తిరుపతి, ఉమ్మడి నెల్లూరు జిల్లా, గూడూరు జిల్లాలో పలుచోట్ల ఉద్రిక్తత అర్ధరాత్రి మున్సిపల్ కార్మికుల బైటాయింపు. కార్మికులు సమ్మెలో ఉండగా పర్మనెంట్, ప్రైవేట్ కార్మికులతో అర్ధరాత్రి చెత్త తీపిస్తున్న అధికారులు. అడ్డుకున్న మున్సిపల్ పారిశుధ్య ఔట్ సోర్సింగ్ సిబ్బంది. అధికారులు, పోలీసులుతో పారిశుద్ధ్య కార్మికుల వాగ్వాదం. నెల్లూరు నగరంలోనూ ఇదే పరిస్థితి. రోజు రోజుకూ ఉధృతం అవుతున్న కార్మికుల సమ్మె.
Nellore
దేశంలోనే అతిపెద్ద కుంభకోణం నెల్లూరు జిల్లాలో జరుగుతోంది. రూ.వేల కోట్ల ఖనిజాలను దోచేస్తున్నారు అని మాజీమంత్రి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. వైఎస్ భారతికి ముడుపులు పంపాలని బహిరంగంగా చెబుతున్నారు అని చెప్పుకొచ్చారు. తాను సత్యాగ్రహ దీక్ష చేస్తుంటే హిజ్రాలు, వైసీపీ గూండాలను పంపి లా అండ్ ఆర్డర్ సమస్య సృష్టించారు అని మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. రాజకీయాలు ఇంత దిగజారడం ఎన్నడూ చూడలేదు అని మండిపడ్డారు. అధారాలతో సహా ఫిర్యాదులు చేసినా పట్టించుకునే దిక్కులేదు అని మండిపడ్డారు. జెలిటిన్ స్టిక్స్, డిటోనేటర్ల డంప్‌ను చూపినా అధికారులు స్పందించలేదన్నారు. ఉద్యమం ఇంతటితో ఆపేదిలేదు అని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి హెచ్చరించారు.
నెల్లూరు జిల్లా పొదలకూరు మండలంలో గడువు ముగిసిన ఓ క్వారీ నుంచి అక్రమంగా క్వార్ట్జ్ తవ్వుతున్నారంటూ మూడు రోజుల నుంచి టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కొనసాగిస్తున్న సత్యాగ్రహ దీక్షను పోలీసులు భగ్నం చేశారు. రాత్రి 2 గంటల సమయంలో దీక్షా శిబిరం వద్దకు వెళ్లి సోమిరెడ్డిని బలవంతంగా తీసుకెళ్లి ఆయన ఇంటి వద్ద దించారు. ఈ సమయంలో పోలీసులు, కార్యకర్తలకు మధ్య వాగ్వాదం జరిగింది. టీడీపీ శ్రేణులు పోలీసులకు అడ్డుతగిలే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. చివరకు రాత్రి 2 గంటల సమయంలో దీక్షను భగ్నం చేశారు.
నెల్లూరులోని, దేవ రెడ్డి వారి వీధి లో బంగారు దుకాణ యజమాని విమల్ జైన్ ఇంట్లో భారీ దోపిడి. యజమాని ఇంట్లో ఉండగానే లోపలికి జొరబడి దోపిడీకి పాల్పడ్డ గుర్తు తెలియని దుండగులు. దంపతులు బంధించి బీరువాలోని బంగారు నగలను దోచుకెళ్లినట్లు సమాచారం. 100 కి కాల్ చేసిన కుటుంబ సభ్యులు. ఘటన స్థలం చేరుకుని విచారణ చేపట్టి నిందితుల కోసం గాలింపు చర్యచేపట్టిన పోలీసులు.
మిచాంగ్ తుపాను ఏపీపై తీవ్ర ప్రభావం చూపుతోంది. చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, బాపట్ల, కృష్ణా జిల్లాలను అతిభారీ వర్షాలు బెంబేలెత్తిస్తున్నాయి. నెల్లూరు జిల్లా కావలి రైల్వే స్టేషన్ సెంటర్లో ఈదురుగాలులకు భారీ వృక్షాలు, విద్యుత్ స్తంభాలు కుప్పకూలాయి. అన్నమయ్య జిల్లా చిట్వేలు మండలంలో అరటిపంట ధ్వంసమైంది. నేతివారిపల్లి, నగరిపాడు పరిధిలో 25 వేల అరటిచెట్లు నేలకూలాయి. గూడూరు నియోజకవర్గంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో విద్యుత్, టెలికామ్ సేవలు నిలిచిపోయాయి. స్వర్ణముఖి బ్యారేజ్ కు భారీగా వరద నీరు చేరడంతో 12 గేట్లను ఎత్తి 10000 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు అధికారులు. గూడూరు, చవటిపాలెం, పురిటిపాలెం, విందురు, చిల్లకూర్లను వరద నీరు చుట్టుముట్టింది. నీళ్లు,ఆహారం కోసం గిరిజన గ్రామాల ప్రజలు ఎదురు చూస్తున్నారు.
Read Also..
Read Also..
