 17తో ముగియనుంది. భీమిలి నియోజకవర్గంలో యువగళం ముగింపు సభను భారీ ఎత్తున నిర్వహించనున్నారు. ఈ సభకు టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్ హాజరుకానున్నారు. ఈ మేరకు టీడీపీ విశాఖ పార్లమెంటు స్థానం అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు వెల్లడించారు. యువగళం పాదయాత్ర డిసెంబరు 6న అనకాపల్లి జిల్లాలోని పాయకరావుపేటకు చేరుకుంటుందని, పాయకరావుపేట 7న మొదలయ్యే యువగళం డిసెంబరు 17తో సమాప్తం అవుతుందని పల్లా శ్రీనివాసరావు వివరించారు. నారా లోకేశ్ జనవరి 27న కుప్పంలో యువగళం పాదయాత్ర షురూ చేశారు. 4 వేల కిలోమీటర్లు, 400 రోజుల పాటు పాదయాత్ర సాగించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. మధ్యలో చంద్రబాబు అరెస్ట్ కావడంతో యువగళానికి తాత్కాలికంగా బ్రేక్ పడింది. ఇటీవలే లోకేశ్ యువగళాన్ని పునఃప్రారంభించారు.
• జగన్ ప్రభుత్వం తెచ్చిన ల్యాండ్ టైటిలింగ్ చట్టం-2023ను రద్దు చేయాలి.
• ఈ చట్టం సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ఉంది.
• సివిల్ కోర్టులకు విచారణ పరిధి లేకుండా చేశారు.
• ప్రభుత్వ పరిధిలో పనిచేసే ల్యాండ్ టైటిలింగ్ అధికారులపై రాజకీయ జోక్యం ఉండే ఆస్కారం ఉంది.
• సివిల్ కేసులు వేగవంతంగా పరిష్కరించాలనుకుంటే కోర్టులు, సిబ్బంది సంఖ్యను పెంచాలి.
• న్యాయవాదులకు రక్షణ చట్టం తీసుకురావాలి.
• జగన్ ప్రభుత్వం న్యాయవాదుల సంక్షేమానికి ఇస్తానన్న రూ.100కోట్లలో రూ.75కోట్లు నేటికీ రాలేదు.
• కోర్టుల్లో ఖాళీ పోస్టులు భర్తీ చేయాలి, నిర్మాణ దశలో ఉన్న కోర్టు భవనాలు పూర్తిచేయాలి.
• ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసి కేసులు వేగంగా పరిష్కరించాలి.
• రూ.20 అడ్వకేట్ వెల్ఫేర్ స్టాంపును రద్దు చేసి, రూ.100 వెల్ఫేర్ స్టాంపును అమలు చేయాలి.
• న్యాయవాదుల కుటుంబాలకు ఆరోగ్య బీమా ప్రీమియాన్ని ప్రభుత్వమే చెల్లించాలి.
• 41ఏ సీఆర్పీసీ నోటీసుల దుర్వినియోగం అవుతున్న నేపథ్యంలో కొత్త మార్గదర్శకాలు రూపొందించాలి.
లోకేష్ స్పందిస్తూ…
• జగన్మోహన్ రెడ్డి పాలనలో న్యాయానికి సంకెళ్లు వేసే దుర్మార్గపు సంస్కృతిని తెచ్చాడు.
• న్యాయం కోసం పోరాడే న్యాయవాదులపై దాడులు, అక్రమ కేసులతో వేధింపులకు దిగుతున్నారు.
• సామాన్యుడికి న్యాయాన్ని దూరం చేసేలా నల్ల చట్టాలు తెస్తున్నారు.
• న్యాయమూర్తులను సైతం సైకో సోషల్ మీడియా గ్రూపుల్లో కించపరుస్తున్నారు.
• మేం అధికారంలోకి వచ్చాక న్యాయవాదులకు రక్షణ చట్టం తెస్తాం.
• ల్యాండ్ లైటిలింగ్ చట్టాన్ని రద్దు చేస్తాం.
• న్యాయవాదుల సంక్షేమ నిధిని పెంచుతాం.
• నిలిచిపోయిన కోర్టు భవనాల పనులు పూర్తిచేస్తాం.