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండగా మారి తుఫాన్ గా మారబోతున్న నేపథ్యంలో అపరమతమైన జిల్లా యంత్రాంగం. అన్ని శాఖల సిబ్బందిని అప్రమత్తం చేసిన జిల్లా కలెక్టర్ హరి నారాయణ. కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ 1077ఏర్పాటు. ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా జాగ్రత్త వహించాలని అధికారులకు ఆదేశించిన జిల్లా కలెక్టర్. ఎలాంటి పరిస్థితులైన ఎదుర్కొనేందుకు అధికారులు సిద్ధంగా ఉండాలని సూచించిన జిల్లా కలెక్టర్…, ప్రస్తుతం నెల్లూరుకి 860 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్న వాయుగుండం. ఈ రాత్రికి లేదా రేపు ఉదయం తుఫాన్ గా మారే అవకాశం. తీర ప్రాంతంలోని లోతట్టు ప్రాంత ప్రజలను సురక్ష ప్రాంతాలు తరలించుకు రంగం సిద్ధం చేసిన జిల్లా యంత్రాంగం…
నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలోని అంబేద్కర్ భవనంలో కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి అసైన్డ్ భూములకు పట్టాలు పంపిణీ చేసారు. బుచ్చి, కోవూరు మండల పరిధిలో నాలుగు గ్రామాలకు చెందిన125 మంది రైతులకు పట్టాలు పంపిణీ చేసారు. దేశానికి వెన్నెముక రైతులు అని, రైతుకు వెన్నెముక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. ఎన్నో సంవత్సరాల నుంచి పట్టాలు లేక ఇబ్బంది పడుతున్న రైతులకు శాశ్వత పరిష్కారం చేసిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని, ఎన్నికలు వస్తున్నాయని పసుపు చొక్కాలేసుకొని పగటి వేషగాల్లందరూ వస్తున్నారు. ఏ పార్టీ ఓటుకు ఎంత డబ్బులు ఇచ్చినా తీసుకొని ఫ్యాను గుర్తుకు ఓటు వేయండన్నారు. రాబోయే ఎన్నికల్లో గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో దోచుకున్న సొమ్ము ఖర్చు పెట్టాలని చూస్తున్నారన్నారు. రాజకీయ నాయకులు కన్నా ప్రజలు తెలివైన వారని వాళ్ళు డబ్బుకు ఆశపడరని, ఎవరి వల్ల లబ్ధి పొందారో వాళ్లకే ఓటు వేస్తారన్నారు.
Read Also..
Read Also..
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో గత రెండు రోజుల నుండి నెల్లూరు నగరం తో పాటు జిల్లా వ్యాప్తంగా వర్షాలు. నెల్లూరు రూరల్, కోవూరు,రాపూరు, ఉదయగిరి ప్రాంతాలలో కురుస్తున్న మోస్తారు వర్షాలు. వర్షాలతో స్తంభించిన జనజీవనం.. చిన్నపాటి వర్షాలకే నదులను తలపిస్తున్న రోడ్డులు. నెల్లూరు నగరంలోని అండర్ బ్రిడ్జిల అన్నింటిలో పెద్ద ఎత్తున నీరు నిలిచిపోవడంతో వాహనదారుల ఇక్కట్లు.
నెల్లూరు జిల్లా కందుకూరు నియోజకవర్గం వలేటివారిపాలెం మండలంలోని నిర్మాణంలో ఉన్న జాతీయ రహదారి 167 బి పై రాకపోకలకు వాహన చోదకులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. బుధవారం రాత్రి వలేటివారిపాలెం సమీపంలోని మన్నేరు వద్ద ఆర్టీసీ బస్సు అదుపుతప్పి మార్జిన్ లో కూరుకుపోయింది. గురువారం ఉదయం ఓ ఉపాధ్యాయుడు ద్విచక్ర వాహనంపై వెళ్తూ జారి వాహనం పడటంతో గాయాలు అయ్యాయి. ఇలా వర్షాలు పడుతున్న సమయంలో వాహన సోదకులు తీవ్ర ఇకట్లు పడుతున్నారు. మాలకొండ నుంచి కూనిపాలెం వరకు రహదారి నిర్మాణం పనులు కొనసాగుతున్నాయి. ఈ రహదారిలో మెటల్ ఏర్పాటు చేయని చోట్ల మట్టి పై వాహనాలు అదుపు తప్పుతున్నాయి. ప్రయాణికులకు ప్రయాణం చేయాలంటే నరకయాతనలు, పడరాని పాట్లు పడుతున్నారు. ఈ రోడ్డుమీద వెళ్లాలంటే ఏమవుతుందో అని ప్రజలు దిక్కు తోచని పరిస్థితుల్లో ఉన్నారు. కొద్దిపాటి వర్షానికి రాకపోకలు చేయాలంటే ప్రజలు తీవ్ర ఇక్కట్లుకు గురివుతున్నారు. జాతీయ రహదారి నిర్మాణ పనులలో ఉపయోగించే గ్రావెల్ లో బంక మట్టి ఉండటం వలన రాకపోకలు చేయాలంటే ప్రజలు , వాహాన చోదుకులు బాధలు అన్నీ, ఇన్నీ కావనే ఆరోపణలు వాహన శోధకులు నుంచి వినిపిస్తుంది. ఆటోలు, ద్విచక్ర వాహన చొదఖలు రాకపోకలను చేయాలంటే వాహననాలు అదుపుతప్పి ప్రమాదాలు జరుగుతున్నాయి. ఉన్నతాధికారులు స్పందించి దీనిపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.