• సత్వర న్యాయం ఫాస్ట్ ట్రాక్ కోర్టులను అమల్లోకి తెస్తాం.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్ర కోనసీమ జిల్లాలో కొనసాగుతోంది. ఈ సందర్భంగా లోకేశ్ ఆక్వా రైతులతో సమావేశమయ్యారు. ఆక్వా రైతులు తమ సమస్యలను లోకేశ్ కు వివరిస్తూ వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా లోకేశ్ స్పందిస్తూ… ఆక్వా రైతులను జగన్ ప్రభుత్వం దారుణంగా దెబ్బతీసిందని అన్నారు. జగన్ పాలనలో ఆక్వా హాలిడే ప్రకటించాల్సిన తీవ్ర పరిస్థితులు ఏర్పడ్డాయని పేర్కొన్నారు. టీడీపీ అధికారంలోకి వస్తే ఆక్వా రైతులకు సమస్యలు లేకుండా చేస్తామని.. సీడ్, ఫీడ్, కరెంటు చార్జీలు తగ్గేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఆక్వా ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలు కల్పించే బాధ్యత తీసుకుంటామని చెప్పారు. కాగా, లోకేశ్ యువగళం నేడు అమలాపురం, ముమ్మిడివరం నియోజకవర్గాల్లో కొనసాగనుంది. కొన్నిరోజుల కిందట వైసీపీకి రాజీనామా చేసిన ఏలేశ్వరం, రౌతులపూడి ఎంపీపీలు, ఎంపీటీసలు, సర్పంచులు టీడీపీలో చేరగా, వారికి లోకేశ్ పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. భట్నవల్లిలో లోకేశ్ యువతతో ముఖాముఖి నిర్వహించారు.
Read Also..
టీడీపీ యువనేత నారా లోకేశ్ ను ఉద్దేశించి వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై టీడీపీ అయ్యన్నపాత్రుడు ఘాటుగా స్పందించారు. ఎవరు నడమవన్నారో, ఎందుకు పెట్టుకున్నారో యువగళం యాత్ర అంటూ విజయసాయి ఈ ఉదయం ట్వీట్ చేశారు.గాలికుంటు, బ్లూటంగ్ వ్యాధులేమైనా సోకి నాలుక వాచిందేమో టెస్ట్ చేయించుకోండి చినబాబూ అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై అయ్యన్నపాత్రుడు ఘాటుగా స్పందించారు. పీకల్లోతు కేసుల్లో ఇరుక్కుని, అధికారం పోతే నీ బతుకేంటో తెలియక మెదడువాపు వ్యాధి వచ్చి పిచ్చి ట్వీట్లు వేస్తున్నావని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు విమర్శించారు. సప్తసముద్రాల అవతల దాక్కున్నా లాక్కొచ్చి తిన్నదంతా కక్కిస్తామన్నారు. పేలిన ప్రతీ తప్పుడు కూతకీ వాత పెట్టించి, బొక్కలో వేస్తామంటూ విజయసాయి రెడ్డిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్ర కోనసీమ జిల్లాలో కొనసాగుతోంది. ఈ సందర్భంగా లోకేశ్ ఆక్వా రైతులతో సమావేశమయ్యారు. ఆక్వా రైతులు తమ సమస్యలను లోకేశ్ కు వివరిస్తూ వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా లోకేశ్ స్పందిస్తూ ఆక్వా రైతులను జగన్ ప్రభుత్వం దారుణంగా దెబ్బతీసిందని అన్నారు. జగన్ పాలనలో ఆక్వా హాలిడే ప్రకటించాల్సిన తీవ్ర పరిస్థితులు ఏర్పడ్డాయని పేర్కొన్నారు. టీడీపీ అధికారంలోకి వస్తే ఆక్వా రైతులకు సమస్యలు లేకుండా చేస్తామని సీడ్, ఫీడ్, కరెంటు చార్జీలు తగ్గేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఆక్వా ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలు కల్పించే బాధ్యత తీసుకుంటామని చెప్పారు. కాగా, లోకేశ్ యువగళం నేడు అమలాపురం, ముమ్మిడివరం నియోజకవర్గాల్లో కొనసాగనుంది. కొన్నిరోజుల కిందట వైసీపీకి రాజీనామా చేసిన ఏలేశ్వరం, రౌతులపూడి ఎంపీపీలు, ఎంపీటీసలు, సర్పంచులు టీడీపీలో చేరగా, వారికి లోకేశ్ పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. భట్నవల్లిలో లోకేశ్ యువతతో ముఖాముఖి నిర్వహించారు.
Read Also..
Read Also..






Total views : 90557